central govt Budget
-
ఇల్లు అమ్మినా..పన్ను సున్నా!
ఇల్లు విక్రయంపై దీర్ఘకాల మూలధన లాభాల పన్నును 12.5 శాతానికి తగ్గిస్తూ 2024–25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాకపోతే ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ వ్యయం) ప్రయోజనాన్ని తొలగించారు. దీనివల్ల చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుందని ఆందోళన చెందక్కర్లేదు. దీర్ఘకాల మూలధన లాభాలపై గతం నుంచి ఉన్న పన్ను మినహాయింపులను ప్రభుత్వం కొనసాగించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్2024 జూలై 23లోపు ఇంటిని కొని మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ)గా, మూడేళ్లలోపు విక్రయిస్తే వచి్చన లాభాన్ని స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ)గా పరిగణించేవారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) తీసివేసి, మిగిలిన పన్నుపై 20 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. 2024 జూన్ 23 నుంచి.. రెండేళ్లు నిండిన తర్వాత విక్రయిస్తే ఎల్‌టీసీజీగా పరిగణిస్తున్నారు. ఆలోపు విక్రయిస్తే ఎస్టీసీజీ కిందకు వస్తుంది. రెండేళ్లు తర్వాత విక్రయించగా వచి్చన లాభంపై ఇక మీదట 20 శాతానికి బదులు 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. రెండేళ్లలోపు విక్రయిస్తే వచి్చన లాభాన్ని తమ ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి.మూలధన లాభాల పన్నులో మార్పులుసెక్షన్ 54ఈసీ దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను మినహాయింపు కోసం ఇల్లు కాకుండా సెక్షన్ 54ఈసీ కింద.. ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ బాండ్లలో గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇల్లు లేదా స్థలాన్ని విక్ర యించిన వారు సైతం ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 54ఇంటి విక్రయంపై ఎల్టీసీజీ వద్దనుకుంటే సెక్షన్ 54లో చెప్పిన విధంగా.. మరో ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకు మూడు షరతులు ఉన్నాయి. విక్రయించిన తేదీ నుంచి రెండేళ్ల లోపు మరో ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలి. లేదా మూడేళ్లలోపు ఇంటి నిర్మాణంపై ఖర్చు చేయాలి. లేదా ఇంటిని విక్రయించడానికి ముందు ఏడాదిలోపు మరో ఇంటిని కొనుగోలు చేసి ఉండాలి. జీవితంలో ఒకరు ఒక్కసారే ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోగలరు. ⇒ దీర్ఘకాల మూలధన లాభం రూ.2 కోట్లు మించకపోతే.. ఆ మొత్తంతో రెండు ఇళ్లు కొనుగోలు చేసినా పన్ను మినహాయింపునకు అర్హులే. లాభం రూ.2 కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంతో ఒకే ఇంటిని కొనుగోలు చేయాలి. ⇒ ఈ సెక్షన్ కింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ.10 కోట్లు. పన్ను మినహాయింపు కోసం కొనుగోలు చేసిన ఇంటిని మూడేళ్ల తర్వాతే విక్రయించాలి. ఆలోపు విక్రయిస్తే పన్ను మినహాయింపు కోల్పోవాల్సి వస్తుంది. ⇒ నిబంధనల మేరకు మరో ఇంటిని కొనుగోలు చేసే వరకు లేదా ఇంటిని నిర్మించుకునే వరకు ఆ మొ త్తాన్ని బ్యాంక్‌లో ‘క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్’ (సీజీఏఎస్)లో డిపాజిట్ చేయాలి. ఇంటిని విక్రయించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే లోపే ఈ డిపాజిట్ చేయాలి.పన్ను ఊరటన్యూఢిల్లీ: ఇళ్ల విక్రయంపై బడ్జెట్లో చేసిన దీర్ఘకాల మూల ధన పన్ను ప్రతిపాదనలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2024 జూన్ 23 (బడ్జెట్)కు ముందు ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్).. వా టిని విక్రయించినప్పుడు పాత విధానంలో ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకుని 20% పన్ను చెల్లించొచ్చు. లేదా కొత్త వి ధానంలో ఇండెక్సేషన్ లేకుండా 12.5% పన్ను చెల్లించేలా ఫైనాన్స్ బిల్లు 2024లో సవరణలను ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. సంబంధిత కాపీలను లోక్‌సభ సభ్యులకు అందించింది.సెక్షన్ 54ఎఫ్ఇల్లు కాకుండా ఇతర క్యాపిటల్ అసెట్స్ (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ సహా) విక్రయించినప్పుడు వచ్చి న దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను మినహాయింపు ఎలా అన్నది సెక్షన్ 54 ఎఫ్ వివరిస్తోంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ అసెట్స్‌ను విక్రయించగా వచి్చన మూలధన లాభంతో రెండేళ్లలోపు ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా మూడేళ్లలో ఇంటి నిర్మాణంపై వ్యయం చేయాలి. లేదా విక్రయించడానికి ముందు ఏడాదిలోపు ఇంటిని కొనుగోలు చేసి ఉండాలి. ఇక్కడ కూడా గరిష్ట పన్ను మినహాయింపు రూ.10 కోట్లకే పరిమితం. అలాగే, క్యాపిటల్ అసెట్స్ విక్రయించగా వచి్చన మొత్తాన్ని ఇంటిపై వెచి్చంచేంత వరకు క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. రెండు రకాల ప్రయోజనాలు ఈ సెక్షన్ల కింద ఒకటికి మించిన ప్రయోజనానికి అర్హులే. ఉదాహరణకు ఇంటిపై దీర్ఘకాల మూలధన లాభం రూ.10.5 కోట్లు వచ్చిందని అనుకుందాం. అప్పుడు రూ.10 కోట్లతో మరో ఇంటిని కొనుగోలు చేసి సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకున్న తర్వాత మరో రూ.50 లక్షలు మిగిలి ఉంటాయి. అప్పుడు సెక్షన్ 54ఈసీ కింద ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ క్యాపిటల్ గెయిన్ బాండ్లలో రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. -
నీతిఆయోగ్‌లో కేంద్రాన్ని నిలదీస్తా: మమతా బెనర్జీ
కలకత్తా: ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలపై కేంద్ర బడ్జెట్లో సవతితల్లి ప్రేమ చూపించారని తృణమూల్కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో శనివారం(జులై 26) జరిగే నీతిఆయోగ్ సమావేశానికి హాజరై చెబుతానన్నారు. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం(జులై26) ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తానని బడ్జెట్‌కు ముందే చెప్పా. మీటింగ్‌లో నా స్పీచ్ కాపీని కూడా ఇప్పటికే పంపించాను. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వ్యవహరించిన తీరు చూశాక ఈ విషయమే నీతిఆయోగ్‌లో మాట్లాడాలనుకుంటున్నా. ఒకవేళ వాళ్లు నాకు మాట్లాడటగానికి నాకు అనుమతివ్వకపోతే నిరసన తెలిపి సమావేశం నుంచి బయటికి వస్తా అని మమత తెలిపారు. మమతాబెనర్జీ నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం ఇదే తొలిసారి. 2014లో ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి నీతిఆయోగ్‌ను ఏర్పాటు చేయడంపై మమత తొలి నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నారు. -
‘అమృత్ భారత్ స్టేషన్స్’.. ఏపీలో 72 రైల్వే స్టేషన్లకు మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ సహా 72 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్స్’ పథకం కింద దేశంలో 1,275 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వాటిలో మన రాష్ట్రంలోని 72 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లలో 53 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. ప్రతి స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన స్టేషన్ల అభివృద్దికి త్వరలోనే మాస్టర్ ప్లాన్లు రూపొందించేందుకు నిపుణుల కమిటీలను నియమిస్తామని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. అనంతరం బడ్జెట్‌ను రూపొందించి దశలవారీగా పనులు చేపడతామన్నారు. స్టేషన్లలో కల్పించే ప్రధాన సౌకర్యాల్లో కొన్ని.. - ప్రతి స్టేషన్లో భవనాలు, ఫ్లోరింగ్ ఆధునిక శైలిలో నిర్మాణం - ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లు 600 మీటర్ల పొడవుతో ఉన్నాయి. వాటి పొడవు 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు పెంపు - స్టేషన్ల వద్ద ట్రాక్‌ల శుభ్రత, సులభమైన నిర్వహణ కోసం ‘బ్యాలస్ట్ట్‌లెస్ ట్రాక్’ల ఏర్పాటు - ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ఎస్జీ 1 – 4, ఎస్జీ 1– 2 కేటగిరీ స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు - దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చెయిర్లు, ప్రత్యేక ప్రవేశ మార్గాలు, ఇతర సదుపాయాలు - వెయిటింగ్ హాల్స్, వాటికి అనుబంధంగా కేఫెటేరియా - స్థానిక ఉత్పత్తుల విక్రయానికి కనీసం రెండు స్టాల్స్ ఏర్పాటు - ప్రతి స్టేషన్ మొదటి అంతస్తులో ప్రత్యేకంగా రూఫ్ ప్లాజా - సమావేశ మందిరాలు - స్టేషన్‌కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, పార్కింగ్ ఏరియా, పాదచారులకు ప్రత్యేక దారి - ల్యాండ్ స్కేపింగ్, ఆధునిక లైటింగ్ - వేగవంతమైన వైఫై సేవలకు 5జీ టవర్లు రాష్ట్రంలో అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్లు ఇవే.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, విజయనగరం, తెనాలి, గుంటూరు, ఆదోని, అనకాపల్లి, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కంభం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, యలమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గూడురు, గుణదల, హిందూపూర్, ఇచ్ఛాపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస, కుప్పం, కర్నూలు సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి రోడ్, మంగళగిరి, మార్కాపూరం రోడ్, మంత్రాలయం రోడ్, నడికుడి, నంద్యాల, నరసరావుపేట, నరసాపూర్, నౌపడ, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలాస, పార్వతీపురం, పిడుగురాళ్ల, పీలేరు, రాజంపేట, రాజమహేంద్రవరం, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సూళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తుని, వినుకొండ. -
దేశ సందపను దోపిడీ చేస్తున్నారు: అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కాగా, సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత భట్లి విక్రమార్క.. కేసీఆర్ సర్కార్‌పై కౌంటర్ అటాక్‌కు దిగారు. అటు కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ప్రకటించలేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అదానీ కంపెనీ ఏం చేసిందో బయటపడింది. హిండెన్‌బర్గ్ అన్నీ బయటపెట్టింది. దేశ సంపద దోపిడీకి గురవుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదు. రూ. 4.86 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి?. సామాన్యులపైనే భారం పెరుగుతోంది. తలసారి ఆదాయం ఎలా పెరిగిందో లెక్కలు చెప్పాలి. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగింది. పేదలు ఇళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల్లో లక్షలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండాలి అని సూచనలు చేశారు. -
కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో బడ్జెట్ కేటాయింపుల విషయంలో కేంద్రం తీరుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని మాత్రం పక్కన పెట్టారు అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, మంత్రి కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పేదలకు ఇచ్చే పథకాలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. కొందరి చేతుల్లోనే డబ్బులు ఉండేలా కేంద్రం పనిచేస్తున్నది. అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తేనే అభివృద్ధి సాధ్యం. దేశంలో గొప్పనాయకులు అందరూ గెలుపును మాత్రమే చూస్తూ.. అభివృద్ధిని పక్కన పెట్టారు’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
బడ్జెట్లో ప్రత్యేక ప్రస్తావన.. హైదరాబాద్‌లో మిల్లెట్స్‌పై పరిశోధనలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను జరుపుకుంటున్న తరుణంలో వాటి సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని గురించి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. శ్రీఅన్న పథకం ద్వారా హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై ప్రత్యేక పరిశోధనలు జరపాలని నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) ఉన్న సంగతి తెలిసిందే. అందులోని పరిశోధనలకు పెద్దపీట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సంస్థ జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో అనుసంధానమై పనిచేస్తుంది. వేలాదిమందికి ఇందులో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. భవిష్యత్తులో మిల్లెట్ ఆహారపదార్థాలు అందుబాటులోకి తీసుకురావడం, మిల్లెట్ సాగు చేసే రైతులను ప్రోత్సహించడం, ఉత్పాదకత పెంచడం ఈ పరిశోధనల లక్ష్యం. ఐఐఎంఆర్ పరిధిలో 41 మంది సాంకేతిక సిబ్బంది, 21 అడ్మినిస్ట్రేటివ్, 27 సహాయక సిబ్బంది, 17 విభాగాలలో 48 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నారు. 2023 అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ప్రాధాన్యం ఏంటి? మిల్లెట్లు పోషక ఆహార ధాన్యాలు. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి మిల్లెట్ల సాగు, వినియోగం కొనసాగుతోంది. మిల్లెట్లలో ప్రొటీన్, ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా, వచ్చినవారికి మంచి ఆహారంగా ఉంటుంది. మిల్లెట్ల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు, వాటిని పండించడానికి తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి అవసరం. భారత ప్రభుత్వ విన్నపం మేరకు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనను 70 దేశాలు ఆమోదించాయి. రసాయన పురుగుమందులు, ఎరువులు వాడకుండా మిల్లెట్లను సులభంగా పండించవచ్చు. చిన్న కమతాల రైతులకు మిల్లెట్ పంటలు పండించడం ఉపయోగకరం. మిల్లెట్లను రొట్టెలు, ఉప్మా, గంజిగా ఉపయోగించవచ్చు. మిల్లెట్లలో 60 రకాల వరకు ఉన్నాయి. మన దేశంలో ప్రధానంగా జొన్న, సజ్జ, కొర్రలు, ఎండు కొర్రలు, ఊదలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాలు ఉన్నాయి. అయితే 1960లలో హరిత విప్లవం ద్వారా ఆహార భద్రతపై దృష్టి సారించడంతో చిరుధాన్యాల ఆహారాన్ని ప్రజలు మరిచిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. హరిత విప్లవానికి ముందు మిల్లెట్ల సాగు దాదాపు 40 శాతం ఉండగా, ఆ తర్వాత 20 శాతానికి పడిపోయింది. మన దేశంలో ప్రస్తుతం 1.70 కోట్ల టన్నుల మిల్లెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఆసియాలో 80 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం ఉంటుంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అధికంగా మిల్లెట్లను ఉత్పత్తి చేస్తాయి. మనదేశం నుంచి మిల్లెట్లను యూఏఈ, నేపాల్, సౌదీ అరేబియా, లిబియా, ఒమన్, ఈజిప్ట్, ట్యునీషియా, యెమెన్, యూకే, యూఎస్‌లకు ఎగుమతి అవుతాయి. ఆగ్రోస్ మిల్లెట్ ఆహార కేంద్రాలు: కె.రాములు, ఎండీ, ఆగ్రోస్ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆగ్రోస్ ఆధ్వర్యంలో మిల్లెట్‌ను ప్రజలకు చేరువ చేయాలని భావి స్తున్నాం. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది మిల్లెట్ కియోస్క్‌లను ఏర్పాటు చేయా లని నిర్ణయించాం. ఆసక్తి కలిగిన మహిళలకు మిల్లెట్ ఫుడ్‌పై ఐఐఎంఆర్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని కూడా మా ఆలోచన. శిక్షణ అనంతరం నిర్ణీత పద్ధతిలో తయారు చేసిన కియోస్క్‌లను ఏర్పాటు చేస్తాం. అందుకోసం ముందుకు వచ్చే వారికి రుణాలు ఇప్పించే ఆలోచన కూడా ఉంది. ఈ కియోస్క్‌ల్లో రెడీమేడ్ మిల్లెట్ ఫుడ్, మిల్లెట్‌తో తయారు చేసిన బిస్కెట్లు, ఐస్‌క్రీం, నూడిల్స్, మిల్లెట్ బిర్యానీ వంటివి కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాం. -
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6న ముగియనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. ఇదీ చదవండి: ఒడిశాలో మిస్టరీ మరణాల కలకలం.. మరో రష్యా పౌరుడు మృతి -
బడ్జెట్ పై కేంద్రం కసరత్తు..
-
ఆస్తుల విక్రయానికి కేంద్రం భారీ ప్రణాళిక, రోడ్‌మ్యాప్ విడుదల
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరాం : విజయసాయిరెడ్డి
-
టీడీపీ vs బీజేపీ
కోల్డ్ వార్! ఇరు పార్టీల నేతల నడుమ పేలుతున్న మాటల తూటాలు కేంద్ర బడ్జెట్ తర్వాత ముదిరిన వివాదం రాజధానిపైనా తలో మాట విజయవాడ : మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య ముసలం మొదలైందా.. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారి భగ్గుమంటాయా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. అప్పుడే ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందంటూ టీడీపీ నేతలు పెదవి విరుస్తుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ సాగిస్తున్న పాలనపై కమలనాథులు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకరి తీరును మరొకరు ఎండగట్టేందుకు ఏమాత్రం జంకడం లేదు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఒకడుగు ముందే ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచే.. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు రెండు పార్టీల నేతలకు సుతరామూ ఇష్టం లేదు. ఆయా పార్టీల అగ్ర నేతలు కుదుర్చుకున్న ఒప్పందం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో జిల్లా నాయకులు అంగీకరించక తప్పలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలవడం, రాష్ట్ర మంత్రివర్గంలో కైకలూరుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కడం జరిగిపోయాయి. అయినా రెండు పార్టీల మధ్య సఖ్యత కుదరలేదు. మంత్రుల మధ్యే కాదు.. కింది స్థాయి కేడర్ వరకు విభేదాలు కనపిస్తున్నాయి. మరింత ముదిరాయి.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రత్యేక హోదా దక్కకపోవడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించింది. అరుణ్ జైట్లీ బడ్జెట్ బాగానే ఉందంటూనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ టీడీపీ నేతలు ఆక్రోశించారు. దీంతో బీజేపీ నేతలు సీరియస్ అవుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు సరైన ప్రతిపాదనలతో కేంద్రం వద్దకు వెళ్లలేదని, ఇప్పటివరకు రాజధాని ఎక్కడ నిర్మిస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదని, అందువల్ల నిధులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందంటూ బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందితే తెలుగుదేశం నేతలు స్వీట్లు పంచుకున్నారని, ఇదేమి స్నేహధర్మమంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిశోర్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా రాష్ట్రం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్రంలో తమ పార్టీ ఎదగకుండా టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇకనుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రజల్లోకి తీసుకువెళ్లతామని అంటున్నారు. రాజధానిపై బీజేపీ గరంగరం.. ఇప్పటికే రుణమాఫీని సరిగా చేయలేక అప్రతిష్టను మూటగట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని నిర్మాణ విషయంలో వ్యవహరిస్తున్న తీరును బీజేపీ నేతలు త ప్పు పడుతున్నారు. రైతులు, విపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న తమకు రాజధాని కమిటీలో ఏమాత్రం చోటివ్వని చంద్రబాబు విపక్షాలను సైతం సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై కమలనాథులు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంత రైతులు టీడీపీకి దూరమవుతున్నారని, ఈ ప్రభావం తమ పార్టీపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. రాజధాని వల్ల వస్తున్న వ్యతిరేకతనంతా టీడీపీకి అంటగట్టేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఇలాగే కొనసాగిస్తే మరింత దాడికి దిగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.