న్యూ కలర్ డిజైన్తో ఐఫోన్ 7 ప్లస్..! | Apple iPhone 7 Plus Blue Colour variant revealed | Sakshi
Sakshi News home page

న్యూ కలర్ డిజైన్తో ఐఫోన్ 7 ప్లస్..!

Published Fri, Aug 5 2016 10:35 AM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM

న్యూ కలర్ డిజైన్తో ఐఫోన్ 7 ప్లస్..! - Sakshi

న్యూ కలర్ డిజైన్తో ఐఫోన్ 7 ప్లస్..!

యాపిల్ కొత్త ఐఫోన్7 కోసం వేచిచూసే యూజర్లకు శుభవార్త. ఈ ఏడాది యాపిల్ మార్కెట్లోకి తీసుకొచ్చే డివైజ్లు రెండు కావంట. ముచ్చటగా మూడు ఐఫోన్7లతో యాపిల్ తన ఫ్యాన్స్ను అలరించబోతుందట.  యాపిల్ ఈ ఏడాది లాంచ్ చేయబోయే డివైజ్లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 7 ప్రో లని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మూడో ఫోన్, ఐఫోన్ 7 ప్లస్ ఎలా ఉండబోతుందా తెలుసా..? డ్యూయల్ రేర్ కెమెరా అమరికతో, కొత్త బ్లూ కలర్ డిజైన్లో యూజర్లను ఈ ఫోన్ అలరించనుందని రిపోర్టులు తెలుపుతున్నాయి.  ప్రముఖ యూట్యూబర్ లెవిస్ హిల్సెంటీగర్ ఈ ఐఫోన్ 7 ప్లస్కు సంబంధించిన వీడియోను తన చానెల్ అన్బాక్స్ థెరపీలో పోస్ట్ చేశారు. కాగా ఈవారం మొదట్లోనే చైనాలో యాపిల్ ఐఫోన్ల లాంచ్ పార్టనర్, చైనీస్ టెలికాం దిగ్గజం చైనా యూనికామ్ కూడా బ్లూ కలర్ ఐఫోన్ 7 వేరియంట్ గురించి టీజ్ చేసింది.  

యాపిల్ నుంచి రాబోతున్న కొత్త డివైజ్ గురించి రిపోర్టులు ఒక్కోటి ఒక్కో మాదిరిగా వెల్లడిస్తున్నాయి. దీంతో యాపిల్ ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే ఐఫోన్లు ఎన్ని అన్నది సందేహంగా మారింది. మరోవైపు ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా న్యూ రీ-డిజైన్డ్ ఐఫోన్ 7ను 2017లోనే యాపిల్ ప్రవేశపెడుతుందని కంపెనీ అనలిస్టు క్రియేటివ్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ టిమ్ బజరిన్ చెప్పారు.  చిన్న చిన్న మార్పులతో ఐఫోన్ 6ఎస్ఈ పేరుతో ఈ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తుందని ఓ జర్మన్ వెబ్సైట్ కూడా పేర్కొంది. అంతకుముందటి రిపోర్టులు కూడా ఐఫోన్ 7 ప్రో డివైజే డ్యూయర్ రేర్ కెమెరాతో రాబోతుందని వెల్లడించాయి. దీంతో ఈ ఫోన్ పై సందేహాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఎల్జీ, హియోమి వంటి స్మార్ట్ఫోన్ తయారీదారులు తమ ఫోన్లను డ్యూయల్ కెమెరాతో మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement