ఫ్లిప్కార్ట్తో జతకట్టి, ఆపిల్ అదరగొట్టింది!
ఫ్లిప్కార్ట్తో జతకట్టి, ఆపిల్ అదరగొట్టింది!
Published Tue, Nov 8 2016 12:02 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
బెంగళూరు : పండుగ సీజన్లో ఎలాగైనా భారత్లో ఐఫోన్స్ విక్రయాలు పెంచుకోవాలని భావించిన ఆపిల్, ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో దోస్తికట్టింది. ఫ్లిప్కార్ట్తో జతకట్టిన వేళ విశేషం ఆపిల్కు బాగా కలిసివచ్చింది. ఐఫోన్ విక్రయాల్లో విరగదీసింది. అక్టోబర్లో 50 శాతం ఐఫోన్ అమ్మకాలు ఫ్లిప్కార్ట్తోనే జరిగినట్టు తెలిసింది. ఆపిల్కు ఎలాంటి అవుట్టెల్స్ లేకపోవడంతో, సిటీలకు, పట్టణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేయడానికి ఈ దోస్తీ బాగా సహకరించిందని ఆపిల్ సంబురపడుతోంది. ఆపిల్ లేటెస్ట్గా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ విక్రయాలు అత్యధిక మొత్తంలో నమోదవుతూ, అక్టోబర్లో దాదాపు 2.6 లక్షల యూనిట్ల సరుకు రవాణా జరిగినట్టు టెక్నాలజీ పరిశోధన సంస్థ సైబర్మీడియా తెలిపింది. చాలామటికి ఐఫోన్ విక్రయాలు ఎక్స్చేంజ్ ఆఫర్లోనే జరిగినట్టు పేర్కొంది. 70 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లను ఐఫోన్ 7ల కోసం ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు వివరించింది.
30 శాతం ముందటి తరం ఐఫోన్లకు అప్గ్రేడ్గా తీసుకున్నట్టు తెలిపింది. రూ.20వేలకు ఎక్కువున్న ప్రీమియం హ్యాండ్ సెట్ కేటగిరీలో ఆపిల్ మార్కెట్ షేర్ అత్యధికంగా ఆర్జించడానికి ఈ దోస్తి దోహదం చేసిందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. 2016 మొదటి తొమ్మిది నెలల కాలంలో రూ.20వేలకు పైన ఉన్న హ్యాండ్ సెట్ల మార్కెట్లో ఆపిల్ షేరు 20 శాతంగా ఉండేదని సైబర్ మీడియా వెల్లడించింది. కానీ అక్టోబర్లో ఈ షేరు భారీగా పెరిగినట్టు పేర్కొంది. శాంసంగ్ నోట్ 7 ఎదుర్కొంటున్న పేలుళ్ల సమస్య కూడా ఆపిల్కు బాగా కలిసి వచ్చినట్టు సైబర్ మీడియా ప్రముఖ విశ్లేషకుడు(టెలికాం) ఫైసల్ కావూసా తెలిపారు. ఒక్క భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా శాంసంగ్ గెలాక్సీ పేలుళ్ల సమస్య ఆపిల్కు లబ్ది చేకూరుస్తుందన్నారు. రెడింగ్టోన్ ఇన్గ్రామ్, రాశి ఫెరిఫిరల్స్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఆపిల్ ఇన్ని రోజులు ఐఫోన్లను భారత్లో విక్రయించేది. కానీ మొదటిసారి సంప్రదాయానికి భిన్నంగా, ఈ పండుగ సీజన్లో ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టి, డైరెక్ట్గా తానే ఐఫోన్ విక్రయాలను భారత్లో చేపట్టింది.
Advertisement
Advertisement