గుడ్ న్యూస్‌ : ఇక తక్కువ ధరలోనే ఐఫోన్‌ 7 | iPhone 7 Now Being Made in India  | Sakshi
Sakshi News home page

గుడ్ న్యూస్‌ : ఇక తక్కువ ధరలోనే ఐఫోన్‌ 7

Published Tue, Apr 2 2019 5:52 PM | Last Updated on Tue, Apr 2 2019 6:37 PM

iPhone 7 Now Being Made in India  - Sakshi

ఐఫోన్‌ 7 (ఫైల్‌ ఫోటో)

సాక్షి, బెంగళూరు : ఐఫోన్‌ లవర్స్‌కు శుభవార్త. త్వరలోనే ఇండియాలో తయారైన మరో ఐఫోన్‌ సరసమైన ధరలో భారతీయ వినియోగదారులకు లభ్యం కానుంది. మేడిన్‌ ఇండియా పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది దిగ్గజ సంస్థ ఆపిల్‌.  ఇందులో భాగంగా బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్‌ ఐపోన్‌ 7ను రూపొందిస్తోంది. ఈ ఫోన్ల అసెంబ్లింగ్‌ ప్రక్రియ మార్చి నెలలో ప్రారంభమైదని ఆపిల్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. 

భారతదేశంతో తమ దీర్ఘకాలిక నిబద్ధతను కొనసాగిస్తూ స్థానిక కస్టమర్లకోసం స్థానికంగా ఐఫోన్ 7ని ఉత్పత్తి చేస్తు‍న్నందుకు గర్వంగా ఉందని ఆపిల్‌ ప్రకటించింది. భవిష్యత్తులో మేడిన్‌ ఇండియా పోర్టిఫోలియోను మరింత విస్తరించనుందని కూడా తెలుస్తోంది. దీంతో  ఐఫోన్‌ 7 బేసిక్‌ మోడల్‌ రూ.39వేలకంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్లు ఖరీదు ఎక్కువే. దీనికి తోడు విదేశీ స్మార్ట్‌ఫోన్లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలోనే సుంకాల బారి నుంచి తప్పించుకునేందుకు గత ఏడాది నుంచే భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని  చేపట్టింది ఆపిల్‌ సంస్థ. తైవాన్‌ దిగ్గజం విస్ట్రోన్‌ సహకారంతో బెంగళూరులోని ప్లాంట్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను రూపొందించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement