ఐఫోన్7 కొనుగోలుపై బంపర్ ఆఫర్స్!!
- ఫ్లిప్కార్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.24,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అమెజాన్ సైతం ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను రూ.16వేల వరకు ఆఫర్ చేసింది.
- ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లు ఈ కొత్త ఐఫోన్లపై ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి. ఐఫోన్7 ఈఎంఐ ఆప్షన్ రూ.2,910 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 7 ప్లస్ వినియోగదారులు నెలసరి వాయిదాల్లో రూ.3,967 చెల్లించుకోవచ్చు.
- అదేవిధంగా స్నాప్డీల్ వెబ్సైట్లో కూడా ఐఫోన్ 7 ఈఎంఐ రూ.2,852 నుంచి, ఐఫోన్ 7ప్లస్ ఈఎంఐ రూ.3,898 నుంచి మొదలవుతుంది.
- క్యాష్బ్యాక్ ఆఫర్లను కూడా ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రకటించాయి. సిటీ బ్యాంకు కార్డ్స్తో ఈ ఫోన్లను కొన్నవారికి ఫ్లాట్పై రూ.10వేల క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. 2017 జనవరి 8న ఈ మొత్తాన్ని క్రెడిడ్ చేయనున్నట్టు వెల్లడించింది. అమెజాన్ సైతం ఐఫోన్7, 7ప్లస్ కొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు ఫ్లాట్పై రూ.11వేల క్యాష్బ్యాక్ను ఆఫర్ చేసింది. పేటీఎం రూ.7వేల వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. టాటా సీఎల్ఐక్యూలో కొత్త ఫోన్లను హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.10వేల క్యాష్బ్యాక్ను ఆఫర్ చేయనున్నారు.
- తాజా ఐఫోన్లను కొనుగోలుచేసిన ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. అదేవిధంగా స్నాప్డీల్ సైతం వివిధ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 20 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ ప్రకటించింది.
- పాత ఐఫోన్లను కొత్త ఐఫోన్7 ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకునే వారు అమెజాన్లో రూ.4వేల గిప్ట్ కార్డు కూడా పొందనున్నారు. ప్రైమ్ సర్వీసు యూజర్లకు కేవలం రూ.500 గిప్ట్ కార్డును మాత్రమే అందించనున్నట్టు అమెజాన్ వెల్లడించింది.