Cairn Energy
-
కెయిర్న్‌తో ‘రెట్రాస్పెక్టివ్’ వివాద పరిష్కారం
న్యూఢిల్లీ: రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లు రిఫండ్చేసింది. కెయిర్న్ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీగా పేరు మారింది) ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ‘‘పన్ను రిఫండ్‌గా 1.06 బిలియన్ డాలర్లను స్వీకరించడం జరిగింది’’ అని పేర్కొంది. దీనితో భారత్‌తో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడేళ్ల నుంచి తీవ్ర వివాదాస్పంగా ఉన్న రెట్రాస్పెక్టివ్ వివాదంలో కీలక సానుకూల పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. వివారాలు ఇవీ... 50యేళ్ల క్రితం జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేందుకు వీలు కల్పిస్తూ 2012లో చేసిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దీనిపై పలు సంస్థలు దావాలు దాఖలు చేసి, వాటికి అనుగుణంగా తీర్పులను పొందాయి. కెయిర్న్ విషయానికి వస్తే, 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. వాటిని రాబట్టుకునేందుకు కెయిర్న్ షేర్లు మొదలైన వాటిని జప్తు చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 7,900 కోట్లు. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ, భారత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో .. తనకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఉన్న ఆస్తులపై కెయిర్న్ దృష్టి సారించింది. వాటిని జప్తు చేసి, తనకు పరిహారం ఇప్పించాలంటూ వివిధ దేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించింది. కొన్ని చోట్ల కంపెనీకి అనుకూల ఆదేశాలు కూడా వచ్చాయి. వరుసలో మరో 16 కంపెనీలు! అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో కేంద్రం గత ఏడాది రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ దిశలో వివాదాస్పద చట్ట నిబంధనల కింద వసూలు చేసిన మొత్తాలను తిరిగి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.1.10 లక్షల కోట్ల పన్ను డిమాండ్లు అందుకున్న దాదాపు 17 కంపెనీల్లో 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ ఒకటి. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల న్యాయస్థానాల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటిని కెయిర్న్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేసింది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కెయిర్న్‌కు మార్గం సుగమం అయ్యింది. కెయిర్న్తోపాటు కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగులు వేస్తోంది. -
పన్ను వివాద కేసుల ఉపసంహరణ: కెయిర్న్
న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్లుగా భారత ప్రభుత్వంతో నెలకొన్న రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ వివాదానికి ముగింపు పలికే దిశగా బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ చర్యలు తీసుకుంది. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల కోర్టుల్లో భారత్‌పై వేసిన దావాలన్నింటినీ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించనున్నట్లు కెయిర్న్ ఎనర్జీ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీ) తెలిపింది. ఆ తర్వాత ట్యాక్స్‌ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేస్తుందని పేర్కొంది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కంపెనీకి మార్గం సుగమం అయ్యింది. ఇదీ నేపథ్యం 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్‌కు నోటీసులు పంపించింది. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. అంతర్జాతీయంగా పరువు పోతుండటంతో గతేడాది ఆగస్టులో వివాదాస్పద రెట్రాస్పెక్టివ్ చట్టాన్ని కేంద్రం పక్కన పెట్టింది. -
రెట్రో ట్యాక్స్‌పై కెయిర్న్ ఆఫర్‌కు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: రెట్రో ట్యాక్స్ వివాదాలను సత్వరం పరిష్కరించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కెయిర్న్ ఎనర్జీ సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం అంతర్జాతీయ కోర్టుల్లో భారత్‌పై వేసిన కేసులన్నింటినీ కెయిర్న్ ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యాక, కంపెనీకి ప్రభుత్వం దాదాపు రూ. 7,900 కోట్ల పన్నులను రీఫండ్ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేసుల ఉపసంహరణకు మూడు–నాలుగు వారాలు పట్టొచ్చని వివరించాయి. గత లావాదేవీలకు కూడా పన్నులు విధించేందుకు వెసులుబాటు నిచ్చే చట్ట సవరణ (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) ద్వారా ట్యాక్స్‌లు వసూలు చేయడంపై కెయిర్న్ సహా పలు కంపెనీలు, కేంద్రం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో ఈ చట్టాన్ని పక్కన పెట్టి, ఆయా కంపెనీల నుంచి వసూలు చేసిన పన్నులను తిరిగి ఇవ్వడం ద్వారా వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్రం భావించింది. అయితే, ఇందుకోసం భారత్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సంస్థలకు షరతు విధించింది. దానికి అనుగుణంగానే కెయిర్న్ తాజా ఆఫర్ ఇచ్చింది. -
భారత్ ప్రభుత్వంపై దావా... వెనక్కి తగ్గిన కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: భారత్ ప్రభుత్వంపై దావాల కొనసాగింపు విషయంలో కెయిర్న్ ఎనర్జీ వెనక్కు తగ్గుతుంది. ఇందుకు సంబంధించి న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఎయిర్ ఇండియాపై తాను వేసిన ఒక దావాపై స్టేను కోరుతూ స్వయంగా ముందుకు వచ్చింది. ఎయిర్ ఇండియాతో కలిసి ఈ మేరకు న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. రెట్రాస్పెక్టివ్ పన్ను రద్దుపై భారత్ నిర్ణయం, ఈ నిర్ణయం అమలుకు విధివిధానాల అమలు తత్సంబంధ అంశాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున దావాపై విచారణపై స్టే ఇవ్వాలని రెండు సంస్థలూ న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి. వివరాలు ఇవీ... కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.7,900 కోట్లు. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.2 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ నిర్ణయించింది. అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు కూడా దాఖలు చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియాపై సైతం ఒక దావాను మేలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా జూలైలో ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అయితే రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని కేంద్రం గత నెల్లో నిర్ణయం తీసుకుంది. రెట్రో పన్ను రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒక్క కెయిర్న్ ఎనర్జీకి చెల్లించాల్సిందే రూ.7,900 కోట్లు కావడం గమనార్హం. దీనితోపాటు మొత్తం రూ.1.10 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను డిమాండ్లను దాదాపు 17 కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. వివాద పరిష్కారాలకు, రిఫండ్స్‌కు తొలుత ఆయా కంపెనీలు కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పలు కంపెనీలు ప్రారంభించాయి. రెట్రాస్పెక్టివ్ పన్ను అంటే.. గత 50 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలకు కూడా పన్నులు వసూలు చేసే విధానాన్ని రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్‌గా వ్యవహరిస్తారు. భారతదేశంలోని ఆస్తుల అమ్మకం, షేర్ల బదలాయింపు వంటి లావాదేవీలు గతంలో విదేశాల్లో జరిగినా వాటికి సంబంధించి ఇక్కడ పన్ను కట్టాల్సిందేనన్న ఉద్దేశంతో 2012 మే 28న అప్పటి యూపీఏ ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థిరమైన పన్ను విధానాలపై ఇన్వెస్టర్లలో భరోసా కల్పించేందుకు, కార్పొరేట్ సంస్థలతో నెలకొన్న రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వివాదాలకు ముగింపు పలికేందుకు రెట్రో ట్యాక్స్‌ను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. చదవండి: సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే -
ఇండియా వర్సెస్ కెయిర్న్,.. కుదిరిన డీల్ ?
న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను తిరిగి చెల్లించే విషయమై భారత ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ పట్ల బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్సీ సానుకూలంగా స్పందించింది. రెట్రోస్పెక్టివ్ చట్టాన్ని రద్దు చేసే బిల్లుకు గత నెలలో పార్లమెంట్ ఆమోదం తెలుపడం తెలిసిందే. దీంతో గతంలో ముక్కు పిండి వసూలు చేసిన బిలియన్ డాలర్లకు పైన (రూ.7,900 కోట్లు సుమారు) కెయిర్న్ ఎనర్జీకి భారత ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. దీనికంటే ముందు కెయిర్న్ ఎనర్జీ భారత సర్కారు ఆస్తుల స్వాధీనానికి పలు దేశాల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమ్మతమే భారత్ ఇచ్చిన ఆఫర్ తమకు ఆమోదనీయమేనని కెయిర్న్ ఎనర్జీ సీఈవో సైమన్ థామ్సన్ లండన్‌లో ప్రకటించారు. తమకు భారత సర్కారు నుంచి చెల్లింపులు అందిన రోజుల వ్యవధిలోనే.. ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయ అపార్ట్మెంట్లు, అమెరికాలో ఎయిర్ ఇండియా విమానం జప్తునకు సంబంధించి దావాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ‘‘మా వాటాదారులైన బ్లాక్‌రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇందుకు అంగీకరించాయి. మా కీలకమైన వాటాదారుల మద్దతు ఆధారంగానే మా అభిప్రాయం ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ప్రతికూలంగా నడుస్తున్న దాన్ని ముగించి, ఇచ్చిన ఆఫర్‌ను ఆమోదించడం మంచిది, ఆచరణాత్మకం అన్నది అభిప్రాయం’’ అని థామ్సన్ పేర్కొన్నారు. సరైన అవకాశం ఉంటే..: భారత్‌కు కెయిర్న్ ఎనర్జీ తిరిగొస్తుందా? అన్న ప్రశ్నకు.. సమస్య తొలగిపోతే సరైన పెట్టుబడి వేదిక కాగలదని సైమన్ థామ్సన్ చెప్పారు. సరైన అవకాశం ఉంటే ఎందుకు రాబోమని అన్నారు. 2012 నాటి రెట్రోస్పెక్టివ్ పన్ను చట్టం కింద 50 ఏళ్ల క్రితం నమోదైన లావాదేవీలపైనా ప్రభుత్వం పన్ను వేయగలదు. భారత్‌లోని ఆస్తుల యాజమాన్యాలు విదేశీ ఇన్వెస్టర్ల మధ్య చేతులు మారితే లాభాలపై పన్నును ఈ చట్టం కింద రాబట్టుకోవచ్చు. చదవండి: వోస్తోక్ ప్రాజెక్ట్‌పై ఓవీఎల్ దృష్టి -
ఎయిరిండియాపై కెయిర్న్ దావా ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయంపై కెయిర్న్ ఎనర్జీ, దేవాస్ మల్టీమీడియా సంస్థలు దాఖలు చేసిన కేసుల ప్రభావమేమీ ఉండదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్పష్టం చేశారు. సొంత మేనేజ్మెంటు, బోర్డుతో ఎయిరిండియా ప్రత్యేకంగా కార్పొరేట్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోందని లోక్‌సభలో ఆయన తెలిపారు. పన్ను వివాదంలో కేంద్రం నుంచి పరిహారం రాబట్టుకునే క్రమంలో బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీ.. విదేశాల్లోని భారత ఆస్తులను జప్తు చేసుకునేందుకు వివిధ దేశాల్లో కేసులు వేసింది. ఇందులో భాగంగా ఎయిరిండియా ఆస్తుల జప్తుపై కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఏవియేషన్’ సవాళ్ల పరిష్కారానికి సలహా బృందాలు కాగా, విమానయాన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల పరిష్కారానికి గాను పౌర విమానయాన శాఖ మూడు సలహా బృందాలను ఏర్పాటు చేసింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, కార్గో (సరుకు రవాణా) విమానయాన సంస్థలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలు, ఫ్లయింగ్ శిక్షణా కేంద్రాలు, మరమ్మతులు, నిర్వహణ సంస్థలకు ఇందులో చోటు కల్పించింది. కరోనా మొదటి విడతలో రెండు నెలల పాటు విమానయాన సర్వీసులు మూతపడ్డాయి. రెండో విడతలోనూ సర్వీసులు, ప్రయాణికుల సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుని నిర్వహించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఈ పరిశ్రమలోని సంస్థలపై గట్టిగానే పడింది. దీంతో భారీ నష్టాలతో వాటి ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారాయి. దీంతో పౌర విమానయాన శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ‘‘పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చైర్మన్‌గా మూడు సలహా బృందాలను ఏర్పాటు చేయడమైనది. ఈ బృందాలు క్రమం తప్పకుండా సమావేశమై పలు అంశాలపై చర్చించడంతోపాటు.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తాయి’’ అంటూ పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. -
అలక్ష్యంతో వచ్చిపడ్డ అవమానం!
సరైన సమయంలో... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడైనా పెద్ద చిక్కే. ఆ సంగతి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలిసొచ్చింది. బ్రిటన్‌కు చెందిన చమురు అన్వేషణ, ఉత్పత్తి సంస్థ కెయిర్న్ ఎనర్జీతో కొన్నేళ్ళుగా సాగుతున్న పన్నుల వివాదంలో గురువారం భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు ఆ సంస్థకు వీలు కల్పిస్తూ, న్యాయప్రక్రియ పూర్తయింది. ప్యారిస్‌లో ఆ సంస్థ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న భారత ప్రభుత్వ ఆస్తుల విలువ దాదాపు 2 కోట్ల యూరోలు. ఇదే కాదు... అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్రకారం మన ప్రభుత్వం వెనక్కి కట్టాల్సిన 170 కోట్ల డాలర్ల సొమ్ము కోసం ఆ సంస్థ ఇప్పటికే వేర్వేరు దేశాల్లో కూడా కేసు వేసింది. అక్కడ కూడా స్వాధీనం చేసుకొనేందుకు భారత ప్రభుత్వ ఆస్తులను గుర్తిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలే కాదు, చివరకు అక్కడి ఎయిర్ ఇండియా విమానం సహా భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకొని, విక్రయి స్తామని కెయిర్న్ గతంలోనే బెదిరించింది. ఇప్పుడు ఆ పనే చేయడానికి సిద్ధమవుతోంది. దిగ్భ్రాంతి కరమైన ఈ వార్త ఒక రకంగా ప్రభుత్వానికి పరువు తక్కువగా మారింది. ఈ వివాదానికి మూలమైన భారత్‌లో కెయిర్న్ కథ చాలా ఏళ్ళ క్రితం మొదలైంది. 1994లోనే ఆ సంస్థ మన దేశంలో చమురు, సహజవాయు రంగంలో పెట్టుబడులు పెట్టింది. 2004 జనవరిలో రాజస్థాన్‌లోని బర్మేర్ దగ్గర చమురు బావులున్నట్టు ఆ సంస్థ అన్వేషణలో తేలింది. అక్కడ పని మొదలుపెట్టింది. సరిగ్గా మూడేళ్ళకు కెయిర్న్ ఇండియా సంస్థ మన స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అటుపైన నాలుగేళ్ళకు షేర్లలో అధిక భాగాన్ని గనుల తవ్వక దిగ్గజమైన వేదాంత సంస్థకు అమ్మేసింది. ఇలా ఉండగా, 2012లో మన కేంద్ర ఆర్థిక శాఖ వెనుకటి తేదీ నుంచి వర్తిస్తూ పన్ను వేసేలా చట్టంలో సవరణ తెచ్చింది. దాని ప్రకారం కెయిర్న్‌పై వెనకటి తేదీ 2006 నుంచే వర్తించేలా పన్ను భారం పడింది. 2006–07లో ఆ సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘కెయిర్న్ ఇండియా హోల్డింగ్స్’ షేర్లను ‘కెయిర్న్ ఇండియా’కు బదలాయించింది. తద్వారా ఆ బ్రిటన్ సంస్థకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చినందువల్ల, దానిపై రూ. 24.5 వేల కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలని అధికారులు ఆదేశించారు. అది వివాదమైంది. విషయం కోర్టుల దాకా వెళ్ళింది. బ్రిటన్ – భారత్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద అది చెల్లదంటూ 2015 మార్చిలో కెయిర్న్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఇది పెట్టుబడులకు సంబంధిం చిన వివాదమే తప్ప, కేవలం పన్ను వ్యవహారం కాదంటూ హేగ్‌లోని అంతర్జాతీయ మధ్వవర్తిత్వ కోర్టు స్పష్టం చేసింది. అలా 2020 డిసెంబర్లో కెయిర్న్‌కు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. వివాదం వల్ల భారత ప్రభుత్వం ఆపిన డబ్బులన్నీ లెక్క కట్టి, ప్రభుత్వమే ఆ సంస్థకు 120 కోట్ల డాలర్ల అసలు, 50 కోట్ల డాలర్ల వడ్డీ – మొత్తం 170 కోట్ల డాలర్లు చెల్లించాలని కోర్టు పేర్కొంది. దానితో అసంతృప్తికి లోనైన భారత ప్రభుత్వం దానిపై అప్పీలు చేసుకుంది. మరోపక్క కెయిర్న్ సంస్థ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, కెనడా, సింగపూర్, జపాన్ సహా పలుచోట్ల కేసు వేసింది. తద్వారా విమానాలు, నౌకలు, బ్యాంకు ఖాతాలతో సహా ఆ దేశాల్లో మన దేశానికి ఉన్న వాణిజ్యపరమైన ఆస్తులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొనే వీలు కలిగింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే రంగంలోకి దిగి, సర్దుబాటు, దిద్దు బాటు చర్యలు చేపట్టాల్సిన మన సర్కారు ఆ పని చేయలేదు. ప్రభుత్వ వర్గాలు మొద్దునిద్ర పోవ డంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికీ ‘తగిన చర్యలన్నీ తీసుకుంటాం’, ‘న్యాయపోరాటానికి దిగుతాం’ లాంటి మాటలనే ప్రభుత్వ వర్గాలు వల్లె వేస్తున్నాయి. కానీ, వాద నకు వకీలుకు తగినంత సమాచారం ఇవ్వరంటూ సొంత అధికారుల నుంచి గతంలోనే ప్రభుత్వం విమర్శల పాలైంది. ఇప్పుడిక అంతర్జాతీయ ఉత్తర్వులు అమలుకు వీలున్న అనేక ప్రాంతాల్లో ఆస్తులు కాపాడుకొనేందుకు ప్రభుత్వం ఎంత సమర్థంగా పోరాటం చేయగలదన్నది ప్రశ్న. మరోపక్క కెయిర్న్ చూపిన ఈ బాట ఇప్పుడు పలు విదేశీ సంస్థలకు అవకాశం కానుంది. ఇప్పటికే మరో విదేశీ సంస్థ దేవాస్ మల్టీమీడియా కూడా న్యూయార్క్‌లోని ఎయిరిండియా ఆస్తులపై కన్నేసి, ఇదే దోవలో వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇస్రో అనుబంధ సంస్థ యాంత్రిక్స్ కార్పొ రేషన్‌కూ, దేవాస్కూ మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2012లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు దానికీ భారీగానే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఒప్పందాలు కుదుర్చుకునే ముందే ఆలోచించాలి తప్ప, కుదుర్చుకున్నాక చటుక్కున బయటకు రావడం అంత సులభం కాదని ఆలస్యంగానైనా ప్రభుత్వానికి అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రాజీ మార్గం వెతకాలి. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ద్వారా భారత్ నుంచి రావాల్సిన మొత్తాన్ని భారత్‌లోనే పెట్టుబడిగా పెడతామని ఆ మధ్య కెయిర్న్ చేసిన ప్రతిపాదననూ పరిశీలించవచ్చు. తక్షణమే సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోతే, ఒకపక్క ఆస్తులతో పాటు అంతర్జాతీయంగా ప్రభుత్వం పరువూ పోతుంది. చట్టబద్ధమైన ఒప్పందాలను గౌరవించరనే అపఖ్యాతే మిగులుతుంది. అంతర్జాతీయ పెట్టుబడులు వెనుకపట్టు పట్టే ప్రమాదం ఉంది. గెలవని యుద్ధాలు చేయడం కన్నా... చేసిన తప్పు నుంచి తక్కువ మూల్యంతో బయట పడడమే ఒక్కోసారి విజ్ఞత. -
భారత్‌కు కెయిర్న్ షాక్..
న్యూఢిల్లీ: బ్రిటన్ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్ పన్నుల వివాదంలో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనకు రావాల్సిన పరిహారాన్ని రాబట్టుకునేందుకు ప్యారిస్‌లో భారత్‌కి ఉన్న 20 ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా ఫ్రాన్స్ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎక్కువగా ఫ్లాట్ల రూపంలో ఉన్న ఈ ప్రాపర్టీలను భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌లో తమ కార్యకలాపాలకు ఉపయోగిస్తోంది. వీటి విలువ సుమారు 20 మిలియన్ యూరోల దాకా ఉంటుందని అంచనా. తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల ఊతంతో ఆయా ప్రాపర్టీల్లో ఉన్న భారత అధికారులను కెయిర్న్ వెళ్లగొట్టే అవకాశాలు తక్కువే అయినా, కోర్టు ఆదేశాల కారణంగా వాటిని భారత ప్రభుత్వం విక్రయించడానికి ఉండదు. మరోవైపు, ఫ్రాన్స్ న్యాయస్థానం నుంచి తమకు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అందిన తర్వాత చట్టపరంగా తగు పరిష్కార మార్గాలు అమలు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వివరాల్లోకి వెడితే.. కెయిర్న్ ఎనర్జీ 1994లో భారత్‌లో చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది. 2006లో తన భారత విభాగాన్ని బీఎస్ఈలో లిస్ట్ చేసింది. ఈ క్రమంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ ఎనర్జీ లబ్ధి పొందిందని, దానికి సంబంధించి రూ. 10,247 కోట్ల మేర పన్ను పెనాల్టీ, వడ్డీ కట్టాలని కెయిర్న్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. గత డీల్స్‌కు కూడా వర్తించేలా సవరించిన పన్ను చట్టాలకు (రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్) అనుగుణంగా వీటిని జారీ చేసింది. భారత విభాగంలో కెయిర్న్‌కు ఉన్న షేర్లను, దానికి రావాల్సిన డివిడెండ్లు మొదలైన వాటిని జప్తు చేసింది. దీన్ని కెయిర్న్ ఎనర్జీ పలు న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు 1.72 బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ భారత్‌కు సూచించింది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేకపోవడంతో విదేశాల్లో భారత్‌కి ఉన్న ఆస్తులను జప్తు చేయడం ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవాలని కెయిర్న్ యోచిస్తోంది. దీనికోసం అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఆర్బిట్రేషన్ ప్యానెల్ ఆదేశాల అమలు కోరుతూ పిటీషన్లు దాఖలు చేసింది. -
ఫ్రాన్స్‌లో ఉన్న భారత ఆస్తుల జప్తుపై ఇంకా నోటీస్ అందలేదు
న్యూఢిల్లీ: పారిస్‌లో ఉన్న భారతీయ ఆస్తులను స్కాట్లాండ్కు చెందిన కెయిన్ ఎనర్జీ సంస్థ జప్తు చేయనుందనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ."పారిస్‌లో భారత ప్రభుత్వ ఆస్తులను కెయిన్ ఎనర్జీ స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే భారత ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ ఫ్రెంచ్ కోర్టు నుంచి నోటీసులు రాలేదు"అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. కెయిన్ ఎనర్జీ టాక్స్ వివాదం: కెయిన్ ఎనర్జీ సంస్థ దాఖలు చేసిన ఓ కేసులో.. అంతర్జాతీయ ట్రిబ్యునల్ కోర్టు భారత్‌కు 1.2 బిలియన్ల డాలర్ల జరిమానా విధించింది. 2014లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించినట్లు ట్రిబ్యునల్ పేర్కొన్నది. దానిలో భాగంగా ఫ్రాన్స్‌లో ఉన్న ఆస్తులను ఆ కంపెనీ స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గతంలో ఆ సంస్థ పలు దేశాల్లో భారత్‌పై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించింది. కాగా, భారతీయ ప్రాపర్టీలను అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కెయిన్ సంస్థలకు వెళ్తుందని ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేరకు సుమారు 20 ప్రాపర్టీలను ఆ సంస్థ స్వాధీనం చేసుకోనున్నది. ఆ ప్రాపర్టీల విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఓ కేసు విషయంలో సెటిల్మెంట్లో భాగంగా ఈ సీజ్ మొదలైనట్లు సమాచారం. -
కెయిర్న్ వివాద పరిష్కారంపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్‌తో పన్ను వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మెరుగైన మార్గాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి సంబంధించి ట్యాక్సేషన్ విషయంలో భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా, కెయిర్న్‌కు అనుకూలంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇవ్వడం తప్పు ధోరణులకు దారి తీసే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. భారత విభాగాన్ని గతంలో పునర్వ్యవస్థీకరణ చేసిన కెయిర్న్ దాదాపు రూ. 10,247 కోట్ల మేర పన్నులు, వడ్డీ కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులివ్వడం, కంపెనీకి చెందాల్సిన డివిడెండ్లను.. ట్యాక్స్ రీఫండ్లను జప్తు చేసుకోవడం తెలిసిందే. దీనిపై కెయిర్న్ వివిధ న్యాయస్థానాలతో పాటు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించగా.. కంపెనీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కెయిర్న్‌కు భారత ప్రభుత్వం 1.725 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,600 కోట్లు) చెల్లించాలంటూ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భారత ప్రభుత్వం సవాలు చేసింది. రికవరీ బాటన పరిశ్రమ: పారిశ్రామిక రంగం రికవరీ బాటన పయనిస్తోందని ఆర్థికమంత్రి ఫైనాన్షియల్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో పేర్కొన్నారు. కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల నేపథ్యంలోనూ పెట్టుబడి ఉపసంహరణసహా బడ్జెట్ ప్రతిపాదనలు అన్నింటినీ అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. -
అసలు చెల్లిస్తే వడ్డీ వదులుకుంటాం
న్యూఢిల్లీ: యూకే కంపెనీ కెయిర్న్ ఎనర్జీ తాజాగా అసలు చెల్లిస్తే వడ్డీని వదులుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిలో భాగంగా 50 కోట్ల డాలర్ల వడ్డీని ప్రభుత్వం సూచించిన చమురు, గ్యాస్ లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అవార్డుకు ప్రభుత్వం ఒప్పుకుని పునఃసమీక్ష ద్వారా పన్ను విధింపుతో తమకు కలిగిన నష్టాన్ని చెల్లించేటట్లయితే వడ్డీని వదులుకోగలమని కెయిర్న్ ఎనర్జీ వివరించినట్లు తెలుస్తోంది. 1994లో చమురు, గ్యాస్ రంగంలో ఈ స్కాట్లాండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా రాజస్తాన్‌లో భారీ చమురు నిక్షేపాన్ని వెలికి తీసింది. 2006–07లో బీఎస్ఈలో దేశీ ఆస్తులతో కూడిన కంపెనీని లిస్ట్ చేసింది. ఐదేళ్ల తదుపరి కంపెనీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెట్రోయాక్టివ్ పన్ను చట్టం ప్రకారం వడ్డీతో సహా రూ. 10,247 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా దేశీ సంస్థలో మిగిలిన కెయిర్న్ షేర్లను లిక్విడేట్ చేయడం, పన్ను రిఫండ్లను నిలువరించడం తదితరాలను చేపట్టింది. అయితే కెయిర్న్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ హేగ్‌లోని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. కాగా.. 2020 డిసెంబర్లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వడ్డీతో కలిపి అసలు 1.2 బిలియన్ డాలర్లు కెయిర్న్ ఎనర్జీకి తిరిగి చెల్లించవలసిందిగా తీర్పులో పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం -
రూ. 10,500 కోట్ల పరిహారం కట్టండి!
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఇంధన రంగ సంస్థ కెయిర్న్ ఎనర్జీతో రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదంలో కేంద్రానికి చుక్కెదురైంది. ఈ కేసులో కెయిర్న్‌కు 1.4 బిలియన్ డాలర్ల దాకా పరిహారం చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. 2006–07 సంవత్సరంలో కెయిర్న్ భారత విభాగం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూ. 10,247 కోట్లు కట్టాలన్న ప్రభుత్వ డిమాండ్ అనుచితమైనదని ట్రిబ్యునల్ కొట్టిపారేసింది. బ్రిటన్‌తో ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడుల రక్షణ ఒప్పందం కింద .. కెయిర్న్ ఎనర్జీ పెట్టుబడులను కాపాడటంలో సముచితంగా వ్యవహరించడంలో భారత్ విఫలమైందని వ్యాఖ్యానించింది. భారత ప్రభుత్వం విక్రయించిన కెయిర్న్ ఎనర్జీ షేర్లు, స్వాధీనం చేసుకున్న డివిడెండ్లు, తన వద్దే అట్టే పెట్టుకున్న పన్ను రీఫండ్లకు సమానమైన విలువను కంపెనీకి వాపసు చేయాలని ట్రిబ్యునల్ సూచించింది. కెయిర్న్‌కు వాటిల్లిన మొత్తం నష్టానికి పరిహారాన్ని వడ్డీ, ఆర్బిట్రేషన్ ఖర్చులు సహా చెల్లించాలని పేర్కొంది. 582 పేజీల ఉత్తర్వుల్లో త్రిసభ్య ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా ఈ మేరకు ఆదేశాలిచ్చింది. భారత ప్రభుత్వం తరఫున ఒక నామినీ కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నారు. ఒకవేళ ఈ ఉత్తర్వులను గానీ కేంద్రం పాటించకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని బ్రిటన్ తదితర దేశాల్లోని భారత్ ఆస్తులను జప్తు చేసుకునేందుకు కెయిర్న్ ఎనర్జీ.. కోర్టులను ఆశ్రయించడానికి ఆస్కారం ఉందన్నది విశ్లేషణ. కెయిర్న్సహా టెలికం సంస్థ వొడాఫోన్తో కూడా ఇలాంటి వివాదమే నెలకొన్న నేపథ్యంలో భార త్ తీసుకోబోయే చర్యలపై విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని పేర్కొన్నాయి. అసలు.. వడ్డీ.. వ్యయాలు.. ఆర్బిట్రేషన్ ప్యానెల్ తమకు 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు వడ్డీ, వ్యయాలు చెల్లించా లని ఉత్తర్వులు ఇచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. 200 మిలియన్ డాలర్ల వడ్డీ, 20 మిలియన్ డాలర్ల ఆర్బిట్రేషన్ వ్యయాలు కలిపితే భారత ప్రభుత్వం మొత్తం 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,500 కోట్లు) చెల్లించాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు వివరించాయి. వివాదం వివరాల్లోకి వెడితే.. కెయిర్న్ ఎనర్జీ తమ భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే క్రమంలో 2006లో సంస్థ స్వరూపాన్ని పునర్వ్యవస్థీకరించింది. 2011లో ఈ కంపెనీలోని మెజారిటీ వాటాలను వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. అదే సమయంలో.. పూర్వం నిర్వహించిన లావాదేవీలకు కూడా వర్తింపచేసేలా రెట్రాస్పెక్టివ్ పన్ను విధానాన్ని భారత ప్రభుత్వం 2012లో అమల్లోకి తెచ్చింది. 2006–07లో చేసిన పునర్వ్యవస్థీకరణతో ప్రయోజనం పొందిన కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్ల పన్నులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం వేదాంత గ్రూప్‌లో భాగంగా ఉన్న కెయిర్న్ ఇండియాకు కూడా ట్యాక్స్ డిమాండ్ పంపింది. దీనిపై కెయిర్న్ ఇండియా విడిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇక కెయిర్న్ ఎనర్జీ నుంచి పన్ను బకాయిలను రాబట్టుకునే క్రమంలో వేదాంతలో ఆ కంపెనీకి ఉన్న 5 శాతం వాటాలను ప్రభుత్వం విక్రయించేసింది. దానికి రావాల్సిన డివిడెండ్లను స్వాధీనం చేసుకుని బకాయిల కింద జమ వేసుకుంది. ఈ చర్యలన్నింటినీ సవాలు చేస్తూ.. కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తలుపు తట్టగా.. తాజా ఆదేశాలు వచ్చాయి. కార్యాచరణపై కేంద్రం కసరత్తు.. ఈ ఆదేశాలపై అప్పీల్‌కి వెళ్లే వెసులుబాటునిచ్చే నిబంధనలేమీ లేవని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఉత్తర్వులను అధ్యయనం చేస్తామని కేంద్రం తెలిపింది. అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెండో దెబ్బ... వొడాఫోన్ వ్యవహారంలోనూ ప్రభుత్వం ఇలాంటి పరిణామాలే ఎదుర్కొనగా, ప్రస్తుత కెయిర్న్ ఎనర్జీ పరిణామం ఆ కోవకు చెందిన కేసుల్లో రెండోది. దాదాపు రూ. 22,100 కోట్ల రెట్రాస్పెక్టివ్ పన్నుల వివాదంలో వొడాఫోన్ గ్రూప్‌నకు అనుకూలంగా సెప్టెంబర్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, వొడాఫోన్ కేసులో ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించాల్సిన పరిహారమేమీ లేదు. పైగా డిసెంబర్ 24లోగా దీన్ని సింగపూర్ కోర్టులో సవాలు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంది. అటు కేజీ–డీ6 క్షేత్రాల నుంచి అంచనాల కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కూడా కేంద్రం జరిమానా విధించింది. అయితే, దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పట్నుంచీ నోటీసులివ్వడం ఆగింది. -
కెయిర్న్ వివాదం: భారత్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను వివాదంలో భారత ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. బ్రిటిష్ ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీ సంస్థ వివాదంలో భారత్ కు అంతర్జాతీయ కోర్టు రూ. 8 వేల కోట్ల జరిమానాను విధించింది. కెయిర్న్ ఎనర్జీకి సంబంధించిన రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదం కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం(ఆర్బిట్రేషన్) కెయిర్న్ ఎనర్జీ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు పన్నులను చెల్లించాల్సిన అవసరంలేదంటూ దీంతో తాజా ఆదేశాలు జారీ చేసింది. పన్ను వివాదం కేసుల్లో అంతర్జాతీయ కోర్టులో భారత్ ఇటీవలి కాలంలో ఇది రెండవ ఎదురుదెబ్బ. ఈ ఏడాది సెప్టెంబరులో సెప్టెంబరులో వోడాఫోన్ గ్రూప్ భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేసులో విజయం సాధించిన తరువాత ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. యుకే-ఇండియా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ప్రకారం కైర్న్‌కు భారత్ తన బాధ్యతలను ఉల్లంఘించిందని, భారత్ ఆపేసిన పన్ను రిటర్న్ రీఫండ్, డివిడెండ్లతో పాటు పన్ను వసూళ్ల కోసం విక్రయించిన షేర్ల సొమ్ముకు వడ్డీతో సహా రూ. 8,000 కోట్లు చెల్లించాలని ట్రిబ్యునల్ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. కాగా దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. కెయిన్ సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా భారత్ వ్యవహరించినట్లు కోర్టు ఆరోపించింది. కెయిన్ ట్యాక్స్ వివాదం కేవలం పన్ను వివాదం మాత్రమే కాదు అని, అది పన్ను పెట్టుబడికి సంబంధించిన వివాదమని వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలోనే ఈ కేసు తమ పరిధిలోకి వస్తుందని హేగ్ కోర్టు వెల్లడించింది. -
కెయిర్న్ ఎనర్జీకి ఐటీ షాక్
♦ రూ.2,150 కోట్లు జప్తు చేసిన ఆదాయపన్ను శాఖ ♦ వేదాంతలో ఉన్న 9.8 శాతం వాటా త్వరలో స్వాధీనం ♦ రూ.10,247 కోట్ల పన్ను విషయంలో కఠిన చర్యలు న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ విషయంలో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలకు దిగింది. రూ.10,247 కోట్ల రెట్రోస్పెక్టివ్ పన్ను విషయంలో ఇన్నాళ్లూ వేచి చూసే ధోరణి అనుసరించిన ఆదాయపన్ను శాఖ తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో దూకుడు ప్రదర్శించింది. వేదాంత లిమిటెడ్ నుంచి కెయిర్న్ ఎనర్జీకి వెళ్లాల్సిన రూ.650 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని జప్తు చేసింది. అలాగే, పన్ను రిఫండ్ రూపంలో కెయిర్న్ ఎనర్జీకి వెళ్లాల్సిన రూ.1,500 కోట్లను కూడా రూ.10,247 కోట్ల పన్నులో భాగంగా జమకట్టుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ట్రిబ్యునల్‌లోనూ చుక్కెదురు కెయిర్న్ ఎనర్జీ తన భారతీయ విభాగమైన కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను వేదాంత లిమిటెడ్‌కు విక్రయించగా, అనంతరం కెయిర్న్ ఇండియా వేదాంతలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ డీల్‌కు సంబంధించి రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీని ఎప్పటి నుంచో కోరుతోంది. దీన్ని కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసింది. ఇక, పన్ను వసూలులో భాగంగా భారతదేశ ఆదాయపన్ను శాఖ ఎటువంటి నిర్బంధ చర్యలు చేపట్టకుండా, వేదాంత నుంచి రావాల్సిన డివిడెండ్‌ను నిలువరించకుండా చూడాలని కోరుతూ మరోసారి ఇటీవలే ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. కాగా, దీన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చినట్టు సమాచారం. వెంటనే చర్యలు... ట్రిబ్యునల్‌లో కెయిర్న్‌కు చుక్కెదురు కావడంతో ఆదాయపన్ను శాఖ వెంటనే తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కెయిర్న్‌కు చెల్లించాల్సిన డివిడెండ్ రూ.650 కోట్లను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలని వేదాంత లిమిటెడ్‌ను ఆదేశిస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్226(3) కింద ఈ నెల 16న నోటీసు జారీ చేసింది. వేదాంతలో కెయిర్న్‌కు 9.8 శాతం వాటా ఉంది. ఈ వాటా కింద గత రెండు సంవత్సరాలుగా చెల్లించాల్సిన డివిడెండ్‌ను పన్ను వివాదం నేపథ్యంలో వేదాంత లిమిటెడ్ నిలిపి ఉంచింది. ఇక వేదాంతలో కెయిర్న్‌కు ఉన్న వాటాను సైతం ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకోనుంది. చట్ట ప్రకారం పన్ను వసూలుకు అసెసింగ్ అధికారి సర్టిఫికెట్‌ను రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా కెయిర్న్‌కు వేదాంతలో ఉన్న వాటాను స్వాధీనం చేసుకుని విక్రయించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ లేదా వేదాంత లిమిటెడ్ ఈ రెండు సంస్థల్లో రేటు ఎక్కువ కోట్ చేసిన వారికి వాటాను విక్రయించే అవకాశమున్నట్టు వెల్లడించాయి. న్యాయపోరాటం కొనసాగిస్తాం: కెయిర్న్ ఆదాయపన్ను శాఖ తాజా చర్యలను కెయిర్న్ ఎనర్జీ ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో రెట్రోస్పెక్టివ్ పన్ను విషయంలో తన పోరాటం కొనసాగిస్తామని, కేసుపై తమకు విశ్వాసం ఉందని పేర్కొంది. -
కెయిర్న్‌కు రూ.30 వేల కోట్ల పెనాల్టీ
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌పై ఐటీ నోటీసులు న్యూఢిల్లీ: సుమారు రూ. 10,247 కోట్ల క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను గడువులోగా చెల్లించనందుకు గాను.. రూ. 30,700 కోట్లు పెనాల్టీగా కట్టాలంటూ బ్రిటీష్ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను విభాగం తాజాగా నోటీసులు ఇచ్చింది. గత లావాదేవీలకు కూడా వర్తించేలా పన్ను విధించడాన్ని సమర్ధిస్తూ ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. ఐటీ విభాగం ముందుగా రూ. 10,247 కోట్ల మేర డిమాండ్ నోట్ పంపింది. గడువులోగా పన్ను చెల్లించనందుకు గాను, రిటర్న్స్ ఫైల్ చేయనందుకు గాను జరిమానా ఎందుకు విధించరాదో వివరించాలంటూ మరో షోకాజ్ నోటీసు కూడా పంపింది. జరిమానా విధింపు షోకాజ్ నోటీసుపై వివరణ ఇచ్చేందుకు కెయిర్న్ ఎనర్జీ మరో పది రోజులు గడువు కోరినట్లు ఐటీ విభాగం సీనియర్ అధికారులు తెలిపారు. -
కెయిర్న్ ఎనర్జీకి భారీ జరిమానా
న్యూఢిల్లీ: బ్రిటీష్ సంస్థ , ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయ పన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీకి ఆదాయపన్ను శాఖ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించని కారణంగా రూ. 30,700 కోట్ల భారీ జరిమానా విధించింది. రూ10,247 కోట్ల రూపాయల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఐటీ ఈ నోటీసులు జారీ చేసింది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసిన కొన్ని వారాల్లో ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నోటీసులతోపాటు, ఎందుకు జరిమానా విధించ కూడదో చెప్పాలంటూ మరో షో కాజ్ నోటీసును కూడా జారీ చేసింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా కోరినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఆదాయపన్ను చట్టం 271 (1)(సీ) ప్రకారం ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు చెప్పారు. అంచనా ప్రకారం 2016 జనవరిలో ఇది పూర్తికావాల్సి ఉందని, ఈనేపథ్యంలో రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాల్సిందిగా ఫైనల్ నోటీస్ జారీచేశామన్నారు. మొత్తం ఈ పన్నుకు తోడుగా ఈ 10 సంవత్సరాల వడ్డీనిమిత్తం మరో రూ. 18,800 కోట్లను జోడించినట్టు చెప్పారు. అయితే దీనిపై స్పందించడానికి కెయిర్న్ ఎనర్జీ ప్రతినిధి ప్రస్తుతానికి అందుబాటులో లేరు. కాగా గత నెలలో ఐటీఏటి రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే నని కెయిర్స్కు కస్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
కెయిర్న్ ఎనర్జీకి ఐటీ తాజా నోటీసు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ పీఎల్‌సీకి తాజా డిమాండ్ నోటీసు జారీ చేసింది. రూ.10,247 కోట్లను చెల్లించాలని ఆదేశించింది. ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) కెయిర్న్ ఎనర్జీకి విధించిన రిట్రోస్పెక్టివ్ ట్యాక్స్ సబబేనని, దీన్ని చెల్లించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందంటూ మార్చి 9న ఆదేశించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. 2006లో కెయిర్న్ ఎనర్జీ భారత్‌లోని తన ఆస్తులను కంపెనీ స్టాక్ ఎక్సేంజ్‌లలో లిస్టింగ్‌కు ముందు కెయిర్న్ ఇండియాకు బదలాయించగా, వచ్చిన మూలధన లాభంపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఐటీఏటీ పేర్కొంది. -
కెయిర్న్ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందే...
క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై ట్యాక్స్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ: క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్లు కట్టాల్సిందేనని ట్యాక్స్ ట్రిబ్యునల్ ఐటీఏటీ స్పష్టం చేసింది. అయితే, గతకాల లావాదేవీలకు కూడా వర్తించేలా సవరించిన చట్టం కింద డిమాండ్ నోటీసు ఇచ్చినందున.. వడ్డీ విధించడానికి లేదని పేర్కొంది. కెయిర్న్ ఇండియాను లిస్ట్ చేయడానికి ముందు అంతర్గత వ్యాపార పునర్వ్యవస్థీకరణ కింద 2006లో షేర్ల బదలాయింపు అంశానికి సంబంధించి ఐటీఏటీ ఈ ఆదేశాలు ఇచ్చింది. మాతృసంస్థకు దక్కిన క్యాపిటల్ గెయిన్స్‌పై కెయిర్న్ ఇండియా పన్నును మినహాయించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది. 2014 జనవరిలో జారీ అయిన రూ. 10,247 కోట్ల ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డరును సవాల్ చేస్తూ కెయిర్న్ ఎనర్జీ ఐటీఏటీని ఆశ్రయించింది. అటు అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. -
రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదాల పరిష్కారానికి డిసెంబర్ గడువు!
న్యూఢిల్లీ : వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు తమ రెట్రాస్పెక్టివ్ (క్రితం లావాదేవీలకు సంబంధించి వర్తించేలా విధించిన పన్నులు) పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్రం నిర్దేశించింది. ఈ తరహా కేసుల పరిష్కారం దిశలో వడ్డీ, జరిమానాను మినహాయిస్తూ... ఒన్‌టైమ్ సెటిల్మెంట్కు అవకాశం ఇస్తున్న పథకం ప్రారంభించి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఈ పథకానికి తాజాగా కేంద్రం ఒక గడువును నిర్దేశించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. గడువు ముగిసిన తర్వాత, కేసులకు సంబంధించి తదుపరి చర్యలను ఆదాయపు పన్ను శాఖ తీసుకుంటుందని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ కంపెనీల విషయానికి వస్తే... ఒడాఫోన్ ఈ తరహా రూ.14,200 కోట్ల వివాదాన్ని ఎదుర్కొంటుండగా, కెయిర్న్ ఎనర్జీ విషయంలో రూ.10,247 కోట్ల ఐటీ డిమాండ్ పెండింగులో ఉంది. -
కేంద్రానికి కెయిర్న్ ఎనర్జీ భారీ ఝలక్
న్యూఢిల్లీ : పన్ను వివాదాలతో, తమ వ్యాపారాలను కుదేలు చేసినందుకు తమకు భారత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బ్రిటీష్ ఎక్స్ ప్లోరర్ కెయిర్న్ ఎనర్జీ డిమాండ్ చేస్తోంది. 5.6 బిలియన్ డాలర్ల(రూ.37,400కోట్లను) నష్టపరిహారాన్ని కేంద్రప్రభుత్వం నుంచి కెయిర్న్ కోరుతోంది.10 ఏళ్ల ఇంటర్నెల్ ఇండియా యూనిట్ ను పునర్ వ్యవస్థీకరించేందుకు కెయిర్న్ ప్రభుత్వం నుంచి ఈ నష్టపరిహారాన్ని ఆశిస్తోంది. జూన్ 28న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ప్యానెల్ కు 160 పేజీల "స్టేట్ మెంట్ ఆఫ్ క్లెయిమ్" ను ఫైల్ చేసింది. ఎడిన్ బర్గ్ కు చెందిన ఈ కంపెనీ, భారత్ లో పన్ను డిమాండ్ ను ఉపసంహకరించుకోవాలని కోరింది. 2014 జనవరిలో ఆదాయపు పన్ను విభాగం జారీచేసిన పన్ను డిమాండ్, షేర్ల అటాచింగ్ తో కెయిర్న్ ఇండియా సబ్సిడరీ భారీగా నష్టాల పాలైంది. టాక్స్ డిపార్ట్ మెంట్ విచారణ నేపథ్యంలో 700 మిలియన్ డాలర్లు(రూ.4690 కోట్లు) విలువచేసే ఇండియన్ వెంచర్ విక్రయం స్తంభించింది. ఆ ఆలస్యంతో ఉత్పన్నమైన నష్టాలను భారత్ చెల్లించాల్సిందిగా కెయిర్న్ కోరుతోంది. 9.8శాతం షేర్ హోల్డింగ్ కోల్పోవడంతో, విలువ నష్టం కింద 1.05 బిలియన్ డాలర్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది. మొత్తంగా పెట్టుబడుల ఒప్పంద ఉల్లంఘన, పెనాల్టీలు, వడ్డీలు అన్నీ కలుపుకొని, పన్ను డిమాండ్ కు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కెయిర్న్ కోర్టులో ఫైల్ చేసింది. ఈ పిల్ విచారణ నేపథ్యంలో యూకే-ఇండియా పెట్టుబడుల ఒప్పందాన్ని కెయిర్న్ చాలెంజ్ చేయనుంది. జెనీవాకు చెందిన న్యాయమూర్తి లారెంట్ లెవీ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ ప్యానెల్ కెయిర్న్ ఎనర్జీ పిల్ ను విచారణ ప్రారంభించనుంది. మేలో పన్ను డిమాండ్ లకు వ్యతిరేకంగా, కంపెనీ గత నెలలో స్టేట్ మెంట్ ఆఫ్ క్లెయిమ్ దాఖలు చేసింది. కేంద్రప్రభుత్వం దీనిపై స్టేట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ కింద నవంబర్ లో తన ఫైల్ దాఖలు చేయనుంది. 2017 మొదట్లో ఈ పిల్ పై ప్రామాణికమైన విచారణ జరుగనుంది. కెయిర్న్ తన భారత ఆస్తులను కొత్త సబ్సిడరీకి మరలించినందుకు మూలధన లాభాల పన్ను రూ.10,247 కోట్ల ఆరోపణలను ఎదుర్కొంది. 2011లో మెజార్టీ స్టాక్ వేదాంత రిసోర్స్ కు అమ్మేసినా.. 9.8 శాతం స్టాక్ కంపెనీనే కలిగి ఉందనే ఆరోపణలతో, వాటిని ఆదాయపు పన్ను విభాగం అటాచ్ చేసుకుంది. -
షేర్లు విడిపిస్తే కెయిర్న్ విలీనానికి ఓకే!
♦ సంకేతాలిచ్చిన కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ♦ కెయిర్న్ ఎనర్జీ చెల్లించాల్సిన పన్ను రూ.10,247 కోట్లు ♦ దానికి బదులుగా రూ.2,790 కోట్ల విలువైన షేర్ల జప్తు ♦ వాటిని విడిపించి విలీనం జరిగితే; కెయిర్న్ ఎనర్జీ వాటా సున్నా న్యూఢిల్లీ: పన్ను వివాదంలో చిక్కుకున్న కెయిర్న్ ఇండియా వ్యవహారంలో కేంద్రం దిగివస్తున్నట్లే కనిపిస్తోంది. రూ.10,247 కోట్లు చెల్లించాల్సిన కెయిర్న్... అందులో మూడోవంతు చెల్లించినా చాలునని పరోక్షంగా ప్రభుత్వం సంకేతాలిచ్చింది. దీనికి కారణమేంటి? తెరవెనక ఏం జరిగి ఉంటుంది? అనే విషయాలు బయటపడనప్పటికీ ప్రభుత్వ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని చెప్పటానికి సోమవారం రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వివరాలివీ... క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించి రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాల్సిందేనంటూ కెయిర్న్ మాతృసంస్థ కెయిర్న్ ఎనర్జీకి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి కెయిర్స్ ఎనర్జీ వాటాగా ఉన్న 9.8% షేర్లను ఐటీశాఖ జప్తు చేసింది కూడా. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.2,790 కోట్లు మాత్రమే ఉంది. మొత్తం పన్ను చెల్లించాల్సిందేనని మొదటి నుంచీ చెబుతున్న ప్రభుత్వం... ఇటీవల వేదాంతాలో కెయిర్న్ ఇండియా విలీనానికి వచ్చిన ప్రతిపాదనలకు కూడా ఇదే లింకు పెట్టింది. పన్ను చెల్లిస్తే తప్ప విలీనానికి అనుమతించేది లేదని స్పష్టంగా చెప్పింది. సోమవారంనాడు కూడా ఆర్థిక శాఖ అధికారులు ఇదే విషయం చెప్పినా... ఆ తరవాత రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వ వైఖరి మారిందనే సంకేతాలిచ్చాయి. ‘‘9.8% కెయిర్న్ ఇండియా షేర్లను ఐటీ శాఖ జప్తు నుంచి విడిపించుకున్నాకే ఆ కంపెనీ వేదాంతాలో విలీనమయ్యేందుకు అనుమతిస్తాం. 9.8% షేర్ల విలువ మొత్తాన్ని చెల్లించడమో లేదా దానికి తగ్గ బ్యాంకు గ్యారంటీనివ్వటమో చేస్తేనే విలీనానికి సంబంధించి తాజా షేర్ల జారీకి అనుమతిస్తాం’’ అని అదియా చెప్పారు. ఐటీ చట్టం ప్రకారం ఐటీ శాఖ అనుమతి లేకుండా ఆ వాటాను విక్రయించడం కుదరదని కూడా ఆయన స్పష్టంచేశారు. ఇదీ విలీనం కథ... బ్రిటన్‌కు చెందిన చమురు దిగ్గజ సంస్థ కెయిర్న్ ఎనర్జీ నుంచి వేదాంత 2011లో కెయిర్న్ ఇండియాను టేకోవర్ చేసింది. 2006-07లో కెయిర్న్ ఇండియాలో బ్రిటన్ కంపెనీ తనకున్న వాటాల్ని విక్రయించటంతో దానికి భారీ లాభం వచ్చింది. దానిపై పన్ను చెల్లించడానికి సంబంధించి వివాదం నడుస్తోంది. రూ.10,247 కోట్ల పన్ను, మరో రూ.18,853 వడ్డీ కలుపుకుని రూ.29,000 కోట్లు కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీకి 2014 జనవరిలో నోటీసులిచ్చింది. కెయిర్న్ ఇండియాలో మాతృ సంస్థకు ఇంకా 9.8 శాతం వాటా వుండగా, పన్ను కట్టలేదు కనక వాటిని ఐటీ శాఖ జప్తుచేసింది. రెట్రోస్పెక్టివ్ పన్నులకు సంబంధించి ఒన్‌టైమ్ ఆఫర్‌గా పన్ను చెల్లిస్తే, వడ్డీని, ఆపరాధ రుసుంను రద్దుచేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కె యిర్న్ ఎనర్జీ కనీసం రూ.10,247 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా తాము అదియాతో మాట్లాడామని, ప్రభుత్వానికి విలీనాన్ని ఆపే ఉద్దేశం ఎంతమాత్రం లేదని ఆయన చెప్పారని వేదాంతా ప్రతినిధి పేర్కొనటం గమనార్హం. -
కెయిర్న్ ఇండియాలో వాటా విక్రయానికి సిద్ధం: కెయిర్న్ ఎనర్జీ
న్యూఢిల్లీ: చమురు ఉత్పాదక కంపెనీ కెయిర్న్ ఇండియాలో వున్న 9.82 శాతం వాటాను విక్రయించడానికి బ్రిటన్ ఆయిల్ కంపెనీ కెయిర్న్ ఎనర్జీ సిద్ధమయ్యింది. ఈ విక్రయం కోసం షేర్‌హోల్డర్ల అనుమతి కోరడంతో పాటు ఇతర అంశాలు చర్చించేందుకు మే 12వ తేదీన కెయిర్న్ ఎనర్జీ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) ఏర్పాటుచేసింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 29,000 కోట్ల రెట్రోస్పెక్టివ్ టాక్స్ డిమాండ్ నోటీసును అందుకున్న నేపథ్యంలో ఈ వాటా విక్రయ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. టాక్స్ డిమాండ్ నోటీసుతో పాటు మరో రూ. 10,200 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలన్న నోటీసు కూడా ఐటీ శాఖ నుంచి వచ్చినట్లు కెయిర్న్ ఎనర్జీ క్రితంరోజే ప్రకటించిన సంగతి తెలిసిందే. కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంతకు 2011లో కెయిర్న్ 8.67 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఇంకా ఇండియా కంపెనీలో కెయిర్న్ ఎనర్జీకి 9.82 శాతం వాటా వుంది. రెట్రోస్పెక్టివ్ టాక్స్ చెల్లింపునకు సంబంధించిన వివాదం కారణంగా ఈ వాటా విక్రయాన్ని భారత్ ఆదాయపు పన్ను శాఖ నిషేధించిందంటూ ఏజీఎం నోటీసులో షేర్హోల్డర్లకు కెయిర్న్ తెలిపింది. వాటా విక్రయంపై ఐటీ శాఖ నుంచి భవిష్యత్తులో కంపెనీకి స్వేచ్ఛ లభిస్తే, షేర్హోల్డర్లకు విలువను అందిస్తామన్న విశ్వాసాన్ని కెయిర్న్ ఈ నోటీసులో వ్యక్తంచేసింది. -
29 వేల కోట్లు కట్టాల్సిందే..!
♦ కెయిర్న్ ఎనర్జీకి ఐటీ శాఖ తుది నోటీసులు ♦ దీన్లో అసలు 10.247 కోట్లు; మిగిలిందంతా వడ్డీయే ♦ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిందేనంటున్న ఐటీ శాఖ ♦ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ బాటలో కెయిర్న్ ఎనర్జీ న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి కేంద్రం రెట్రోస్పెక్టివ్(పాత లావాదేవీలకు పన్ను వర్తింపు) పన్ను షాకిచ్చింది. 2006లో కంపెనీ భారత్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చిన మూలధన లాభాలకుగాను రూ.29,000 కోట్లకుపైగా మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ తుది డిమాండ్ నోటీసును జారీ చేసింది. ఇందులో అసలు పన్ను మొత్తం రూ.10,247 కోట్లు. ఇక 2007 నుంచి ఈ పన్నుపై వడ్డీ రూపంలో 18,800 కోట్లు కట్టాలని ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొంది. ఐటీ శాఖ తొలిసారిగా 2014, జనవరి 22న ముసాయిదా అసెస్మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. తాజాగా గత నెలలో వడ్డీతో కలిపి తుది అసెస్మెంట్ ఆర్డర్‌ను ఇచ్చింది. 2015 ఏడాదికిగాను ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ ఈ వివరాలను వెల్లడించింది. కాగా, వొడాఫోన్ తర్వాత ఈ ఏడాది రెట్రోస్పెక్టివ్ పన్ను నోటీసును అందుకున్న రెండో కంపెనీ కెయిర్న్ ఎనర్జీ. అందులోనూ ఈ రెండూ బ్రిటన్‌కు చెందినవే కావడం గమనార్హం. బడ్జెట్లో ప్రకటనకు ముందే... రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా 2016-17 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వన్‌టైమ్ వడ్డీ, జరిమానా మాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పన్ను అసలును చెల్లించిన వారికి ఈ మాఫీ వర్తిస్తుంది. అయితే, ఈ బడ్జెట్ ప్రకటనకు ముందే ఐటీ శాఖ తుది అసెస్మెంట్ ఆర్డర్‌ను జారీ చేసింది. 2012లో రెట్రోస్పెక్టివ్ పన్నును ఐటీ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కెయిర్న్ ఎనర్జీకి విధించిన పన్నుపై 2007 నుంచి వడ్డీని లెక్కించడం గమనార్హం. కంపెనీ అంతర్గత పునర్వ్యవస్థీకరణపై రెట్రోస్పెక్టివ్ పన్ను విధింపును కెయిర్న్ గ్రూప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా ఈ పన్ను వివాదంపై తాము అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ఈ పన్ను నోటీసు కారణంగా తమ వాటాదారులకు వచ్చిన నష్టానికి, కెయిర్న్ ఇండియాలో తమకున్న 9.8 శాతం వాటా షేర్లను విక్రయించకుండా నిలుపుదల(ఫ్రీజ్) చేసినందుకుగాను బిలియన్ డాలర్లను(దాదాపు రూ.6,700 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని కూడా కెయిర్న్ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. తమ నుంచి ఐటీ శాఖ ఏదైనా రికవరీ చేసుకోగలిగితే ఈ దాదాపు 10 శాతం వాటా(విలువ దాదాపు 47.7 కోట్ల డాలర్లు)కు మాత్రమే పరిమితవుతుందని కెయిర్న్ పేర్కొంది. కెయిర్న్‌కు రూ.24,503 కోట్ల మూలధన లాభం: ఐటీ శాఖ 2006లో భారత్ కార్యకలాపాలకు చెందిన షేర్లను(అసెట్స్) అప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన సబ్సిడరీ కెయిర్న్ ఇండియాకు బదలాయించిన సందర్భంగా కెయిర్న్ ఎనర్జీ రూ.24,503 కోట్ల మూలధన లాభాన్ని ఆర్జించిందని ఐటీ శాఖ వాదిస్తోంది. ఈ ఆస్తుల బదలాయింపు తర్వాత కెయిర్న్ ఇండియా పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కి వచ్చింది. దీనిద్వారా రూ.8,616 కోట్లను కంపెనీ సమీకరించింది. 2011లో కెయిర్న్ ఇండియాలోని మెజారిటీ వాటాను మైనింగ్ దిగ్గజం వేదాంత గ్రూప్‌నకు కెయిర్న్ ఎనర్జీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ 8.67 బిలియన్ డాలర్లు. కెయిర్న్ ఇండియా పాత యాజమాన్యం కెయిర్న్ ఎనర్జీకి లభించిన మూలధన లాభాలపై విత్‌హోల్డింగ్ పన్నును ముందే తీసుకోవడంలో విఫలమైనందుకుగాను కెయిర్న్ ఇండియాకు కూడా ఐటీ శాఖ రూ.20,495 కోట్ల డిమాండ్ నోటీసును ఇదివరకే జారీ చేసింది. ఇందులో అసలు పన్ను రూ.10,248 కోట్లు కాగా, వడ్డీ రూ.10,247 కోట్లుగా ఉంది. అయితే, ఈ పన్ను డిమాండ్ ఆదేశాలను కెయిర్న్ ఇండియా ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. కాగా, రూ.14,200 కోట్ల పన్ను బకాయిలు(హచిసన్ ఎస్సార్‌లో వాటా కొనుగోలుపై లభించిన మూలధన లాభాలకు గాను) చెల్లించాలంటూ వొడాఫోన్‌కు గత నెలలోనే ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీచేయడం తెలిసిందే. భారత్‌లో పన్నులకు సంబంధించిన సరళమైన, స్థిరమైన వ్యవస్థను తీసుకొస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఐటీ శాఖ చర్యలు ఉన్నాయంటూ వొడాఫోన్ దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వివాదం కూడా ఇప్పుడు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో ఉంది. -
కెయిర్న్ ఇండియా షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ ఆయిల్ దిగ్గజం కెయిర్న్ ఇండియా రూ. 5,725 కోట్లతో సొంత షేర్లను కొనుగోలు(బైబ్యాక్) చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎలాంటి నిధులూ ఖర్చుపెట్టకుండానే కెయిర్న్ ఇండియాలో ప్రమోటర్ కంపెనీ వేదాంతా గ్రూప్ వాటా పెరగనుంది. కెయిర్న్ ఇండియా వద్ద 300 కోట్ల డాలర్ల నగదు నిల్వలున్నాయి. దీంతో ఓపెన్ మార్కెట్ నుంచి 8.9% వాటాకు సమానమైన 17.09 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక వేసింది. షేరుకి రూ. 335 గరిష్ట ధర షేరుకి గరిష్టంగా రూ. 335 ధరను చెల్లించనున్న బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు వారాల సగటు ధరతో పోలిస్తే బైబ్యాక్‌కు నిర్ణయించిన ధర 4% అధికమని కంపెనీ తెలిపింది. వాటాదారుల అనుమతి పొందాక జనవరిలో బైబ్యాక్‌ను చేపట్టే అవకాశముంది. కాగా, బైబ్యాక్‌లో భాగంగా 10.27% వాటాను కలిగిఉన్న యూకే సంస్థ కెయిర్న్ ఎనర్జీ కొంతమేర వాటాను విక్రయించే అవకాశముంది. ఇది జరిగితే వే దాంతా గ్రూప్ వాటా ప్రస్తుతం 58.76% నుంచి 64.53%కు పెరుగుతుంది. ఇప్పటికే వేదాంతా గ్రూప్‌నకు మెజారిటీ వాటాను విక్రయించిన కెయిర్న్ ఎనర్జీ ప్రస్తుతం కెయిర్న్ ఇండియాలో 10.27% వాటాను కలిగి ఉంది. ఫలితంగా బైబ్యాక్‌లో మిగిలిన వాటాను విక్రయించడం ద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగే అవకాశముంది. కెయిర్న్ ఇండియాలో కెయిర్న్ ఎనర్జీ వాటాను వేదాంతా షేరుకి రూ. 355 ధరలో కొనుగోలు చేసింది. కాగా, మంగళవారం బీఎస్ఈలో కెయిర్న్ ఇండియా షేరు 2.1% క్షీణించి రూ. 324 వద్ద ముగిసింది. బైబ్యాక్ వల్ల ఏమిటి లాభం? సాధారణంగా కంపెనీలు తమ వద్ద నగదు నిల్వలను విస్తరణ ప్రణాళికలు, లేదా ఇతర కంపెనీల కొనుగోళ్లు వంటి కార్యకలాపాలకు వినియోగించే ఆలోచన లేనప్పుడు వాటాదారులకు లబ్ది చేకూర్చేందుకు వీలుగా బైబ్యాక్‌ను చేపడతాయి. తద్వారా మార్కెట్ ధర కంటే అధిక ధరలో వాటాదారుల వద్ద నుంచి సొంత షేర్లను కొనడం ద్వారా నగదును వాటాదారులకు బదిలీ చేస్తాయి. అంతేకాకుండా బైబ్యాక్ వల్ల కంపెనీ ఈక్విటీ తగ్గి వార్షిక ఆర్జన(ఈపీఎస్) మెరుగుపడుతుంది. తద్వారా కంపెనీలో మిగిలిన వాటాదారులకు కూడా లబ్ది చేకూరుతుంది. అయితే పూర్తిస్థాయిలో షేర్ల బైబ్యాక్‌ను చేపట్టాలనే నిబంధన లేకపోవడం గమనార్హం.