free data
-
బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..! ఉచితంగా 5జీబీ డేటా..! ఎన్ని రోజులంటే..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. కొద్ది రోజుల క్రితం జియో పోటీగా బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2399 ఏకంగా 90 రోజుల అదనపు వ్యాలిడిటీని అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఇతర నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే యూజర్ల కోసం క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. స్విచ్ టూ బీఎస్ఎన్ఎల్...! యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకుగాను బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్‌ను ముందుకొచ్చింది. #switchtoBSNL అనే ప్రచారాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్కు మారే కొత్త యూజర్లకు 5జీబీ హైస్పీడ్ డేటాను 30 రోజుల పాటు ఉచితంగా అందించనుంది. ఆయా యూజరు ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ ఐనా వారికే మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ అన్ని సర్కిళ్లలో జనవరి 15 వరకు అందుబాటులో ఉండనుంది. షరుతులు వర్తిస్తాయి..! బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ ఆఫర్‌ను సొంతం చేసేకునే కొత్త కస్టమర్లకు పలు షరతులను పెట్టింది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి రావాలనుకునే సదరు యూజరు ఫేస్బుక్, ట్విటర్ ప్లాట్‌ఫామ్స్‌లో #switchtoBSNL ప్రచారాన్ని షేర్ చేయాలి. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ అధికారిక ఫేస్బుక్ పేజీ (@bsnlcorporate), ట్విట్టర్ హ్యాండిల్ (@BSNLcorporate) ఫాలో చేయాల్సి ఉంటుంది. ఆయా యూజర్ బీఎస్ఎన్ఎల్కు ఎందుకుమారుతున్నారో కూడా సోషల్‌మీడియా హ్యండిల్స్లో తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పోర్ట్ కానున్న నంబర్‌నుంచి 9457086024 నంబర్‌కు స్క్రీన్షాట్లను పంపాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించి ఆయా యూజర్లకు 30 రోజుల పాటు 5జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను బీఎస్ఎన్ఎల్ అందజేస్తుంది. A great reason to #SwitchToBSNL!#BSNL #NewYear #Offers T&C: https://t.co/4YNfqFRgLU pic.twitter.com/voDknZFvI2 — BSNL India (@BSNLCorporate) January 4, 2022 చదవండి: BSNL: జియోకు పోటీగా...బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్..! -
Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్ ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 విపత్తు వేళ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. తక్కువ ఆదాయమున్న 6 కోట్ల మంది కస్టమర్లకు రూ.49 రీచార్జ్ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా ఇవ్వనుంది. 28 రోజుల కాలపరిమితి గల ఈ ప్యాక్ కింద రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా అందుకోవచ్చు. ఇక ఈ ప్రయోజనాల విలువ రూ.294 కోట్లు అని కంపెనీ వెల్లడించింది. అలాగే రూ.79 రీచార్జ్ ప్యాక్‌పై రూ.128 టాక్‌టైం, 200 ఎంబీ డేటా ఆఫర్ చేస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా తెలిపింది. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న జియో -
చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఆకట్టుకునేందుకు, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా కొత్త మార్గాలతో వస్తోంది. తాజాగా లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర చిరుతిండి ప్యాకెట్లు కొంటే ఉచితంగా డేటాను అందిస్తోంది. 10 రూపాయల ప్యాకెట్‌తో 1 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ డోరిటో ఇతర తినదగిన వస్తువుల ప్యాకెట్ కొనుగోలు చేసిన ప్రతిసారీ వారికి ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఈ ఉచిత ఇంటర్నెట్ డేటాను పొందాలంటే ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్ కోసం వెతకాలి. ఆతరువాత ఈ కోడ్‌ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసి,ఆపై మైకూపన్‌ల విభాగంలో నమోదు చేయాలి. అంటే ఎయిర్టెల్ వినియోగదారులు చిప్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్యాకెట్ తో పాటు కూపన్‌ను తీసుకోవడం మర్చిపోకూడదు. 10 రూపాయల విలువైన చిప్స్ కొనుగోలు చేస్తే, ఒక జీబీ ఉచితం. అదే 20 రూపాయలు కొనుగోలు చేస్తే, 2 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అయితే రీడీమ్ చేసిన తేదీ నుండి మూడు రోజులు మాత్రమే ఈ ఉచిత డేటా చెల్లుతుంది. వినియోగదారులకు ఉత్తమ నెట్వర్క్ అనుభవాన్ని అందించేందుకు పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పోకడలను సరిపోలే కొత్త వ్యూహాలను తాము అభివృద్ధి చేస్తామనీ, ఇందులో భాగంగానే ఎయిర్టెల్ తో భాగస్వామ్యం అని పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్ కేటగిరీ హెడ్ ఫుడ్స్ దిలేన్ గాంధీ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ కంటెంట్ చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేస్తారన్నారు. -
నెలకు 15 జీబీ డేటా ఫ్రీ; ‘కేజ్రీ’ ఆఫర్
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల వరాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉచిత ఇంటర్నెట్తో ఢిల్లీ వాసులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దేశ రాజధానిలో 11 వేల ఉచిత వై-ఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. హాట్స్పాట్ల నుంచి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉచిత వై-ఫైలను ఏర్పాటు చేస్తామని 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హామీయిచ్చింది. ఈ నాలుగేళ్లలో అమలు చేయడానికి మూడు విభాగాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కేజ్రీవాల్ సర్కారు ఎట్టకేలకు పట్టాకెక్కించింది. దీని కోసం బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించామని, మరో నాలుగు నెలల్లో ప్రజలకు ఉచిత వై-ఫై అందుబాటులోకి రానుందని కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్వహిస్తామన్నారు. వై-ఫై ఏర్పాటు చేయడానికి అవసరమైన రౌటర్లు ప్రైవేటు సంస్థలు సమకూరుస్తాయని, వీటి నిర్వహణ మాత్రం ప్రభుత్వం చేతిలో ఉంటుందని వివరించారు. ఒక హాట్‌స్పాట్ నుంచి రౌటర్ సేవలు 50 మీటర్ల వరకు అందుతాయని, ఒకేసారి 200 మంది ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఢిల్లీలో మరో 14 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో గతవారం ఉచిత విద్యుత్ వరాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. ఫిక్స్డ్ చార్జీలను 84 శాతం తగ్గించడమే కాక 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితం చేసి ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు. (చదవండి: ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..) -
98 జీబీ, 126 జీబీ డేటా ఫ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో డేటావార్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రకటించిన నేపథ్యంగా మరో ప్రధాన ఆపరేటర్ వోడాఫోన్ కొత్త ప్లాన్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తన ప్రీపెయిడ్ చందాదారుల కోసం రెండు కొత్త ప్లాన్లను వోడాఫోన్ ప్రకటించింది. వోడాఫోన్ రూ.549, రూ.799 రెండు రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 549 ప్లాన్‌లో రోజుకు 3.5జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 98 జీబీ డేటా నెలకు అందిస్తుంది. దీనితో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఇక రెండో ప్లాన్ రూ.799 రీచార్జ్‌పై వోడాఫోన్ వినియోగదారులు రోజుకు 4.5జీబీ డేటా వాడుకోవచ్చు. దీని ప్రకారం మొత్తం126జీబీ ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తోంది. -
ఎయిర్టెల్ ఉచితంగా 30జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్ అయ్యే తన ప్రస్తుత 2జీ, 3జీ కస్టమర్లకు ఉచితంగా 30జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమంలో మరో ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ వర్తించనుంది. కంపెనీ ఛార్జ్ చేసే ప్యాక్‌ల పైన రోజూ ఉచితంగా 1జీబీ డేటాను 30 రోజుల పాటు ప్రీపెయిడ్ కస్టమర్లు పొందనున్నట్టు కంపెనీ తెలిపింది. అదే పోస్టు పెయిడ్ కస్టమర్లైతే రోల్ఓవర్ సౌకర్యం కింద తొలి బిల్ సైకిల్లో ఉచితంగా 30జీబీ డేటాను పొందనున్నారు. అయితే ఈ ఉచిత డేటా ప్రయోజనాలను క్లయిమ్ చేసుకోవడానికి, అర్హతను చెక్ చేసుకోవడానికి 51111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా మై ఎయిర్టెల్ మొబైల్ యాప్‌లో చూసుకోవాలని పేర్కొంది. 24 గంటల్లో 30జీబీ ఉచిత డేటాను కస్టమర్లకు క్లయిమ్ చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. మరింత సమాచారం కోసం ఎయిర్టెల్ కస్టమర్లు airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని చెప్పింది. 4జీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని, లక్షల కొద్దీ ఫీచర్ ఫోన్, 3జీ డివైజ్‌లు, 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్ కావాలనుకోవడం అతిపెద్ద నిర్ణయమని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ వేణి వెంకటేశ్ తెలిపారు. ఇదే కస్టమర్‌కు చెందిన అతిపెద్ద రివార్డింగ్ ప్రొగ్రామ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో 4జీ స్పీడ్‌లో ఆన్లైన్ ప్రపంచాన్ని అనుభవించే అవకాశం తమ కస్టమర్లకు దొరుకుతుందన్నారు. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమం కింద ఇప్పటికే ఎయిర్టెల్, పలు మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతోంది. -
జియో స్టార్టర్ కిట్ వచ్చేసింది
న్యూఢిల్లీ: ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీని తన కనుగుణంగా మలుచుకుంటోంది. ‘జియో వైఫై జియో జీఎస్టీ’ స్టార్టర్ కిట్ పేరుతో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో గురువారం జ్యోతి జ్యోతిస్ట్ స్టార్టర్ కిట్‌ను గురువారం లాంచ్ చేసింది. ఇందులో బిల్లింగ్ అప్లికేషన్, జీఎస్టీ సాఫ్ట్వేర్ ఉచితం. దీంతోపాటు జియో వైఫై డివైస్ లో ఏడాది పాటు అపరిమిత కాల్స్, 24 జీబీ డేటా అందించనుంది. ఈ కిట్‌తో పాటు వినియోగదారులకు 10,884 రూపాయల ఇతర ఆఫర్లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో వెబ్ సైట్ ప్రకారం, రూ. 1,999 ఖర్చు చేసే ఒక పరికరాన్ని, వినియోగదారులు 10,884 రూపాయల వరకు ఆఫర్లను పొందగలుగుతారు. అంతేకాదు జియో జీఎస్టీ కిట్‌ను ఈఎంఐ పద్ధతిలో కూడా కొనుక్కోవచ్చట. జీఎస్టీ స్టార్టర్ కిట్‌లో పన్నుచెల్లింపుదారులను అనుమతించడానికి వీలుగా 'జీయో- జీఎస్టీ సొల్యూషన్' ను అందిస్తోంది. జియో యాప్ బేస్డ్ జీఎస్టీ సొల్యూషన్ ప్లాట్ ఫాం ద్వారా రిటైలర్లు తమ రికార్డులను నిర్వహించడానికి, జిఎస్టికి తిరిగి రాబట్టడానికి జీఎస్టీ చట్టం నిబంధనలకు అనుగుణంగా సహాయపడుతుంది. ఇది ఏబిల్లింగ్ సాఫ్ట్వేర్కైనా ఇది అనుగుణంగా ఉంటుంది. అంటే బిల్లింగ్సాఫ్ట్వేర్, కంప్యూటర్ తో పనిలేకుండానే జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ సేవలను ఏడాదిపాటు పొందవచ్చు. రూ. 4999 విలువైన జియో బిల్లింగ్ అప్లికేషన్ ఉచితం. దీని సహాయంతో మొబైల్ లో రిటర్న్ ఫైలింగ్, ఇన్ వాయిస్‌లను తీసుకోవచ్చు. దీంతో వివిధ ఉత్పత్తులు, సర్వీసుల పన్నురేటును తెలుసుకోవచ్చు. అలాగే జీఎస్టీ ఫైలింగ్ సందర్భంగా టాక్స్ ఎక్స్‌పర్ట్‌లు సలహాలు కూడా ఉచితం. జియో స్టార్టర్ కిట్ పొందడానికి Jio.comలోకి వెళ్లి స్టార్టర్ కిట్ ఆర్డర్ చేయాలి. డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. దీంతో జియో సిమ్ లో జియోజీఎస్టీ.కామ్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ జీఎస్టీన్ ఎంచుకొన్న అనంతరం మొబైల్ ఎంఎస్ఐఎస్డీఎన్ను (మొబైల్ స్టేషన్ ఇంటర్నేషనల్ సబ్స్క్రయిబర్ డైరెక్టరీ నంబర్) జత చేయాలి. దీంతో స్టార్టర్ కిట్ యాక్టివేట్ అవుతుంది. -
ఎయిర్ టెల్ న్యూ ఆఫర్.. ఏంటది?
టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ పై ఓ కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. ' రోమ్ అబ్రాడ్ ఫ్రీలీ'' అంటే ఉచితంగా విదేశాలకు వెళ్లండి అనే ఆఫర్ ను ప్రకటించింది. దీని కింద మూడు ప్లాన్స్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'ఈ ప్లాన్లు అమెరికాకు రూ.646 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ కింద రోజంతా అపరిమిత ఇన్ కమింగ్ కాల్స్, 500 ఎంబీ ఉచిత డేటా, 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్లాన్ తో పాటు రూ.2,9978 ప్లాన్ ను ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ ప్లాన్ తో 3జీబీ వరకు ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. 10 రోజుల పాటు ఈ ప్లాన్ వాలిడిటీలో ఉంటుంది. డేటాతో పాటు ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 250 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను వాడుకోవచ్చు. నెలవారీ ప్లాన్ కింద రూ.3,999ను ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ ప్లాన్ లో 5జీబీ ఉచిత డేటా, ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 500 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను ఎయిర్ టెల్ వినియోగదారులు పొందుతారు. ఈ ఆఫర్ కింద ఏ ప్యాక్ నైనా సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే అంతర్జాతీయ రోమింగ్ సేవలను యాక్టివేట్ చేసుకోవాల్సినవసరం లేదని ఎయిర్ టెల్ పేర్కొంది. అయితే భారత్ వదిలివెళ్లిన 24 గంటల్లోగా ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలని, అప్పుడైతేనే ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇతర డిస్కౌంట్లను కూడా దీనిలో కలుపబోమని కంపెనీ స్పష్టంచేసింది. అయితే దేశదేశానికి ఈ రెంటల్ ప్లాన్లు మారనున్నాయి. -
ఐడియా ఆఫర్: 10జీబీ ఫ్రీ 4జీ డేటా..
టెలికాం దిగ్గజం ఐడియా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కొత్త, పాత కస్టమర్లకు 10జీబీ ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. ప్యాన్-ఇండియా బేసిస్ లో 4జీ సేవలను ప్రారంభిస్తున్న క్రమంలో తన కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రకటించింది. మూడు నెలల కాలంలో ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చట. ముంబై సర్కిల్ లో ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసు ప్రొవైడర్ 4జీ సర్వీసులను ప్రారంభించింది. తన 20 సర్కిళ్లలో ఈ సేవలందించడం కోసం 4జీ స్పెక్ట్రమ్ ను ఐడియా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 34ఎంబీపీఎస్ స్పీడుతో ఈ సేవలను కస్టమర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మైలురాయిని సాధించిన క్రమంలో ఐడియా 'ఇన్విటేషన్ ఆఫర్' ను తన కొత్త, పాత సబ్ స్క్రైబర్లకు పొడిగిస్తోందని కంపెనీ తెలిపింది. ఈ పొడిగింపుతో 10జీబీ ఉచిత 4జీ డేటా మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 2017 మే 25, 2017 ఆగస్టు 22 మధ్యలో ఐడియా కొత్త 4జీ కొనుగోలు చేసిన లేదా అప్ గ్రేడ్ అయిన కస్టమర్లకే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ఐడియా సబ్ స్క్రైబర్లు 4జీలోకి అప్ గ్రేడ్ అయితే అదనంగా మరో 4జీబీ 4జీ డేటాను 14 రోజుల పాటు అందించనుందని పేర్కొంది. ఈ సర్వీసులు కూడా కేవలం ముంబైలోని ఐడియా సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ముంబైలో ఈ కంపెనీకి 4.4 మిలియన్ ప్రస్తుత కస్టమర్లతో 10.2 శాతం రెవెన్యూ మార్కెట్ షేరు కలిగి ఉంది. ముంబై సర్కిల్ లో కొత్త ప్రీపెయిడ్ సబ్ స్క్రైబర్లకు రూ.395 రీఛార్జ్ తో ఇన్వెటేషన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ తో అపరిమిత స్థానిక, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యం, 1జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. ఇవే ప్రయోజనాలను రూ.192తోనూ 28 రోజుల పాటు పొందవచ్చు. -
జియో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ వారికి కూడా...
ముంబై : ఉచిత వాయిస్, ఉచిత డేటా సర్వీసులతో గతేడాది నుంచి సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలుచేయనున్న జియో, కొత్తగా 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్‌తో మరో సంచలనానికి తెరతీయబోతుంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం రూ.149 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కూడా అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుందని రివీల్ అయింది. మార్చి 31 తో ముగుస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కంటే ముందుగా రీఛార్జ్ చేసుకున్న వారికి 1జీబీ, 5జీబీ, 10 జీబీ డేటా అదనంగా ఇస్తామని కంపెనీ ఇంతకమునుపే ప్రకటించిన సంగతి తెలిసిందే. అది ఒక్కటి మాత్రమే కాక రూ.149కు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, మరో 1జీబీ డేటాను పొందవచ్చట. అయితే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని జియో కస్టమర్లకు ఇదే రీఛార్జ్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అదే ప్రైమ్ మెంబర్లైతే ఈ రీఛార్జ్ కింద 2జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జనవరి నుంచి మార్చి 31 వరకు కంపెనీ కస్టమర్లకు హ్యాపీ న్యూయర్ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ప్రస్తుతం ముగియడానికి వస్తోంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కింద రూ.303, రూ.499, రూ.999, రూ.1999, రూ.9999 రీఛార్జ్ లపై అదనపు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం రూ.149 రీఛార్జ్‌తో కూడా డేటా ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది. -
జియోకి షాక్..‘జన’ ఉచిత డేటా ఆఫర్
ఉచిత డేటా, ఉచిత కాలింగ్ అంటూ జియో టెలికాం రంగంలో సంచలనం సృష్టించగా ఇపుడు మరో ఉచిత ఆఫర్ దూసుకొస్తోంది. అయితే ఈ సారి ఓ విదేశీ కంపెనీ కావడం విశేషం. అమెరికాలోని బోస్టన్ ఆధారిత మొబైల్ ప్రకటనల సంస్థ 'జన' ఉచిత డేటా ఆఫర్ తో ముందుకొస్తోంది. రోజుకు 10 ఎంబీ డేటాను ఉచితంగా అందించనుంది. అంతేకాదు తమ ప్లాట్ ఫాంపై ప్రకటనల ఆదాయం పెరిగే కొద్దీ ఉచిత డేటా ఆఫర్‌ను కూడా ఆమేరకు పెంచుతుందట. ముఖ్యంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఉచిత ఆఫర్ లకు స్వస్తి పలికి బిల్లింగ్ మోడ్ లోకి మారిపోయిన తరుణంలో, జన ఆండ్రాయిడ్ బ్రౌజర్ ను ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా తన ఎంసెంట్(mCent ) బ్రౌజర్ ను భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రారంభ దశలో, వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా (వారానికి 70ఎంబీ) అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్, రిలియన్స్ జియో లాంటి ఇతర దేశీయ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. బిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే తమ తదుపరి లక్ష్యమని జన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సహ వ్యవస్థాపకుడు నాథన్ ఈగిల్ చెప్పారు. ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు అధిక డేటా ఖర్చు భయంతో వినియోగదారులు మోర్ సెలెక్టివ్‌గా ఉండడం, మొబైల్ ప్రకటనకర్తలకు సవాలుగా మారిందని అయితే, ఎంసెంట్ ఎంట్రీ ఇది మొత్తం మారిపోనుందని జన మేనేజర్, సహ వ్యవస్థాపకుడు జోనాథన్ డిసౌజా తెలిపారు. ఇది వినియోగదారుల ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయం అందించడంతోపాటు, ప్రకటనకర్తలకు మంచి అవకాశాన్ని కల్పించనుందని చెప్పారు. కాగా దాదాపు గూగుల్ ప్లే స్టోర్‌ను పోలిన ఎంసెంట్ బ్రౌజర్ ను ఎంసెంట్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. భారతదేశం లో 2014 లో ప్రారంభించిన ఈ యాప్ ప్రతి డౌన్ లోడ్ పై ఉచిత డేటాను ఆఫర్ చేసి 30 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది. -
జియో తరువాతి డాటా ప్లాన్ ఏంటి?
న్యూడిల్లీ: రిలయన్స్ జియో సంచలన ఆఫర్ ముగిసిన తరువాత డాటా చార్జ్ ఎంత వసూలు చేయనుందనే దానిపై ఊహాగానాలు భారీగానే నెలకొన్నాయి. ప్రస్తుత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత డాటా ప్లాన్ రూ.100గా ఉండనుందని వార్తలు వెలువడుతున్నాయి. టెలికాం దిగ్గజాలకు షాకిస్తూ ఆఫర్లను అందిస్తున్న జియో ఫ్రీ ఆఫర్ ముగిసిన తరువాత డేటా వినియోగానికి రూ.100 వసూలు చేయవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అపరిమిత కాలింగ్, ఉచిత డ్యాటా అంటూ భారతీయ టెలికాం రంగంలోకి రియలన్స్ జియో ఇన్ఫోకాం దూసుకువ చ్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన ఈ ఆఫర్ ను హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ గా మార్చి 31, 2017 వరకు పొడిగించింది. మార్చి తరువాత ఉచిత డాటా ప్లాన్ రూ.100 గా నిర్ణయించనుందట. మరోవైపు ఈ ఫ్రీ ఆఫర్ ను జూన్ 30వరకు పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా ఆవిష్కరించిన మూడు నెలల్లో ఫేసు బుక్ , వాట్సాప్, స్కైప్ లాంటి సామాజిక నెట్వర్కింగ్ సైట్లకు ధీటుగా యూజర్లను సొంతం చేసుకుంది జియో. 72 మిలియన్లకు పై చందాదారులను ఆకర్షించిందని ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత డిసెంబర్ లో ప్రకటించారు. అంతేకాదు 100 మిలియన్ల లక్ష్యంగా ముందుకుపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు రూ .2 లక్షల కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఎంట్రీ ఇచ్చిన జియో ఇతర టెల్కోలను తారిఫ్‌వార్ లో అనివార్యంగా లాక్కొచ్చింది. మరి ఈ రూ. 100 ల డాటా ప్లాన్ ఇతర కంపెనీలను ఇరకాటంలో పెట్టనుందా.. వేచి చూడాలి. -
గ్రామీణ టెలికం యూజర్లకు ఫ్రీ డేటా!
ఉచితంగా అందించాలని కేంద్రానికి ట్రాయ్ ప్రతిపాదన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు క్యాష్‌లెస్ ఎకానమీకి మద్దతుగా గ్రామీణ సబ్స్క్రైబర్లకు నెల ప్రాతిపదికన ఉచితంగా కొంత డేటాను అందించాలని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రతిపాదించింది. దీని కోసం ఒక పథకాన్నిఏర్పాటు చేసి, దీని అమలుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) నుంచి నిధులివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ఉచిత డేటాను అందించాలనుకునే కంపెనీలు.. టెలికం శాఖ వద్ద రిజిస్ట్రేషన్చేసుకోవాలి. ఇవి ఇండియన్ కంపెనీస్ యాక్ట్, 1956 కింద రిజిస్టర్ అయ్యిండాలి. ఇక రిజిస్ట్రేషన్ వాలిడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక కంపెనీ తన రిజిస్ట్రేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరేఇతర సంస్థలకు బదిలీ చేయకూడదు’ అని పేర్కొంది. డిజిటల్ చార్జీలు తగ్గించాలి: శర్మ డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి ట్రాన్సాక్షన్ (లావాదేవీల) చార్జీలను తక్కువగా ఉండేలా చూడాలని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ సూచించారు. డిజిటల్ లావాదేవీలు విస్తృతం కావడానికి... వ్యయం, సౌకర్యం,నమ్మకం ఈ 3 అంశాలు ప్రధానమన్నారు. -
ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ యూజర్లకు దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో నెలకు 10జీబీ 4జీ/3జీ డేటాను ఏడాది పాటు కొత్త ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ వినియోగదారులు ఉచితంగా వాడుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సునిల్ భారతీ మిట్టల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఐఫోన్7 ఫోన్లు నిన్నటి నుంచే భారత వినియోగదారుల ముంగిట్లోకి వచ్చాయి. రిటైల్ దుకాణాల్లోనూ లేదా ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ ఈ ఫోన్లను కొనుకోవచ్చని కంపెనీ తెలిపింది. తాజా ఐఫోన్ల కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎయిర్టెల్ మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇన్ఫినిటీ ప్లాన్స్‌పై ఉచిత డేటాను, అపరిమిత వాయిస్కాలింగ్ను ఆఫర్ చేయనున్నట్టు భారత, దక్షిణాసియా డైరెక్టర్ అజయ్ పురి చెప్పారు. ఈ ఉచిత డేటా ప్లాన్‌కు అదనమని టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలుపుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్), 3జీ/4జీ డేటా, ఎస్ఎమ్ఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్స్ కింద ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. -
వోడాఫోన్ కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా తమ వినియోగదారులకు ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. నవంబర్ 11న ఆ కంపెనీ కస్టమర్లు 100 ఎంబీ డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీనికి చేయాల్సిందల్లా వొడాఫోన్ వినియోగదారులు ఈఐగిఏఔఐ(EIGAOI) అని టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈ ఉచిత డేటాను వినియోగించుకోవచ్చని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.