4G
-
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
మెరుగైన నెట్‌వర్క్‌లో వొడాఫోన్‌ఐడియాకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో వొడాఫోన్ఐడియా 4జీ నెట్వర్క్ అత్యుత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందినట్లు కంపెనీ తెలిపింది. నవంబర్ నెలలో కంపెనీ మెరుగైన నెట్వర్క్ అందించినట్లు ఓపెన్‌సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4జీ డౌన్లోడ్ స్పీడ్, వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో ప్రసారం, 4జీ వాయిస్ వంటి సర్వీసుల్లో పటిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల బ్యాండ్‌విడ్త్ అప్‌గ్రేడ్ చేయడం, 8700 పైగా లొకేషన్లను తమ నెటవర్క్ పరిధిలోకి తీసుకురావడం వంటి తదితర అంశాలు ఇందుకు ఎంతో తోడ్పడ్డాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ తెలిపారు.‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యుత్తమ 4జీ నెట్వర్క్ అందిస్తున్నందుకుగాను మాకు గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. మా నెట్‌వర్క్‌ను మరింత పటిష్ఠ పరిచేందుకు, నిరాంటకంగా కనెక్టివిటీ ఉండేలా చూసేందుకు మేము చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ప్రతిఫలమే ఈ గుర్తింపులు. వినియోగదారులకు ఆటంకంలేని అత్యుత్తమ కనెక్టివిటీని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని ఆనంద్ దానీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఓపెన్సిగ్నల్ 4జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ ప్రకారం..కంపెనీ వినియోగదారులు నవంబర్ నెలలో వేగవంతమైన 4జీ సేవలను ఉపయోగించుకున్నారు.యూజర్లు 17.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్ని, 4.7 ఎంబీపీఎస్ అప్లోడ్ వేగాన్ని అనుభవించారు.వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియోకు సంబంధించి వినియోగదారులకు మెరుగైన సర్వీసు లభించింది.యూజర్లు స్థిరంగా ఈ నాణ్యమైన సేవలను అనుభవించారు.కంపెనీ ఈ గుర్తింపు సాధించేందుకు 2500 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను రెట్టింపు స్థాయిలో అప్‌గ్రేడ్ చేసింది.ఫలితంగా 5,000కు పైగా లొకేషన్లలో కంపెనీ 4జీ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంది.2000కు పైగా పట్టణాలు, 60 జిల్లాలవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్స్టాల్ చేసిన 50,000 సైట్లలో 41,000 సైట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.వీటిలో దాదాపు 36,747 సైట్లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్లను విస్తరించాలనే బీఎస్ఎన్ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్‌తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్‌లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్‌లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్‌తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్‌గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్‌లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
బీఎస్ఎన్ఎల్ నుంచి 4జీ ఫోన్.. ఇక అంతా చవకే!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సొంత 4జీ మొబైల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇతర టెలికాం సంస్థల కంటే చౌకగా ఉండే కొత్త ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్లో రీఛార్జ్ ప్లాన్లు చవగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ చవకైన 4జీ ఫోన్‌ను ప్రవేశపెడుతోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్ఎన్ఎల్, కార్బన్ మొబైల్స్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి. దేశవ్యాప్తంగా సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని బీఎస్ఎన్ఎల్ ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ బీఎస్ఎన్ఎల్ సిమ్‌తో వస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. -
రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్ క్యాపిటల్ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) ప్రకారం..భారత్ డిజిటల్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.ఇదీ చదవండి: ‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. -
వొడాఫోన్ ఐడియా భారీ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్వర్క్ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్‌గా వొడాఫోన్ ఐడియా నిలిచింది. మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటన పేర్కొంది. సరఫరాలు డిసెంబర్ క్వార్టర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీఐఎల్ 2.0కు శ్రీకారం... వీఐఎల్ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు. నోకియా, ఎరిక్సన్ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్సంగ్తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు. 2018లో ఐడియా సెల్యులర్‌తో విలీనం అనంతరం వొడాఫోన్ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్‌టెల్‌తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు. -
బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచేయడంతో చాలామంది ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే గణనీయంగా యూజర్లు ఇతర కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్లో చేరారు. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గుట్టుగానే ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే..4జీ రోల్అవుట్ కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కారణంగా, బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లు 4జీ సేవలను ఉపయోగించడానికి 5జీ-అనుకూల ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. 4G సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ 2,100 MHz, 700 MHz అనే రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగిస్తోంది. వీటిలో 700 MHz బ్యాండ్ సాధారణంగా 5జీ సేవలకు సంబంధించిదైనా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు కూడా వినియోగిస్తోంది.ఇతర టెలికాం ఆపరేట్లకు ఇచ్చినట్లే ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కి కూడా 700 MHz బ్యాండ్‌ని కేటాయించింది. అయితే జియో వంటి వాణిజ్య ఆపరేటర్లు తమ స్వంత 5జీ నెట్వర్క్ కోసం దీనిని ఇంకా ఉపయోగించడం లేదు. ఈ బ్యాండ్ 5జీ సేవల కోసం ఇంకా పూర్తిగా స్థాపితం కాలేదు.దీంతో 2,100 MHz ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోదన్న ఉద్దేశంతో బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్‌ని కూడా 4జీ సేవలు అందించడానికి ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..ఈ సమస్య గురించి తెలిసిన ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్ (B28)తో పని చేసేలా 4జీ ఫోన్లను తయారు చేయాలని తయారీ కంపెనీలను కోరింది. రాబోయే హ్యాండ్సెట్లు 700 MHz బ్యాండ్‌లో 4జీ, 5జీ రెండింటికి సపోర్ట్ చేసేలా చూసేందుకు బీఎస్ఎన్ఎల్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో సమన్వయంతో పనిచేస్తోంది. బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్‌తో పనిచేసే ఫోన్లు ప్రస్తుతం 1,000 మాత్రమే ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్‌ఫారమ్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by— DoT India (@DoT_India) August 10, 2024 -
దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. ‘4జీ’లో మరో మైలురాయి
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ తాజాగా మరింత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.దేశవ్యాప్తంగా 4జీ సర్వీస్‌ను విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలకు పోటీగా 5జీ టెక్నాలజీని పరీక్షించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వినియోగదారులకు 5జీ సిమ్ కార్డ్‌లను కూడా అందిస్తోంది. తాజగా 4జీ సర్వీస్‌లో మరింత పురోగతి సాధించింది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లు 15 వేల మైలురాయికి చేరుకున్నాయి.ఈ టవర్లను 'ఆత్మనిర్భర్ భారత్' పథకం కింద నిర్మించామని, దేశవ్యాప్తంగా అంతరాయం లేని ఇంటర్నెట్ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ పూర్తిగా భారతీయ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో అమర్చిన పరికరాలన్నీ భారత్‌లోనే తయారయ్యాయి.అక్టోబరు చివరి నాటికి 80,000 టవర్లను ఏర్పాటు చేస్తామని, మిగిలిన 21,000 టవర్లను వచ్చే ఏడాది మార్చి నాటికి ఏర్పాటు చేస్తామని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అంటే 2025 మార్చి నాటికి మొత్తం లక్ష టవర్లు 4జీ నెట్‌వర్క్‌కు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుందని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.1,799కే 4జీ ఫోన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని నెట్వర్క్ సేవలందించే జియో ‘జియో భారత్ జే1’ పేరుతో 4జీ మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఫోన్లో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.2.8 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ధర రూ.1799గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసినవారికి జియో ప్రత్యేకంగా రిఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. రూ.123 జియో భారత్ ప్లాన్‌తో 14 జీబీ 4జీ డేటా ఇస్తుంది. ప్రస్తుతం ఇతర వినియోగదారులకు ఇదే ప్లాన్ ధర రూ.189గా ఉంది. ఈ ఫోన్ 128జీబీ వరకు ఎస్డీ కార్డు సపోర్ట్ చేస్తుంది. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులను 4జీ నెట్‌వర్క్‌తో కనెక్ట్ చేయడానికి ఈ మొబైల్ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జియో..నెట్వర్క్ సేవలందిస్తున్నా మొబైళ్లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. జియో రీఛార్జ్ ప్లాన్‌ను కూడా కస్లమర్లకు ఇవ్వొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివల్ల కంపెనీ రెవెన్యూ కూడా వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
బీఎస్ఎన్ఎల్కు వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను పెంచడంతో చాలా మంది ఇపుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ 1 2వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి 2.5 లక్షల మందికిపైగా బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు. -
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్‌ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్‌ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్‌ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్‌ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్‌ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్‌లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్‌వర్క్‌ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్‌లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్‌ట్రాన్ ఈ బిడ్‌ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్‌లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్‌ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్‌చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు. -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ వీఐ నెట్ వర్క్ సబ్ స్క్రైబర్లు 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదనపు డేటాను అందిస్తోంది.ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. 5జీ, 4జీ ఫోన్ వినియోగదారులందరికీ 130 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్‌ను ఎంచుకున్న యూజర్లకు మరో ఏడాది పాటు ఈ డేటాను పొందవచ్చని వీఐ పేర్కొంది. 13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమేటిక్‌గా 10జీబీ జమ అవుతుందని కంపెనీ ఒక విడుదలలో తెలిపింది.ఈ సందర్భంగా వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ..దేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల వారి 4జీ/5జీ స్మార్ట్ ఫోన్ వినియోగం సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదని చెప్పారు. -
5జీకి పెరుగుతున్న ఆదరణ.. డేటా వినియోగం ఎంతంటే..
భారత్‌లో 5జీ వినియోగదార్లు డేటాను విరివిగా వాడుతున్నారు. 4జీ వినియోగదార్లతో పోలిస్తే ఏకంగా 3.6 రెట్ల డేటాను వాడుతున్నట్లు టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా తన నివేదికలో పేర్కొంది. టెలికం వినియోగదారులకు సేవలందించేందుకు కంపెనీలు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా అక్టోబరు 2022లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2023లో మొత్తం డేటా రద్దీలో 15 శాతం వాటా 5జీదేనని ఆ నివేదికలో తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 5జీ అందుబాటులోకి వచ్చాక ఆ టెక్నాలజీ కొన్నిసార్లు వాడకపోయినా 5జీ మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. 4జీ డివైజెస్ సంఖ్యతో పోలిస్తే 17 శాతం మేర 5జీ మొబైళ్లు వాడుతున్నారు. అంటే 79.6 కోట్లలో వీటి వాటా 13.4 కోట్లుగా ఉంది. భారత్‌లో డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 20% వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్స్‌గా నమోదవుతోంది. 1 ఎక్సాబైట్ 100 కోట్ల జీబీకి సమానం. సగటున ఒక్కో వినియోగదారు నెలకు 24 జీబీ వాడుతున్నారు. అంటే భారత్‌లో డేటా వినియోగం చాలా భారీగా ఉంది. మొత్తం మొబైల్ డేటా రద్దీలో 20 శాతం వాటాకు ఇది చేరింది. ఇదీ చదవండి..హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం -
2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబు
సాంకేతిక విప్లవంలో భారత్ మరికొద్ది రోజుల్లో కీలక ముందడుగు వేయబోతోంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఇతర సేవలందించేలా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మే 20న ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాంకేతికంగా దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలెందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. మొదట్లో సెల్‌ఫోన్ బరువు కేజీ ఉండేది. తర్వాత కీ ప్యాడ్ ఫోన్ వచ్చింది. తర్వాత మడత పెట్టే ఫోన్లూ వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఫోన్లు స్మార్ట్‌గా మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ మాట్లాడడానికి మాత్రమే.. కానీ ఇప్పటి స్మార్ట్ఫోన్లతో దాదాపు అన్ని రకాల పనులూ చక్కెబెట్టేయొచ్చు. అలాగే టెలికాం కమ్యూనికేషన్ రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అలా తొలి తరం నెట్‌వర్క్‌ను 1జీ అనే వారు. ఇక్కడ G అంటే జనరేషన్ అని అర్థం. ఈ నెట్‌వర్క్‌లో కేవలం ఫోన్లు మాట్లాడడానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత తరాన్ని బట్టి ఇంటర్నెట్ అందించే వేగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ, 5జీ విస్తృత వినియోగంలో ఉన్నాయి. ఏ తరం దేనికి? 1G: 1970ల్లో జపాన్‌లో తొలి తరం మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సౌండ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. 2G: టెలికాం రంగంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్న నెట్వర్క్ 2జీ. 1991లో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తొలిసారి ఎస్సెమ్మెస్, ఎంఎంఎస్ అనేవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. డేటా వేగం గరిష్ఠంగా 50 కేబీపీఎస్ మాత్రమే. 3G: 2001లో ఈ సాంకేతికత పరిచయం అయ్యింది. మనం ఇప్పుడు వాడుతున్న చాలా సదుపాయాలు ఈ సాంకేతిక నుంచి మొదలైనవే. వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి సదుపాయాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. 4G: దేశంలో చాలా వరకు వాడుకలో ఉన్న నెట్వర్క్ ఇదే. వేగవంతమైన డేటా, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ వంటి సదుపాయాలు ఈ నెట్ వర్క్ సొంతం. ముఖ్యంగా జియో రాకతో చాలా వరకు 2జీ, 3జీ దాదాపు కనుమరుగైనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ నెట్వర్క్ వాడుతున్నారు. 5G: ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్డీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం జగన్
-
రూ. 1,127 కోట్ల ఆర్డర్.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (OTN) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు హెచ్ఎఫ్సీఎల్ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్‌గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్‌పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ను నిలుపుతుందని భావిస్తున్నారు. సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్‌వర్క్‌తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్ఎఫ్సీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్
దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారత మార్కెట్లో 5జీ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా 5జీ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వొడాఫోన్ ఐడియా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఢిల్లీ, పూణేలోని నిర్దిష్ట ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే 'విఐ 5జీ రెడీ సిమ్' ఉపయోగించి కనెక్షన్ పొందవచ్చు అని పేర్కొంది. దేశంలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలకు ఊతం ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా ఆగస్టులో 26జీహెచ్, 3.3జీహెచ్‌జెడ్ బ్యాండ్లను ఉపయోగించి పూణేలో 5G సేవలను విజయవంతంగా పరీక్షించింది. గత ఏడాది జులైలో స్పెక్ట్రమ్ వేలం అయితే, గత ఏడాది జూలై నెలలో జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 17 టెలికం సర్కిళ్లను సొంతం చేసుకుంది. కానీ వాటిల్లో 15 సర్కిళ్లలో 5జీ నెట్వర్క్ని అందించలేమని ఆ సంస్థ సీఈవో అక్షయ్ మూంద్రా తెలిపారు. ఆసక్తికర పరిణామాలు ఈ నేపథ్యంలో ఇండియా ముబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఈవెంట్లో వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ.. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా 4జీ, 5జీ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ తరుణంలో వొడాఫోన్ 5జీ సేవలు రానున్నాయనే నివేదికలతో టెలికం రంగంలో ఆసక్తిర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. -
జియో 4జీ ఫోన్ వచ్చేసింది..ధర రూ.2,599 మాత్రమే!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ సంస్థ యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. ఈ సందర్భంగా జియో ఫీచర్ ఫోన్లో వాట్సాప్,యూట్యూబ్,జియోపే, యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. ధర ఎంతంటే? దీపావళి పండుగ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానున్న ఈ 4జీ ఫోన్ ధర రూ.2,599గా ఉంది. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ షోరూంలలో కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఫీచర్లు జియో ఫోన్ ప్రైమా 4జీ వాట్సాప్,ఫేస్బుక్, యూట్యూబ్‌లను వీక్షించవచ్చు. అదనంగా జియో సినిమా, జియో సావన్,జియో టీవీ, జియో,యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. 512 ఎంబీ ర్యామ్‌తో వస్తున్న ఈ షోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 1800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. బ్యాటరీతో ఏఆర్ఎం కార్టెక్స్ ఏ53 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. -
డిసెంబర్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది డిసెంబర్లో 4జీ సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ముందుగా పరిమిత స్థాయిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. జూన్ తర్వాత 4జీ సర్వీసులను 5జీకి అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. ‘డిసెంబర్లో పంజాబ్‌లో 4జీ సేవల ను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉంది. 200 సైట్లలో నెట్వర్క్ సిద్ధంగా ఉంది. 3,000 సైట్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉన్నాం‘ అని పుర్వార్ చెప్పారు. నెట్‌వర్క్‌ను క్రమంగా నెలకు 6,000 సైట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత 15,000 సైట్ల వరకు పెంచుకోనున్నట్లు తెలిపారు. మొత్తం మీద 2024 జూన్ నాటికి 4జీ విస్తరణ పూర్తి చే యాలని నిర్దేశించుకున్నట్లు పుర్వార్ పేర్కొన్నారు. -
6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
అభిమానులకు గుడ్‌న్యూస్: రూ. 999లకే జియోభారత్ ఫోన్ 4జీ సేల్
JioBharat 4G ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన JioBharat 4G ఫోన్ అమెజాన్‌లో కొనుగోలుకు అందు బాటులో ఉంది. రూ.999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికీ 2G ఫోన్లను ఉపయోగిస్తున్న వారికి సరసమైన ధరలో, ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జియోభారత్ 4G ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 23 భాషలకు మద్దతు ఇస్తుందని విడుదల సందర్బంగా జియో ప్రకటించింది. కార్బన్‌తో కలిసి తీసుకొచ్చిన ఈ ఫోన్లో 1000mAh బ్యాటరీ , మైక్రో SD కార్డ్ వంటి ఫీచర్లతోపాటు స్విఫ్ట్ 4G ఇంటర్నెట్ కనెక్ట్ సామర్థ్యంతో వచ్చింది. JioBharat 4G ఫీచర్లు 1.77-అంగుళాల TFT డిస్ప్లే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ 0.3MP కెమెరా విత్ LED ఫ్లాష్ 1000mAh బ్యాటరీ ఎక్స్టర్నల్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. "భారత్" , వెనుక కార్బన్ లోగోను డ్యూయల్ బ్రాండింగ్‌తో వస్తుంది. (టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్‌వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?) రూ. 123 ప్లాన్ అంతేకాదు ఈఫోన్ లాంచింగ్ సందర్బంగా స్పెషల్‌గా రూ. 123 ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్లు, 14 GB డేటా అందిస్తుంది. డియో స్ట్రీమింగ్‌ను ప్రారంభించే Jio యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. అయితే, భవిష్యత్తులో ఇతర రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. (ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్) -
జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మరో సంచలనానికి నాంది పలికింది. చౌక ధరలో ఫోన్‌ను లాంచ్ చేసింది. జియో 2 జీ ముక్త్ భారత్ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. అంతేకాదు ఈ ఫోన్‌తో పాటు కొత్త రూ. 123 ప్లాన్ ప్రకటించింది. ఇది 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అన్లిమిటెడ్ కాల్స్‌తోపాటు, 14GB డేటా (రోజుకు 0.5 GB) అందిస్తుంది. ప్రత్యర్థులతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువని జియో పేర్కొంది. ఇంకా 2జీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న కస్టమర్ల కోసం ఇన్-క్లాస్ జియో 4జీ నెట్వర్క్ తొలి 10 లక్షల జియో భారత్ ఫోన్ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభమవుతుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో ఇప్పటికీ 250 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు 2G యుగంలోనే ఉన్నారని, కొత్త జియో భారత్ ఫోన్ ఆ దిశలో మరో అడుగు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ప్రతీ భారతీయుడికి, ఇంటర్నెట్, ఆధునిక టెక్నాలజీని అందించే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం జియోను లాంచ్ చేశాం. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని నిరూపించాం. ఇకపై టెక్కాలజీ కొంతమంది ప్రత్యేక హక్కుగా మిగలబోదు అని ఆకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 1.77-అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. ఇంకా ఇందులో JioCinema, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత సంగీత యాప్ JioSaavn, JioPayని కలిగి ఉంది. -
BSNL: కావాలనే దివాలా తీయిస్తున్నారు!
ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) లను దివాళా తీయించి కార్పొరేట్ సంస్థలకు లాభార్జనలో అడ్డులేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేయదగినదంతా చేస్తోంది. దీనికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం నిలువెత్తు నిదర్శనం. ఈ సంస్థకు ఒకవైపు నష్టాలు వచ్చేలా పరిస్థి తులను సృష్టిస్తున్నది ప్రభుత్వమే. అదే సమయంలో నష్టాల నుంచి బయట పడేయడానికి పున రుద్ధరణ (రివైవల్) ప్యాకేజీలు పేరిట మాయ చేస్తున్నదీ ప్రభుత్వమే. ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చే క్రమంలో ముందు తన సంస్థలకు ఇచ్చి, తర్వాత ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం సహజం. కాదంటే ఎటువంటి వివక్షా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటికీ అనుమతులు జారీ చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు 3జీ సర్వీ సులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్ ఇచ్చే సమయంలో కానీ, 4జీ సర్వీసులు ఇవ్వడానికి కావాల్సిన స్పెక్ట్రమ్ ఇచ్చేందుకు కానీ అనేక అడ్డంకులు సృష్టించింది. కానీ ఇదే సమయంలో ప్రయివేటు టెలికాం కంపెనీలకు 4జీ సేవల అనుమతుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. ప్రపంచ వ్యాప్తంగా టెలికాం సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి చేసే దేశాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. భారత దేశానికి మూడేళ్ళ వరకు ఆ పరిజ్ఞానం లేదు. చాలామంది పెట్టుబడి దారుల ఒత్తిడితో భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ కేవలం మన దేశంలో తయారైన 4జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వాడుకుని 4జీ సర్వీసులు ఇవ్వాలని నిబంధనలు పెట్టింది. అంటే విదేశాల నుంచి ఈ టెక్నాలజీని ఇది దిగుమతి చేసుకోకూడదన్నమాట. అయితే ప్రైవేటు టెలికాం కంపెనీ లకు మాత్రం ఈ నిబంధన విధించలేదు. దీంతో ప్రైవేట్ సంస్థలు 4జీ సేవలు అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతుంటే.. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం కోసం మూడేళ్లు బీఎస్ఎన్ఎల్ ఎదురు చూడాల్సి వచ్చింది. ఈలోపు దాని ఖాతాదారులు చేజారిపోయారన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఇక నష్టాలు వచ్చాయంటే రావా? చివరకు 4జీ సర్వీ సులు ప్రారంభించడానికి అయ్యే ఖర్చులు, బీఎస్ఎన్ ఎల్‌కు ఉన్న అప్పులు, నష్టాలు, ఉద్యోగుల కోసం అయ్యే ఖర్చులు పరిశీలించి మొదటి రివైవల్ ప్యాకేజీని సెప్టెంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో 90,000 మంది ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ పథకం అమలైతే చెల్లించాల్సిన డబ్బూ భాగమన్న విషయం గుర్తుంచుకోవాలి. దాదాపు 74,000 కోట్ల రివైవల్ ప్యాకేజీని సెప్టెంబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 20,140 కోట్లు 4జీ స్పెక్ట్రమ్ కోసం కాగా, రూ. 3,674 కోట్లు బీఎస్ ఎన్ఎల్ కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ చార్జీలు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల వాలంటరీ రిటైర్మెంట్ పథకం ఖర్చు దాదాపు రూ. 29,935 కోట్లు. ఈ వీఆర్ఎస్ పథకంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ లాంటి ఆర్థిక ప్రయోజనాలను వాయిదా వేసి, ప్రభుత్వం మోసం చేసిందనుకోండి. బీఎస్ఎన్ఎల్ 4జీ స్పెక్ట్రమ్‌పై చెల్లించాల్సిన రూ. 3,674 కోట్ల జీఎస్టీపై కూడా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో ఆ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న సేవలకు గాను కొంత నగదు తిరిగి చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా 2010 వరకు మాత్రమే ఈ రకమైన చెల్లింపు చేసి ఆ తర్వాత ఈ వెసులుబాటును ఆపేసింది. భారత దేశంలో తయారైన సాంకే తిక పరిజ్ఞానం వాడుకుని 4జీ సేవలు ప్రారంభించడానికి అయ్యే ఖర్చును ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రోగ్రాంలో భాగంగా భరిస్తామని పేర్కొని, తర్వాత దాన్ని క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఈక్విటీ ఇన్ఫ్యూజన్గా సర్దుబాటు చేసింది ప్రభుత్వం. ఇన్ఫ్యూజన్ అంటే నికరంగా నగదు రూపంలో ఇవ్వకుండా పెట్టుబడులు లేదా షేర్ల రూపంలో లేదా ఇతర మార్గాలలో సర్దుబాటు చేసి చూపడం. నిజానికి ప్రయివేటు టెలికం కంపెనీలు గత నాలు గేళ్లుగా వాణిజ్య పరంగా లాభాలు వచ్చే పట్టణ ప్రాంతా ల్లోనే 4జీ సర్వీసులు ఇస్తున్నాయి. అంతగా ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు ఇవ్వాలంటే బీఎస్ ఎన్ఎల్ అవసరం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల కిలో మీటర్ల ఓఎఫ్సీ కేబుల్ కలిగిన ‘భారత్ బ్రాడ్ బాండ్ నెట్వర్క్ లిమిటెడ్’ (బీబీఎన్ఎల్)ను బీఎస్ ఎన్ఎల్లో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది. తాజాగా ఈ జూన్‌లో మూడవ రివైవల్ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 4జీ/5జీ స్పెక్ట్రమ్ కోసం 46,339 కోట్లు కేటా యించారు. మిగతాది అప్పులు తీర్చడం కోసం ఇచ్చారు. అయితే నికరంగా ఈ ప్యాకేజీలో నగదు సర్దు బాటు చేసింది రూ. 531 కోట్లు మాత్రమే. మొత్తంగా బీఎస్ఎన్ఎల్కు మూడు విడతల్లో ప్రకటించిన రూ. 3.23 లక్షల కోట్ల ప్యాకేజీలో నికరంగా నగదు రూపంలో 15,000 కోట్లు మాత్రమే సర్దుబాటు చేశారు. అది కూడా దశాబ్దాల తర్వాత పునరుద్ధరణ చేసిన గ్రామీణ సేవల సర్వీసులకు చేసిన చెల్లింపుగానే దీన్ని ఇచ్చారు. బుక్‌లో సర్దుబాటు చేసే మొత్తానికి ప్యాకేజీ అనే పేరు పెట్టడం వెసులుబాటు ఎలా అవుతుంది?. టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ లాంటి ప్రజా సేవలు అందించే సంస్థ లేకపోతే ప్రయివేటు టెలికాం కంపెనీలు ప్రజ లను టారిఫ్‌ల పేరుతో దోచుకుంటాయని గమనించాలి. తారానాథ్ మురాల, వ్యాసకర్త టెలికాం రంగ నిపుణులు -
మారుమూల గ్రామాలకు 4జి సేవలు ప్రారంభించిన సీఎం జగన్
-
బీఎస్ఎన్ఎల్కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్ఎన్ఎల్కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్ బ్యాండ్‌లో 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది. -
టీసీఎస్ కన్సార్షియంకు బీఎస్ఎన్ఎల్ 4జీ కాంట్రాక్ట్
ముంబై: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కు 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేసే కాంట్రాక్టును ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) సారథ్యంలోని కన్సార్షియం దక్కించుకుంది. దీని విలువ రూ. 15,000 కోట్లు. దీనికి సంబంధించి బీఎస్ఎన్ఎల్ నుంచి అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డర్‌ను అందుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో కొద్ది నెలలుగా దీనిపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ కాంట్రాక్టు గురించి ప్రకటించినప్పటి నుంచి టీసీఎస్ కంపెనీయే ముందు వరుసలో ఉందంటూ వార్తలు వచ్చాయి. ముంబై, న్యూఢిల్లీ మినహా బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఫిక్స్డ్ లైన్, వైర్లెస్, డేటా సర్వీసులను అందిస్తోంది. మరోవైపు టెలికం పరికరాల తయారీ సంస్థ ఐటీఐకి కూడా బీఎస్ఎన్ఎల్ రూ. 3,889 కోట్ల విలువ చేసే ఆర్డరు ఇచ్చింది. దీని ప్రకారం 18–24 నెలల వ్యవధిలో 23,633 సైట్ల కోసం 4జీ పరికరాలను సరఫరా చేయాల్సి ఉంటుందని ఐటీఐ వివరించింది. -
త్వరలో వన్ ప్లస్3 5జీ ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
5జీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్‌లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే నెలలో వన్ ప్లస్ నార్డ్3 5జీతో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ రిలీజ్ కానుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్, 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తో విడుదల కానుంది. వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుందని భావిస్తున్నది. దీని ధర రూ.30,000-40,000 మధ్య పలుకుతుందని అంచనా. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో..
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. పూర్తి దేశీ సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశించుకున్నందున ఇందుకు కాస్త సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ సంతృప్తికర స్థాయిలోనే జరుగుతోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం 800 పైగా జిల్లాల్లో 5జీ సర్వీసులు ఉన్నాయని, ఇతరత్రా ఏ దేశంలోనూ ఇంత వేగంగా సేవల విస్తరణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి ఇండియా పోస్ట్, సీఏఐటీ, తృప్తా టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌహాన్ ఈ విషయాలు చెప్పారు. ఇండియా పోస్ట్‌కి ఉన్న విస్తృత నెట్వర్క్ సాయంతో చిన్న వ్యాపారాలకు డెలివరీ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. లాజిస్టిక్స్ సర్వీసుల ను అందించేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో కూడా చేతులు కలపాలని ఇండియా పోస్ట్ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
భారీ పెట్టుబడితో 4జీ నెట్వర్క్ - గ్రామాలపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కనెక్టివిటీ లేని అన్ని గ్రామాలకు 2024 కల్లా 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ చెప్పారు. ‘4జీ విస్తరణ ప్రాజెక్టు గురించి మాట్లాడితే.. దాదాపు 38,000 - 40,000 గ్రామాలకు సిగ్నల్స్ లేవు. ప్రతి ఇంటికీ చేరే దిశగా.. 2024 నాటికల్లా 4జీ పూర్తి స్థాయిలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ’మన్ కీ బాత్’ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం సందర్భంగా చౌహాన్ మాట్లాడారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, సేవలను మరింతగా ప్రజలందరి వద్దకు చేర్చేలా ప్రధాని ప్రోత్సహిస్తారని ఆయన పేర్కొన్నారు. కనెక్టివిటీ లేని గ్రామాలకు కూడా 4జీ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల సామాజిక - ఆర్థిక పరివర్తన సాధ్యపడుతుందని, డిజిటల్ అసమానతలను తొలగించవచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఎంత మేర జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. కవరేజీ లేని గ్రామాలన్నింటిలోనూ 4జీ మొబైల్ సర్వీసులను విస్తరించే ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ 2022 జూలైలో ఆమోదించింది. దీని మొత్తం వ్యయం రూ. 26,316 కోట్లు. దీనితో చేరుకోవడం కష్టతరంగా ఉండే 24,680 పైచిలుకు మారుమూల గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. -
4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్‌బాక్స్
ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్‌బాక్స్ 3.0 ని ఆవిష్కరించింది. రియల్ టైమ్ పేమెంట్ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్‌బాక్స్ ఇది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగిన ఈ మేడిన్ ఇండియా ప్రాడెక్ట్ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది. పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్‌గా 2జీకి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్‌పై కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్‌లైన్, ఒక గంట కాల్ బ్యాక్ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. -
నోకియా సరికొత్త చరిత్ర: చందమామపై 4జీ నెట్వర్క్ త్వరలో
న్యూఢిల్లీ: ఎంతో కొంతకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన ఘట్టం త్వరలోనే ఆవిష్కృతం కానుంది. రాబోయే అంతరిక్ష యాత్రలో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఇంతవరకు ఏ సర్వీస్ ప్రొవైడర్ చెయ్యని సాహసంతో చంద్రుడిపై 4జీ మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. ఫిన్నిష్ టెలికమ్యూనికేషన్స్ గ్రూప్ రాబోయే నెలల్లో స్పేస్ఎక్స్ రాకెట్లో నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని నోకియా ప్రిన్సిపల్ ఇంజనీర్ లూయిస్ మాస్ట్రో రూయిజ్ డి టెమినో ఈ నెల ప్రారంభంలో బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ షోలో విలేకరులకు వెల్లడించారు. దీని ప్రకారం నోకియా ఈ ఏడాది చివర్లో చంద్రునిపై 4జీ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. దీన్ని నాసా ఆర్టెమిస్-1 మిషన్‌లో ఉపయోగించబడుతుందనీ, తద్వారా చంద్రునిపై మానవ ఉనికిని స్థాపించడమే లక్ష్యమని తెలిపారు. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం ప్రస్తుతం SpaceX ఫాల్కన్ 9 రాకెట్లో నవంబర్‌లో ప్రారంభించనుందని, Intuitive Machines యొక్క Nova-C లూనార్ ల్యాండర్ మన సహజ ఉపగ్రహానికి సిస్టమ్ ఇతర పేలోడ్లను తీసుకువెళుతుంది, నోకియా 4జీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను చంద్రుని దక్షిణ ప్రాంతంలోని షాకిల్టన్ క్రేటర్‌పై దాని చివరి గమ్యస్థానానికి తీసుకువెళుతుంది. భూసంబంధమైన నెట్‌వర్క్‌లు భవిష్యత్ అంతరిక్ష మిషన్ల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చగలవని చూపడం దీని లక్ష్యం.సంబంధించి 2020 అక్టోబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో నోకియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనుందని సమాచారం. (నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్: తరలి వచ్చిన తారలు, ఫోటోలు వైరల్ ) ఈ పరిశోధనలు హెచ్డీ వీడియో, రోబోటిక్స్, సెన్సింగ్ అప్లికేషన్లు, టెలిమెట్రీ లేదా బయోమెట్రిక్స్ అవసరమయ్యే భవిష్యత్ మిషన్లకు సెల్యులార్ నెట్‌వర్క్‌లు ప్రారంభించే అధునాతన సామర్థ్యాలు అవసరం" అని నోకియా తన వెబ్ పేజీలో నాసా భాగస్వామ్యం గురించి వెల్లడించింది. మరోవైపు ఈ టెక్నాలజీలు చంద్రునిపై మంచును గుర్తించడంలో పరిశోధకులకు సహాయ పడతాయి. అలాగే భవిష్యత్తులో ఇంధనం, నీరు, ఆక్సిజన్ లాంటి వాటిని గుర్తిస్తే గ్రహం మీద మానవ జీవితాన్ని నిలబెట్టడంలో సహాయ పడుతుందని నాసా అంచనా. -
ప్రైమ్బుక్ చవక ల్యాప్‌టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తాజాగా విద్యార్థుల కోసం ప్రైమ్బుక్ 4జీ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ఆన్‌డ్రాయిడ్–11 ఆధారిత ప్రైమ్‌ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. మీడియాటెక్ ఎంటీకే8788 ప్రాసెసర్, 11.6 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, వైఫై, బ్లూటూత్, 4జీ సిమ్ స్లాట్, ఫుల్ హెచ్డీ 2 ఎంపీ కెమెరా ఏర్పాటు ఉంది. బరువు 1.065 కిలోలు. ఒక ఏడాది ఆన్సైట్ వారంటీ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. 10 గంటలకుపైగా బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ తెలిపింది. 200 జీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాంక్, స్టూడెంట్ ఆఫర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆరు నెలల ఉచిత చందా, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో రూ.11,827 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ వివరించింది. ధర వేరియంట్‌నుబట్టి 4జీబీ/64 జీబీ రూ. 16,990, అలాగే 4జీబీ/128 జీబీ రూ.18,990 ఉంది. ఈ ల్యాప్‌టాప్ దేశీయంగా తయారైంది. విద్యార్థుల కోసం ఉద్ధేశించిన ల్యాప్టాప్స్ విక్రయా లు తమ వేదికపై గడిచిన మూడేళ్లలో 1.5 రెట్లు పెరిగాయని ఫ్లిప్‌కార్ట్ లార్జ్ అప్లయాన్సెస్, ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ హరి కుమార్ తెలిపారు. -
హలో.. అవుటాఫ్ కవరేజ్.. వారికి ఇంకా మొబైల్ కవరేజ్కష్టాలు!
సాక్షి, అమరావతి: దేశంలో 38,901 మారుమూల గ్రామాలకు ఇంకా మొబైల్ కవరేజ్ లేదని కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. వాణిజ్యపరంగా ఇది సాధ్యం కాకపోవడంతోపాటు జనాభా అక్కడక్కడ కొద్దికొద్దిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశంలో మొత్తం 6,44,131 గ్రామాలుండగా 6,05,230 గ్రామాలకు మొబైల్ కవరేజ్ ఉందని, మిగతా 38,901 గ్రామాలకు లేదని వివరించింది. అత్యధికంగా ఒడిశా రాష్ట్రంలో 6,592 గ్రామాలకు.. ఆ తరువాత రాజస్థాన్‌లో 3,316 గ్రామాలకు మొబైల్ కవరేజ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. రూ.26,316 కోట్లతో ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మొబైల్ కవరేజీ లేని గ్రామాల్లో 4జి మొబైల్ సేవలను దశల వారీగా సంతృప్త స్థాయిలో కల్పించడానికి రూ.26,316 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కేంద్ర కమ్యునికేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండో దశలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రూ.2,211 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతమున్న 2జీ టెక్నాలజీని రూ.2,425 కోట్ల అంచనా వ్యయంతో 4జీ టెక్నాలజీ స్థాయికి పెంచనున్నామని పేర్కొంది. అంతేకాక.. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సేవలను అందించడానికి రూ.3,673 కోట్ల వ్యయం అంచనాతో పథకాలను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలోని 7,287 గ్రామాలకు.. అలాగే, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని 502 గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీని అందించడానికి రూ.7,152 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. -
ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్.. స్మార్ట్‌ఫోన్ సేల్స్ డౌన్
ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ప్రపంచంలోనే రెండు అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లైన భారత్, చైనాలలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పూర్తిగా తగ్గినట్లు తెలిపింది. అయితే చైనా కంటే భారత్‌లో ఈ పరిణామం ఎక్కువగా ఉండటం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్ తగ్గినట్లు తెలిపింది కౌంటర్ పాయింట్ రీసెర్చ్. 2021తో పోలిస్తే 2022లో భారత్‌లో స్మార్ట్ ఫోన్ సేల్స్ 9 శాతం తగ్గి గతేడాది కేవలం 152 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. విచిత్రం ఏంటంటే ఓవరాల్‌గా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గినా.. రూ.30 వేల కంటే పై చిలుకు స్మార్ట్ ఫోన్ల సేల్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో 35 శాతం పెరగడం గమనార్హం. లేటెస్ట్ 5జీ టెక్నాలజీ ఫోన్ల అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. 2021లో స్మార్ట్ ఫోన్ల విక్రయం 19 శాతం పెరిగితే, 2022లో అది 32 శాతం వృద్దిరేటును నమోదు చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో శామ్ సంగ్ 21 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా.. సేల్స్ ఆదాయంలోనూ 22 శాతంతో ముందంజలో ఉంది. -
Ashwini Vaishnaw: ఈ గ్రామాల్లో 4జినే లేదు!
సాక్షి, అమరావతి: దేశంలో మొబైల్ సేవల రంగంలో అయిదో జనరేషన్ (5 జి) మొదలైంది. ఇంతకు ముందు 4జి, దానికి ముందు 2జి సేవలు అందించిన టెలికాం సంస్థలు ఇప్పుడు 5జిని అందిపుచ్చుకున్నాయి. సాంకేతికత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, దేశంలో ఇంకా 4జి సేవలే లేని గ్రామాలు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. కానీ ఇది నిజం. దేశంలో ఇప్పటికీ 45,180 గ్రామాలకు 4 జి మొబైల్ సేవలు అందుబాటులో లేవని లోక్ సభలో కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. ఈ గ్రామాలకు సంతృప్త స్థాయిలో 4జి సేవలు అందించాలంటే రూ. 26,316 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. దేశంలో 6,44,131 గ్రామాలుండగా ఇందులో 5,98,951 గ్రామాలకు 4జి మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంటే 93శాతం గ్రామాలకు 4 జి సేవలు ఉన్నాయి. మిగతా 7 శాతం గ్రామాలకు 4జి నెట్వర్క్ లేదు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 99 శాతం గ్రామాలకు 4జి సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాలో 7,592 గ్రామలకు 4జి కవరేజ్ లేదు. మహారాష్ట్రంలో 3,793 గ్రామాలకు 4జి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 3,169 గ్రామాల్లో 4జి అందుబాటులోకి రాలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు 4జి సేవలందించేందుకు రూ.2,211 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. -
దేశంలో 5జీ జోరు, వందల కోట్ల పెట్టుబడి పెట్టనున్న శాంసంగ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ భారత్‌లో రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌తో తమిళనాడు కేంద్రంగా 4జీ, 5జీ రేడియో ఎక్విప్మెంట్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇందుకోసం జియో, ఎయిర్‌టెల్‌తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌తో పాటు మిగిలిన అంతర్జాతీయ సంస్థలు ప్రొడక్ట్‌లను తయారు చేసేలా కేంద్ర ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకంలో చేరారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పీఎల్ఐ స్కీమ్‌లో భాగంగా తయారీ సంస్థలు నెలకొల్పేలా నోకియా, శామ్సంగ్, ఎరిక్సన్ భాగస్వామి జబిల్ దేశీయంగా 5జీ పరికరాల్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 5జీ జోరు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విడుదల చేయడంతో 5జీ పరికరాలకు డిమాండ్ పెరగనుంది. అయితే గతేడాది పరికరాలు సరఫరా చేసే అవకాశాలు లేకపోవడంతో పీఎల్ఐ స్కీమ్‌లో చేరేందుకు శాంసంగ్ ఇష్టపడేలేదు. కేవలం జియోకు 4జీ పరికరాల్ని అందించే సంస్థగా కొనసాగింది. కానీ తాజాగా భారత్‌లో 5జీ రాకతో లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అవసరం పెరిగింది. దీంతో శాంసంగ్ పీఎల్ఐ స్కీంలో చేరి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. -
4జీ స్పీడ్, మరోసారి టాప్‌లో జియో
న్యూఢిల్లీ: అతి వేగవంతమైన 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అక్టోబరు 4జీ స్పీడ్ టెస్ట్ గణాంకాలను విడుదల చేసింది. జియో సగటు 4G డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో సగటు 4G డౌన్లోడ్ వేగం సెప్టెంబర్‌లో 19.1 Mbps నుండి అక్టోబర్‌లో 20.3 Mbpsకి పెరిగింది. (మస్క్ మరో బాంబు: వన్ అండ్ ఓన్లీ అప్షన్, డెడ్‌లైన్) సగటు డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య గట్టి నెలకొంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ డౌన్లోడ్ వేగం 15 Mbps కాగా Vi (వోడాఫోన్-ఐడియా) 14.5 Mbps. కానీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాతో పోలిస్తే జియో 4జీ సగటు డౌన్లోడ్ వేగం 5 Mbps ఎక్కువ. (త్వరలోనే తప్పుకుంటా, అమెరికా కోర్టులో మస్క్ సంచలన ప్రకటన) సగటు 4G అప్లోడ్ వేగం పరంగా కూడా, రిలయన్స్ జియో గత నెలలో మొదటి సారి తొలి స్థానానికి చేరుకుంది. అక్టోబర్ నెలలో కూడా కంపెనీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 6.2 Mbps సగటు 4G అప్లోడ్ వేగంతో జియో టాప్ లో నిలిచింది. వోడాఫోన్-ఐడియా 4.5 Mbps వేగంతో రెండవ స్థానంలో కొనసాగింది. అదే సమయంలో, ఎయిర్టెల్ అప్లోడ్ స్పీడ్‌లో నిరంతర క్షీణత ఉంది. అక్టోబర్‌లో ఎయిర్టెల్ సగటు 4జీ అప్లోడ్ వేగం ఆందోళనకరంగా 2.7 Mbpsకి చేరుకుంది. ఎయిర్టెల్ అప్లోడ్ వేగం జియోలో సగం కంటే తక్కువకు చేరుకుంది. -
జియో 4జీ సిమ్ వినియోగిస్తున్నారా? అయితే జియో 5జీ నెట్వర్క్ పొందండిలా!
దేశంలో జియో 5జీ సేవలు దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కంపెనీ భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు ఆ సంస్థ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇక దీపావళికి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఎంపిక చేసిన జియో వినియోగదారులకు మాత్రమే జియో ట్రూ 5జీని వినియోగించుకునే సదుపాయం ఉంది. జియో 5జీని వినియోగించుకోవాలంటే మీరు మై జియో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత, యాప్‌ని ఓపెన్ చేసి మీ జియో నంబర్‌ను ఎంటర్ చేయండి. అనంతరం యాప్ స్క్రీన్ మీద పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా ‘జియో వెల్కమ్ ఆఫర్’ అని డిస్ప్లే అవుతుంది. చదవండి👉 గుడ్ న్యూస్: జియో 5జీ ట్రయల్స్,యూజర్లకు ఆహ్వానం ఆతర్వాత జియో వెల్కమ్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే ‘మోస్ట్ యూజ్డ్ ఏరియాస్’ 5జీ సపోర్ట్ చేస్తుందో లేదో యాప్ తనిఖీ చేస్తుంది. ఇది మీ ఫోన్ 5జీకి (అన్ని సంబంధిత అప్డేట్లతో) మద్దతు ఇస్తుందని నిర్ధారిస్తుంది. అది పూర్తయిన తర్వాత, వెల్కమ్ ఆఫర్ కింద 5జీ సపోర్ట్‌ని పొందడానికి మీరు వరుసలో ఉన్నారని నిర్ధారిస్తూ మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడే జియో 5జీ అందిస్తున్న ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ఈ నాలుగు సర్కిల్‌లలో ఒకదానిలో ఉన్నట్లయితే మీరు 5జీని వినియోగించుకోవచ్చు. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్ అవ్వండి’
సైబర్ నేరస్తులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మార్కెట్ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆధార్ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్ ఇలా సందర్భాన్ని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా మన దేశంలో అందుబాటులోకి వచ్చిన ఫాస్టెస్ట్ 5జీ నెట్ వర్క్ సైబర్ నేరగాళ్లకు కాసులు కురిపిస్తోంది. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ పేరుతో కేటగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటూ పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. యూపీఐ, బ్యాంకు యాప్‌లకు అనుసంధానం అయిన మొబైల్ నంబర్ల ద్వారా ఖాతాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ అవ్వండంటూ వచ్చే ఏ మెసేజ్‌ను నమ్మొద్దు చెబుతున్నారు. ఆ తరహా మెసేజ్ లింకులు క్లిక్ చేయొద్దు. ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత టెలికం సంస్థ కార్యాలయంలో 5జీ అప్‌గ్రేడేషన్ చేసుకోవాలని, ఫేక్ లింకులను క్లిక్ చేసి ఆర్థిక మోసాలకు, డేటా చౌర్యానికి గురికావద్దని అంటున్నారు. 5జీ పేరుతో ఫేక్ లింకులు వస్తున్నాయని, అనుమానం ఉంటే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సైతం సామాన్యుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. -
నవంబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నవంబర్ నుంచి తమ 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి క్రమంగా దాన్ని 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. 18 నెలల్లో 1.25 లక్షలకు పైగా 4జీ మొబైల్ సైట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. దేశీ 4జీ టెక్నాలజీని వినియోగించేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికం పరిశోధన సంస్థ సీ–డాట్ సారథ్యంలోని కన్సార్షియంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 2023 ఆగస్టు 15 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ కార్యకలాపాలు ప్రారంభించాలంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్దేశించారని, తదనుగుణంగా కృషి చేస్తున్నామని పుర్వార్ పేర్కొన్నారు. -
5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఖచ్చితంగా వీటిని పరిశీలించండి
‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ ఈవెంట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ నెట్వర్క్ ప్రారంభించారు. దీంతో దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు అధికారికంగా వినియోగించేకునే సౌకర్యం కలిగింది. ప్రస్తుతం టెలికం సంస్థ ఎయిర్ టెల్ మాత్రమే ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5జీ సర్వీసుల్ని ప్రారంభించగా జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లు ఈ లేటెస్ట్ టెక్నాలజీ నెట్‌వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో 5జీ నెట్ వర్క్‌ల పనితీరు, సిమ్‌లు, నెట్ వర్క్ ప్లాన్ ధరలు సంగతి పక్కన పెడితే..యూజర్లు 5జీ సపోర్ట్ చేసే ఫోన్లను కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నారు. అయితే రోజువారీ అవసరాల కోసం 5జీ నెట్ వర్క్ పనిచేసేలా స్మార్ట్ ఫోన్లలో ఏయే ఫీచర్లు ఉండాలనే విషయాల గురించి తెలుసుకుందాం. 5జీ చిప్సెట్ 5జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేసేలా మీ ఫోన్లో తప్పని సరిగా 5జీ చిప్సెట్ ఉండాలి. ఇక్కడ శుభ పరిణామం ఏంటంటే? ఇప్పటికే తయారు చేసిన కొత్త చిప్సెట్లు మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లకు 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తున్నాయి. క్వాల్కమ్ ప్రాసెసర్ సపోర్ట్ చేసే ఫోన్లలో స్నాప్ డ్రాగన్ 695 , స్నాప్‌డ్రాగన్ 765జీ, స్నాప్‌డ్రాగన్ 865, చిప్ సెట్లు డిఫాల్ట్‌గా 5జీ నెట్ వర్క్‌కి మద్దతు ఇస్తాయి. మీడియా టెక్ ప్రాసెసర్‌కు సపోర్ట్ చేసే ఫోన్లలో మీడియా టెక్ డైమెన్సిటీ సిరీస్ చిప్సెట్ ఉంటే 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చు. ఇందులో డైమెన్సిటీ 700 వంటి తక్కువ స్థాయి ఫోన్లు, అలాగే హై-ఎండ్ డైమెన్సిటీ 8100, డైమెన్సిటీ 9000 ఉన్నాయి. పాత జీ-సిరీస్, హీలియో సిరీస్ ఫోన్లు 5జీని వినియోగించుకోలేం. 5G బ్యాండ్లు స్మార్ట్ ఫోన్ 5జీ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుందా? లేదా? అనేది ఫోన్ చిప్సెట్ నిర్ణయిస్తుంది. అందుకే మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఏదైనా ఫోన్లో 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తాయా? లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లో డివైజ్ ప్రొడక్ట్ పేజీ విభాగంలో స్పెసిఫికేషన్ సెక్షన్లో బ్యాండ్ వివరాలు ఉంటాయి. 5జీ బ్యాండ్స్ 8-12 మధ్య ఉంటే సరిపోతుంది. వాటి పనితీరు బాగుంటాయి. -
రూ.15వేలకే ల్యాప్‌ట్యాప్,‘రిలయన్స్ జియో సరికొత్త సంచలనం!’
ల్యాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త సంచలనం సృష్టించనుంది. రూ.15వేల బడ్జెట్ ధరలో ల్యాప్ ట్యాప్‌ను విడుదల చేయనుంది. 4జీ సిమ్ కనెక్ట్ చేస్తూ లో బడ్జెట్ ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియో అధినేత ముఖేష్ అంబానీ ఇప్పటికే జియో బుక్ కోసం టెక్ దిగ్గజం క్వాల్కామ్, మైక్రోసాఫ్ఠ్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు ఈ లోబడ్జెట్ ల్యాప్ ట్యాప్ చిప్ కోసం యూకేకి చెందిన ఏఆర్ఎం కంపెనీతో జతకట్టినట్లు..ఈ సంస్థ తయారు చేసిన చిప్‌తో విండోస్ ఓఎస్ తో పాటు మరికొన్ని యాప్స్ వినియోగించుకునే సౌలభ్యం కలగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ల్యాప్ ట్యాప్‌పై జియో ప్రతినిధులు ఇప్పుటి వరకు స్పందించలేదు. ఈ నెలలో విడుదల జియో సంస్థ ఈ సెప్టెంబర్ నెలలో ల్యాప్‌ట్యాప్‌ను విడుదల చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జియోఫోన్ మాదిరిగానే, 5జి ఎనేబుల్డ్ వెర్షన్‌ను సైతం ఈ ల్యాప్ ట్యాప్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. జియో ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు ఈ ల్యాప్ ట్యాప్‌లో జియో సొంత ఆపరేటింగ్ సిస్టం ‘జియో ఓఎస్’ ఉండనుంది. కావాల్సిన యాప్స్‌ను జియోస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఉద్యోగులు వినియోగించే ట్యాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌ట్యాప్ పనిచేస్తుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 5జీ, ఏమిటో వింత పరిణామం! -
5G ఎఫెక్ట్: 1G ఇంకా వాడుకలోనే ఉందా?
దేశంలో 5జీ సేవలు మొదలు అయ్యాయి. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫైజీ సేవలను ప్రారభించారు. డిజిటల్ ఇండియా నినాదం కొనసాగుతున్న వేళ.. ఇంటర్నెట్ సేవల ప్రాముఖ్యత పెరగడం, ఈ క్రమంలోనే అప్డేటెడ్ వెర్షన్ 5జీ భారత్‌లోకి ప్రవేశించడం విశేషం. అయితే.. సాధారణంగా ప్రతీ పదేళ్లకొకసారి కొత్తగా వైర్లెస్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ వస్తుంటుంది. అలా.. 1జీ, 2జీ, 3జీ, 4జీ, 4.5జీ, 5జీ.. ఇలా వచ్చాయి. కొత్తగా ఒకటి రాగానే.. పాత జనరేషన్ టెక్నాలజీ కనుమరుగు కావడం విశేషం. కానీ, తొలి తరం వైర్లెస్ సెల్యూలార్ టెక్నాలజీ 1జీ, 2జీ..3జీలు వచ్చాక కూడా చాలా ఏళ్లపాటు మనుగడలో కొనసాగడం విశేషం. ఈ భూమ్మీద ఎక్కువ కాలం 1జీ సేవలు ఎక్కువ కాలం నడిచింది.. రష్యాలోనే!. ► 1980లో 1జీ వాడుకలోకి వచ్చింది. కేవలం ఆడియో ట్రాన్స్మిషన్స్ ఆధారిత సేవల కోసం ఇది పుట్టుకొచ్చింది. వేర్వేరు దేశాల్లో.. వేర్వేరు ప్రమాణాలు అభివృద్ధితో సేవలు అందాయి. అయితే ప్రపంచంలో చాలా చోట్ల నోర్డిక్ మొబైల్ టెలిఫోన్(NMT), అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ సిస్టమ్(AMPS) వ్యవస్థలు పని చేశాయి. ► 90వ దశకం మధ్యలోనే 2జీ పుట్టుకొచ్చింది. 2000 సంవత్సరంలో పూర్తిస్థాయిలో 2జీ వాడుకతో.. 1జీ బంద్ అయ్యింది. కానీ.. ► చాలా ఏళ్లపాటు 1జీ సేవలు కొనసాగాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. ► ఫస్ట్ జనరేషన్ ఆఫ్ సెల్ల్యూలార్ నెట్వర్క్స్.. లో పవర్ రేడియో ట్రాన్స్మిట్టర్స్ సాయంతో ప్రత్యేకించి ఓ భౌగోళిక ప్రాంతంలో పని చేసేవి. ► ప్రపంచంలోనే ఫస్ట్ కమర్షియల్ సెల్యూలార్ నెట్వర్క్ 1979లో నిప్పోన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్(NTT) జపాన్‌లో ప్రారంభించింది. తొలుత మెట్రోపాలిటన్ ప్రాంతంగా టోక్యోలో ప్రారంభించారు. ► పానాసోనిక్ TZ-801 ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగించిన తొలి ఫోన్. ఐదేళ్లలో ఆ నెట్వర్క్ జపాన్ అంతటా విస్తరించింది. అలా ప్రపంచంలో తొలి 1జీ/సెల్యూలార్ నెట్వర్క్ దేశంగా జపాన్ ఖ్యాతి సంపాదించుకుంది. అయితే.. ► జపాన్ కంటే ముందు బెల్ లాబోరేటరీస్(నోకియా బెల్ ల్యాబ్స్) ఫస్ట్ సెల్యూలార్నెట్వర్క్ను నిర్మించింది. ► జపాన్ తర్వాత.. స్వీడన్, నార్వే, సౌదీ అరేబియా, డెన్మార్క్, ఫిన్లాండ్, స్పెయిన్లు 1జీ నెట్వర్క్ ద్వారా కమర్షియల్ సెల్యూలార్ నెట్‌వర్క్‌లను మొదలుపెట్టాయి. ► 90వ దశకం మధ్యనాటికి 1జీ శకం ముగిసి.. 2జీ శకం మొదలైంది. జీఎఎస్ఎం, సీడీఎంఏ వన్ లాంటి సెల్యూలార్ టెక్నాలజీలు వాడుకలో వచ్చాయి. ► 2000 సంవత్సరం మొదటినాటికి 1జీ నెట్వర్క్ దాదాపుగా కనుమరుగు అయ్యింది. అయితే.. యూరప్ తూర్పు ప్రాంతాల్లో మాత్రం 1జీ నెట్‌వర్క్‌లు కొనసాగాయి. ఇక ప్రపంచంలో చివరగా 1జీ నెట్‌వర్క్‌ను మూసేసిన దేశం రష్యా. అలా.. 2017 దాకా 1జీ నెట్వర్క్ తన సేవలను కొనసాగించింది. ► 0G.. జీరో జనరేషన్ సెల్యూటార్ టెక్నాలజీ. ప్రీ సెల్యూలార్ వ్యవస్థలుగా వ్యహరిస్తుంటారు. మొబైల్ రేడియో టెలిఫోన్ వ్యవస్థలు.. వైర్లెస్ టైప్‌గా గుర్తింపు పొందాయి. 1940 నుంచి వీటి వాడకం పెరిగింది. వైర్లెస్ ఫోన్లు, వాకీటాకీలు వీటి కిందకు వచ్చేవి. ► 2జీ.. డిజిటల్‌గా ఎన్‌క్రిప్ట్ చేయబడిన సంభాషణలతో పాటు మొబైల్ డేటా, ఎస్సెమ్మెస్ సేవల కోసం అందుబాటులోకి వచ్చింది. 1991లో జీఎస్ఎం స్టాండర్డ్‌తో ఫిన్లాండ్లో 2జీ సెల్యూలార్ టెలికామ్ నెట్వర్క్స్ సేవలు మొదలు అయ్యాయి. ఆపై 2.5జీ ద్వారా జీపీఆర్ఎస్(General Packet Radio Service), 2.75జీ ద్వారా ఎడ్జ్(Enhanced Data rates for GSM Evolution) అందుబాటులోకి వచ్చాయి. ► 3జీ.. వైర్లెస్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీలో మూడవతరం. వేగంగా డాటా ట్రాన్స్ఫర్ కోసం, బెటర్ వాయిస్ క్వాలిటీ కోసం ఉద్దేశించబడింది. 2001 ఏడాది మధ్యలో 3జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌కు చెందిన NTT డోకోమో అక్టోబర్ 1వ తేదీ, 2001లో 3జీ కమర్షియల్ సేవల్ని మొదలుపెట్టింది. భారత్‌లో 2008 డిసెంబర్ 11వ తేదీన మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్(MTNL) ద్వారా 3జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 3జీలో 3.5జీ, 3.75జీ కూడా వచ్చాయి. ► 4జీ.. బ్రాడ్‌బాండ్ సెల్యూలార్ నెట్వర్క్ టెక్నాలజీలో నాలుగవ తరం. వైమ్యాక్స్(Wimax) ప్రమాణాలతో 2006లో దక్షిణ కొరియాలో తొలి కమర్షియల్ 4జీ సేవలు లాంఛ్ అయ్యాయి. అయితే.. ► 2010 డిసెంబర్లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 4జీ నిర్వచనంలో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్(LTE)ని కూడా జత చేసింది. ఎల్టీఈతో పాటు వైమ్యాక్స్, హెచ్ఎస్పీఏ+( Evolved High Speed Packet Access) ప్రమాణాలు కూడా 4జీకి జత కలిశాయి. ► 2021 నాటికి 4జీ టెక్నాలజీ ప్రపంచంలో దాదాపు 58 శాతం మార్కెట్‌ను ఆక్రమించింది. ► ఇక 5జీ విషయానికొస్తే.. 2019 నుంచే ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు మొదలయ్యాయి. ► సౌత్ కొరియా 5జీ నెట్‌వర్క్‌ను లాంఛ్ చేసింది. ఎల్జీయూ ఫ్లస్ తప్పించి దాదాపు అన్ని కంపెనీ ఫోన్లు అక్కడ 5జీ నెట్వర్క్ ఆధారంగానే పని చేస్తున్నాయి. ► 2025 నాటికి.. ప్రపంచంలో 25 శాతం మొబైల్ టెక్నాలజీ మార్కెట్, 1.7 బిలియన్ సబ్‌స్క్రయిబర్స్ 5జీకే మొగ్గు చూపుతారని అంచనా ఉంది. ► 6జీ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిక కనబరుస్తున్నా.. అది ఇంకా ఆచరణలోకి రాలేదు. 2030 నాటికి అది ప్రపంచానికి అందుబాటులోకి రావొచ్చనేది ఒక అంచనా. ► 7G గురించి.. ఆసక్తికరమైన విషయం చర్చించుకోవాలి. ప్రపంచంలో కేవలం నార్వేలో 7జీ-8జీ స్పీడ్‌తో కొన్ని చోట్ల ఇంటర్నెట్ను అందిస్తున్నారు. అంటే.. సెకనుకు 11 గిగాబైట్స్ లెక్కను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. అయితే 6జీనే మనుగడ లేని టైంలో 7జీ సేవల గురించి ప్రపంచం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. -
5జి వచ్చేస్తోంది.. మీ ఫోన్లో ఈ ఆప్షన్ ఉంటే సపోర్ట్ చేసినట్లే!
ఈ అక్టోబర్‌లో భారతదేశం ఎట్టకేలకు 5జి మార్కెట్ కానుంది. మరి కొద్ది వారాల్లో మీ స్మార్ట్ ఫోన్ స్టేటస్ బార్ లో మీరు 5జి ఐకాన్ చూడడం సాధ్యపడే అవకాశం ఉంది. జులైలో స్పెక్ట్రమ్ విజయవంతంగా ముగిసిన తరువాత, భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు 5జి ని వినియోగించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఢిల్లీ లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 5జి సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు. జియో, ఎయిర్ టెల్ ఈ సేవలను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వోడాఫోన్ ఐడియా (వి) కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెట్రో నగరాలు మొదటగా 5జి సేవలను పొందనున్నాయి. తాము 5జి సేవలను అందించే విషయంలో కంపెనీలు ఎంతో విశ్వాసంతో ఉన్నాయి. అదే సమయంలో 5జి అనుభూతిని పొందేందుకు కస్ట మర్లు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. 5జి కి సంబంధించి కస్టమర్లు సమాధానాలు తెలుసు కోవాలనుకుంటున్న ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయి. 5జి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? దాన్ని నేను ఎలా పొందగలుగుతాను? నాకు కొత్త ఫోన్ అవసరమవుతుందా? నేను ఏ ఫోన్ తీసుకోవాలి? కొత్త సిమ్ కార్డ్ అవసరమవుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిలో కొన్ని మాత్రం ముఖ్యమైనవే. నాకు 5జి అవసరమా? జీవనశైలిని అప్ గ్రేడ్ చేసుకోవాలనే భావనను పక్కనపెడితే, అసలు ఇంటర్నెట్ కనెక్షన్ నుంచి మీరు ఏం పొందాలనుకుంటున్నారు అనే దానిపై ఈ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన ఇంట ర్నెట్ అనేది ఎలాంటి బఫరింగ్ లేకుండా హై-క్వాలిటీ వీడియోలను స్ట్రీమ్ చేస్తుంది. అతి తక్కువ లాటెన్సీ (స్పందించే సమయం) తో హై - గ్రాఫిక్స్ గేమ్స్ ను ప్లే చేస్తుంది. మీ కనెక్షన్ స్లో అవుతుందేమో అన్న బాధ లేకుండా పలు ఉప కరణాలను ఉపయోగించవచ్చు. 5జి కనెక్షన్ పొందడం అనేది టెంప్టింగ్ గా ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అది క్యూరియాసిటీ వల్ల కావచ్చు లేదా తోటి వారంతా దాని గురించి ముచ్చటించుకోవడం నుంచైనా కావచ్చు. హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం లేని యా క్సెస్ ను పొందేందుకు అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి అందిస్తుంది. భారతీయ స్మార్ట్ ఫోన్ విని యోగదారులకు సంబంధించి ఒక కన్జ్యూమర్ సర్వే ప్రకారం వేగవంతమైన నెట్ వర్క్ వేగాలు తమ మొబైల్ సేవలను మెరుగుపరుస్తాయని 42 శాతం మంది భావిస్తున్నారు. మరింత విశ్వసనీయమైన కనెక్షన్, మెరుగైన్ ఇన్ డోర్ కనెక్షన్ ఉంటాయని భావిస్తున్న వారి శాతం కూడా అధికంగానే ఉంది. భారతీయ ఆపరేటర్లు వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ సి-బ్యాండ్, సబ్-1GHz లలో అధిక సామర్థ్యాన్ని, కవరేజీని అందించనుంది. టాప్ లైన్ స్పీడ్స్ పరంగా చెప్పాలంటే, 5జి మార్కెట్లలో చేసిన ఈ అధ్యయనం ప్రకారం, ప్రస్తుత 4జి కంటే కూడా 5జి వేగం 7 నుంచి 10 రెట్లు అధికంగా ఉండనుంది అని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం. మీరు గనుక అప్ గ్రేడ్ కావాలనుకుంటే, భారతదేశంలో 4జి ప్రవేశపెట్టబడినట్లుగానే, 5జి మీకు అందించే ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకోండి. అప్పట్లో టారిఫ్ లలో అగ్రెసివ్ ప్రైసింగ్ (ధరలు బాగా తక్కువగా ఉండడం) వెనుక పోటీ కూడా ఒక కారణంగా ఉండింది. ఈ రెండు అంశాలతో పాటుగా 5జికి గల డిమాండ్, దేశంలో 5జి సేవల ప్రోత్సా హకాలను ప్రభావితం చేయనున్నాయి. 2016లో జియో మొదలైనప్పుడు అది మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు, మార్కెట్ వాటా పొందేం దుకు తన నూతన 4జి నెట్ వర్క్ పై సుమారుగా 6 నెలల పాటు వాయిస్, డేటాను ఉచితంగా అందించింది. దీంతో 4జి మార్కెట్ లో జియో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. 5జి సేవలను అందించడంలో పోటీలో ముందు ఉండాలని భారతీయ ఆపరేటర్లు తహతహలాడుతున్న తరుణంలో ఆకర్షణీయ 5జి అప్ గ్రేడ్ ఆఫర్లు మార్కెట్ ను ముంచెత్తే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా జియో 'ట్రూ 5జి' సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. నా ఫోన్ 5జికి సిద్ధంగా ఉందా? మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు సులభమార్గం ఉంది. 2019లోనే దేశంలో మొదటి 5జి ఫోన్ రావడాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మీరు మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్స్ ను లేదా మీ సిమ్ కార్డ్ కు సంబంధించి ప్రిఫర్డ్ నెట్ వర్క్ ను పరిశీలించండి అది గనుక 5జి ని కూడా సూచిస్తే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. ఓక్లా నిర్వహించిన ఒక మార్కెట్ సర్వే ప్రకారం చూస్తే, భారతీయులు 5జి ఫోన్ ఉపయోగిస్తూ తమ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ను పరీక్షించుకుంటున్నారు. ఎంతో మంది భారతీయులు ఇప్పటికే 5జి సామర్థ్యం కలిగిన ఉపకరణాలు ఉపయోగిస్తూ స్పీడ్ టెస్ట్ యాప్ ను రన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, 5జి అప్ గ్రేడేషన్ అనేది ఖరీదైన హ్యాండ్ సెట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండానే, ఒక నూతన మొబైల్ రీచార్జ్ ప్లాన్ ను కొనుగోలు చేసినంత సులభం కానుందని ఈ సర్వే తెలుపుతోంది. 5జి అనేది ఖరీదైన ఫోన్లలోనే కాకుండా మధ్యస్థాయి ఫోన్లలో కూడా ఒక సాధారణ ఫీచర్ గా ఉంటోంది. మీ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడా కూడా మీకు 5జి అనేది కనిపించకపోతే, మీ ఫోన్ 5జిని సపోర్ట్ చేయదనే అర్థం. అలాంటప్పుడు మాత్రం మీరు 5జిని సపోర్ట్ చేసే కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కొత్త 5జి ఫోన్ అవసరమా? అక్టోబర్ మొదలుకొని వచ్చే ఏడాది నాటికి వివిధ భారతీయ నగరాల్లో 5జి అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతానికి మాత్రం అది మెట్రో నగరాల్లోనే లభ్యం కానుంది. మీరు గనుక ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లేదా బెంగళూరులలో నివసిస్తున్నట్లయితే, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అనుభూతి పొందేందుకు మీ వద్ద 5జి ఫోన్ ఉండాల్సిందే. 5జి ఫోన్ ను కొనడం ఎంతో ప్రయోజనదాయకం అవుతుంది. అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జి కనెక్టివిటీ మరికొన్ని రోజుల తరువాత రానుంది. దేశంలో 5జి మొదటగా ఆవిష్కరించబడే 13 నగ రాల పేర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఇప్పటికే ప్రకటించింది. మొదట పెద్ద పెద్ద నగరాల్లో ఈ కవరేజీ అందుబాటులోకి రానుంది. తమ పెట్టుబడులపై ప్రతిఫలాలు రావచ్చు అన్న అంచనాతో టార్గెట్లపై ఆపరేటర్లు పని చేస్తున్నారు. టాప్ 100 భారతీయ నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్ ను ఇప్పటికే పూర్తి చేసి నట్లుగా జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్ టెల్ ఉంది. నా ముందున్న ఆప్షన్లు ఏంటి? వివిధ ధరల శ్రేణుల్లో యాపిల్ ఐఫోన్లు, సామ్ సంగ్, షావోమి, పోకో, రియల్ మి, వివో వంటి బ్రాండ్లు 5జి స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయి. 5జి చిప్ సెట్ తయారీ సంస్థలైన మీడియా టెక్, క్వాల్ కమ్ వంటి వాటితో వ్యూహా త్మక ఒప్పందాలతో ఓఈఎంలు చాలా తక్కువ ధరకే అంటే రూ. 15,000లకే 5జి స్మార్ట్ ఫోన్లను అందించ గలుగుతున్నాయి. ఇది 5జి సేవల కోసం మరింత మంది ముందుకు వచ్చేలా చేస్తుంది. రియల్ మి వంటి బ్రాండ్లు రూ.10,000 లోపుగానే 5జి ఫోన్లను అందించేందుకు వాగ్దానం చేశాయి. 5జి స్మార్ట్ ఫోన్లను కొనాలనుకునే వినియోగదారులు అనుకూలతలు, ప్రతికూలతలు అన్ని ఒకసారి బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. తమకు సరిపోయే ఫీచర్లు గల ఫోన్ కోసం చూడాలి. 5జీ ఫోన్ కొనేటప్పుడు ఏయే అంశాలను చూడాలి? కొత్త ఫోన్ కొనేటప్పుడు 5జి తో పాటు మరెన్నో ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 5జి అనేది నేడు ఫోన్లకు ఒక తప్పనిసరి ఆవశ్యకతగా మారింది. రిటైల్ బాక్స్ లపై ‘‘5జి’’ అని ముద్రించబడి ఉంటుంది. అది ఒక్కటి మాత్రమే సరిపోదు. మరే ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలో చూద్దాం. 5-జి రెడీ ఫోన్ ఒక్కటే సరిపోదు. ఏ విధమైన 5జి బ్యాండ్స్ ను మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందో కూడా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఫోన్ రిటైల్ బాక్స్ పై సులభంగా అందుబాటులో ఉంటుంది. 5జి స్పెక్ట్రమ్ లో మూడు బ్యాండ్స్ ఉంటాయి, వీటినే టెలికాం కంపెనీలు పొందాయి. లో – బ్యాండ్, మిడ్ -బ్యాండ్, హై- బ్యాండ్. లో-బ్యాండ్ అనేది 700MHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్నే n28గా కూడా వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ అనేది 3500MHz ను కలిగి ఉంటుంది. దీన్నే n78 అని వ్యవహరిస్తారు. దాదాపుగా ప్రతీ 5జి ఫోన్ కూడా n78 ను సపోర్ట్ చేస్తుంది. కానీ బాగా ఖరీదైన ఫోన్లలోనే n28ను మీరు గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే 700MHz అనేది స్టాండ్ అలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీన్ని అందించగలదు. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్ ను కలిగిఉంటుంది. దీన్ని mmWave గా, n258గా వ్యవహరిస్తారు. చాలా కొద్ది ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జి ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. 5జి ఎంత వేగంగా ఉండవచ్చు? ప్రపంచవ్యాప్తంగా 5జి నెట్వర్క్ లు వినియోగదారులకు 1జీబీపీఎస్ కు మించిన వేగాన్ని అందించగలుగు తున్నాయి. భారతీయ టెల్కోలు 4జి కన్నా అధికంగా డౌన్ లోడ్, అప్ లోడ్ వేగాలను అందించేందుకు వాగ్దానం చేశాయి. అయితే, 5జి స్పీడ్ అనేది ఆపరేటర్ పైనే గాకుండా, లొకేషన్ పై కూడా ఆధారపడి ఉంటుంది. 5జి ఫోన్లో 4జి సిమ్ కార్డ్ పని చేస్తుందా? మీ ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ కొత్త 5జి ఫోన్లోనూ ఖచ్చితంగా పని చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, SMS మరియు వాయిస్ కాలింగ్ వంటి 4జి మరియు 5జి సేవలను పొందొచ్చు. భారతీయ టెలికాంలు NSA 5జి సాంకేతికతను అవలంబించడంతో, వారి ప్రస్తుత 4జి సిమ్ కార్డ్ Rel 99+ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది. ఈ ప్రమాణం 2జి, 3జి, 4జి, మరియు 5జి సేవలు అందించేందుకు అనుకూలంగా ఉంటుంది. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
4జీ చార్జీలకే 5జీ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం అయిన 5జీ సేవలను నేడో రేపో ప్రారంభించేందుకు భారత టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. స్పెక్ట్రం అందుకున్న కంపెనీలు ఒకవైపు.. 5జీ హ్యాండ్‌సెట్స్‌తో 5 కోట్ల మంది కస్టమర్లు మరోవైపు. అయితే అందరి చూపూ చార్జీలు ఎలా ఉండబోతున్నాయనే. టెలికం కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు 4జీ రేటుకే 5జీ సేవలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కస్టమర్ నుంచి సమకూరే ఆదాయాన్ని పెంచుకోవాలని కొన్నేళ్లుగా టెలికం సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఈ సంస్థలు అందుకు తగ్గ ప్రణాళికనూ రెడీ చేసుకున్నాయి. ఆరు నెలల తర్వాతే.. ముందుగా 4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించే అవకాశం ఉందని దిగ్గజ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కొత్త టెక్నాలజీపట్ల కస్టమర్ అనుభూతి చెందాలి. 5జీ ప్రయోజనాలు అందుకోవాలి. అంత వరకు రేట్ల సవరణ ఉండకపోవచ్చు. ఆరు నెలల తర్వాతే క్రమంగా కొత్త చార్జీలు అమలులోకి వచ్చే చాన్స్ ఉంది. నెట్వర్క్ స్లైసింగ్ విధానంలో ఒక్కో వినియోగదారుడు కోరుకున్న వేగాన్ని 5జీలో అందించే వీలుంది. నెట్వర్క్ అప్‌గ్రేడ్ కారణంగా అటు 4జీ సేవల నాణ్యతా పెరుగుతుంది’ అని వివరించారు. 2022 మే 31 నాటికి దేశవ్యాప్తంగా 79.47 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదార్లు ఉన్నారు. వీరిలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 76.55 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీకి సమకూరుతున్న ఆదాయం రూ.200లోపే ఉంటోంది. దీనిని రూ.300–350కి చేర్చాలన్నది కంపెనీల లక్ష్యం. 2021 నవంబర్–డిసెంబర్లో చార్జీలు 20–25 శాతం పెరిగాయి. కంపెనీలకు స్పెక్ట్రం భారం.. టెలికం కంపెనీలు 5జీ స్పెక్ట్రం కోసం భారీగానే ఖర్చు చేశాయి. రిలయన్స్ జియో ఏకంగా రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఒక్క 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం జియో ఏకంగా రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో అంటోంది. 5జీ సేవల్లో భాగంగా మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్వర్క్ అప్‌గ్రేడ్, విస్తరణకు అయిదేళ్లలో రూ.1.43–1.59 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని ఓ కన్సల్టింగ్ కంపెనీ వెల్లడించింది. భారీగా ఖర్చులు ఉన్నందున ప్యాక్‌ల చార్జీలు పెంచక తప్పదు. అది కూడా ఆచితూచి వ్యవహరించాలన్నది కంపెనీల భావన. రెండేళ్లలో 15 కోట్లు.. ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది వద్ద 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. రెండేళ్లలో ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చాలన్నది టెలికం కంపెనీల లక్ష్యం. ఇందుకు అనుగుణంగా మొబైల్స్ తయారీ సంస్థలతో కలిసి బండిల్ ఆఫర్లను టెలికం సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి. జియో రాకతో ఒక్కసారిగా దేశంలో 4జీ విప్లవం వచ్చింది. మూడు కంపెనీల గట్టి పోటీతో 5జీలోనూ అదే ఊపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
‘బీఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా..ప్రైవేటుకు అండగా కేంద్ర ప్రభుత్వం’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపరిమిత డేటా.. అదీ ఎటువంటి స్పీడ్ నియంత్రణ లేకుండా. అదనంగా అపరిమిత కాల్స్. 30 రోజుల కాల పరిమితి గల ఈ ట్రూలీ అన్లిమిటెడ్ ప్యాక్ కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రూ.398 చార్జీ చేస్తోంది. అపరిమిత డేటాతో రూ.98 నుంచి ప్యాక్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ సేవలు 3జీ సాంకేతికతపైనే. భారత టెలికం రంగంలో చవక ధరలతో సేవలు అందించడమేగాక పారదర్శక సంస్థగా పేరున్న బీఎస్ఎన్ఎల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన పునరుద్ధరణ ప్యాకేజీని ఆసరాగా చేసుకుని 4జీ, 5జీ సర్వీసుల్లోనూ ఇదే స్థాయిలో గనక చార్జీలను నిర్ణయిస్తే మార్కెట్లో సంచలనమే అని చెప్పవచ్చు. ప్రైవేట్ సంస్థలకు సవాల్ విసరడమేగాక అధిక చార్జీలకు కట్టడి పడడం ఖాయం. ఇదే జరిగితే బీఎస్ఎన్ఎల్ కొత్త వైభవాన్ని సంతరించుకోవడం ఎంతో దూరంలో లేదు. అంతేకాదు సామాన్యులకూ నూతన సాంకేతికత చేరువ అవుతుంది. వచ్చే రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్ కనీసం 20 కోట్ల 4జీ, 5జీ కస్టమర్లను సొంతం చేసుకుంటుందని కేంద్రం భావిస్తోంది. 5జీ సేవలూ అందించవచ్చు.. బీఎస్ఎన్ఎల్కు ఊతమిచ్చేందుకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ జూలైలో ఆమోదించింది. ఇందులో రూ.43,964 కోట్లు నగదు రూపంలో, రూ.1.2 లక్షల కోట్లు నగదుయేతర రూపంలో నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం అందించనుంది. 4జీ సర్వీసులకై 900, 1800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీలో రూ.44,993 కోట్ల విలువైన స్పెక్ట్రంను బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం కేటాయించనుంది. 900, 1800 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో 5జీ సేవలనూ అందించవచ్చు. అత్యంత మారుమూలన ఉన్న 24,680 గ్రామాలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చే రూ.26,316 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్కు సిబ్బంది బలమూ ఉంది. ప్రస్తుతం సంస్థలో సుమారు 62,000 మంది పనిచేస్తున్నారు. ప్రధాన పోటీ సంస్థల మొత్తం ఉద్యోగుల కంటే బీఎస్ఎన్ఎల్ సిబ్బంది సంఖ్యా బలం ఎక్కువ. ఈ స్థాయి ఉద్యోగులతో వినియోగదార్లను గణనీయంగా పెంచుకోవచ్చు. జియో వద్ద 18,000, ఎయిర్టెల్ 20,000, వొడాఫోన్ ఐడియా వద్ద 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. ప్రైవేటుకు అండగా.. ప్రభుత్వ పోకడలే సంస్థ ప్రస్తుత పరిస్థితికి కారణమని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టం చేసింది. టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు ఘాటుగా లేఖ రాసింది. ‘బీఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా, ప్రైవేటుకు అండగా ప్రభుత్వం వ్యవహరించింది. 2019 అక్టోబర్ 23న కేంద్రం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రం కేటాయింపు కూడా ఉంది. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల కారణంగా స్పెక్ట్రం ప్రయోజనాన్ని బీఎస్ఎన్ఎల్ అందుకోలేకపోయింది. 49,300 టవర్లను అప్‌గ్రేడ్ చేసి ఉంటే రెండేళ్ల క్రితమే 4జీ సేవలు ప్రారంభం అయ్యేది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకం కలిగించింది. 50,000ల 4జీ టవర్ల కొనుగోలుకై 2020 మార్చిలో టెండర్లను ఆహ్వానించింది. టెలికం ఎక్విప్మెంట్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫిర్యాదుతో టెండర్ రద్దు అయింది. పైగా దేశీయ కంపెనీల నుంచే పరికరాలను కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టారు. ప్రైవేట్ కంపెనీలు విదేశీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్కు మాత్రమే ఎందుకీ నిబంధన? ఆలస్యం అయినప్పటికీ లాభా లు అందించే దక్షిణ, పశ్చిమ ప్రాంతంలో రూ.500 కోట్లతో నోకియా సహకారంతో 19,000 టవర్లను అప్‌గ్రేడ్ చేసి ఇప్పటికైనా 4జీ అందించవచ్చు’ అని ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి పి.అభిమన్యు మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది కంపెనీ స్థానం ట్రాయ్ ప్రకారం 2022 మే 31 నాటికి 114.5 కోట్ల వైర్లెస్ సబ్స్క్రైబర్లలో జియోకు 35.69%, ఎయిర్టెల్ 31.62%, వొడాఐడియా 22.56% వాటా ఉంటే వెనుకంజలో ఉన్న బీఎస్ఎన్ఎల్ 9.85% వాటాకు పరిమితమైంది. మేలో జియో 30 లక్షలు, ఎయిర్టెల్ 10 లక్షల మంది యూజర్లను కొత్తగా సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 5.3 లక్షల మందిని కోల్పోయింది. దేశంలో వైర్‌లైన్ కస్టమర్లు 2.52 కోట్ల మంది ఉన్నారు. ఇందులో అగ్ర స్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ వాటా 28.67%. జియోకు 26.7%, ఎయిర్‌టెల్‌కు 23.66% వాటా ఉంది. మొత్తం 79.4 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లలో జియో 52.18% వాటాతో 41.4 కోట్లు, ఎయిర్టెల్ 27.32%తో 21.7 కోట్లు, వొడాఫోన్ ఐడియా 15.51%తో 12.3 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 3.21% వాటాతో 2.55 కోట్ల మంది ఉన్నారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియోకు 58.9 లక్షలు, ఎయిర్టెల్ 47.4 లక్షలు, బీఎస్ఎన్ఎల్కు 47.4 లక్షల మంది యూజర్లు ఉన్నారు. -
దేశంలో 5జీ, జియో నెట్వర్క్ యూజర్లకు శుభవార్త!
5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఏడురోజుల పాటు జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.1,50,173కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఆగస్ట్ 10కల్లా స్పెక్ట్రం కేటాయింపులు జరుపుతామని తెలిపారు. దీంతో మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చే 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానుండగా..తొలిసారి జియో 5జీ నెట్ వర్క్ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్‌లో 5జీ నెట్ వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు సంస్థలు 5జీ నెట్ వర్క్ నిర్మాణ పనుల్ని పూర్తి చేశాయని టెస్ట్‌లతో పాటు ట్రయల్స్ నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఫస్ట్ జియోనే టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న రియలయన్స్ జియో దేశంలో తన 5జీ సేవల్ని వినియోగదారులకు అందించనుంది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, జామ్‌నగర్ నగరాల్లో 5జీ నెట్వర్క్ పనితీరుపై ట్రయల్స్ నిర్వహించినట్లు సంస్థ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా రియలన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు. 5జీపై టెలికాం కంపెనీలు ►రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ పాన్ ఇండియా అంతటా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అని అన్నారు. ►దేశంలో పలు ప్రధాన నగరాల నుంచి దశల వారీగా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఎయిర్టెల్ తెలిపింది ►ఇప్పుడే బిడ్డింగ్ ముగిసింది. 4జీ నెట్ వర్క్‌ను పటిష్టం చేసి 5జీని అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్ ఐడియా చెప్పింది. ►మార్కెట్ మొత్తం మీద 7శాతం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చు. అందుకే టెలికాం కంపెనీలు ప్రధాన నగరాల నుంచి దశల వారీగా 5జీ నెట్ వర్క్‌లను విస్తరిస్తాయిని నోమురా తన నివేదికలో పేర్కొంది. -
కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.! నెలకు సగటున ఎంత డేటా వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు గడిచిన ఐదేళ్ల కాలంలో రెట్టింపునకు పైగా పెరిగి 76.5 కోట్లకు చేరారని, 4జీ డేటా ట్రాఫిక్ 6.5 రెట్లు పెరిగిందని నోకియా తెలిపింది. భారత్‌లో మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 99 శాతానికి చేరినట్టు పేర్కొంది. ఈ ఏడాది 5జీ సర్వీసులు మొదలవుతున్నా.. వచ్చే కొన్నేళ్లపాటు మొబైల్బ్రాడ్ బ్యాండ్ వృద్ధికి 4జీ టెక్నాలజీ సాయంగా నిలుస్తుందని నోకియా ఎంబిట్ పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ‘‘మొబైల్ డేటా వినియోగం 2017 నుంచి 2021 మధ్య ఏటా 53 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం మూడు రెట్లు పెరిగి 17జీబీకి చేరింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు అప్ గత ఐదేళ్లలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు పెరిగారు. ఈ గణాంకాలన్నీ భారత్‌లో డేటా వినియోగం గణనీయంగా పెరిగినట్టు తెలియజేస్తున్నాయి’’ అని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత్ విభాగం హెడ్ సంజయ్ మాలిక్ తెలిపారు. మిలీనియల్స్ (23–38) రోజుకు 8 గంటల సమయాన్ని ఆన్లైన్లో గడుపుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. షార్ట్ వీడియో ఫార్మాట్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం ఇవన్నీ భారత్‌లో డేటా వినియోగం వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. గతేడాది 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ల రవాణా జరిగిందని, ఇందులో 3 కోట్లు 5జీ ఫోన్లు ఉన్నట్టు తెలిపింది. -
జియో మరో సంచనలం!! ప్లాన్ మామూలుగా లేదుగా!
టెలికం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్ జియో మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గానా ఇంటర్నెట్ కేబుల్ నిర్మాణాల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వరలో మాల్దీవ్లోని హుల్ హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ కానున్నాయి. సెకనుకు 200 టెరాబైట్స్ వేగంతో ఇంటర్నెట్ సామర్థ్యంతో జియో సంస్థ ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేస్తుంది. ప్రస్తుతం ఈ కేబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేబుల్స్ నిర్మాణం మాల్దీవులోని హుల్హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ అవుతున్నట్లు జియో తెలిపింది. తద్వారా భారత్, సింగపూర్లలో ప్రపంచంలోని ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ కానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఉజ్ ఫయాజ్ ఇస్మాయిల్ మాట్లాడుతూ..మాల్దీవుల మొదటి అంతర్జాతీయ కేబుల్ నిర్మాణం గురించి మాట్లాడుతూ..మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, నాణ్యమైన ఇంటర్నెట్ను అందించడం ద్వారా మాల్దీవుల ప్రజలు ఆర్ధికంగా అన్నీ రంగాల్లోని అవకాశాల్ని అందిపుచ్చుకుంటారని కొనియాడారు. ఆర్థికాభివృద్ధితో పాటు, ఇది మాల్దీవుల అంతటా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని ఉజ్ ఫయాజ్ అన్నారు. చదవండి: రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా షాక్..! దెబ్బ మామూలుగా లేదు -
జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..
Reliance Jio Becomes the First Operator to Offer a Rs 1 Prepaid Plan with 100 MB Data Valid for 30 Days: దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోంది. మంగళవారం గప్‌చుప్‌గా ఈ ప్యాక్‌ను వాల్యూ కేటగిరీలో యాడ్ చేసింది జియో. ప్రీపెయిడ్ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది రిలయన్స్ జియో. 100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట. ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. ఇక వాటర్ ప్యాకెట్ ధర కంటే తక్కువకి.. అదీ కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్ ద్వారా 10రూ.తోనే వన్ జీబీ పొందే వీలు ఉంటుంది. ఇక జియో అందిస్తున్న ఈ 100 ఎంబీప్లాన్ డేటాప్లాన్.. అన్నేసి రోజుల వాలిడిటీతో ఏ టెలికామ్ ప్రొవైడర్ అందించట్లేదు. పైగా 28 రోజుల వాలిడిటీ కాకుండా.. 30 రోజుల పరిమితితో ఇస్తోంది. నేరుగా మైజియో యాప్ ద్వారా ఈ రీచార్జ్ వెసులుబాటును కూడా అందిస్తోంది రిలయన్స్ జియో. చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్ -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన యూజర్లకు అదిరిపోయే శుభవార్తను అందించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు కేవలం ఎంపిక చేయబడిన ప్రాంతాలలోనే 4జీ సేవలను అందిస్తోంది. 4జీ సేవలతో దాదాపు 900 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుందని పార్లమెంటులో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. అన్ని పుకార్లను కొట్టివేస్తూ..బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణపై ఏలాంటి ప్రణాళికలు లేవని లోక్‌సభకు లిఖితపూర్వకంగా దేవుసిన్హ్ చౌహాన్ సమాధానమిచ్చారు. పీటీఐ నివేదిక ప్రకారం..రాబోయే బీఎస్ఎన్ఎల్ 4జీ టెండర్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC)ను బీఎస్ఎన్ఎల్ ఆహ్వానించింది. ప్రభుత్వ టెలికాం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రారంభించింది . ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు 4జీ సేవల స్పెక్ట్రమ్ కేటాయింపులు ఉన్నాయి. దీనికోసం బడ్జెట్ కేటాయింపులు వాడనున్నారు. ఆర్థిక నివేదికలోని గణాంకాల ప్రకారం...సెప్టెంబర్ 30, 2021 వరకు బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విలువ రూ. 1,33,952 కోట్లు , ఉండగా ఎంటీఎన్ఎల్ ఆస్తుల విలువ రూ. 3,556 కోట్లుగా ఉంది. అప్పుల విషయానికి వస్తే..బీఎస్ఎన్ఎల్ మొత్తం రూ. 85,721 కలిగి ఉంది. ఎంటీఎన్ఎల్ రూ. 30,159 కోట్ల అప్పు కలిగి ఉంది. చదవండి: యూజర్లకు భారీ షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్..! -
పల్లెపల్లెకూ మొబైల్
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలు లేని గ్రామాలకు 4జీ సేవలు అందించడానికి కేంద్రం సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో 1,218 గ్రామాలు సహా దేశవ్యాప్తంగా 44 ఆకాంక్ష (యాస్పిరేషనల్) జిల్లాల్లోని 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించడంలో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు బుధవారం సమావేశమయ్యాయి. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. యూఎస్ఓఎఫ్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లోని 44 ఆకాంక్ష జిల్లాల్లో 7,287 గ్రామాల్లో సుమారు రూ.6,466 కోట్ల అంచనా వ్యయంతో 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందించనున్నట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాల అనంతరం ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలోని ఆకాంక్ష జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, కడపల్లోని మారుమూల గ్రామాలకు మొబైల్ సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 1,054, విజయనగరంలో 154, కడప జిల్లాలో 10 గ్రామాల్లో మొబైల్ సేవల విస్తరణకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.మొత్తంగా 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. సాధ్యసాధ్యాలు పరిగణనలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత ఎక్కువగా సోలర్ పవర్ బ్యాటరీలు ద్వారా టెలికాం టవర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2022 వరకు పీఎంజీఎస్‌వై పథకం ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు 2022 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తిచేశామన్నారు. 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు కొనసాగించడం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల రాష్ట్రాల్లోని మిగిలిన పనులు పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇంకా 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్ జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి. ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది. అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది. -
గిరిజన గ్రామాల్లో 4జి జియో సేవలు
సాక్షి, అమరావతి: దేశంలో టెలికాం రంగ రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు చేరింది. రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 1,529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు 4జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి. తన నెట్వర్క్ విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, జి.మాడుగుల, పెదబయలు, జి.కె.వీధి, డుంబ్రిగూడ వంటి మారుమూల గ్రామాలకు ఇప్పుడు హై–స్పీడ్ 4జి సేవలు అందిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఈ కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా వారి విద్యను కొనసాగించడానికి, ప్రజలు సురక్షితంగా ఉండడానికి సహాయపడుతోంది. -
ఎయిర్టెల్ నుంచి కొత్త డేటా టాప్అప్ ప్లాన్
కొంత కాలంగా స్థబ్ధుగా ఉన్న ఓటీటీలోకి ఈవారం నుంచే కొత్త సినిమాలు సందడి మొదలైంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతీ వారం మూడునాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మూవీస్ చూడాలంటే మొబైల్ డేటాతో చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఎయిర్టెల్ సంస్థ కొత్త డేటా టాప్ అప్ ప్లాన్‌ని అమల్లోకి తెచ్చింది. డేటా ప్యాక్ రూ. 119 ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే రూ. 119 ప్యాక్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఈ టాప్ అప్ ప్యాక్‌తో 15 జీవీ 4జీ డేటా లభిస్తుంది. వినియోగదారులు ప్రస్తుతం ఏ ప్యాకేజీలో ఉన్నారో ఆ ప్యాకేజీ గడువు ముగిసే వరకు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. కాల్స్, వ్యాలిడిటీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే ఈ ప్యాక్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి : డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’ -
5జీ నెట్ వర్క్...ముందు నుయ్యి వెనుక గొయ్యి
మనదేశంలోని టెలికాం కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ టెక్ లవర్స్ సైతం 5జీ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న 4జీ కంటే 5జీ వినియోగం వల్ల టెక్నాలజీతో పాటు అన్నీరంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని టెక్ నిపుణుల చెబుతున్నారు. కానీ 5జీ నిర్మాణం అంతసాధ్యం కాదని, భారీ ఇన్వెస్ట్మెంట్లు పెడితే కానీ లాభాలు చవిచూడలేమన్నది దేశీ టెలికాం మాట. మరోవైపు 5జీ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చైనా టెలికాం గణాంకాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా మిగిలిన దేశాల్లోకంటే చైనా 5జీ వినియోగంలో ముందంజలో ఉంది. తాజాగా బ్లూంబెర్గ్ రిపోర్ట్ ప్రకారం చైనా ప్రభుత్వానికి చెందిన చైనా మొబైల్ లిమిటెడ్ కంపెనీ మొదటి ఆరునెలల్లో 5జీ వినియోగం వల్ల 6శాతం లాభాల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది నికర ఆదాయం జనవరి నుంచి జులై మధ్య కాలంలో 59.1 బిలియన్ డాలర్లకు చేరింది. నిర్వహణ ఆదాయం 13.8శాతానికి పెరిగింది. ఆ కంపెనీ స్టాక్ వ్యాల్యూ 1.53 యువాన్లు ఉండగా ఇప్పుడు 1.63 యూవాన్లకు పెరిగింది. 5జీలో లాభాలు అధికంగా ఉండటంతో ఇటీవల అమెరికా స్టాక్ ఎక్సేంజీలో బహిష్కరణకు గురైన మూడు టెలికాం కంపెనీలు ఇప్పుడు 5జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 5జీలో లాభాలు ఎంతగా ఉన్నాయనేందుకు ఈ పెట్టుబడుల ప్రవహామే ఓ ఉదాహరణ. డ్రాగన్ కంట్రీలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తుంటే భారత్ టెలికాం కంపెనీలు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. అందుకు కారణం 4జీ నెట్ వర్క్ లో భారీగా నష్టాలు రావడమే. ఒక్క జియో మినహాయించి మిగిలిన ఎయిర్టెల్, ఒడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కు నష్టాలు వెంటాడుతున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టెలికాం శాఖ మాత్రం 2022నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5జీ నెట్ వర్క్‌ని అందుబాటులోకి తెస్తామని చెప్పింది. మరో 4,5ఏళ్లు 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి ఉంటుందని కాబట్టి.. ఈలోపే 5జీ స్పెక్టమ్ ను వేలం వేస్తామని స్పష్టం చేసింది. టెలికాం సంస్థలు మాత్రం వేలంలో తామున్నామంటూ హింట్ ఇస్తున్నా..వేలకోట్లలో అప్పులున్న ఐడియా, వొడాఫోన్ లాంటి సంస్థలు 5జీ వల్ల ఏ మేరకు లాభాలు గడిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి : గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
అంతా 5జీ మయం, 2024 కి ఎంత పెరుగుతుందంటే
5జీ..! హ్యూమన్ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మార్చేసుందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరగడం వల్ల 5జీ నెట్ వర్క్ సంస్థలు 2021లో 19.91 బిలియన్ డాలర్లను అర్జించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ డేటాను విడుదల చేసింది. 5జీ నెట్ వర్క్. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ, మొబైల్ నెట్ వర్కింగ్ వ్యవస్థతో పాటు..వర్చవల్ రియాల్టీ, ఓటీటీ,ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది. అయితే దీని వల్ల దేశ భద్రత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నా..టెక్నాలజీతో వాటన్నింటికి చెక్ పెట్టొచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయా సంస్థలు 5జీ టెక్నాలజీని విస్తరించే పనిలోపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్-19 వల్ల యూజర్లు ఆల్ట్రా ఫాస్ట్ బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీకి ఆప్టిమైజ్ అవ్వడంతో పాటు స్ట్రీమింగ్ వీడియోస్, ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా అప్లికేషన్ల వినియోగం పెరిగిందని గ్రాంట్రార్ రీసెర్చ్ సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు.5జీ వైర్లెస్ నెట్ వర్క్ ఇన్ఫ్రాస్టెక్చర్ మార్కెట్ విస్తరించడంతో పాటు..కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)తో 5జీ నెట్ వర్క్‌తో పనిచేసే ఫోన్ల వినియోగం పెరిగిందని వెల్లడించారు. దీంతో 2020 లో 5జీ నెట్ వర్క్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ వినియోగం వల్ల వరల్డ్ వైడ్‌గా 13.7బిలియన్ల రెవెన్యూ రాగా..2021లో 39 శాతం పెరిగి 19.91 బిలియన్ డాలర్లు చేరుకున్నట్లు ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ రిపోర్ట్‌లో పేర్కొంది. టైర్ 1 సిటీస్‌లో 60శాతం వినియోగం గ్రాంటర్ రిపోర్ట్ ప్రకారం.. 2020లో 10 శాతం వినియోగంలో ఉన్న సీపీసీ నెట్ వర్క్ 2024కి 60శాతం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా టైర్ 1 సిటీస్ లో ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఎవెల్యూషన్ (ఎల్టీఈ) కమ్యూనికేషన్ తో వినియోగించే 4జీ నెట్ వర్క్ నుంచి 5జీ నెట్ వర్క్‌కు మార్చుకుంటారని గ్రాంటార్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు. -
జియో సంచలనం: 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో టాప్
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులకు సంబంధించి డౌన్లోడ్ వేగంలో రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగుతోంది. మే గణాంకాల ప్రకారం సెకనుకు సగటున 20.7 మెగాబిట్ (ఎంబీపీఎస్) డౌన్లోడ్ స్పీడ్‌తో కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. అప్లోడ్ స్పీడ్ విభాగంలో వొడాఫోన్ ఐడియా 6.7 ఎంబీపీఎస్ వేగంతో నంబర్ వన్‌గా ఉంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. జియో 4జీ నెట్వర్క్ వేగం స్వల్పంగానే పెరిగినప్పటికీ.. సమీప ప్రత్యర్థి సంస్థ వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ఇంకా మూడు రెట్లు అధికంగానే ఉంది. వొడాఫోన్ ఐడియా సగటు డౌన్లోడ్ స్పీడ్ 6.3 ఎంబీపీఎస్ మాత్రమే. 2018 ఆగస్టులో వొడాఫోన్, ఐడియా విలీనం తర్వాత రెండు సంస్థల గణాంకాలను కలిపి ట్రాయ్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక 4జీ సేవలకు సంబంధించి ఎయిర్టెల్ సగటు డౌన్లోడ్ స్పీడ్ అత్యంత తక్కువగా 4.7 ఎంబీపీఎస్‌గాను, అప్లోడ్ స్పీడ్ 3.6 ఎంబీపీఎస్‌గాను ఉంది. అప్లోడ్ స్పీడ్ విషయంలో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానం లో ఉండగా జియో రెండో స్థానంలో (4.2 ఎంబీపీఎస్), ఎయిర్టెల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలు అందిస్తున్నప్పటికీ ఆ గణాంకాలు ట్రాయ్ డేటాలో వెల్లడి కాలేదు. -
4జీ స్పీడ్‌లో రికార్డు సృష్టించిన జియో..!
న్యూ ఢిల్లీ: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరోసారి సత్తా చాటింది. 4జీ నెట్వర్క్ డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో జియోకు సాటిలేదని మరోసారి రుజువైంది. మే నెలలో డౌన్లోడింగ్ స్పీడ్ విషయంలో ఇతర నెట్వర్క్లకంటే సెకనుకు సరాసరి 20.7 ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో జియో నెట్వర్క్ ముందంజలో ఉంది. కాగా ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్ ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతోపాటుగా వోడాఫోన్ అప్లోడింగ్ స్పీడ్‌లో ముందంజలో నిలిచింది. వోడాఫోన్ సుమారు 6.7 ఎమ్‌బీపీఎస్ అప్లోడింగ్ స్పీడ్‌ను కలిగి ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జూన్ 8 న ప్రచురించిన గణాంకాల ప్రకారం.. వోడాఫోన్-ఐడియా మే నెలలో సగటున 6.3 ఎమ్‌బిపిఎస్ అప్లోడ్ వేగాన్ని కలిగి ఉండగా, దీని తరువాత రిలయన్స్ జియో 4.2 ఎమ్‌బీపీఎస్ వేగంతో, భారతి ఎయిర్టెల్ 3.6 ఎమ్‌బీపీఎస్ అప్లోడింగ్ వేగాన్ని కల్గి ఉన్నట్లు ట్రాయ్ పేర్కొంది. కాగా తాజాగా రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్ స్పీడ్ స్వల్పంగా పెరగ్గా, ఇది వోడాఫోన్-ఐడియాతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ. ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ ఎంచుకున్న ప్రాంతాల్లోనే 4జీ సేవలను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ స్పీడ్‌ను ట్రాయ్ తన నివేదికలో తెలుపకపోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా రియల్ టైమ్ ప్రాతిపదికన నెట్వర్క్ స్పీడ్‌ను మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో ట్రాయ్ లెక్కిస్తుంది. చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే.. -
4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా!
ప్రపంచం దృష్టి రాబోయే 5జీ మీద ఉంటె మనదేశంలో మాత్రం చాలా ప్రాంతాలలో సరిగ్గా 4జీ స్పీడ్ రాక భాదపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్ లో 4జీ డేటా స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. మన మొబైల్ స్పీడ్ అనేది మీరు మొబైల్ టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత మంది వినియోగదారులు 4జీ మొబైల్ టవర్ ను ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే, మీరు మీ ఇంటి లోపల లేదా వెలుపల ఉన్నారా అనే దానిపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా రాత్రి సమయంలో డేటా స్పీడ్ తక్కువగా రావడం గమనించవచ్చు. అయితే, కొన్ని పరిస్థితులలో మన మొబైల్ లో ఉండే నెట్ వర్క్ సిగ్నల్ సెట్టింగ్స్ కారణంగా కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 4జీ వోఎల్టీఈ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి పెరగడం ఒక కారణం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది. మీరు మీ ఫోన్ లో 4జీ వేగాన్ని మెరుగుపరచడానికి కొన్ని పద్ధతులు తెలుసుకుందాం.. మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లి మొబైల్ నెట్వర్కుల ద్వారా "4జీ"ను ఎనేబుల్ చేయండి. మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగుకు వెళ్లి యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయండి కొన్ని అవసరం లేని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి వాటిని ఆన్ ఇంస్టాల్ చేయడం లేదా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆప్షన్ నిలిపి వేయడం ఉత్తమం 4జీ ఇంటర్నెట్ సరిగ్గా రాణి సందర్భంలో ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేయడం మంచిది కొన్ని ప్రత్యేక సందర్భాలలో మీ నెట్వర్క్ సెట్టింగ్స్ ను రీసెట్ చేయడం మంచిది చదవండి: 10 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ భారత్‌లో మూడు నెలల్లో 5జీ సిద్ధం -
మొబైల్ టారిఫ్‌లు పెరగనున్నాయా?
దాదాపు ఐదేళ్ల తర్వాత నిర్వహించిన 2021 స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీలు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ స్పెక్ట్రమ్ వేలంలో జియో అతిపెద్ద బిడ్డర్‌గా అవతరించింది. ఈ వేలంలో విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో మూడింట రెండు వంతుల వాటా కొనుగోలు చేసింది. ఆయా నెట్‌వర్క్‌లు ఎంత మేర స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి? దాని కోసం ఎంత చెల్లించారు? వంటి విషయాలు వినియోగదారుల మొబైల్ టారిప్‌లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. దీని ప్రభావం ప్రీపెయిడ్ కస్టమర్‌కు అందించే ఆఫర్ల మీద కూడా పడనుంది. భారత ప్రభుత్వం మొత్తం రూ.77,800 కోట్ల విలువైన స్పెక్ట్రంను విక్రయించింది. వీటిలో జియో సుమారు రూ.57,100 కోట్లు, ఎయిర్టెల్ రూ.18,700 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,000 కోట్లు విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఈ స్పెక్ట్రమ్ వేలం 4జీ బ్యాండ్ల కోసం నిర్వహించారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ రెండూ సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 800 మెగాహెర్ట్జ్ నుంచి 900 మెగాహెర్ట్జ్ రేంజ్లో స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. అయితే, ఈ స్పెక్ట్రమ్‌ను 5జీ సేవల కోసం కూడా ఉపయోగించుకోనున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు 2జీ, 3జీ నుంచి 4జీకి మారడాన్ని ఈ స్పెక్ట్రం వేలం మరింత వేగవంతం చేస్తుంది. ప్రస్తుతం జియోలో కేవలం 4జీ చందాదారులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 2జీ, 3జీ యూజర్లు 4జీకి మారడం వల్ల ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలకు లాభదాయకమే. ఎందుకంటే, ప్రస్తుతం ఉన్న మూడు నెట్‌వర్క్‌లకు బదులుగా ఒక నెట్‌వర్క్‌ను మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే, 2జీ, 3జీ ప్లాన్లతో పోలిస్తే 4జీ డేటా ప్లాన్లు నాలుగు రెట్లు ఎక్కువ ఖరీదైనవి. అందువల్ల, 4జీకి మారడం వల్ల వినియోగదారుల ఫోన్ బిల్లుల సగటు వినియోగం పెరుగుతాయి. ఇది నెట్వర్క్ కంపెనీలకు మరింత లాభం చేకూర్చనుంది. ఫిచ్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ సోని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 50-55 శాతం మంది ఇంకా 2జీ, 3జీ నెట్‌వర్క్‌లను వాడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జియో, ఎయిర్టెల్ రెండూ కూడా తమ నెట్వర్క్ కవరేజీని మెరుగు పరచడానికి వాటి సామర్థ్యాలను విస్తరించడానికి 2300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. తద్వారా, తమ 4జీ నెట్వర్క్ నాణ్యత, సామర్థ్యాలు మరింత పెరగనున్నాయి. చదవండి: జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి! వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్వర్క్
ఇకపై చందమామపై మొబైల్ ఫోన్ వాడొచ్చు. అది కూడా 4జీ, 5జీ నెట్‌వర్స్‌తో.. నమ్మడానికి కాస్తా అనుమానంగా ఉన్నా ఇదే నిజం. చందమామపై ఏకంగా ఫోన్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చందమామపై 4G సెల్యూలర్ నెట్ వర్క్ అమర్చేందుకు ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నోకియాకు 14.1 మిలియన్ డాలర్ల నిధులను నాసా అందిచనుంది. టిప్పింగ్ పాయింట్ ఎంపికల కింద 370 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. మొదట జాబిల్లిపై 4జీ/ఎల్నెటీఈ నెట్వర్స్ను నోకియా నిర్మిస్తుంది. ఆ తర్వాత దాన్ని 5జీకి విస్తరించనుంది. ఇది అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి దిశగా కొనసాగేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థ చంద్ర ఉపరితల సమాచార మార్పిడికి ఎక్కువ దూరం, పెరిగిన వేగంతో పాటు ప్రస్తుత ప్రమాణాల కంటే ఎక్కువ విశ్వసనీయతను అందించగలదని నాసా తన కాంటాక్ట్ అవార్డు ప్రకటనలో పేర్కొంది. చదవండి: బస్సు సైజు గ్రహ శకలం.. మనకు ప్రమాదమేనా? To the moon! 🌕 We are excited to have been named by @NASA as a key partner to advance “Tipping Point” technologies for the moon, to help pave the way towards sustainable human presence on the lunar surface. So, what technology can you expect to see? (1/6) pic.twitter.com/wDNwloyHdP — Bell Labs (@BellLabs) October 15, 2020 2028 నాటికి చంద్రునిపై స్థావరం ఏర్పాటు చేసుకోవాలన్నది నాసా లక్ష్యమని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్స్టైన్ తెలిపారు. అప్పటికి వ్యోమగాములు చంద్రునిపై నివసించడానికి, పనులు ప్రారంభించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని అన్నారు. తాము చంద్రునిపై ఎక్కువ కాలం ఉండేందుకు విద్యుత్ వ్యవస్థలు, నివాస సామర్థ్యం అవసరమన్నారు. ఇందుకోసం నాసా నోకియా ఆఫ్ అమెరికాతో కాంట్రాక్ట్ కుదిరింది. చంద్రునిపై సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళికలు చేపట్టింది. Our pioneering innovations will be used to build and deploy the first wireless network on the moon, starting with #4G/LTE technologies and evolving to #5G. (2/6) — Bell Labs (@BellLabs) October 15, 2020 నోకియా పరిశోధక విభాగం బెల్ ల్యాబ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్ర రోవర్లు, నావిగేషన్ వైర్లెస్ ఆపరేషన్‌తో పాటు వీడియోను ప్రసారం చేయడానికి నెట్‌వర్క్‌ను తీసుకోస్తోంది. ఈ నెట్వర్క్ కాంపాక్ట్‌ను సమర్థవంతంగా నిర్మించారు. అలాగే అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రత, రేడియేషన్, వాక్యూమ్ పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్‌ను తయారు చేయడానికి సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను వినియోగించుకోవచ్చు. -
చంద్రుడిపై 4జీ, నోకియా-నాసా ప్లాన్
వాషింగ్టన్: జాబిలిపై నివాసం ఏర్పరుచుకోవడానికి కొన్ని దశాబ్ధాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయోగాల ద్వారా చంద్రుపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం మానవ నివాస యోగ్యంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక 2028 నాటికి వ్యోమగాములు చంద్రునిపై కొన్ని పనులు కూడా ప్రారంభించడానికి నాసా ఇప్పటి నుంచే ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా చంద్రునిపై 4జీ సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకోసం నాసా ప్రముఖ మొబైల్ దిగ్గజం నోకియాకు సహాయాన్ని అందిస్తోంది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి నోకియా చేపట్టిన ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్షంలో రాకెట్ ప్రొపెల్లెంట్‌ను తయారు చేయడానికి, దానిని నిర్వహించడానికి ఉపయోపడే సాంకేతికత కోసం దాదాపు 370 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే వీటిలో ఎక్కువ డబ్బును ఈ సాంకేతికను అందించే స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్ వంటి అంతరిక్ష సంస్థలకు నాసా అందిస్తోంది. ఇక అనుకున్నట్లు చంద్రునిపై కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తే అక్కడికి వెళ్లే వ్యోమగాములు మొబైల్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు. చదవండి: అంతరిక్షం నుంచి అధ్యక్షుడికి ఓటు -
5జీ సేవలకు సన్నద్ధం : ముఖేష్ అంబానీ
ముంబై : రిలయన్స్ జియో కేవలం మూడేళ్లలోనే 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించగా, ఇతర టెలికాం కంపెనీలకు 2జీ నెట్వర్క్ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వరల్డ్ సిరీస్ 2020 వర్చువల్ భేటీని ఉద్దేశించి ముఖేష్ మాట్లాడుతూ జియో ప్రస్ధానాన్ని వివరించారు. జియో 4జీ నెట్వర్క్ ద్వారా భారతీయులకు అల్ట్రా హైస్పీడ్ కనెక్టివిటీ, సహేతుకమైన ధరల్లో ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తీరును ముఖేష్ అంబానీ గుర్తుచేశారు. జియోకు ముందు భారత్ 2జీ టెక్నాలజీకే పరిమితమైందని, భారత్ డేటా కష్టాలకు ముగింపు పలకాలని జియో నిర్ణయించుకుని డిజిటల్ విప్లవాన్ని చేపట్టిందని చెప్పారు. దేశమంతటా అత్యధిక వేగంతో పాటు మెరుగైన కవరేజ్‌తో ప్రపంచ శ్రేణి డిజిటల్ నెట్‌వర్క్‌ను సృష్టించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను తాము ప్రవేశపెట్టామని, జియో యూజర్లకు వాయిస్ సేవలను పూర్తి ఉచితంగా అందించామని చెప్పుకొచ్చారు. జియోకు ముందు స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్ ఫోన్లతో సాధ్యంకాక వందకోట్ల భారతీయుల్లో సగానికి పైగా డిజిటల్ ఉద్యమానికి దూరంగా ఉన్నారని అన్నారు. 2016లో టెలికాం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్ధానంలో ఉన్న భారత్ అగ్రస్ధానానికి ఎగబాకిందని తెలిపారు. జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లో చేరుతున్నారని చెప్పారు. భారత్‌లో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్ జీబీకి ఎగబాకిందని, ఇక అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని వివరించారు. దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం జరుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి : రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్.. -
వొడాఫోన్ కొత్త ‘ఐడియా’
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) ‘వీఐ’ బ్రాండ్‌తో వినియోగదారులను ఇక మీదట పలకరించనుంది. టెలికం మార్కెట్లో వాటా పెంచుకునే లక్ష్యంతో, మరింత మంది చందాదారులను ఆకర్షించడం ద్వారా నెట్వర్క్ బలోపేతం లక్ష్యాలతో నూతన బ్రాండ్ వీఐను సోమవారం కంపెనీ ఆవిష్కరించింది. వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ఇకమీదట వీఐగా పిలవనున్నట్టు కంపెనీ ప్రకటించింది. జూన్ చివరికి 28 కోట్ల చందాదారులు వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ పరిధిలో ఉన్నారు. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై పదేళ్ల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు జారీ చేసిన వారం వ్యవధిలోనే వొడాఫోన్ ఐడియా నూతన బ్రాండ్‌తో మార్పు దిశగా అడుగువేసింది. అంతేకాదు, రూ.25,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే. 100 కోట్ల మందికి 4జీ సేవలు ‘‘రెండేళ్ల క్రితం విలీనం ద్వారా వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. అప్పటి నుంచి రెండు అతిపెద్ద నెట్‌వర్క్‌లు, ఉద్యోగులు, ప్రక్రియల ఏకీకరణపై దృష్టి పెట్టాము. భవిష్యత్తుపై దృష్టితో కస్టమర్ల కోసం రూపొందించిన బ్రాండ్ వీఐ. రెండు బ్రాండ్ల ఏకీకరణతో ప్రపంచంలోనే అతిపెద్ద టెలికం విలీనం పూర్తయింది. అంతేకాదు 4జీ నెట్‌వర్క్‌పై 100 కోట్ల భారతీయులకు బలమైన డిజిటల్ సేవలు అందించేందుకు, భవిష్యత్తు ప్రయాణానికి వీలుగా కంపెనీ సిద్ధమైంది’’అంటూ వీఐ బ్రాండ్‌ను వర్చువల్‌గా ఆవిష్కరించిన సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ పేర్కొన్నారు. చార్జీలు పెంచాల్సిందే.. గత కాలపు బకాయిల చెల్లింపులకు టెలికం కంపెనీలకు సుప్రీంకోర్టు పదేళ్ల గడువు ఇవ్వడాన్ని సానుకూల పరిణామంగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. పరిశ్రమ మనుగడ సాగించాలంటే మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదనపు టారిఫ్‌లు (చార్జీలు) చెల్లించేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని, గతంలో చెల్లించిన మాదిరే (జియో రాక పూర్వం) ఉండొచ్చని టక్కర్ పేర్కొన్నారు. తొలుత రూ.200కు, అనంతరం రూ.300కు టారిఫ్‌లు పెరగడం తప్పనిసరి అన్నారు. చార్జీలు పెంచేందుకు తాము సంకోచించడం లేదని.. ఇదే సరైన తరుణమని భావిస్తే ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్మిట్టల్ సైతం ఇదే విధమైన ప్రకటనను ఇటీవలే చేసిన విషయం గమనార్హం. ఏజీఆర్, ఇతర బకాయిల రూపంలో వొడాఫోన్ ఐడియా టెలికం శాఖకు రూ.58,000 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి రూ.7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసింది. పదేళ్ల గడువు ఇవ్వడంతో కంపెనీకి పెద్ద ఉపశమనే లభించినట్టయింది. తాము ఇప్పటికే 10 శాతం చెల్లించేశామని, కనుక తదుపరి చెల్లింపులు 2020 మార్చిలోనే చేయాల్సి ఉంటుందని టక్కర్ స్పష్టం చేశారు. మొత్తానికి కోర్టు తీర్పు పట్ల తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. రూ.25వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు నిర్ణయం తీసుకోగా.. ఇండస్‌టవర్స్‌లో తనకున్న వాటాను విక్రయించే ప్రణాళికతో ఉంది. ఫైబర్, డేటా సెంటర్ల ఆస్తుల విక్రయంతోనూ నిధులు సమీకరించాలనుకుంటోంది. తదుపరి నిధుల సమీకరణలో ప్రమోటర్ సంస్థ వొడాఫోన్ గ్రూపు కూడా పాల్గొనే ఉద్దేశ్యం ఉందా..? అన్న ప్రశ్నకు.. దీనిపై వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టక్కర్ స్పష్టం చేశారు. రుణ పరిమితి రూ. లక్ష కోట్లకు..? రుణాల పరిమితిని రూ.లక్ష కోట్లకు పెంచుకునేందుకు ఈ నెల 30న జరిగే సమావేశంలో వాటాదారుల ఆమోదం కోరనున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. వాస్తవానికి రూ.25,000 కోట్ల రుణ సమీకరణ పరిమితికి 2014 సెప్టెంబర్‌లో అప్పటి ఐడియా సెల్యులర్ వాటాదారులు ఆమోదం తెలిపారు. అనంతరం ఐడియా సెల్యులర్, వొడాఫోన్ ఐడియాతో వీలీనమైన విషయం తెలిసిందే. ఇండస్టవర్స్తో పదేళ్ల మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్‌కు సైతం వాటాదారుల ఆమోదం కోరనుంది. డిజిటల్ ఎకానమీకి తోడ్పాటు... దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లో 120 కోట్ల భారతీయులు వాయిస్, డేటా సేవలను ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్‌లకు పొందుతున్నారు. ‘వీఐ’ బ్రాండ్‌తో భారత్‌ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయ్యేందుకు కట్టుబడి ఉన్నాము. – వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమారమంగళం బిర్లా రెండు నెట్‌వర్క్‌ల ఏకీకరణ పూర్తయింది. నూతన ప్రయాణం ఆరంభానికి సమయం వచ్చింది. – వొడాఫోన్ గ్రూపు సీఈవో నిక్‌రీడ్ -
చైనాకు షాకివ్వనున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తత, నెట్వర్క్ సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు షాకివ్వనుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్ఎన్ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనుంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్లో 'హిందీచీనిబైబై', 'భారత్ వెర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. -
నెలకు 11 జీబీ డేటా!!
న్యూఢిల్లీ: చౌక డేటా ప్లాన్లు, అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, వీడియో సేవలు, 4జీ నెట్వర్క్ విస్తరించడం తదితర అంశాల ఊతంతో దేశీయంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నెలకు సగటున 11 జీబీ స్థాయిలో వినియోగం ఉంటోంది. టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా రూపొందించిన వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 4జీ ఊతంతో 2019లో డేటా ట్రాఫిక్ 47 శాతం పెరిగింది. 3జీ డేటా ట్రాఫిక్ 30 శాతం క్షీణించింది. మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 96 శాతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా జీబీకి రూ. 7 స్థాయిలో భారత్‌లో డేటా చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో అరగంట నిడివి వీడియో చూసేందుకు లేదా 200 పాటలను వినేందుకు సుమారు ఒక జీబీ డేటా సరిపోతుంది. కంటెంట్ నాణ్యతను బట్టి డేటా వినియోగం పెరుగుతుంది. సంపన్న దేశాల స్థాయిలో దేశీయంగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు విస్తరించే దాకా మొబైల్ డేటా వినియోగం పెరుగుతూనే ఉండవచ్చని నోకియా ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే డేటా వినియోగం అత్యధికంగా ఉంటోంది. ఈ విషయంలో చైనా, అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్‌ల కన్నా ముందు ఉంది. ► 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 59.8 కోట్లు కాగా, 3జీ యూజర్ల సంఖ్య 4.4 కోట్లు. ► నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో తదితర ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫాంల ఊతంతో దేశీ యం గా వీడియోల వినియోగం భారీగా పెరిగింది. ► ఓటీటీ ప్లాట్‌ఫాంలపై యూజర్లు రోజుకు సగటున 70 నిమిషాలు వెచ్చిస్తున్నారు. ఒక్కో సెషను సగటున సుమారు 40 నిమిషాలు ఉంటోంది. ► 2019లో 4జీ హ్యాండ్సెట్స్ సంఖ్య 50.1 కోట్లకు చేరినట్లు అంచనా. అంతక్రితం ఏడాది ఇది 33 కోట్లు. వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఆధారిత స్మార్ట్ఫోన్ల సంఖ్య 43.2 కోట్లకు చేరింది. -
రివర్స్ మళ్లీ అదుర్స్
-
ఎయిర్టెల్ కాదు.. జియోనే టాప్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగంలో మరోసారి తనస్థానాన్ని నిలబెట్టుకుంది.భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 సెప్టెంబర్‌లో సెకనుకు 21 మెగాబైట్ల సగటు డేటా డౌన్లోడ్ వేగాన్ని నమోదు చేసింది. భారతి ఎయిర్టెల్ నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 8.3 ఎంబీపీఎస్‌ను నమోదు చేసింది. వొడాఫోన్ 6.9 ఎంబీపీఎస్, ఐడియా సెల్యులార్ 6.4 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగాన్నినమోదు చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. వొడాఫోన్, ఐడియాలు విలీనమైనప్పటికీ నెట్‌వర్క్‌ల విషయంలో వేర్వేరుగానే ఉండటంతో వాటి వేగాలను కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తోంది ట్రాయ్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ 3జీ మాత్రమే కలిగి ఉంది. అప్లోడ్ విషయానికి వస్తే 5.4 ఎంబీపీఎస్‌తో ఐడియా, 5.2 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ కంపెనీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. 4.2 ఎంబీపీఎస్‌తో జియో మూడో స్థానంలో ఉండగా, 3.1 ఎంబీపీఎస్‌తో ఎయిర్టెల్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇది ఇలా వుంటే ప్రైవేట్ మొబైల్ డేటా అనలిటిక్స్ సంస్థ 'ఓపెన్ సిగ్నల్' లెక్కలప్రకారం ఎయిర్టెల్ డౌన్ లోడ్ వేగంలో టాప్‌లో ఉంది. టెలికాం కంపెనీల ఇంటర్నెట్ వేగ గణన సర్వే వివరాలను నిన్న(అక్టోబర్ 22, మంగళవారం) వెల్లడించింది. 2019 జూన్-ఆగస్టు కాలానికి ఎయిర్టెల్ కంపెనీయే అత్యధిక స్పీడ్‌ను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే ట్రాయ్ సర్వేలో మాత్రం జియోనే మళ్లీ మొదటి స్థానంలో రావడం గమనార్హం. మై స్పీడ్ అప్లికేషన్ ఆధారంగా ట్రాయ్ ఇంటర్నెట్ సరాసరి వేగాల్ని గణించే విషయం తెలిసిందే. -
జియో దూకుడు: మళ్లీ టాప్‌లో
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్జియో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. 4జీ డౌన్లోడ్ స్పీడ్ చార్టులో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో వోడాఫోన్ అగ్రభాగాన నిలిచింది. ఆగస్టు మాసానికి సంబంధించిన గణాంకాలను టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ తాజాగా విడుదల చేసింది. ఆగస్టు నెలలో 21.3 ఎంబీపీఎస్ సగటు డౌన్లోడ్ వేగంతో టాప్ లోఉంది జియో. జూలైలో 21.0 ఎంబీపీఎస్‌తో పోలిస్తే మరికొంచెం మెరుగుపడింది. మొత్తం 12 నెలల్లో అత్యధిక సగటు డౌన్లోడ్ వేగంతో రిలయన్స్ జియో 2018లో అత్యంత వేగవంతమైన 4 జీ ఆపరేటర్‌గా నిలిచింది. కాగా ఈ ఏడాది మళ్ళీ మొత్తం 8 నెలల్లో జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రచురించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ పనితీరు ఏమాత్రం మెరుగుపడలేదు. జూలైలో 8.8 ఎంబీపీఎస్ నుండి ఆగస్టులో 8.2 ఎంబీపీఎస్ పడిపోయింది. వోడాఫోన్, ఐడియా సెల్యులార్ తమ వ్యాపారాలను విలీనం అనంతరం వోడాఫోన్ ఐడియాగా పనిచేస్తున్నప్పటికీ, ట్రాయ్ వారి నెట్వర్క్ పనితీరును విడి, విడిగానే ప్రచురించింది. వోడాఫోన్ నెట్‌వర్క్‌లో సగటు 4జి డౌన్లోడ్ వేగం ఆగస్టులో 7.7 ఎంబీపీఎస్ వద్ద ఉండగా, ఐడియా జూలైలో సగటు డౌన్లోడ్ వేగం 6.6 ఎంబీపీఎస్ నుండి 6.1 ఎంబీపీఎస్‌కు తగ్గింది. వోడాఫోన్ ఆగస్టులో 4జీ అప్లోడ్ వేగం సగటు 5.5 ఎంబీపీఎస్ సాధించగా, జూలై నెలలో 5.8 ఎంబీపీఎస్నుంచి క్షీణించింది. ఐడియా, ఎయిర్టెల్ నెట్వర్క్ ఆగస్టులో సగటున 4 జి అప్లోడ్ వేగంలో వరుసగా 5.1, 3.1 ఎంబీపీఎస్ వద్ద స్వల్ప క్షీణతను నమోదు చేయగా, జియో 4.4 ఎంబీపీఎస్ సగటు అప్లోడ్ మెరుగుపడటం విశేషం. -
తొలి దేశీయ 4జీ సెమీకండక్టర్ చిప్
న్యూఢిల్లీ: 4జీ, ఎల్టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి అనువైన సెమీకండక్టర్ చిప్స్‌ను తొలిసారి దేశీయంగా రూపొందించినట్లు బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ వెల్లడించింది. ఇందులో నాలుగు చిప్‌ల శ్రేణిని బుధవారం ఆవిష్కరించింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు. తొలి దేశీ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పనపై సిగ్నల్‌చిప్ సంస్థను టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ అభినందించారు. మరోవైపు, భద్రతాప్రమాణాలకు సంబంధించి అంతర్జాతీయంగా చైనా టెలికం పరికరాల తయారీ సంస్థలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింతగా అధ్యయనం చేయనున్నట్లు అరుణ చెప్పారు. ‘చాలా దేశాలు చైనా సంస్థల టెలికం పరికరాల విషయంలో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి భారత్ కూడా దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది‘ అని చిప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా కంపెనీలు.. ముఖ్యంగా హువావే సంస్థ తయారు చేసే టెలికం పరికరాలను ఉపయోగించరాదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అరుణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, హువావేకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. జర్మనీ తదితర దేశాలు మాత్రం ఆ సంస్థ పరికరాల వినియోగం కొనసాగించే యోచనలో ఉన్నాయి. -
4జీ స్పీడ్‌లో జియో టాప్
న్యూఢిల్లీ: 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జనవరిలో కూడా అత్యధిక డౌన్లోడ్ స్పీడ్‌తో జియో అగ్రస్థానంలో నిల్చింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జియో 4జీ నెట్వర్క్ సగటు డౌన్లోడ్ స్పీడ్ సెకనుకు 18.8 మెగాబిట్స్ (ఎంబీపీఎస్)గా నమోదైంది. ఎయిర్టెల్ నెట్వర్క్ స్పీడ్ 9.5 ఎంబీపీఎస్ కాగా, వొడాఫోన్ 6.7 ఎంబీపీఎస్, ఐడియా 5.5 ఎంబీపీఎస్‌గా ఉంది. వొడాఫోన్, ఐడియా తమ మొబైల్ వ్యాపారాన్ని విలీనం చేసినప్పటికీ.. అనుసంధాన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున రెండింటి స్పీడ్‌ను వేర్వేరుగా లెక్కించినట్లు ట్రాయ్ పేర్కొంది. పోటీ సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 2జీ, 3జీ, 4జీ సేవలు కూడా అందిస్తుండగా.. జియో మాత్రం 4జీ సర్వీసులు మాత్రమే అందిస్తోంది. మరోవైపు, 4జీ అప్లోడ్ స్పీడ్‌లో సగటున 5.8 ఎంబీపీఎస్ సామర్ధ్యంతో ఐడియా అగ్రస్థానంలో ఉంది. 5.4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వొడాఫోన్ రెండో స్థానంలో, 4.4 ఎంబీపీఎస్‌తో జియో.. 3.8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఎయిర్టెల్ వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిల్చాయి. Jio tops 4G download speed chart in January, Idea fastest in upload speed: Trai -
టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న జియో, ఐడియా
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకుపోతోంది. 4జీ సర్వీస్ డౌన్లోడ్ స్పీడ్‌లో మరోసారి టాప్‌లో నిలిచింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నవంబర్ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌తో పోలిస్తే4జీ వేగంకొంచెం తగ్గినప్పటికీ 20.3 సెకునుకు ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో టాప్ ఉంది. అక్టోబర్‌లో ఇది 22.3 గా ఉంది. యూజర్లకు 4జీ సర్వీసు అందించడంలో మిగతా నెట్‌వర్క్‌ల కంటే జియో ముందుంది. ట్రాయ్ అందించిన లెక్కల ప్రకారం నవంబరులో డౌన్లోడ్ స్పీడ్‌లో జియోదే పైచేయి. అప్లోడ్ స్పీడ్‌లో ఐడియా సెల్యులార్ టాప్‌లో నిలిచింది. మరోవైపు సమీప ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ ఈ నెలలో కొంచెం మెరుగుపడింది. ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్ నమోదైంది. గత నెలలో ఇది 9.5గా ఉంది. వొడాఫోన్ డౌన్లోడ్ స్పీడ్ కూడా స్వల్పంగా మెరుగుపడింది. అక్టోబర్ 6.7 ఎంబీపీఎస్గాఉండగా.. ప్రస్తుత నెలలో 6.8స్థాయికి పెరిగింది. ఐడియా సెల్యులార్ 4జీ డౌన్లోడ్ స్పీడ్ 6.4 నుంచి 6.2 కి పడిపోయింది. అయితే అప్లోడ్ స్పీడ్‌లో (5.9ఎంబీపీఎస్) తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది ఐడియా. సెకండ్ ప్లేస్‌లో వోడాఫోన్ (4.9)నిలవగా, జియో (4.5) మూడవస్థానంతో సరి పెట్టుకుంది. అయితే ఇక్కడ కూడా ఎయిర్టెల్ స్వల్పంగా పుంజుకుంది. అయితే యూజర్ల విషయంలో డౌన్లోడ్ స్పీడే చాలా ముఖ్యం. వీడియోలు చూడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, యాప్స్ ఆపరేట్ చేయడంలో డౌన్లోడ్ స్పీడ్ ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయాలనుకుంటే మాత్రం అప్లోడ్ స్పీడ్ చూస్తారు. మైస్పీడ్ అప్లికేషన్లో రియల్ టైమ్ ఆధారంగా సగటు స్పీడ్ తెలుసుకోవచ్చు. -
4జీలో కోల్‌కతా టాప్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో 4జీ విస్తరణ వేగంగా చోటుచేసుకుంటున్న క్రమంలో 4జీ అందుబాటు స్కోరులో 90 శాతం పైగా సాధించి కోల్‌కతా అగ్రశ్రేణి నగరంగా నిలిచింది. దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలో కోల్‌కతా మొదటి స్ధానంలో ఉందని లండన్‌కు చెందిన వైర్లెస్ కవరేజ్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్‌సిగ్నల్ వెల్లడించింది. ఇక పంజాబ్ (89.8 శాతం) బిహార్ (89.2), మధ్యప్రదేశ్ (89.1), ఒడిషా (89 శాతం)సర్కిల్లు తరువాతి స్ధానాల్లో ఉన్నాయని పేర్కొంది. 2012 నుంచి భారత్‌లో 4జీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కేవలం ఆరేళ్లలో దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీ శీఘ్రగతిన వృద్ధి చెందిందని తెలిపింది. 4జీ అందుబాటులో ఉన్న నగరాల్లో తూర్పు, ఉత్తరాది సర్కిళ్లు అగ్రభాగాన ఉన్నాయని ఓపెన్‌సిగ్నల్ వెల్లడించింది. ఇక భారత్‌లోని 20 అతిపెద్ద నగరాల్లో 4జీ అందుబాటులో ముంబై 15వ ర్యాంక్‌లో నిలవగా, ఢిల్లీ 17వ ర్యాంక్‌లో ఉందని తెలిపింది. భారత్ మరోవిడత స్పెక్ర్టమ్ వేలంకు సిద్ధమవుతున్న తరుణంలో 4జీ అందుబాటు స్కోర్లు మరింత పెరుగుతాయని అంచనా వేసింది. జియో రాకతో భారత్‌లో 4జీ ఊపందుకుందని, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 కోట్ల మందికి జియో 4జీ సబ్‌స్ర్కిప్షన్లు అందించిందని మార్కెట్ పరిశోధన సంస్ధ సైబర్‌మీడియా రీసెర్చ్ అంచనా వేసింది. -
4జీ నెట్‌వర్క్‌లకు ట్రాయ్ కొత్త ప్రమాణాలు
న్యూఢిల్లీ: టెలికం వినియోగదారులు 4జీ టెక్నాలజీపై కాల్స్ విషయంలో సమస్యలను ఎదుర్కొంటుండడంతో ట్రాయ్ కళ్లు తెరిచింది. 4జీ కాల్స్‌లో వాయిస్ వినపడకుండా ఆగిపోతుండడంతో నాణ్యతను గుర్తించేందుకు నూతన ప్రమాణాలను నిర్దేశిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2జీ, 3జీ టెక్నాలజీలకు భిన్నంగా 4జీ నెట్‌వర్క్‌లో కాల్స్ అన్నవి డేటా ఆధారంగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) టెక్నాలజీ ఆధారంగా దీన్ని రూపొందించారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లో కాల్స్ అన్నవి ఆటోమేటిక్‌గా కట్ అయిపోవడం కస్టమర్లకు అనుభవమే. నిబంధనల ప్రకారం వీటిని కాల్డ్రాప్గా పరిగణిస్తారు. కానీ, 4జీ నెట్‌వర్క్‌లో డేటా సిగ్నల్స్ లేకపోతే కాల్ మధ్యలో వాయిస్ వినిపించకుండా పోతుంది కానీ కాల్ కట్ అవ్వదు. అవతలి వారి మాటలు వినిపించకపోవడంతో కస్టమర్లే స్వయంగా కాల్‌ను ముగించేస్తుంటారు. దీంతో 2జీ, 3జీ నెట్వర్క్ నిబంధనల మేరకు ఇలా మాటలు వినిపించకుండా పోవడాన్ని కాల్ డ్రాప్‌గా పరిగణించడానికి లేదు. దీంతో డేటా ప్యాకెట్ ఆధారంగానే కాల్స్ నాణ్యతను పరిగణించే నిబంధనలను ట్రాయ్ తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ‘‘భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రెండు నూతన నెట్వర్క్ ప్రమాణాలు.. డౌన్‌లింక్ ప్యాకెట్ డ్రాప్ రేట్ (డీఎల్–పీడీఆర్), అప్‌లింక్ ప్యాకెట్ డ్రాప్ రేట్ (యూఎల్–పీడీఆర్) ను ప్రవేశపెడుతున్నాం. దీని ద్వారా మొత్తం మీద డేటా ప్యాకెట్ డ్రాప్‌ను కొలవ -
4జీ ల్యాప్‌టాప్ వస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 4జీ ఫోన్లే కాదు. ల్యాప్‌టాప్‌లూ వస్తున్నాయ్. కాకపోతే వీటిని తెస్తున్నది మాత్రం హైదరాబాదీ స్టార్టప్ ఆర్డీపీ. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్కూ పరిచయం చేస్తున్న తమ ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతం పూర్తయిందని.. 4జీతో పాటూ 24 గంటల బ్యాటరీ బ్యాకప్, ధర కూడా రూ.15 వేల లోపే ఉంటుందని చెప్పారు ఆర్డీపీ ఫౌండర్ అండ్ సీఈఓ విక్రమ్ రెడ్లపల్లి. ఈ ఏడాది ఏకంగా 10 మోడళ్లను విడుదల చేస్తామన్నారు. డిగ్రీ పూర్తయ్యాక అనంతపురంలో చిన్న కంప్యూటర్ సర్వీస్ సెంటర్లో పనిచేసిన విక్రమ్.. అక్కడే ఏకంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌ను తయారు చేసే కేంద్రమే పెట్టేశాడు. ఆర్డీపీ భవిష్యత్తు ప్రణాళికలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది అనంతపురంలోని కదిరి. ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చేశా. అక్కడే కంప్యూటర్ సర్వీసెంగ్ సెంటర్‌తో పాటు తొలి సైబర్ కేఫ్ ప్రారంభించా. 2004లోనే స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వాలని ప్రయత్నించా. కానీ, బ్యాండ్‌విడ్త్, శాటిలైట్ సమస్యలతో అది సక్సెస్ కాలేదు. 2008లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు థిన్ క్లింట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా. నాలుగేళ్ల ఈ డిస్ట్రిబ్యూషన్లో వ్యాపారం, నెట్వర్కింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఏంటనేది నేర్చుకున్నా. అదే సమయంలో చైనాలో ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో జరిగింది. విమానం ఎక్కాలనే కోరిక కూడా తీరుతుందని నేరుగా ఎక్స్‌పోకు వెళ్లా. స్థానికంగా ఒకటిరెండు టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సైబర్ సొల్యూషన్ బ్రాండ్ పేరిట వంద కంప్యూటర్లు తయారు చేయించుకొని ఇక్కడ విక్రయించడం మొదలుపెట్టా. అక్కడి నుంచి సొంతంగా బ్రాండ్ ఉండాలని నిర్ణయించుకొని 2012లో ఆర్డీపీ పేరిట సొంత కంపెనీ ప్రారంభించా. టెక్నాలజీ తెలిసిన ఎవరికైనా సరే థిన్‌క్లింట్ అంటే రిమోట్ డెస్క్‌టాప్ ప్రొటోకాల్ (ఆర్డీపీ) అనే. కానీ, సొంతగా కంపెనీ పెట్టాక కూడా ఆర్డీపీ అనే ఉంచడానికి కారణం.. అది మా ఇంటి పేరు కూడా కావటమే. థిన్‌క్లింట్ లోగో కూడా మార్చి.. ఆర్డీపీ అంటే రెడ్లపల్లిగా మార్చేశా. ఇప్పటివరకు ఆర్డీపీలో రూ.15 కోట్ల పెట్టుబడి పెట్టా. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్.. ప్రస్తుతం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్, థిన్క్లింట్స్ మూడు విభాగాల్లో 16 మోడల్స్ ఉన్నాయి. ధరలు రూ.3,500 నుంచి రూ.45 వేల వరకూ ఉన్నాయి. ఎంటర్ప్రైజ్, రిటైల్, ఈ–కామర్స్ మూడు మాధ్యమాల్లో ఆర్డీపీ విక్రయాలుంటాయి. ఎంటర్ప్రైజ్లో కార్వీ, కేర్ ఆసుపత్రి, సేఫ్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రాబ్యాంక్, ఎయిర్ ఇండియా వంటి 3 వేలకు పైగా కంపెనీలు మా కస్టమర్లు. రిటైల్‌లో 26 ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్లున్నాయి. సొంత వెబ్‌సైట్‌తో పాటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే వంటి ఈ–కామర్స్ సంస్థల్లోనూ మా ఉత్పత్తులను కొనొచ్చు. తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం.. గత ఆర్ధిక సంవత్సరంలో 62 వేల ఉపకరణాలను విక్రయించాం. ఈ ఏడాది లక్షకు చేరాలని లకి‡్ష్యంచాం. ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా విక్రయాల్లో ల్యాప్‌టాప్ వాటా 40 శాతం. మా అమ్మకాల్లో డిస్ట్రిబ్యూషన్ల వాటా 30 శాతం, ఆన్లైన్ వాటా 15 శాతం వరకూ ఉంది. మన దేశంతో పాటూ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ విక్రయాలున్నాయి. మా వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం. ఎగుమతుల వాటా 5 శాతం. ఈ ఏడాది ముగిసేసరికి ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ల సంఖ్యను 100కు చేర్చాలని లకి‡్ష్యంచాం. అనంతపురంలో తయారీ కేంద్రం.. ఈ ఏడాది రూ.4 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఆయా ఉత్పత్తుల తయారీకి అవసరమైన విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. అనంతపురంలో 7 వేల చదరపు అడుగుల్లో తయారీ కేంద్రం ఉంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 65–70 వేలు. ప్రభుత్వం రాయితీలిస్తే విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో నెలకు 50 వేల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఐఓటీ, ఏఐ ఆధారిత ఉపకరణాల అభివృద్ధిపై దృష్టిసారించాం. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు, విద్యా సంస్థలు, ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.30 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం సంస్థలో 94 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది ఇంజనీర్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని చేరాం. ఈ ఏడాది రూ.80 కోట్లు లకి‡్ష్యంచాం. 2020 నాటికి రూ.150 కోట్లు చేరుకోవాలనేది లక్ష్యం. 2019 నాటికి రూ.100 కోట్ల వాల్యుయేషన్‌తో 6 శాతం వాటాను విక్రయించేందుకు బ్రాండ్ క్యాపిటల్‌తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాదిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. -
4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో ఎయిర్టెల్ టాప్!
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తాజాగా 4జీ డౌన్లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తన నెట్‌వర్క్‌లో 4జీ డౌన్లోడ్ స్పీడ్ 9.31 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. రీసెర్చ్ సంస్థ ఓపెన్ సిగ్నల్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్యకాలంలో పరీక్షలు నిర్వహించింది. వీటి ప్రకారం.. ఎయిర్టెల్ తర్వాతి స్థానంలో ఐడియా, వొడాఫోన్ ఉన్నాయి. వీటి డౌన్లోడ్ స్పీడ్ వరుసగా 7.27 ఎంబీపీఎస్‌గా, 6.98 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇక రిలయన్స్ జియో డౌన్లోడ్ స్పీడ్ 5.13 ఎంబీపీఎస్‌గా రికార్డ్ అయ్యింది. అయితే 4జీ నెట్వర్క్ కవరేజ్ పరంగా చూస్తే జియో టాప్‌లో ఉంది.