సాక్షి, హైదరాబాద్ : కస్టమర్ ప్రయోజనాలకు అనుగుణమైన ప్లాన్‌లను అందించడంలో భాగంగా భారతి ఎయిర్‌టెల్ తన మొబైల్ కస్టమర్ల కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ (ఐఆర్) అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మరో వినూత్న ఆవిష్కరణను ప్రవేశపెట్టింది. వ్యాపార, పర్యాటక అవసరాల నిమిత్తం విదేశాలను సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా కస్టమర్లను ఆకట్టుకునేలా ఎయిర్‌టెల్ ఆకర్షణీయ ఫీచర్లతో గ్లోబల్స్ ప్యాక్స్‌ను లాంఛ్ చేసింది. ఎయిర్‌టెల్ కస‍్టమర్లు తమ ఎయరి్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ప్రస్తుతం తమ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ యూసేజ్‌ను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
కేవలం సింగిల్ టచ్‌తో అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. మరో ప్యాక్‌ను తీసుకోవడం, టాప్ చేసుకోవడం థ్యాంక్స్ యాప్ ద్వారా చేపట్టవచ్చని వెల్లడించింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు తమ ప్రయాణ తేదీకి 30 రోజుల ముందుగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను కొనుగోలు చేయవచ్చని, వారు అంతర్జాతీయ మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన తర్వాత నుంచే ప్యాక్ వ్యాలిడిటీ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ ఫీచర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకూ అందుబాటులో ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది. అంతర్జాతీయ ట్రావెల్‌లో కస్టమర్లు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను డిజైన్ చేశామని ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్, బ్రాండ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment