ఇల్లు విక్రయంపై దీర్ఘకాల మూలధన లాభాల పన్నును 12.5 శాతానికి తగ్గిస్తూ 2024–25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాకపోతే ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ వ్యయం) ప్రయోజనాన్ని తొలగించారు. దీనివల్ల చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుందని ఆందోళన చెందక్కర్లేదు. దీర్ఘకాల మూలధన లాభాలపై గతం నుంచి ఉన్న పన్ను మినహాయింపులను ప్రభుత్వం కొనసాగించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్
2024 జూలై 23లోపు ఇంటిని కొని మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ)గా, మూడేళ్లలోపు విక్రయిస్తే వచి్చన లాభాన్ని స్వల్పకాల మూలధన లాభం (ఎస్‌టీసీజీ)గా పరిగణించేవారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) తీసివేసి, మిగిలిన పన్నుపై 20 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. 2024 జూన్ 23 నుంచి.. రెండేళ్లు నిండిన తర్వాత విక్రయిస్తే ఎల్‌టీసీజీగా పరిగణిస్తున్నారు. ఆలోపు విక్రయిస్తే ఎస్‌టీసీజీ కిందకు వస్తుంది. రెండేళ్లు తర్వాత విక్రయించగా వచి్చన లాభంపై ఇక మీదట 20 శాతానికి బదులు 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. రెండేళ్లలోపు విక్రయిస్తే వచి్చన లాభాన్ని తమ ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి.
మూలధన లాభాల పన్నులో మార్పులు
సెక్షన్ 54ఈసీ
దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను మినహాయింపు కోసం ఇల్లు కాకుండా సెక్షన్ 54ఈసీ కింద.. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ బాండ్లలో గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇల్లు లేదా స్థలాన్ని విక్ర యించిన వారు సైతం ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.
సెక్షన్ 54
ఇంటి విక్రయంపై ఎల్‌టీసీజీ వద్దనుకుంటే సెక్షన్ 54లో చెప్పిన విధంగా.. మరో ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకు మూడు షరతులు ఉన్నాయి. విక్రయించిన తేదీ నుంచి రెండేళ్ల లోపు మరో ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలి. లేదా మూడేళ్లలోపు ఇంటి నిర్మాణంపై ఖర్చు చేయాలి. లేదా ఇంటిని విక్రయించడానికి ముందు ఏడాదిలోపు మరో ఇంటిని కొనుగోలు చేసి ఉండాలి. జీవితంలో ఒకరు ఒక్కసారే ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోగలరు.
⇒ దీర్ఘకాల మూలధన లాభం రూ.2 కోట్లు మించకపోతే.. ఆ మొత్తంతో రెండు ఇళ్లు కొనుగోలు చేసినా పన్ను మినహాయింపునకు అర్హులే. లాభం రూ.2 కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంతో ఒకే ఇంటిని కొనుగోలు చేయాలి.
⇒ ఈ సెక్షన్ కింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ.10 కోట్లు. పన్ను మినహాయింపు కోసం కొనుగోలు చేసిన ఇంటిని మూడేళ్ల తర్వాతే విక్రయించాలి. ఆలోపు విక్రయిస్తే పన్ను మినహాయింపు కోల్పోవాల్సి వస్తుంది.
⇒ నిబంధనల మేరకు మరో ఇంటిని కొనుగోలు చేసే వరకు లేదా ఇంటిని నిర్మించుకునే వరకు ఆ మొ త్తాన్ని బ్యాంక్‌లో ‘క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్’ (సీజీఏఎస్)లో డిపాజిట్ చేయాలి. ఇంటిని విక్రయించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే లోపే ఈ డిపాజిట్ చేయాలి.
పన్ను ఊరట
న్యూఢిల్లీ: ఇళ్ల విక్రయంపై బడ్జెట్‌లో చేసిన దీర్ఘకాల మూల ధన పన్ను ప్రతిపాదనలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2024 జూన్ 23 (బడ్జెట్)కు ముందు ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్).. వా టిని విక్రయించినప్పుడు పాత విధానంలో ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకుని 20% పన్ను చెల్లించొచ్చు. లేదా కొత్త వి ధానంలో ఇండెక్సేషన్ లేకుండా 12.5% పన్ను చెల్లించేలా ఫైనాన్స్ బిల్లు 2024లో సవరణలను ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. సంబంధిత కాపీలను లోక్‌సభ సభ్యులకు అందించింది.
సెక్షన్ 54ఎఫ్
ఇల్లు కాకుండా ఇతర క్యాపిటల్ అసెట్స్ (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ సహా) విక్రయించినప్పుడు వచ్చి న దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను మినహాయింపు ఎలా అన్నది సెక్షన్ 54 ఎఫ్ వివరిస్తోంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ అసెట్స్‌ను విక్రయించగా వచి్చన మూలధన లాభంతో రెండేళ్లలోపు ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా మూడేళ్లలో ఇంటి నిర్మాణంపై వ్యయం చేయాలి. లేదా విక్రయించడానికి ముందు ఏడాదిలోపు ఇంటిని కొనుగోలు చేసి ఉండాలి. ఇక్కడ కూడా గరిష్ట పన్ను మినహాయింపు రూ.10 కోట్లకే పరిమితం. అలాగే, క్యాపిటల్ అసెట్స్ విక్రయించగా వచి్చన మొత్తాన్ని ఇంటిపై వెచి్చంచేంత వరకు క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
రెండు రకాల ప్రయోజనాలు
ఈ సెక్షన్ల కింద ఒకటికి మించిన ప్రయోజనానికి అర్హులే. ఉదాహరణకు ఇంటిపై దీర్ఘకాల మూలధన లాభం రూ.10.5 కోట్లు వచ్చిందని అనుకుందాం. అప్పుడు రూ.10 కోట్లతో మరో ఇంటిని కొనుగోలు చేసి సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకున్న తర్వాత మరో రూ.50 లక్షలు మిగిలి ఉంటాయి. అప్పుడు సెక్షన్ 54ఈసీ కింద ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ క్యాపిటల్ గెయిన్ బాండ్లలో రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment