ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్
ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్
Published Fri, Sep 23 2016 6:28 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
టెక్ దిగ్గజం యాపిల్, ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లను భారత్లో విక్రయించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టింది. ఆన్లైన్లో ఈ ఫోన్ల అందుబాటుని మరింత విస్తరించడానికి ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి ఈ కొత్త ఫోన్లు భారత్లో విడుదల కానున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్లు అధికారిక ధరల ప్రకారం ఆన్లైన్ రిటైలర్లో అందుబాటులో ఉండనున్నాయి.
ఈ డీల్తో గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో కాకుండా యాపిల్ నేరుగా ఈసారి ఫ్లిప్కార్ట్ ద్వారానే ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్7 సిరీస్ ఫోన్లతో పాటు, పాత ఐఫోన్ మోడల్స్ను సైతం ఫ్లిప్కార్ట్లో నమోదుకానున్నాయి. ఈ మాదిరి ఆన్లైన్ సైటుతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా ఐఫోన్ల విక్రయానికి భాగస్వామిగా ఉంటున్న ఇన్ఫిబీమ్ కూడా ఈ ఫోన్లను అందించనుంది.
యాపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. ఐఫోన్7 ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.60,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతే స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్న ఐఫోన్ 7 ప్లస్ను రూ.72,000కు విక్రయించనుంది. 128 జీబీ, 256 జీబీ ఐఫోన్ 7 వేరియంట్లు రూ.70వేలు, రూ.80వేలుగా కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా 128జీబీ, 256జీబీ ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ వేరియంట్లు రూ.82వేలు, రూ.92వేలుగా ఉండనున్నాయి.
Advertisement
Advertisement