ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 7 ఎంతో తెలుసా?
Published Mon, Apr 24 2017 8:26 PM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM
ముంబై: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 26 వరకు నిర్వహించనున్న ఆపిల్ డేస్ సేల్ లో భాగంగా ఆ కంపెనీ ఉత్పత్తులపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది.. ఈ సేల్ ఆఫర్ లో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన తన లేటెస్ట్ మొబైల్ ఐఫోన్ 7(256జీబీ) వేరియంట్ పై 20వేల రూపాయల బంపర్ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో ఈ వేరియంట్ కేవలం 39,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర 59,999 రూపాయలు నుంచి 70,000 రూపాయల వరకు ఉంది. సిల్వర్, బ్లాక్, జెట్ బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. కేవలం ఐఫోన్ 7పై డిస్కౌంట్ ను మాత్రమే కాక, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను రూ.19000 వరకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఫోన్ ను బట్టి ఎక్స్చేంజ్ మొత్తం ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు అదనంగా 5 శాతం ధర తగ్గింపు దొరకనుంది. ఇతర స్టోరేజ్ వేరియంట్లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లపై కూడా డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక ఐఫోన్ 6(16జీబీ) పై 26,010 రూపాయల ధర తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ ఐఫోన్ 6 ఫ్లిప్ కార్ట్ లో 25,990 రూపాయలకే లభ్యం కానుంది. ఎక్స్చేంజ్ , యాక్సిస్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు దీనికి వర్తిస్తాయి.. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకు 54,990 రూపాయలకే లభ్యం కానుంది. ఇతర డెబిట్, క్రెడిట్ కార్డుదారులకైతే ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ పై 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆపిల్ వాచ్ లపై 35 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తికరంగా ఐఫోన్ 7కు ఫ్లిప్ కార్ట్ అధికారిక ఆన్ లైన్ రీటైలర్ గా ఉంది.
Advertisement
Advertisement