iPhone 7 Plus
-
ఈనమ్ గంభీర్‌కు చేదు అనుభవం
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి భారత్ తొలి కార్యదర్శి ఈనమ్ గంభీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను కొట్టేశారు. రోహిణి పోలీసు స్టేషన్ పరిధిలోని సెక్టార్ 7లో తన నివాసం సమీపంలో ఉన్న పార్క్‌లో వాక్ చేస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈనమ్ గంభీర్.. 2005 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసు ఆఫీసర్. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌కు తొలి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆమె, సాయంత్రం పూట నడక కోసం తన తల్లి నివాసానికి దగ్గర్లో ఉన్న పార్క్‌కు వెళ్లారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ టెంపుల్ అడ్రస్ కోసం అడిగి, ఆమె ఫోన్‌ను లాక్కొని వెళ్లారని ఈనమ్ తండ్రి జగ్దీశ్ కుమార్ గంభీర్ తెలిపారు. దొంగలించిన ఆ మొబైల్లో అమెరికన్ సిమ్ కార్డు, అధికారిక డిప్లొమాటిక్ పనికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. బైకుపై తనను వారు అడ్రస్ అడుగుతున్న సమయంలో చేతిలో ఫోన్‌ను పట్టుకొని ఉన్నానని, టెంపుల్‌కు వెళ్లే మార్గాన్ని చెబుతున్నట్టు ఈనమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరిలో ఒకరు తన చేతిలో ఉన్న ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌ను లాక్కోగానే, మరొకరు వేగవంతంగా బండిని నడుపుకుంటూ వెళ్లిపోయారని చెప్పారు. చీకటిగా ఉండటంతో పాటు ఈ సంఘటన అంతా రెప్పపాటులో జరిగిపోయిందని, ఆ సమయంలో తాను మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నోట్ చేసుకోలేక పోయాయని తెలిపారు. వారి ముఖాలను సరిగ్గా చూడలేదని ఈనమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోహిణి ఉత్తర పోలీసు స్టేషన్ పరిధిలో సెక్షన్స్ 356, 379, 34ల కింద ఆ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదుచేశారు. ఆ అనుమానితులను త్వరలోనే పట్టుకుంటామని రోహిణి డీసీపీ రాజ్నీష్ గుప్తా తెలిపారు. -
ఈ స్మార్ట్ఫోన్లకు గ్లోబల్‌గా మస్తు గిరాకీ!
ప్రతి వారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతూ.. వినియోగదారులను అలరిస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్ఫోన్ల లాంచింగ్స్‌తో రోజురోజుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా విపరీతంగా విస్తరిస్తోంది. అయితే వీటిలో ఏ ఏ స్మార్ట్ఫోన్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి? బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లుగా ఏవి నిలుస్తున్నాయి? అంటే.. ఈ క్వార్టర్లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ వచ్చిన స్మార్ట్ఫోన్ల జాబితాను రీసెర్చ్ కంపెనీ స్ట్రాటజీ అనాలిటిక్స్ తన క్వార్టర్లీ రిపోర్టులో వెల్లడించింది. 2017 క్యూ 2 ఎక్కువగా సేల్ అయిన స్మార్ట్ఫోన్లు... ఆపిల్ ఐఫోన్ 7... ప్రారంభ ధర రూ.56,200 ఆపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7, ఈ క్వార్టర్లో ఎక్కువగా మార్కెట్ షేరును సంపాదించుకుంది. 4.7 శాతం మార్కెట్ షేరుతో 16.9 మిలియన్ యూనిట్లు ఈ క్వార్టర్లో అమ్ముడుపోయాయి. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్.. ప్రారంభ ధర రూ.76,300 ఐఫోన్ 7లో అతిపెద్ద వేరియంట్ ఈ ఐఫోన్ 7 ప్లస్. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 7 తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ క్వార్టర్లో 4.2 శాతం మార్కెట్ షేరును సంపాదించుకున్న ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్, 15.1 మిలియన్ యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8... ధర రూ.57,900 దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 10.2 మిలియన్ హ్యాండ్సెట్ల షిప్మెంట్లతో ఇది 2.8 శాతం మార్కెట్ షేరును దక్కించుకుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్... ప్రారంభ ధర రూ.64,900 గ్లోబల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ఈ క్వార్టర్లో 2.5 శాతం మార్కెట్ షేరును సంపాదించింది. ఈ క్వార్టర్లో 9 మిలియన్ యూనిట్లు రవాణా అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విక్రయాలను నమోదుచేసిన స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ ఎస్8 ప్లస్, నాలుగో స్థానంలో నిలిచింది. షావోమి రెడ్మి 4ఏ... ధర రూ.5,999 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ మధ్యలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి 4ఏ ఐదో స్థానంలో నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండో క్వార్టర్లో 5.5 మిలియన్ యూనిట్ల సరుకు రవాణాను రికార్డు చేశాయి. గ్లోబల్‌గా ప్రస్తుతం దీని మార్కెట్ షేరు 1.5 శాతం. -
ఐఫోన్ 7పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్
ఇటీవలే 'బిగ్ 10 సేల్' నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ మరోసారి నేటి నుంచి సమ్మర్ షాపింగ్ డేస్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించి, తగ్గింపు ధరతో అందుబాటులో తీసుకొచ్చింది.. దీంతో ఐఫోన్ 7(బ్లాక్, 32జీబీ) వేరియంట్ రూ.45,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై అదనంగా మరో 15వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అంతేకాక సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం క్యాష్ బ్యాక్ నూ, ఫోన్ పే యూజర్లకు 25 శాతం డిస్కౌంట్ నూ అందిస్తున్నట్టు తెలిసింది. దీంతో మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. సమ్మర్ షాపింగ్ డేస్ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్7, 7 ప్లస్ వేరియంట్లు 'నో కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.ఆపిల్ ఐఫోన్7 ప్రారంభ ధర 60వేల రూపాయల నుంచి ఉంది. ఐఫోన్ 7(జెట్ బ్లాక్, 128జీబీ) ఫోన్ 54,499 రూపాయలకు, ఐఫోన్ 7 ప్లస్(బ్లాక్, 128జీబీ) ఫోన్ 67,999లకు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.. వీటికి కూడా ఎక్స్చేంజ్ పై 15వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ఐఫోన్ మోడల్స్ పై ధర తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. -
భారత్‌లోకి యాపిల్ ‘రెడ్’ ఐఫోన్7, 7ప్లస్
ధరలు రూ.82,000 నుంచి.. న్యూఢిల్లీ: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లో వచ్చే నెల నుంచి స్పెషల్ ‘రెడ్’ ఎడిషన్ ఐ ఫోన్7, ఐఫోన్ 7 ప్లస్‌లను విక్రయించనుంది. ఎరుపు రంగులోని ఈ రెండు ఫోన్లు 128 జీబీ, 256 జీబీ మోడల్స్‌లో లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.82,000 నుంచి ప్రారంభమవుతాయి. ఎయిడ్స్ వ్యతిరేక పోరాటానికి ప్రతీకగా ఈ ఫోన్లను అందిస్తున్నామని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తులకు ఔషధ, ఇతరత్రా సహాయ సహకారాలను రెడ్ సంస్థ అందిస్తోంది. ఈ సంస్థ భాగస్వామ్యంతో ఎయిడ్స్‌కు సంబంధించిన గ్లోబల్ ఫండ్‌కు యాపిల్ కంపెనీ 13 కోట్ల డాలర్లకు పైగా విరాళాలందిస్తోంది. రెడ్ సంస్థతో పదేళ్ల భాగస్వామ్యాన్ని పురస్కరించుకొని ఈ స్పెషల్ ఎడిషన్ రెడ్ ఐఫోన్లను అందుబాటులోకి తెస్తున్నామని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. ఎరుపు రంగు అల్యూమినియం ఫినిష్‌తో ఈ ఫోన్లను అందిస్తున్నామని వివరించారు. కాగా, కొత్త ఐపాడ్‌ను కూడా యాపిల్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. 9.7 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ ఐపాడ్ ధర రూ.28,900. -
ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ యూజర్లకు దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో నెలకు 10జీబీ 4జీ/3జీ డేటాను ఏడాది పాటు కొత్త ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ వినియోగదారులు ఉచితంగా వాడుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సునిల్ భారతీ మిట్టల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఐఫోన్7 ఫోన్లు నిన్నటి నుంచే భారత వినియోగదారుల ముంగిట్లోకి వచ్చాయి. రిటైల్ దుకాణాల్లోనూ లేదా ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ ఈ ఫోన్లను కొనుకోవచ్చని కంపెనీ తెలిపింది. తాజా ఐఫోన్ల కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎయిర్టెల్ మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ నెట్వర్క్ ఇన్ఫినిటీ ప్లాన్స్‌పై ఉచిత డేటాను, అపరిమిత వాయిస్కాలింగ్ను ఆఫర్ చేయనున్నట్టు భారత, దక్షిణాసియా డైరెక్టర్ అజయ్ పురి చెప్పారు. ఈ ఉచిత డేటా ప్లాన్‌కు అదనమని టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలుపుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్), 3జీ/4జీ డేటా, ఎస్ఎమ్ఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్స్ కింద ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. -
ఐఫోన్7 కొనుగోలుపై బంపర్ ఆఫర్స్!!
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల ముగింట్లోకి రానున్నాయి. ఈ ఫోన్లను కొనుక్కోవాలని ఆశిస్తున్న కస్టమర్ల కోసం ఈ-కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించేశాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు ఆఫర్ చేస్తున్న 5 డీల్స్, డిస్కౌంట్స్ ఏమిటో ఓ సారి చూద్దాం.. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.24,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అమెజాన్ సైతం ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను రూ.16వేల వరకు ఆఫర్ చేసింది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లు ఈ కొత్త ఐఫోన్లపై ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి. ఐఫోన్7 ఈఎంఐ ఆప్షన్ రూ.2,910 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 7 ప్లస్ వినియోగదారులు నెలసరి వాయిదాల్లో రూ.3,967 చెల్లించుకోవచ్చు. అదేవిధంగా స్నాప్‌డీల్ వెబ్సైట్లో కూడా ఐఫోన్ 7 ఈఎంఐ రూ.2,852 నుంచి, ఐఫోన్ 7ప్లస్ ఈఎంఐ రూ.3,898 నుంచి మొదలవుతుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రకటించాయి. సిటీ బ్యాంకు కార్డ్స్‌తో ఈ ఫోన్లను కొన్నవారికి ఫ్లాట్‌పై రూ.10వేల క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 2017 జనవరి 8న ఈ మొత్తాన్ని క్రెడిడ్ చేయనున్నట్టు వెల్లడించింది. అమెజాన్ సైతం ఐఫోన్7, 7ప్లస్ కొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు ఫ్లాట్‌పై రూ.11వేల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేసింది. పేటీఎం రూ.7వేల వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. టాటా సీఎల్ఐక్యూలో కొత్త ఫోన్లను హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నారు. తాజా ఐఫోన్లను కొనుగోలుచేసిన ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదేవిధంగా స్నాప్‌డీల్ సైతం వివిధ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 20 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ ప్రకటించింది. పాత ఐఫోన్లను కొత్త ఐఫోన్7 ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకునే వారు అమెజాన్‌లో రూ.4వేల గిప్ట్ కార్డు కూడా పొందనున్నారు. ప్రైమ్ సర్వీసు యూజర్లకు కేవలం రూ.500 గిప్ట్ కార్డును మాత్రమే అందించనున్నట్టు అమెజాన్ వెల్లడించింది. -
భారత్‌లో ఐఫోన్7 లాంచింగ్.. ఎన్నింటికో తెలుసా?
ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లు నేటి నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఆపిల్ కొత్త బ్యాచ్ ఐఫోన్ల ఆవిష్కరణ ఇప్పటివరకు పడమర వైపు దేశాలన్నింటిలోనూ అర్థరాత్రినే జరిగాయి. కానీ దానికి భిన్నంగా భారత్‌లో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచే ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదలచేయాలని ఆపిల్ నిర్ణయించింది. దేశరాజధానిలోను చాలా రిటైల్ దుకాణాలు ఇప్పటికే నేటి సాయంత్రం నుంచి ఐఫోన్ 7లను విక్రయించనున్నట్టు చెప్పేశాయట. గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో సంబంధం లేకుండా యాపిల్ నేరుగా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ-రిటైలర్లలో ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకి షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి అందనున్నాయి. జెట్ బ్లాక్, బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో అధికారికంగా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. మూడు స్టోరేజ్ వేరియంట్లు 32జీబీ,128జీబీ, 256జీబీలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. 32జీబీ ఐఫోన్7 ధర..రూ.60,000 128జీబీ ఐఫోన్7ధర...రూ.70,000 256జీబీ ఐఫోన్7ధర.. రూ.80,000 32జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.72,000 128జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.82,000 256జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.92,000 ఐఫోన్ 7 ఫీచర్స్... 4.70 అంగుళాల డిస్ప్లే క్వాడ్ -కోర్ ప్రాసెసర్ 750x1334 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 1960ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఐఫోన్ 7 ప్లస్ ఫీచర్స్... 5.50 అంగుళాల డిస్ప్లే క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2900ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ -
ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన యాపిల్
టెక్ దిగ్గజం యాపిల్, ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో విక్రయించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టింది. ఆన్లైన్లో ఈ ఫోన్ల అందుబాటుని మరింత విస్తరించడానికి ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి ఈ కొత్త ఫోన్లు భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లు అధికారిక ధరల ప్రకారం ఆన్లైన్ రిటైలర్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ డీల్‌తో గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో కాకుండా యాపిల్ నేరుగా ఈసారి ఫ్లిప్‌కార్ట్ ద్వారానే ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్7 సిరీస్ ఫోన్లతో పాటు, పాత ఐఫోన్ మోడల్స్‌ను సైతం ఫ్లిప్‌కార్ట్‌లో నమోదుకానున్నాయి. ఈ మాదిరి ఆన్లైన్ సైటుతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా ఐఫోన్ల విక్రయానికి భాగస్వామిగా ఉంటున్న ఇన్ఫిబీమ్ కూడా ఈ ఫోన్లను అందించనుంది. యాపిల్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. ఐఫోన్7 ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.60,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతే స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్న ఐఫోన్ 7 ప్లస్‌ను రూ.72,000కు విక్రయించనుంది. 128 జీబీ, 256 జీబీ ఐఫోన్ 7 వేరియంట్లు రూ.70వేలు, రూ.80వేలుగా కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా 128జీబీ, 256జీబీ ఐఫోన్7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లు రూ.82వేలు, రూ.92వేలుగా ఉండనున్నాయి. -
ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా?
శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ల బ్యాటరీ సామర్థ్యమెంతా అంటే అందరికీ సందేహమే. ఎందుకంటే ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ.. యాపిల్ ఈతరం ఫోన్లకూ ర్యామ్, బ్యాటరీ సైజులను ముందుగా రివీల్ చేయలేదు. కానీ ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాలు ముందు వాటికంటే ఎక్కువ కెపాసిటీలను కలిగి ఉంటాయని మాత్రం యాపిల్ ఆవిష్కరణ ఈవెంట్లోనే పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు హ్యాండ్ సెట్లు చైనీస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ టీనాలో లిస్టు అయ్యాయట. దీంతో ఈ ఫోన్ల బ్యాటరీ సైజులు బయటి పొక్కేశాయి. ఈ వెబ్సైట్ లిస్టింగ్ ప్రకారం ఐఫోన్7 ప్లస్ 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందట. ఐఫోన్ 6ఎస్ ప్లస్ కంటే ఈ బ్యాటరీ కొంచెం పెద్దదని వెల్లడైంది. చిన్న ఫోన్ ఐఫోన్7 బ్యాటరీ సామర్థ్యం 1,960 ఎంఏహెచ్ మాత్రమేనట. ఇది కూడా ఐఫోన్ 6ఎస్ కంటే పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. 3జీ ఇంటర్నెట్ వాడితే 12 గంటల వరకు పనిచేయనుందని టీనా సర్టిఫికేషన్ తెలిపింది. ముందుతరం ఐఫోన్ల కంటే ఈ బ్యాటరీలు 14 శాతం పెద్దవిగా ఉన్నాయని టీనా సర్టిఫికేషన్ వెల్లడిస్తోంది. కానీ యాపిల్ ఇప్పటివరకు బ్యాటరీ సామర్థ్యాలపై అధికారికంగా ప్రకటించలేదు. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లను యాపిల్ ఆవిష్కరించింది. 32జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లగా వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఇండియాలో ఈ ఫోన్ల విక్రయాలు అక్టోబర్ 7 నుంచి చేపట్టనున్నారు. ప్రారంభధర రూ.60వేలు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఈ బ్యాటరీ సామర్థ్యాలేమీ ఆశించదగ్గ రీతిలో లేవని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 3,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వినియోగదారులను అలరిస్తున్నాయి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు పవర్ బ్యాంకును కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే చిన్న బ్యాటరీ, పూర్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందనడంలో ఎలాంటి రుజువు లేదంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. తక్కువ వనరులతోనే ఎక్కువ సేపు పనిచేసేలా చేయొచ్చని చెబుతున్నారు. ర్యామ్ కెపాసిటీని కూడా యాపిల్ రివీల్ చేయలేదు. బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ గీక్‌బెంచ్, సర్టిఫికేషన్ పోర్టల్ టీనాలు ఐఫోన్ 7 ప్లస్ 3జీబీ ర్యామ్‌ను కలిగి ఉంటుందని అంచనావేస్తున్నాయి. -
ఐఫోన్7లో కొత్తేమీ లేదట!
ఫుల్ హెప్ క్రియేట్ చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నామంటూ యాపిల్ లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్‌లో కొత్తదనమేమి కనిపించడం లేదట. ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేక ఫీచర్లన్నీ ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్లో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఉన్నవేనని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దానివరకు అది అప్‌గ్రేడెడ్‌గా వచ్చినా.. ఫీచర్ల పరంగా చూస్తే రూ.10 వేల నుంచి రూ.15 వేల శ్రేణిలో ఉన్న వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఇవి అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్7 అరువు తెచ్చుకున్న ఐదు ప్రముఖ ఫీచర్లేమిటో ఓసారి చూద్దాం.. డ్యూయల్ కెమెరా : యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్‌లో కెమెరాపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొంది. డ్యూయల్ కెమెరాతో వినియోగదారుల ముందుకు వచ్చింది. కానీ ఆ ఫీచరేమీ ఐఫోన్7కు ప్రత్యేకంగా నిలవడం లేదట. 2014లోనే డ్యూయల్ కెమెరాతో హెచ్‌టీసీ తన స్మార్ట్‌ఫోన్ ఎం8ను లాంచ్ చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చాలా స్మార్ట్ఫోన్లు డ్యూయల్ కెమెరాలతో లాంచ్ అయ్యాయని తెలిపారు. మరో విశేషమేమిటంటే రూ.10వేల ధరలోనే ఆ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయట. డ్యూయల్ కెమెరా సెట్‌అప్‌తో ఎక్కువ ప్రీమియం ఆఫర్ చేసే ఫోన్లు ఎల్జీ జీ5, హ్యువాయ్ పీ9లు ఐఫోన్7 ప్లస్‌కు సగం ధరలోనే మార్కెట్లో లభ్యమవుతుండటం విశేషం. వాటర్‌ఫ్రూప్ డిజైన్ : నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పించే విధంగా ఐపీ67 వాటర్‌ఫ్రూప్ ప్రమాణాల మేరకు ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్‌లను యాపిల్ లాంచ్ చేసింది. అయితే ఈ ఫీచర్‌ను కూడా నాలుగేళ్ల క్రితమే సోనీ తన ఎక్స్‌పీరియా జడ్ స్మార్ట్‌ఫోన్‌తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిందట. స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా తక్కువ ధరలోనే తన ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్లను విక్రయిస్తోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.. ఫ్రంట్ కెమెరాలో అధిక రెజుల్యూషన్ : గతేడాదే ఐఫోన్6ఎస్/6ఎస్ ప్లస్ ఫోన్లలో 5 ఎంపీ సెన్సార్‌ను అప్‌గ్రేడ్ చేసిన యాపిల్, కొత్తగా లాంచ్‌చేసిన ఐఫోన్ 7 ఫోన్లలో 7ఎంపీ సెన్సార్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కానీ రూ.15,000 సెగ్మెంట్లోనే 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్లు వినియోగదారుల ముందు అలరిస్తున్నాయట. అయితే ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఐఫోన్7కు సరితూగడం లేదని భావిస్తే, జియోని ఎస్6ఎస్, ఓపో ఎఫ్1లు ఫ్రంట్ కెమెరాలో అద్భుతమైన ఫలితాలను ప్రదర్శిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో బెస్ట్ ఫోన్లన్ని ఇప్పటికే రుజువైందని స్పష్టంచేశారు. 3.5 ఎంఎం జాక్ లేకపోవడం : ఇక హెడ్‌ఫోన్స్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే 3.5ఎంఎం హెడ్జాక్ను యాపిల్ ఈ కొత్త ఫోన్లలో తొలగించింది. కానీ 3.5ఎంఎం కోరుకునే వారికోసం అడాప్టర్‌ను అందిస్తోంది యాపిల్. అదేవిధంగా వైర్లెస్ హెడ్‌ఫోన్స్ ఇందులో ప్లస్ పాయింట్ అని యాపిల్ చెబుతోంది. కానీ ఇవే ఫీచర్లను లీఇకో తన లీ2, లీమ్యాక్స్2 ఫోన్లను ఆఫర్ చేస్తోందని టెక్ విశ్లేషకుల వాదన. యూఎస్బీ టైప్-సీ పోర్టును లీఇకో కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చిందని, లీఇకో ఆఫర్ చేస్తున్న ఈ అధిక క్వాలిటీ యూఎస్బీ టైప్-సీ హెడ్ఫోన్లనూ యాపిల్ కొత్త ఫోన్లకు జోడించడం ప్రత్యేకతేమి కాదంటున్నారు విశ్లేషకులు. స్టీరియో స్పీకర్స్ : మరో ఆండ్రాయిడ్ ఫీచర్ స్టీరియో స్పీకర్స్. తొలి సారిగా ఐఫోన్7లో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. కొత్త ఫోన్లలోని స్టీరియో స్పీకర్లు ఉండడంతో సినిమా వీక్షణ అనుభవం సరికొత్తగా ఉండే అవకాశం ఉందని యాపిల్ హామి ఇస్తోంది.. అయితే ఇప్పటికే చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు చాలా ఏళ్ల నుంచే స్టీరియో స్పీకర్లను ఆఫర్ చేస్తున్నాయట. హెచ్‌టీసీ ఈ స్టీరియో స్పీకర్ల ట్రెండ్‌ను సృష్టించిందట. అనంతరం లెనోవా, మోటరోలా వంటి మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఎక్కువగా ఆకట్టుకునే ఈ ఫీచర్లన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లలలో లభ్యమవుతున్నట్టు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్7లో కొత్తమీ లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నారు టెక్ విశ్లేషకులు. -
న్యూ కలర్ డిజైన్‌తో ఐఫోన్ 7 ప్లస్..!
యాపిల్ కొత్త ఐఫోన్7 కోసం వేచిచూసే యూజర్లకు శుభవార్త. ఈ ఏడాది యాపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చే డివైజ్‌లు రెండు కావంట. ముచ్చటగా మూడు ఐఫోన్7లతో యాపిల్ తన ఫ్యాన్స్‌ను అలరించబోతుందట. యాపిల్ ఈ ఏడాది లాంచ్ చేయబోయే డివైజ్‌లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రో లని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మూడో ఫోన్, ఐఫోన్ 7 ప్లస్ ఎలా ఉండబోతుందా తెలుసా..? డ్యూయల్ రేర్ కెమెరా అమరికతో, కొత్త బ్లూ కలర్ డిజైన్‌లో యూజర్లను ఈ ఫోన్ అలరించనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ప్రముఖ యూట్యూబర్ లెవిస్ హిల్సెంటీగర్ ఈ ఐఫోన్ 7 ప్లస్‌కు సంబంధించిన వీడియోను తన చానెల్ అన్‌బాక్స్ థెరపీలో పోస్ట్ చేశారు. కాగా ఈవారం మొదట్లోనే చైనాలో యాపిల్ ఐఫోన్ల లాంచ్ పార్టనర్, చైనీస్ టెలికాం దిగ్గజం చైనా యూనికామ్ కూడా బ్లూ కలర్ ఐఫోన్ 7 వేరియంట్ గురించి టీజ్ చేసింది. యాపిల్ నుంచి రాబోతున్న కొత్త డివైజ్ గురించి రిపోర్టులు ఒక్కోటి ఒక్కో మాదిరిగా వెల్లడిస్తున్నాయి. దీంతో యాపిల్ ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే ఐఫోన్లు ఎన్ని అన్నది సందేహంగా మారింది. మరోవైపు ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ 7ను 2017లోనే యాపిల్ ప్రవేశపెడుతుందని కంపెనీ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ చెప్పారు. చిన్న చిన్న మార్పులతో ఐఫోన్ 6ఎస్ఈ పేరుతో ఈ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తుందని ఓ జర్మన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. అంతకుముందటి రిపోర్టులు కూడా ఐఫోన్ 7 ప్రో డివైజే డ్యూయర్ రేర్ కెమెరాతో రాబోతుందని వెల్లడించాయి. దీంతో ఈ ఫోన్ పై సందేహాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఎల్జీ, హియోమి వంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఫోన్లను డ్యూయల్ కెమెరాతో మార్కెట్లోకి తీసుకొచ్చాయి. -
విప్లవాత్మక ఫీచర్లతో ఐఫోన్ 7!
కాలిఫోర్నియా: ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఫోన్, ఐపాడ్ సిరీస్‌ను తీసుకొస్తూ ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందుకు దూసుకెళుతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీ మరిన్ని విప్లవాత్మక ఫీచర్లతో త్వరలోనే ఐఫోన్ 7 సిరీస్‌ను తీసుకరానుంది. ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్‌ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్‌ను పూర్తిగా ఎత్తివేస్తోంది. అంటే, ఇకముందు వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. బ్యాటరీ చార్జింగ్కు, ఇయర్, హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ కావడానికి ఇప్పటికే కొన్ని మోడల్స్లోవున్న లైటనింగ్ కనెక్టర్ వ్యవస్థనే ఉపయోగిస్తారు. ఈ లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. 30 పిన్స్ ఉండే 3.5 జాక్‌ను ఉపయోగిస్తుండడం వల్ల ఐఫోన్ 6ఎస్ సిరీస్‌ను 7.1 మిల్లీమీటర్లకన్నా తక్కువ మందానికి తయారు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ స్థానంలో 8 పిన్స్‌తో పనిచేసే లైటనింగ్ కనెక్టర్‌ను తీసుకరావడం వల్ల ఫోన్ మందం కూడా 1 ఎంఎం తగ్గుతుంది. ఈ కొత్త సిరీస్‌లో ఉండే మరో ఆకర్షనీయమైన ఫీచర్ ఏమిటంటే....నాయిస్ కన్సీలింగ్ (అనవసర శబ్దాలను నియంత్రించే)టెక్నాలజీని ఉపయోగించాలనుకోవడం. దీనికోసం ఎప్పటి నుంచో ఆపిల్ చిప్ పార్టనర్‌గా పనిచేస్తున్న ‘సైరస్ లాజిక్’కు ప్రాజెక్ట్ కాంట్రక్ట్ ఇచ్చినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. నాయిస్ కన్సీలింగ్ వ్యవస్థ ఫోన్ అంతర్భాగంలోనే ఉండడం వల్ల ఫోన్లోని స్పీకర్ల గుండా కూడా స్పష్టమైన వాయిస్‌ను వినవచ్చు. లైటనింగ్ కనెక్టర్ ద్వారా కూడా ఇయర్ లేదా హెడ్ ఫోన్లలో మరింత స్పష్టంగా వాయిస్ వినిపిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలాగా కొత్త ఐఫోన్లతోపాటు అడాప్టర్లను అందజేస్తారని తెల్సింది. అయితే ఈ సరికొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్ 7 సిరీస్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చేది కంపెనీ వర్గాలు తెలపడం లేదు.