భారత్లో ఐఫోన్7 లాంచింగ్.. ఎన్నింటికో తెలుసా?
భారత్లో ఐఫోన్7 లాంచింగ్.. ఎన్నింటికో తెలుసా?
Published Fri, Oct 7 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లు నేటి నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఆపిల్ కొత్త బ్యాచ్ ఐఫోన్ల ఆవిష్కరణ ఇప్పటివరకు పడమర వైపు దేశాలన్నింటిలోనూ అర్థరాత్రినే జరిగాయి. కానీ దానికి భిన్నంగా భారత్లో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచే ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదలచేయాలని ఆపిల్ నిర్ణయించింది. దేశరాజధానిలోను చాలా రిటైల్ దుకాణాలు ఇప్పటికే నేటి సాయంత్రం నుంచి ఐఫోన్ 7లను విక్రయించనున్నట్టు చెప్పేశాయట.
గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో సంబంధం లేకుండా యాపిల్ నేరుగా ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ-రిటైలర్లలో ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకి షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి అందనున్నాయి. జెట్ బ్లాక్, బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో అధికారికంగా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. మూడు స్టోరేజ్ వేరియంట్లు 32జీబీ,128జీబీ, 256జీబీలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి.
32జీబీ ఐఫోన్7 ధర..రూ.60,000
128జీబీ ఐఫోన్7ధర...రూ.70,000
256జీబీ ఐఫోన్7ధర.. రూ.80,000
32జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.72,000
128జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.82,000
256జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.92,000
ఐఫోన్ 7 ఫీచర్స్...
4.70 అంగుళాల డిస్ప్లే
క్వాడ్ -కోర్ ప్రాసెసర్
750x1334 పిక్సెల్స్ రెజుల్యూషన్
ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
2జీబీ ర్యామ్
32జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
1960ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
ఐఫోన్ 7 ప్లస్ ఫీచర్స్...
5.50 అంగుళాల డిస్ప్లే
క్వాడ్-కోర్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
3జీబీ ర్యామ్
32జీబీ స్టోరేజ్
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
2900ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
Advertisement