
Parliament Budget Session: బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈనెల 14వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడత మాదిరిగానే ఈసారి కూడా రాజ్యసభ, లోక్‌సభలు సమావేశాలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన సీటింగ్, ఇతర ఏర్పాట్లపై మంగళవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమై చర్చించారు.
బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, లోక్‌సభ సాయం త్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఉభయ సభల సెక్రటరీ జనరళ్లు సమావేశమై దేశంలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గినందున తీసుకోవాల్సిన చర్యల ను చర్చించారు. బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో మాదిరిగానే చాంబర్లు, గ్యాలరీల్లో సభ్యులకు స్థానం కల్పించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ఉభయ సభల సంయుక్త సమావేశంతో జనవరి 31న మొదలైన విషయం తెలిసిందే.
(చదవండి: ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సేవలు)
Comments
Please login to add a commentAdd a comment