ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్ | Airtel to bundle free data with iPhone 7, Plus | Sakshi
Sakshi News home page

ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్

Published Sat, Oct 8 2016 11:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్

ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్

న్యూఢిల్లీ : ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ యూజర్లకు దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్ట్పెయిడ్ ప్లాన్తో నెలకు 10జీబీ 4జీ/3జీ డేటాను ఏడాది పాటు కొత్త ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ వినియోగదారులు ఉచితంగా వాడుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సునిల్ భారతీ మిట్టల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఐఫోన్7 ఫోన్లు నిన్నటి నుంచే భారత వినియోగదారుల ముంగిట్లోకి వచ్చాయి. రిటైల్ దుకాణాల్లోనూ లేదా ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ ఈ ఫోన్లను కొనుకోవచ్చని కంపెనీ తెలిపింది.
 
తాజా ఐఫోన్ల కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎయిర్టెల్ మొబైల్ బ్రాండ్బ్యాండ్ నెట్వర్క్ ఇన్ఫినిటీ ప్లాన్స్పై ఉచిత డేటాను, అపరిమిత వాయిస్కాలింగ్ను ఆఫర్ చేయనున్నట్టు భారత, దక్షిణాసియా డైరెక్టర్ అజయ్ పురి చెప్పారు. ఈ ఉచిత డేటా ప్లాన్కు అదనమని టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలుపుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్పెయిడ్ ప్లాన్స్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్), 3జీ/4జీ డేటా, ఎస్ఎమ్ఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్కు ఉచిత సబ్స్క్రిప్షన్ను ఈ ప్లాన్స్ కింద ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement