భారతీయ స్టాక్‌మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ సెగ తగిలింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై కోటి ఆశలతో ఉన్న ఇన్వెస్టర్లు మార్కెట్ ఆరంభంలో సానుకూలంగా ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంతో నిరాశ పడ్డారు. క్యాపిటల్ గెయిన్స్‌పై టాక్స్ తదితర పరిణామాల నేపథ్యంలో అమ్మకాలను దిగారు. దీంతో సెన్సెక్స్ ఏకంగా 750 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నిఫ్టీ కూడా అదే బాటలోనడిచింది.
ప్రస్తుతం కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టానికి పరిమితమే 80వేలకు ఎగువనకొనసాగుతుంది. అటు నిష్టీ 117 పాయింట్ల నష్టంతో 24, 392 వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే ఆ ర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో వ్యవసాయ రంగ షేర్లు 10 శాతం వరకు ర్యాలీ చేశాయి. కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్, కోరమాండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్ లిమిటెడ్, ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. ఓఎన్‌జిసి, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిపిసిఎల్ , రిలయన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
ఎస్‌టీటీ దెబ్బ
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) వ్యాపారులకు షాకిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెక్యూరిటీ లావాదేవీల పన్ను (STT) రేటును 0.01 శాతం నుండి 0.02 శాతానికి పెంచేశారు. ఫలితంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనను అమలు తరువాత ఈక్విటీ , ఇండెక్స్ ట్రేడర్లు వమ వ్యాపారంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
రూపాయి ఢమాల్
క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను రేటును పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.69కి క్షీణించింది. గత జీవితకాలపు కనిష్ట స్థాయి 83.67.
కాగా కేంద్ర బడ్జెట్‌లో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 10-12.5శాతానికి పెంచారు. అలాగే , దిగువ, మధ్య-ఆదాయ తరగతుల ప్రయోజనాల కోసం కొన్ని ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాల మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 1.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment