న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది.
ఇదీ చదవండి: ఒడిశాలో మిస్టరీ మరణాల కలకలం.. మరో రష్యా పౌరుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment