ఎయిర్ టెల్ న్యూ ఆఫర్.. ఏంటది? | Airtel Offers Free Data Upto 5GB On International Roaming Packs | Sakshi
Sakshi News home page

ఎయిర్ టెల్ న్యూ ఆఫర్.. ఏంటది?

Published Tue, Jun 13 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

ఎయిర్ టెల్ న్యూ ఆఫర్.. ఏంటది?

ఎయిర్ టెల్ న్యూ ఆఫర్.. ఏంటది?

టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ పై ఓ కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. ' రోమ్ అబ్రాడ్ ఫ్రీలీ'' అంటే ఉచితంగా విదేశాలకు వెళ్లండి అనే ఆఫర్ ను ప్రకటించింది. దీని కింద మూడు ప్లాన్స్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  'ఈ ప్లాన్లు అమెరికాకు రూ.646 నుంచి ప్రారంభమవుతాయి.  ఈ ప్లాన్ కింద రోజంతా అపరిమిత ఇన్ కమింగ్ కాల్స్, 500 ఎంబీ ఉచిత డేటా, 100 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు అందుబాటులోకి వస్తాయి.  ఈ ప్లాన్ తో పాటు రూ.2,9978 ప్లాన్ ను ఎయిర్ టెల్ ప్రకటించింది.  ఈ ప్లాన్ తో 3జీబీ వరకు ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. 10 రోజుల పాటు ఈ ప్లాన్ వాలిడిటీలో ఉంటుంది. డేటాతో పాటు ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 250 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను వాడుకోవచ్చు.
 
నెలవారీ ప్లాన్ కింద రూ.3,999ను ఎయిర్ టెల్ ప్రకటించింది.  ఈ ప్లాన్ లో 5జీబీ ఉచిత డేటా, ఉచిత ఇన్ కమింగ్ కాల్స్, 500 నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లను ఎయిర్ టెల్ వినియోగదారులు పొందుతారు. ఈ ఆఫర్ కింద ఏ ప్యాక్ నైనా సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే అంతర్జాతీయ రోమింగ్ సేవలను యాక్టివేట్ చేసుకోవాల్సినవసరం లేదని ఎయిర్ టెల్ పేర్కొంది. అయితే భారత్ వదిలివెళ్లిన 24 గంటల్లోగా ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలని, అప్పుడైతేనే ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇతర డిస్కౌంట్లను కూడా దీనిలో కలుపబోమని కంపెనీ స్పష్టంచేసింది.  అయితే దేశదేశానికి ఈ రెంటల్ ప్లాన్లు మారనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement