రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదాల పరిష్కారానికి డిసెంబర్ గడువు! | december dead line for tax Disputes | Sakshi
Sakshi News home page

రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదాల పరిష్కారానికి డిసెంబర్ గడువు!

Published Thu, Jul 28 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదాల పరిష్కారానికి డిసెంబర్ గడువు!

రెట్రాస్పెక్టివ్ పన్ను వివాదాల పరిష్కారానికి డిసెంబర్ గడువు!

న్యూఢిల్లీ : వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు తమ రెట్రాస్పెక్టివ్ (క్రితం లావాదేవీలకు సంబంధించి వర్తించేలా విధించిన పన్నులు) పన్ను వివాదాలను పరిష్కరించుకోవాలని కేంద్రం నిర్దేశించింది. ఈ తరహా కేసుల పరిష్కారం దిశలో  వడ్డీ, జరిమానాను మినహాయిస్తూ... ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు అవకాశం ఇస్తున్న పథకం ప్రారంభించి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఈ పథకానికి తాజాగా కేంద్రం ఒక గడువును నిర్దేశించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. గడువు ముగిసిన తర్వాత, కేసులకు సంబంధించి తదుపరి చర్యలను ఆదాయపు పన్ను శాఖ తీసుకుంటుందని కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ కంపెనీల విషయానికి వస్తే... ఒడాఫోన్ ఈ తరహా రూ.14,200 కోట్ల వివాదాన్ని ఎదుర్కొంటుండగా, కెయిర్న్ ఎనర్జీ విషయంలో రూ.10,247 కోట్ల ఐటీ డిమాండ్ పెండింగులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement