న్యూఢిల్లీ : మనం పొరపాటున స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లలో పడేసినా లేదా కింద పడేసినా.. ఇక దాని పని అంతే. ఆ స్మార్ట్‌ఫోన్‌ను ఓ మూలన పడేసి, కొత్తది కొనుక్కోవాల్సిందే. కానీ ఆపిల్ ఐఫోన్ల విషయంలో దాన్నే ఆపాదిస్తే, మనం తప్పులో కాలేసినట్టే. ఆపిల్ ఐఫోన్లు ఫర్‌ఫార్మెన్స్‌కు మారు పేరుగా నిలుస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7 ఇదే నిరూపించింది. సముద్ర గర్భంలో నాని నాని ఉన్న ఆపిల్ ఐఫోన్ 7, బయటకి తీస్తే భలే పనిచేస్తుందట. దాని బ్యాటరీ పూర్తిగా నీళ్లలో తడిచిపోయినా కూడా ఇంకా మంచిగా పనిచేస్తూనే ఉందని డిజిటైమ్స్ వెల్లడించింది. అంతేకాక సముద్ర గర్భంలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సిగ్నల్‌ను కరెక్ట్‌గా అందుకుంటుందని తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్ ఐఫోన్ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆ ఫోన్ దొరికింది. ఇంగ్లండ్‌లోని డోర్డల్ డోర్ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి ఓ వెలుగు రావడం కనిపించింది. అదేమిటా? అని దాని వద్దకు వెళ్లి చూసింది. సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. అది ఐఫోన్ 7. టెక్ట్స్ మెసేజ్ రావడంతో, ఆ ఐఫోన్ 7ను వెలుతురును బ్లింక్ అవుతుంది. నీటిలో మునిగి ఉన్న ఆ డివైజ్‌ను హార్సీ బయటకు తీసింది. 48 గంటల పాటు ఆ ఐఫోన్ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్ మంచిగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాక సిగ్నల్స్‌ను కూడా అది కరెక్ట్‌గా పొందుతుంది. హార్సీ తనకు దొరికిన ఐఫోన్ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్ పోగొట్టుకున్న కెనడియన్‌కు అందచేసింది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్ 7 ఎంత స్ట్రాంట్‌గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్ విశ్లేషకులు సైతం అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment