ఐడియా ఆఫర్: 10జీబీ ఫ్రీ 4జీ డేటా.. | Idea offers 10 GB free data to mark pan-India 4G rollout | Sakshi
Sakshi News home page

ఐడియా ఆఫర్: 10జీబీ ఫ్రీ 4జీ డేటా..

Published Fri, May 26 2017 6:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

ఐడియా ఆఫర్: 10జీబీ ఫ్రీ 4జీ డేటా..

ఐడియా ఆఫర్: 10జీబీ ఫ్రీ 4జీ డేటా..

టెలికాం దిగ్గజం ఐడియా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కొత్త, పాత కస్టమర్లకు 10జీబీ ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ప్యాన్-ఇండియా బేసిస్ లో 4జీ సేవలను ప్రారంభిస్తున్న క్రమంలో తన కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది. మూడు నెలల కాలంలో ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చట. ముంబై సర్కిల్ లో ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్ 4జీ సర్వీసులను ప్రారంభించింది.  తన 20 సర్కిళ్లలో ఈ సేవలందించడం కోసం 4జీ స్పెక్ట్రమ్ ను ఐడియా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 34ఎంబీపీఎస్ స్పీడుతో ఈ సేవలను కస్టమర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మైలురాయిని సాధించిన క్రమంలో ఐడియా 'ఇన్విటేషన్ ఆఫర్' ను తన కొత్త, పాత సబ్ స్క్రైబర్లకు పొడిగిస్తోందని కంపెనీ తెలిపింది. 
 
ఈ పొడిగింపుతో 10జీబీ ఉచిత 4జీ డేటా మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 2017 మే 25, 2017 ఆగస్టు 22 మధ్యలో ఐడియా కొత్త 4జీ కొనుగోలు చేసిన లేదా అప్ గ్రేడ్ అయిన కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఐడియా సబ్ స్క్రైబర్లు 4జీలోకి అప్ గ్రేడ్ అయితే అదనంగా మరో 4జీబీ 4జీ డేటాను 14 రోజుల పాటు అందించనుందని పేర్కొంది. ఈ సర్వీసులు కూడా కేవలం ముంబైలోని ఐడియా సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ముంబైలో ఈ కంపెనీకి 4.4 మిలియన్ ప్రస్తుత కస్టమర్లతో 10.2 శాతం రెవెన్యూ మార్కెట్ షేరు కలిగి ఉంది. ముంబై సర్కిల్ లో కొత్త ప్రీపెయిడ్ సబ్ స్క్రైబర్లకు రూ.395 రీఛార్జ్ తో ఇన్వెటేషన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ తో అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం, 1జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఇవే ప్రయోజనాలను రూ.192తోనూ 28 రోజుల పాటు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement