ఐఫోన్ 7పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్
ఐఫోన్ 7పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్
Published Mon, May 29 2017 8:06 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
ఇటీవలే 'బిగ్ 10 సేల్' నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ మరోసారి నేటి నుంచి సమ్మర్ షాపింగ్ డేస్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించి, తగ్గింపు ధరతో అందుబాటులో తీసుకొచ్చింది.. దీంతో ఐఫోన్ 7(బ్లాక్, 32జీబీ) వేరియంట్ రూ.45,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై అదనంగా మరో 15వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అంతేకాక సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం క్యాష్ బ్యాక్ నూ, ఫోన్ పే యూజర్లకు 25 శాతం డిస్కౌంట్ నూ అందిస్తున్నట్టు తెలిసింది.
దీంతో మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. సమ్మర్ షాపింగ్ డేస్ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్7, 7 ప్లస్ వేరియంట్లు 'నో కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.ఆపిల్ ఐఫోన్7 ప్రారంభ ధర 60వేల రూపాయల నుంచి ఉంది. ఐఫోన్ 7(జెట్ బ్లాక్, 128జీబీ) ఫోన్ 54,499 రూపాయలకు, ఐఫోన్ 7 ప్లస్(బ్లాక్, 128జీబీ) ఫోన్ 67,999లకు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.. వీటికి కూడా ఎక్స్చేంజ్ పై 15వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ఐఫోన్ మోడల్స్ పై ధర తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.
Advertisement
Advertisement