
దేశీ టెలికం మార్కెట్లో నిలదొక్కుకునే క్రమంలో వొడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను ప్రవేశపెట్టింది. ముందుగా ముంబైలో ప్రారంభించి, ఏప్రిల్ నాటికి ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పట్నా, మైసూర్ వంటి అయిదు నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 17 సర్కిల్స్‌లోని 100 నగరాలు/పట్టణాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ‘పరిచయ ఆఫర్’ కింద రూ.299 నుంచి ప్రారంభమయ్యే అన్‌లిమిటెడ్ ప్లాన్లతో యాడ్–ఆన్‌గా ఈ సేవలు లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుందో వెల్లడి కాలేదు. వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ.50,000–55,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు ఉండగా ఇందులో దాదాపు సగ భాగం 5జీపై, మిగతా మొత్తాన్ని 4జీ కవరేజీ విస్తరణపై వెచ్చించనున్నట్లు సింగ్ చెప్పారు. కస్టమర్ల వినియోగాన్ని బట్టి 5జీ నెట్‌వర్క్ విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 17 కోట్ల యూజర్లతో రిలయన్స్ జియో, 12 కోట్ల మందితో భారతీ ఎయిర్‌టెల్ 5జీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఇదీ చదవండి: గోల్డ్.. నాన్ స్టాప్ ర్యాలీ
శాట్‌కామ్ సంస్థలతో చర్చలు..
ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, సెల్ టవర్లు లాంటి కనెక్టివిటీ సదుపాయాలు లేని ప్రాంతాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు శాట్‌కామ్ సంస్థలతో జట్టు కట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సింగ్ చెప్పారు. అయితే, డివైజ్‌ల వ్యయాలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తదితర అంశాలపై ఇంకా కొన్ని సందేహాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాŠండ్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రవేశపెట్టే దిశగా జియో ప్లాట్‌ఫామ్స్, ఎయిర్‌టెల్ ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌తో జట్టు కట్టిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment