Capital gains tax
-
ఈక్విటీ రాబడులపై పన్ను సున్నా!
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది. ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను తగ్గించుకునే మార్గాలు..ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.ట్యాక్స్ హార్వెస్టింగ్ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం. ఇల్లు కొనడం.. ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు. బాండ్లు సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.షరతులు ఉన్నాయ్... దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సరైన నిర్ణయమేనా?మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.నష్టాలతో భర్తీ..ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇల్లు అమ్మినా..పన్ను సున్నా!
ఇల్లు విక్రయంపై దీర్ఘకాల మూలధన లాభాల పన్నును 12.5 శాతానికి తగ్గిస్తూ 2024–25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాకపోతే ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణ వ్యయం) ప్రయోజనాన్ని తొలగించారు. దీనివల్ల చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుందని ఆందోళన చెందక్కర్లేదు. దీర్ఘకాల మూలధన లాభాలపై గతం నుంచి ఉన్న పన్ను మినహాయింపులను ప్రభుత్వం కొనసాగించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్2024 జూలై 23లోపు ఇంటిని కొని మూడేళ్లు నిండిన తర్వాత విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ)గా, మూడేళ్లలోపు విక్రయిస్తే వచి్చన లాభాన్ని స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ)గా పరిగణించేవారు. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) తీసివేసి, మిగిలిన పన్నుపై 20 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. 2024 జూన్ 23 నుంచి.. రెండేళ్లు నిండిన తర్వాత విక్రయిస్తే ఎల్‌టీసీజీగా పరిగణిస్తున్నారు. ఆలోపు విక్రయిస్తే ఎస్టీసీజీ కిందకు వస్తుంది. రెండేళ్లు తర్వాత విక్రయించగా వచి్చన లాభంపై ఇక మీదట 20 శాతానికి బదులు 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. రెండేళ్లలోపు విక్రయిస్తే వచి్చన లాభాన్ని తమ ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి.మూలధన లాభాల పన్నులో మార్పులుసెక్షన్ 54ఈసీ దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను మినహాయింపు కోసం ఇల్లు కాకుండా సెక్షన్ 54ఈసీ కింద.. ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ బాండ్లలో గరిష్టంగా రూ.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ బాండ్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇల్లు లేదా స్థలాన్ని విక్ర యించిన వారు సైతం ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 54ఇంటి విక్రయంపై ఎల్టీసీజీ వద్దనుకుంటే సెక్షన్ 54లో చెప్పిన విధంగా.. మరో ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకు మూడు షరతులు ఉన్నాయి. విక్రయించిన తేదీ నుంచి రెండేళ్ల లోపు మరో ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలి. లేదా మూడేళ్లలోపు ఇంటి నిర్మాణంపై ఖర్చు చేయాలి. లేదా ఇంటిని విక్రయించడానికి ముందు ఏడాదిలోపు మరో ఇంటిని కొనుగోలు చేసి ఉండాలి. జీవితంలో ఒకరు ఒక్కసారే ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోగలరు. ⇒ దీర్ఘకాల మూలధన లాభం రూ.2 కోట్లు మించకపోతే.. ఆ మొత్తంతో రెండు ఇళ్లు కొనుగోలు చేసినా పన్ను మినహాయింపునకు అర్హులే. లాభం రూ.2 కోట్లకు మించి ఉంటే ఆ మొత్తంతో ఒకే ఇంటిని కొనుగోలు చేయాలి. ⇒ ఈ సెక్షన్ కింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ.10 కోట్లు. పన్ను మినహాయింపు కోసం కొనుగోలు చేసిన ఇంటిని మూడేళ్ల తర్వాతే విక్రయించాలి. ఆలోపు విక్రయిస్తే పన్ను మినహాయింపు కోల్పోవాల్సి వస్తుంది. ⇒ నిబంధనల మేరకు మరో ఇంటిని కొనుగోలు చేసే వరకు లేదా ఇంటిని నిర్మించుకునే వరకు ఆ మొ త్తాన్ని బ్యాంక్‌లో ‘క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్’ (సీజీఏఎస్)లో డిపాజిట్ చేయాలి. ఇంటిని విక్రయించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే లోపే ఈ డిపాజిట్ చేయాలి.పన్ను ఊరటన్యూఢిల్లీ: ఇళ్ల విక్రయంపై బడ్జెట్లో చేసిన దీర్ఘకాల మూల ధన పన్ను ప్రతిపాదనలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 2024 జూన్ 23 (బడ్జెట్)కు ముందు ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్).. వా టిని విక్రయించినప్పుడు పాత విధానంలో ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని వినియోగించుకుని 20% పన్ను చెల్లించొచ్చు. లేదా కొత్త వి ధానంలో ఇండెక్సేషన్ లేకుండా 12.5% పన్ను చెల్లించేలా ఫైనాన్స్ బిల్లు 2024లో సవరణలను ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించింది. సంబంధిత కాపీలను లోక్‌సభ సభ్యులకు అందించింది.సెక్షన్ 54ఎఫ్ఇల్లు కాకుండా ఇతర క్యాపిటల్ అసెట్స్ (షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ సహా) విక్రయించినప్పుడు వచ్చి న దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను మినహాయింపు ఎలా అన్నది సెక్షన్ 54 ఎఫ్ వివరిస్తోంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ అసెట్స్‌ను విక్రయించగా వచి్చన మూలధన లాభంతో రెండేళ్లలోపు ఇంటిని కొనుగోలు చేయాలి. లేదా మూడేళ్లలో ఇంటి నిర్మాణంపై వ్యయం చేయాలి. లేదా విక్రయించడానికి ముందు ఏడాదిలోపు ఇంటిని కొనుగోలు చేసి ఉండాలి. ఇక్కడ కూడా గరిష్ట పన్ను మినహాయింపు రూ.10 కోట్లకే పరిమితం. అలాగే, క్యాపిటల్ అసెట్స్ విక్రయించగా వచి్చన మొత్తాన్ని ఇంటిపై వెచి్చంచేంత వరకు క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. రెండు రకాల ప్రయోజనాలు ఈ సెక్షన్ల కింద ఒకటికి మించిన ప్రయోజనానికి అర్హులే. ఉదాహరణకు ఇంటిపై దీర్ఘకాల మూలధన లాభం రూ.10.5 కోట్లు వచ్చిందని అనుకుందాం. అప్పుడు రూ.10 కోట్లతో మరో ఇంటిని కొనుగోలు చేసి సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకున్న తర్వాత మరో రూ.50 లక్షలు మిగిలి ఉంటాయి. అప్పుడు సెక్షన్ 54ఈసీ కింద ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ క్యాపిటల్ గెయిన్ బాండ్లలో రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. -
ఇల్లు అమ్మితే పన్ను భారం!
సొంతిల్లు.. చాలా మందికి జీవితకాల కష్టార్జితం. అలాంటి సొంతింటిని అవసరార్థమై విక్రయించినప్పుడు వచి్చన లాభంపై పన్ను చెల్లించాలన్న విషయం ఎంత మందికి తెలుసు? మరీ ముఖ్యంగా ఇటీవలి బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదన ప్రకారమైతే.. ఈ పన్ను మరింత చెల్లించాల్సి రావచ్చు. దీర్ఘకాల మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించడం సానుకూల నిర్ణయమేగా అని అనుకోవచ్చు. కానీ, ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగించారు. దీని కారణంగా నికరంగా చెల్లించాల్సిన పన్ను గణనీయంగా పెరగనుంది. అసలు ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగింపు ఎవరికి అనుకూలం? తాజా పన్ను ప్రతిపాదన ఎవరికి లాభం..? తమపై పడే భారం ఎంత..? నిపుణుల విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇప్పటి వరకు.. ప్రాపర్టీ (ఇల్లు లేదా ఇంటి స్థలం/గ్రామీణ వ్యవసాయ భూమి కాకుండా)ని క్యాపిటల్ అస్సెట్‌గా ఆదాయపన్ను చట్టం చెబుతోంది. కనుక ప్రాపర్టీ విక్రయం మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత విక్రయించిన సందర్భాల్లో అది దీర్ఘకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. వచ్చిన లాభంపై లోగడ (జూలై 23కు ముందు) 20% పన్ను అమ లు చేసేవారు. కరెన్సీ విలువను ఏటా కొంత శాతం చొప్పున ద్రవ్యోల్బణం హరిస్తుందని తెలుసు. ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రాపర్టీ కొనుగోలు ధరతో సర్దుబాటు చేసే వారు. దీన్నే ఇండెక్సేషన్ బెనిఫిట్‌గా చెబుతారు. ఉదాహరణకు 6% ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు రూ.100 విలువ ఏడాది తర్వాత రూ.94గా మారుతుంది. పేరుకు మన దగ్గర రూ.100 ఉంటుంది. కానీ, దాని అసలు విలువ రూ.94. ఇదే మాదిరి రూ.100 పెట్టి కొనుగోలు చేసిన ప్రాపరీ్ట.. అసలు కొనుగోలు ధర ఏడాది తర్వాత ఇండెక్సేషన్‌తో కలిపితే రూ.106గా మారుతుంది. పాత విధానంలో ప్రాపర్టీ అసలు కొనుగోలు ధర ఇండెక్సేషన్ ప్రయోజనంతో గణనీయంగా పెరిగేది. దీంతో నికరంగా చెల్లించే పన్ను తక్కువగా ఉండేది. ఆదాయపన్ను శాఖ ఏటా ద్రవ్యోల్బణం సర్దుబాటు ఆధారంగా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ (సీఐఐ/ద్రవ్యోల్బణ వ్యయ సూచీ)ను ఖరారు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా విడుదల చేస్తుంది. దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పుడు ప్రాపరీ్టకి ఈ ప్రయోజనాన్ని తొలగించారు. ఇది మెజారిటీ ఇంటి యజమానులకు నిజంగా మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది. కానీ, నిపుణులు మాత్రం తాజా సవరణలతో పన్ను భారం పెరుగుతుందని గణాంకాల సహితంగా వివరిస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే అది స్వల్పకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ మొత్తం తమ ఆదాయానికి కలిపి పన్ను రిటర్నుల్లో చూపించాలి. ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. వ్యవసాయ భూమి క్యాపిటల్ అస్సెట్ కాదు కనుక దీని విక్రయంపై మూలధన లాభాల పన్ను వర్తించదు. ఎవరికి ప్రయోజనం? జూలై 23 ముందు వరకు ఉన్న ఇండెక్సేషన్ ఆధారిత దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధానంతో అందరికీ ప్రయోజనం ఉండేది. కరెన్సీ విలువ క్షీణత ప్రభావం తీసివేసిన తర్వాత మిగిలిందే అసలైన లాభం కనుక, దానిపై పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు నూతన విధానంతో మెజారిటీ యజమానులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ద్రవ్యోల్బణం రేటుకు మించి ప్రాపర్టీ ధరలు గణనీయంగా పెరిగినప్పుడే నష్టం లేకుండా ఉంటుంది. కొనుగోలు నుంచి విక్రయించే మధ్యకాలంలో ధరల్లో పెద్దగా వృద్ధి పెద్దగా లేకపోతే నష్టమే. ఏటా ప్రాపర్టీ ధరలు 9 శాతంలోపే వృద్ధి చెందితే నష్టపోవాల్సి వస్తుంది. కనీసం 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగితేనే కొత్త విధానంతో లాభపడొచ్చు. 2013 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 36 పట్టణాల్లో ప్రాపర్టీ ధరలు సగటున 5.11 శాతం చొప్పునే పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ‘రెసిడెక్స్’ స్పష్టం చేస్తోంది. ఈ కాలంలో ఒక్క హైదరాబాద్‌లోనే ఇది 8.56 శాతం సీఏజీఆర్‌గా ఉంది. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ రాబడులు 12–16 శాతం (వార్షిక) మధ్య ఉంటున్నాయని, కనుక నూతన విధానం లాభదాయకమని ప్రభుత్వం అంటుంటే.. అన్ని ప్రాంతాల్లోనూ ఆ విధమైన ధరల వృద్ధి లేదంటూ నిపుణులు తోసిపుచ్చుతున్నారు. ఆర్బీఐ హౌసింగ్ ప్రైజింగ్ ఇండెక్స్‌ను చూసినా ప్రముఖ పట్టణాల్లో గడిచిన దశాబ్ద కాలంలో ధరల వృద్ధి 1–9 శాతం మధ్యే ఉన్నట్టు తెలుస్తోంది.పన్ను తగ్గించుకునే మార్గం..? ఇంటి విక్రయంపై దీర్ఘకాల మూలధన లాభం వస్తే.. అంతేసి పన్ను చెల్లించడం వల్ల మిగిలేదేమీ లేదని భాపడక్కర్లేదు. పన్ను భారం తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందుకోసం మెరుగైన ఆప్షన్ తిరిగి ఇంటిని కొనుగోలు చేయడమే. ప్రాపర్టీ విక్రయం ద్వారా వచి్చన మూలధన లాభంతో రెండేళ్లలో తిరిగి ఇల్లు కొనుగోలు చేయాలి. ప్రాపర్టీ విక్రయించడానికి ముందు ఏడాది కాలంలో మరో ఇంటిని కొనుగోలు చేసినా కానీ, సెక్షన్ 54 కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త ఇంటిని నిర్మించుకునేట్టు అయితే అందుకు మూడేళ్ల వ్యవధి ఉంటుంది. ఇలా మరో ఇంటిని కొనుగోలు చేసి పన్ను మినహాయింపు పొందిన వారు.. ఆ ప్రాపరీ్టని మూడేళ్లు నిండిన తర్వాతే విక్రయించాలి. లేదంటే గతంలో పొందిన పన్ను మినహాయింపును కోల్పోవాల్సి వస్తుంది. మూలధన లాభం రూ.2 కోట్లకు మించి ఉంటే, పన్ను మినహాయింపునకు కొత్త ఇల్లు ఒక్కటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మూలధన లాభం రూ.2 కోట్లలోపు ఉంటే రెండు ఇళ్లపై వెచి్చంచినా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక్కసారి ఈ ప్రయోజనం క్లెయిమ్ చేసుకుంటే, ఇక తర్వాత మరోసారి అవకాశం ఉండదు. సెక్షన్ 54 కింద గరిష్ట పన్ను మినహాయింపు ప్రయోజనం రూ.10 కోట్లు. ఇంతకుమించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటిని విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల మూలధన లాభం ఆర్జిస్తే.. తిరిగి మరో ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై రూ.10 కోట్లపైనే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోగలరు. విక్రయించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలులోపు ఇంటిని కొనుగోలు చేయలేకపోతే.. అప్పుడు ఆర్జించిన మూలధన లాభాల మొత్తాన్ని ఎంపిక చేసిన బ్యాంకు శాఖల్లో క్యాపిటల్ గెయిన్స్ స్కీమ్ అకౌంట్ (సీజీఏఎస్)లో డిపాజిట్ చేయాలి. లేదంటే లాభం మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను లేకుండా చూసుకోవచ్చు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ ఈ తరహా బాండ్లను జారీ చేస్తుంటాయి. వీటిపై కూపన్ రేటు 6 శాతంలోపే ఉంటుంది. వీటి కాల వ్యవధి ఐదేళ్లు. ఇంటిని విక్రయించిన తేదీ నుంచి ఆరు నెల్లలోపు ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్నది నిబంధన. నష్టం వస్తే..? ప్రాపర్టీ విక్రయంపై నష్టం వస్తే ఏంటి పరిస్థితి..? ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇతర మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాపర్టీ విక్రయించిన సంవత్సరంలో ఇతర పెట్టుబడి సాధనాలపై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాలు నమోదు చేయని వారు.. తదుపరి ఆరి్థక సంవత్సరానికి క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు.ప్రాపర్టీ కొనుగోలు ధర..? మెజారిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 48 కింద అసలు కొనుగోలు ధర, చెల్లించిన స్టాంప్ డ్యూటీ చార్జీలు, రిజి్రస్టేషన్ చార్జీలు, ఇంటి కొనుగోలుకు రుణం తీసుకుంటే అందుకు చేసిన వడ్డీ చెల్లింపులు (దీనిపై ఆదాయపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయకపోతోనే) అన్నింటినీ మూలధన లాభం లెక్కింపులోకి పరిగణనలోకి తీసుకుంటారు. ‘‘ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి రూ.50 లక్షల ప్రపారీ్టని కొనుగోలు చేశారు. దీనిపై రూ.3.5 లక్షలు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించారు. ఇందులో రూ.1.5 లక్షలను అదే ఆరి్థక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందారు. కొనుగోలుకు రుణం తీసుకోగా, దీనిపై మొత్తం మీద రూ.10 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించారు. ఇందులో రూ.4 లక్షల వడ్డీ చెల్లింపులపైనే సెక్షన్ 24(బీ) కింద పన్ను మినహాయింపు పొందారు. దీంతో అసలు రూ.50 లక్షలు, స్టాంప్ డ్యూటీలో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయని రూ.2 లక్షలు, గృహ రుణంపై వడ్డీ చెల్లింపుల్లో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయకుండా మిగిలిన రూ.6 లక్షలు కలిపితే మొత్తం రూ.58 లక్షలను ప్రాపర్టీ కొనుగోలు ధర కింద పరిగణనలోకి తీసుకుంటారు’’అని ఖైతాన్ లీగల్‌కు చెందిన జోరావాలా తెలిపారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం... → 2009లో ప్రాపర్టీని రూ.15లక్షలు పెట్టి కొన్నారని అనుకుందాం. ఏటా ధర 4% చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుత విక్రయ ధర రూ.27 లక్షలు అవుతుంది. కానీ, ఇండెక్సేషన్ సర్దుబాటుతో కొనుగోలు ధర రూ.36.79 లక్షలుగా మారుతుంది. అంటే 2009లో కొనుగోలుకు వెచి్చంచిన రూ.15 లక్షలకు ఏటా ఇండెక్సేషన్ ప్రభావాన్ని కలిపితే ఈ ధర వస్తుంది. దీంతో పోల్చితే విక్రయించిన ధర తక్కువ కనుక పాత విధానంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కానీ నూతన విధానంలో 2009 నాటి కొనుగోలు ధరనే ప్రామాణికం. దీంతో రూ.12 లక్షలు లాభం వచి్చనట్టు తేలుతుంది. దీనిపై 12.5% పన్ను కింద రూ.1.5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ప్రాపర్టీ ధర ద్రవ్యోల్బణం కంటే తక్కువగా పెరగడం వల్ల వాస్తవంగా ఈ కేసులో నష్టం వచి్చనట్టు అర్థం చేసుకోవాలి. అయినా కానీ, కొత్త విధానం పన్ను చెల్లించాల్సిందే.→ 2009లోనే రూ.15 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ప్రాపర్టీ ధర ఒకవేళ ఏటా 8% కాంపౌండెడ్ చొప్పున పెరిగితే ప్రస్తుత విక్రయ ధర రూ. 47.58 లక్షలు అవుతుంది. ఇండెక్సేషన్ తో సర్దుబాటు చేస్తే కొనుగోలు ధర రూ.36.79 లక్షలు అవుతుంది. దీంతో పాత విధానంలో నికర లాభం రూ.10.79 లక్షలు అవుతుంది. దీనిపై 20% మూలధన లాభం కింద రూ.2.16 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త విధానంలో ఇండెక్సేషన్ లేదు కనుక నికర లాభం రూ.32. 58 లక్షలు అవుతుంది. దీనిపై 12.5% పన్ను కింద రూ. 4.07 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. → 2009లోనే రూ.15లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఇదే ప్రాపర్టీ ధర ఒకవేళ ఏటా 12 శాతం కాంపౌండెడ్ చొప్పున పెరిగితే ప్రస్తుత విక్రయ ధర రూ.82.10 లక్షలు అవుతుంది. ఇండెక్సేషన్‌తో సర్దుబాటు చేసిన తర్వాత వాస్తవ కొనుగోలు ధర రూ.36.79 లక్షలుగా మారుతుంది. దీని ప్రకారం నికర లాభం రూ.45.31 లక్షలు అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను కింద 9.06 లక్షలు చెల్లించాలి. అదే ఇండెక్సేషన్ లేకుండా చూస్తే నికర మూలధన లాభం రూ.67.10 లక్షలు అవుతుంది. దీనిపై 12.5 శాతం పన్ను కింద రూ.8.39 లక్షలు చెల్లించాలి. కొత్త విధానం కారణంగా ఈ కేసులో రూ.67 వేలు ఆదా అవుతోంది. వివిధ పట్టణాల్లో ధరల వృద్ధి నిజానికి గడిచిన ఐదేళ్లలో ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 10 శాతంలోపే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మినహా ఇతర ప్రముఖ పట్టణాల్లో ధరల వృద్ధి 9 శాతంలోపే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం ప్రాపరీ్టలు కొనుగోలు చేసిన వారిపై కొత్త పన్ను విధానం కారణంగా ఎక్కువ ప్రభావం పడనుంది.2001 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేస్తే..? ఇంటిని 2001 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన వారికి వాస్తవ కొనుగోలు వ్యయాన్ని మూ లధన లాభాలకు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు కొనుగోలు చేసిన వారికి ‘గ్రాండ్ ఫాదరింగ్’ ప్రొవిజన్ అమలవుతుంది. 2001 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసిన కేసుల్లో సహేతుక మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు. మరి ఈ సహేతుక మార్కెట్ విలువ అన్న దానికి ఇంకా స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. మార్కెట్ విలువలకు, రిజి్రస్టేషన్ విలువలకు మధ్య గతంలో ఎంతో అంతరం ఉండేది. రిజి్రస్టేషన్ వ్యాల్యూనే పరిగణనలోకి తీసుకుంటే మరింత పన్ను భారం ఎదుర్కోవాల్సి రావచ్చు. నికర పన్ను పన్ను 14.95 %దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్నుకు అదనంగా 15 శాతం సర్‌చార్జ్, 4 శాతం సెస్సు కూడా కలిపితే మొత్తం రూ.14.95 శాతం పన్ను కింద చెల్లించాలన్నది గుర్తుంచుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే..? ప్రభుత్వం పన్ను నిబంధనలు మార్చిన నేపథ్యంలో.. పెట్టుబడుల దృష్ట్యా ఇల్లు, స్థలాలను కొనుగోలు చేసే వారు ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ముఖ్యంగా తాము ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాంతంలో ధరలు ఏటా కనీసం 10 శాతం, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడే ప్రయోజనం దక్కుతుంది. లేదంటే ఒకవైపు పన్ను భారం, మరోవైపు ద్రవ్యోల్బణ ప్రభావం కలిపి నికరంగా మిగిలేదేమీ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడో కొని ఉంటే పన్ను భారం 10–20 ఏళ్లకు ముందు కొనుగోలు చేసిన వారు తాజా పన్ను ప్రతిపాదనతో ఎక్కువ పన్ను భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటికి ప్రాపర్టీ ధరల్లో గణనీయమైన పెరుగుదల చోటు చేసుకుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడం వల్ల మూలధన లాభాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇక నాన్ మెట్రో పట్టణాల్లో, పల్లెల్లో ప్రాపర్టీ ధరల పెరుగుదల అంతగా లేదు. వీటిని విక్రయించినప్పుడు ద్రవ్యోల్బణ ప్రభావం పోను నికరంగా నష్టమే వస్తుంది. అయినా కానీ, నూతన విధానంలో వీరు పన్ను చెల్లించాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. పదేళ్లకు మించితే భారమే... ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడం వల్ల పదేళ్లకు పైగా ప్రాపరీ్టలను హోల్డ్ చేసిన వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల పదేళ్లకు మించిన ఆస్తులను విక్రయించే వారు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. – నిరంజన్ హిరనందాని, నరెడ్కో చైర్మన్ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్‌కు బడ్జెట్ షాక్
భారతీయ స్టాక్‌మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ సెగ తగిలింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఆరంభంలో సానుకూలంగా ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంతో నిరాశ పడ్డారు. క్యాపిటల్ గెయిన్స్‌పై టాక్స్ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలను దిగారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ కూడా అదే బాటలోనడిచింది.ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టానికి పరిమితమే 80వేలకు ఎగువనకొనసాగుతుంది. అటు నిష్టీ 117 పాయింట్ల నష్టంతో 24, 392 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగ షేర్లు 10 శాతం వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఓఎన్జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్ , రిలయన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.ఎస్టీటీ దెబ్బఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) వ్యాపారులకు షాకిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రేటును 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచేశారు. ఫలితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనను అమలు తరువాత ఈక్విటీ , ఇండెక్స్ ట్రేడర్లు వమ వ్యాపారంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.రూపాయి ఢమాల్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేటును పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.69కి క్షీణించింది. గత జీవితకాలపు కనిష్ట స్థాయి 83.67. కాగా కేంద్ర బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10-12.5శాతానికి పెంచారు. అలాగే , దిగువ, మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. -
Capital Gains : ఇళ్లను కొనుగోలు చేసి.. వాటిని లాభాలకు అమ్ముతున్నారా?
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించి మార్పులు వచ్చాయి. ఇవన్నీ 2023 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని మీకు అవసరం అనిపిస్తే లేదా ఉపయోగం అనిపిస్తే 2023 మార్చి 31లోగా ఏదైనా ప్లానింగ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని పెట్టుబడుల కన్నా ఇంటి మీద పెట్టుబడి సురక్షితమనే భావన ఉంది. భద్రత, లాభం ఎక్కువ. స్టాక్ మార్కెట్‌లాగా ఒక రోజులో కుదేలవడం.. ఆవిరి అయిపోవడంలాంటివి వంటి ప్రమాదాలు ఉండవనే ఆలోచనతో ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇల్లు కొని, కొన్నేళ్ల తర్వాత అమ్మేసి ఆ మొత్తంతో మరొక ఇల్లు కొని మినహాయింపులూ పొందుతుంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్ట ప్రకారం ఒక ఇల్లు కొని అమ్మితే ఏర్పడ్డ దీర్ఘకాలిక మూలధన లాభాల్ని మినహాయింపు పొందాలంటే నిర్దేశిత వ్యవధిలో మరో ఇల్లు కొనాలి .. లేదా నిర్దేశిత బాండ్లలో వ్యవధిలోగా ఇన్వెస్ట్ చేయాలి. ఈ మినహాయింపు మన దేశంలో ఆస్తి కొంటేనే వర్తిస్తుంది. ఇలా చేసే వరకు క్యాపిటల్ గెయిన్ స్కీమ్ ద్వారా బ్యాంకుల్లో అకౌంటు తెరవాలి. ఈ అంశాలకు సంబంధించి ఎన్నో ఉదాహరణలు గతంలో మనం ప్రస్తావించాం. పెద్ద మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఈ మినహాయింపు మీద ఆంక్షలు వర్తించబోతున్నాయి. సాధారణంగా ఏదో విధి లేక ఇల్లు అమ్మి.. మళ్లీ కొనుక్కునే వారికి మినహాయింపు ఉంటుంది. ఇది సమంజసమే అయినా క్రమేణా ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రజలు వ్యాపార ధోరణిలో పడ్డారు. కొత్త పుంతలు తొక్కుతున్నారు. విల్లాలు, విలాసవంతమైన భవనాలు, అద్దాల మేడలు, పెద్ద భవంతులవైపు మళ్లుతున్నారు. ఇది ‘‘అవసరం’’ నుండి ‘‘అసమంజసం’’ లేదా ‘‘ఆధునికం’’, ‘‘ఆనందం’’ దాటేసి పరుగెడుతోంది. మినహాయింపు ఉందని విలాసవంతమైన ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, 2023 ఏప్రిల్ 1 నుండి ఈ మినహాయింపు మీద మార్పులు అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇక నుంచి ఈ మినహాయింపు రూ.10 కోటి దాటి ఇవ్వరు. మీరు ఇంటి మీద అంతకు మించి ఇన్వెస్ట్ చేసినా .. నిర్దేశిత పరిమితి దాటిన మొత్తానికి ఎటువంటి మినహాయింపు ఇవ్వరు. సెక్షన్ 54, 54ఎఫ్‌లకు ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉదాహరణకు మీకు దీర్ఘకాలిక మూలధన లాభం రూ.11 కోట్లు అనుకోండి. మీరు రూ. 11 కోట్లు పెట్టి భవంతి కొన్నా కేవలం రూ. 10 కోట్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చి .. అదనపు రూ. 1 కోటిపై పన్ను విధిస్తారు. తస్మాత్ జాగ్రత్త! -
పన్నులు చెల్లించండి..అభివృద్ధికి సహకరించండి..
స్థిరాస్తులు విక్రయించినప్పుడు దఖలుపడే క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించి గత వారం చెప్పుకొన్న దానికి కొనసాగింపుగా మరిన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక్కొక్కపుడు రోడ్డు వైడనింగ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం.. స్థిరాస్తులను కంపల్సరీగా స్వాధీనపర్చుకుంటుంది. అలా స్వాధీ నపర్చుకున్నందుకు గాను నష్టపరిహారం ఇస్తుంటుంది. అది పూర్తిగా చేతికి ముట్టిన తేదీని బదిలీ తేదిగా పరిగణిస్తారు. మీరు కొనబోయే కొత్త ఆస్తి గడువు తేదీని లెక్కించడానికి, నష్టపరిహారం పూర్తిగా ముట్టిన తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. స్వయంగా అమ్ముకున్నా, కంపల్సరీగా వదులుకున్నా.. మిగతా ఏ విషయాల్లోనూ ఎటువంటి మార్పు ఉండదు. ఉదాహరణకు .. ఒక ఉద్యోగి 2014 ఏప్రిల్‌లో ఇల్లు కొని 25–04–2021న రూ. 25,20,000కు విక్రయించారనుకుందాం. క్యాపిటల్ గెయిన్ రూ. 5,00,000 అనుకుందాం. 31–3– 2021తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను వేయడానికి ఆఖరు తేదీ 31–07–2022. అతను ఇల్లు కొనలేదు.. కట్టుకోలేదు. గడువు తేదీ లోపల రూ. 5,00,000 మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ అకౌంటులో జమ చేశారు (ఇలా చేయడం వల్ల మినహాయింపు పొందవచ్చు). ఆ తర్వాత 2023 జనవరిలో ఈ ఖాతాలో నుంచి రూ. 4,00,000 విత్‌డ్రా చేసి ఇల్లు కొన్నారు. 25–04–2021 నుంచి రెండు సంవత్సరాల లోపల ఇల్లు కొనాలి లేదా మూడు సంవత్సరాల లోపల ఇల్లు కట్టాలి. సదరు ఉద్యోగి 2023 జనవరిలో ఇల్లు కొన్నారు ..కాబట్టి మినహాయింపు లభిస్తుంది. కానీ, రూ. 4,00,000 మాత్రమే వెచ్చించి కొన్నారు కాబట్టి.. అంతవరకే మినహాయింపు ఇస్తారు. ఖర్చు పెట్టని రూ. 1,00,000కి గతంలో ఇచ్చిన మినహాయింపును రద్దు చేసి ఆ మొత్తాన్ని 2024–25 సంవత్సరం దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించి పన్ను భారాన్ని లెక్కిస్తారు. ఇక మరో ఉదాహరణలో క్యాపిటల్ గెయిన్ రూ. 5,00,000 అయితే.. స్కీమ్‌లో డిపాజిట్ చేసింది రూ. 8,00,000 అనుకుందాం. అంటే మూడు లక్షల రూపాయలు అదనంగా డిపాజిట్ చేశారనుకుందాం. ఇలా చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ గడువు తేదీలోగా ఇల్లు కొనలేదు, కట్టనూ లేదు అనుకుంటే .. అలాంటప్పుడు స్కీమ్‌లో డిపాజిట్ చేసినప్పుడు రూ. 5,00,000కు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. అదనంగా డిపాజిట్ చేసినంత మాత్రాన అదనంగా మినహాయింపునివ్వరు. ఒకాయన క్యాపిటల్ గెయిన్స్ మొత్తాన్ని స్కీములో పెట్టి .. మినహాయింపు పొంది.. తర్వాత స్కీములో నుంచి మొత్తం విత్‌డ్రా చేసి ఎంచక్కా కారు కొనుక్కున్నారు. దీంతో మినహాయింపుని రద్దు చేసి ఆ మొత్తాన్ని ఆదాయంగా లెక్కేశారు. ఇలాగే స్కీములో నుంచి విత్‌డ్రా చేసి ఇల్లు కొనుక్కోకుండా, కట్టుకోకుండా.. ఆడపిల్ల పెళ్లి చేసిన కల్యాణ రావుకి, పిల్లాడి చదువు చెప్పించిన విద్యాధర రావుకి మినహాయింపు రద్దయి .. పన్ను భారం తప్పలేదు. ఇన్‌కం ట్యాక్స్ ప్లానింగ్ అంటే .. పన్ను ఎగవేత కాదు. సాధ్యమైనంత వరకూ పన్ను భారం లేకుండా చూసుకునేందుకు రాచమార్గాన్ని ఎంచుకోండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోండి. మీ కుటుంబ పరిస్థితులు, అవసరాలు, బాధ్యతలు, ప్రాధాన్యతాంశాలు మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని అడుగేయండి. చట్టప్రకారం వెళ్లండి. శాంతి .. ప్రశాంతత ముఖ్యం. సక్రమంగా వెళ్లాలి. సజావుగా జరగాలి. మోసపోకూడదు. బ్లాక్ జోలికి పోవద్దు. ఇతర చట్టాలు .. అంటే.. రిజిస్ట్రేషన్ చట్టం, స్టాంపు డ్యూటీ, టీడీఎస్, ఎన్నారైలతో డీల్ చేసేటప్పుడు ఫెమా చట్టం , బ్యాంకులు, రుణాలు ఇలా ఎన్నో వలయాలను క్రమంగా ఛేదించుకుంటూ వ్యవహారాన్ని నిర్వహించండి. గజం పది రూపాయలకు కొని .. లక్షల రూపాయలకు అమ్మినప్పుడు నేను ఇంత భారీ మొత్తం పన్ను కట్టాలా అని ఆలోచించకండి. మా తాత కష్టపడి సంపాదిం చిన ఆస్తి అని తప్పటడుగులు వేయకండి. అంత మొత్తం రావడం అదృష్టంగా భావించి ఆ అదృష్టంలో 20 శాతం ప్రభుత్వం ద్వారా ప్రజల అభివృద్ధికి జమ చేయండి. పన్నులు ఎగ్గొట్టే జల్సా జనాలతో పోల్చుకోకుండి. మీరు నిజాయితీ మనుషులుగా వ్యవహరించండి. -
మదుపుదారులకు మరింత ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : వృద్ధి రేటు పతనమవడంతో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్‌ను గణనీయంగా తగ్గించడంతో పాటు షేర్ల విక్రయం, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో యూనిట్ల అమ్మకం ద్వారా సమకూరే క్యాపిటల్ గెయిన్స్‌పై అదనంగా విధించిన సర్‌చార్జ్ నుంచి వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలను మినహాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్యాపిటల్ మార్కెట్లోకి నిధుల ప్రవాహాన్ని స్ధిరీకరించేందుకు ఇటీవల ఫైనాన్స్ చట్టం ద్వారా షేర్ల విక్రయంపై పొందే క్యాపిటల్ గెయిన్స్‌పై అదనంగా విధించిన సర్‌చార్జ్ వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబానికి (హెచ్‌యూఎఫ్) వర్తించవని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడంతో పాటు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆమె పేర్కొన్నారు. -
కెయిర్న్ ఎనర్జీకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: బ్రిటీష్ సంస్థ , ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీకి ఆదాయపన్ను శాఖ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించని కారణంగా రూ. 30,700 కోట్ల భారీ జరిమానా విధించింది. రూ10,247 కోట్ల రూపాయల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఐటీ ఈ నోటీసులు జారీ చేసింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసిన కొన్ని వారాల్లో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నోటీసులతోపాటు, ఎందుకు జరిమానా విధించ కూడదో చెప్పాలంటూ మరో షో కాజ్ నోటీసును కూడా జారీ చేసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా కోరినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఆదాయపన్ను చట్టం 271 (1)(సీ) ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు చెప్పారు. అంచనా ప్రకారం 2016 జనవరిలో ఇది పూర్తికావాల్సి ఉందని, ఈనేపథ్యంలో రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా ఫైనల్ నోటీస్ జారీచేశామన్నారు. మొత్తం ఈ పన్నుకు తోడుగా ఈ 10 సంవత్సరాల వడ్డీనిమిత్తం మరో రూ. 18,800 కోట్లను జోడించినట్టు చెప్పారు. అయితే దీనిపై స్పందించడానికి కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ప్రస్తుతానికి అందుబాటులో లేరు. కాగా గత నెలలో ఐటీఏటి రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే నని కెయిర్స్కు కస్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
పెట్టుబడికి షేర్లు, డెట్ సాధనాలు
ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో భారత్‌పై ఆశాభావం, అంచనాలు పెరిగాయి. అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై సైతం ఆశలు ఊపందుకున్నాయి. ఇదే పరిస్థితులు మెరుగుపడేందుకు దోహదపడుతుంది. ఇలాం టప్పుడు పెట్టుబడులపై అధిక రాబడులు అందుకునేందుకు ప్రత్యేక వ్యూహం పాటించాల్సి ఉంటుంది. కంపెనీలు వివిధ వ్యాపారాల్లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేస్తుంటాయో అలాగే ఇన్వెస్టర్లు కూడా రిస్కు సామర్థ్యాన్ని బట్టి వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈక్విటీలు, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు ఇందుకు ఉపయోగపడగలవు. ఈక్విటీలు , ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు.. పోర్ట్‌ఫోలియోలో ఉండదగిన కీలకమైన సాధనాల్లో ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ రెండూ కూడా మెరుగైన పనితీరు కనపర్చగలవన్న అంచనాలు నెలకొన్నాయి. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్న కొద్దీ కంపెనీల ఆదాయాలు మెరుగుపడుతుండటం ఒక కారణం. కాగా, ద్రవ్యోల్బణ కట్టడి చర్యల మూలంగా వడ్డీ రేట్లు దిగి రానుండటం మరో కారణం. ఈక్విటీలు, ఎఫ్డీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడానికి పైన పేర్కొన్న రెండూ బలమైన కారణాలే. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వ్యవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచడం వల్ల ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో మార్పులు వచ్చాయి. షేర్లలో పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములను ఎంచుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో వీటికి కాస్త ఎక్కువ కేటాయింపులే జరపవచ్చు. అసలు ఏ స్కీమును ఎంచుకోవాలన్న విషయంలో ఇన్వెస్టర్లకు చాలా సందర్భాల్లో సందేహాలు ఎదురవుతుంటాయి. ఈ ప్రశ్న మంచిదే అయినప్పటికీ.. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏ సాధనం వృద్ధి కూడా పెరుగుతూనే పోదు. ఒక్కోసారి పెరగొచ్చు.. ఒక్కోసారి తగ్గొచ్చు. కాబట్టి, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, బ్యాలెన్స్డ్ ఫండ్స్ వంటి వివిధ ఈక్విటీ సాధనాలను ఎంచుకోవచ్చు. ఇన్వెస్టర్లకు గరిష్ట లాభాలు అందించే ఉద్దేశంతో వీటిలో ఒక్కొక్కటీ మార్కెట్లో ఒక్కో విభాగంపై దృష్టి పెడుతుంటాయి. కనుక, డబ్బు మొత్తాన్ని ఒకే ఫండ్‌లో పెట్టేయకుండా వివిధ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక స్థిరమైన ఆదాయాలను అందించే సాధనాల విషయానికొస్తే.. ఇప్పటి వడ్డీ రేట్లను బట్టి చూస్తే..స్వల్పకాలిక మొదలుకుని మధ్యకాలిక వ్యవధికి సంబంధించిన ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీములను ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లలో పన్ను పరమైన ప్రయోజనాలను పొందాలంటే ఇన్వెస్ట్మెంట్ వ్యవధిని మూడేళ్లకు పెంచారు. కనుక, లిక్విడ్ ప్లస్, షార్ట్.. మీడియం టర్మ్ ప్లాన్లు, డైనమిక్ ఫండ్స్ వంటి ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీముల్లో కేటాయింపులు పెంచవచ్చు.