కెయిర్న్ ఎనర్జీకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: బ్రిటీష్ సంస్థ , ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీకి ఆదాయపన్ను శాఖ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించని కారణంగా రూ. 30,700 కోట్ల భారీ జరిమానా విధించింది. రూ10,247 కోట్ల రూపాయల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఐటీ ఈ నోటీసులు జారీ చేసింది.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసిన కొన్ని వారాల్లో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నోటీసులతోపాటు, ఎందుకు జరిమానా విధించ కూడదో చెప్పాలంటూ మరో షో కాజ్ నోటీసును కూడా జారీ చేసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా కోరినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు.
ఆదాయపన్ను చట్టం 271 (1)(సీ) ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు చెప్పారు. అంచనా ప్రకారం 2016 జనవరిలో ఇది పూర్తికావాల్సి ఉందని, ఈనేపథ్యంలో రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా ఫైనల్ నోటీస్ జారీచేశామన్నారు. మొత్తం ఈ పన్నుకు తోడుగా ఈ 10 సంవత్సరాల వడ్డీనిమిత్తం మరో రూ. 18,800 కోట్లను జోడించినట్టు చెప్పారు.
అయితే దీనిపై స్పందించడానికి కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ప్రస్తుతానికి అందుబాటులో లేరు.
కాగా గత నెలలో ఐటీఏటి రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే నని కెయిర్స్‌కు కస్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.