సాక్షి,ఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రసంగం వివాదానికి దారి తీసింది. సోమవారం(జులై1) ఆయన సభలో మాట్లాడుతూ బీజేపీపై లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. హిందుత్వ అంటే అబద్ధాలు ప్రచారం చేయడం, ద్వేషం పెంచడం కాదన్నారు.
బీజేపీ మాత్రం ఇవే చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందువులుగా చెప్పుకునే వాళ్లు హింస, అబద్ధాలు, ద్వేషం గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్లు హిందువులు కాదన్నారు.
సభలో శివుని ఫొటో ప్రదర్శించిన రాహుల్...స్పీకర్ అభ్యంతరం..
అయితే రాహుల్ సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ శివుని ఫొటోనూ సభలో ప్రదర్శించారు. దీనిని స్పీకర్ ఓంబిర్లా తప్పుపట్టారు. సభలో ప్లకార్డులు, ఫొటోలు ప్రదర్శించడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పారు.
రాహుల్‌గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- నా ఇల్లు, పదవి లాగేసుకున్నారు
- విపక్ష నేతలను, ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారు
- ఈడీ నుంచి 55 గంటల విచారణ ఎదుర్కొన్నా
- పరమతాత్మ మోదీతో నేరుగా మాట్లాడతారు
- అదికారం కంటే నిజం గొప్పది
- ప్రతిపక్షంలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, గర్వపడుతున్నా
- శివుడి ఎడమ చేతి వెనక త్రిశులం ఉంటుంది
- త్రిశూలం హింసకు చిహ్నం కాదు
- ఒకవేళ త్రిశూలం హింసకు చిహ్నం అయితే, శివుడి కుడి చేతిలో ఉండేది
- కొందరికి ఆ చిహ్నం అంటే భయం
- సభలో గురునానక్ ఫోటోను సైతం ప్రదర్శించిన రాహుల్
- హిందూ సమాజం అంటే ఒక్క మోదీ కాదు
- హిందువులంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ వారే కాదు
- సభలో ఉన్నావారు, బయటవారు కూడా హిందువులే
రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం..
లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం తెలిపారు. హిందువులు హింసావాదులన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అని అభివర్ణించారు.అనంతరం మాట్లాడిన కేంద్రహోం మంత్రి అమిత్ షా రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నా మైక్ మళ్లీ కట్ చేశారు.. రాహుల్
లోక్‌సభలో తన మైక్‌ను మళ్లీ కట్ చేశారని రాహుల్‌గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని ప్రశ్నించారు. మైక్ కట్ చేశారని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించారు. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు.
రాహుల్ వర్సెస్ స్పీకర్
లోక్‌సభలో స్పీకర్ వ్యవహారశైలిని కూడా తప్పుబట్టారు రాహుల్ గాంధీ.మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తలవంచారని, తాను షేక్ హ్యాండ్ ఇస్తే నిటారుగా నిలబడే ఇచ్చారని రాహుల్ వ్యాఖ్యానించారు.దీనిపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. ‘ తన కంటే వయసులో మోదీ పెద్దవారు కాబట్టే తలవంచానని వివరణ ఇచ్చారు.
రాజ్యాంగానికి మేము రక్షణగా నిలబడతాం: రాహుల్
కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలో పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు రాహుల్. ‘ఈడీ విచారణను 65 గంటలు ఎదుర్కొన్నా అధికారం కంటే నిజం గొప్పది’ అని రాహుల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment