న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి భారత్ తొలి కార్యదర్శి ఈనమ్ గంభీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని ఓ ఇద్దరు వ్యక్తులు ఆమె ఫోన్‌ను కొట్టేశారు. రోహిణి పోలీసు స్టేషన్ పరిధిలోని సెక్టార్ 7లో తన నివాసం సమీపంలో ఉన్న పార్క్‌లో వాక్ చేస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈనమ్ గంభీర్.. 2005 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసు ఆఫీసర్. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌కు తొలి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆమె, సాయంత్రం పూట నడక కోసం తన తల్లి నివాసానికి దగ్గర్లో ఉన్న పార్క్‌కు వెళ్లారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్ టెంపుల్ అడ్రస్ కోసం అడిగి, ఆమె ఫోన్‌ను లాక్కొని వెళ్లారని ఈనమ్ తండ్రి జగ్‌దీశ్ కుమార్ గంభీర్ తెలిపారు.
దొంగలించిన ఆ మొబైల్‌లో అమెరికన్ సిమ్ కార్డు, అధికారిక డిప్లొమాటిక్ పనికి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. బైకుపై తనను వారు అడ్రస్ అడుగుతున్న సమయంలో చేతిలో ఫోన్‌ను పట్టుకొని ఉన్నానని, టెంపుల్‌కు వెళ్లే మార్గాన్ని చెబుతున్నట్టు ఈనమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరిలో ఒకరు తన చేతిలో ఉన్న ఐఫోన్ 7 ప్లస్ ఫోన్‌ను లాక్కోగానే, మరొకరు వేగవంతంగా బండిని నడుపుకుంటూ వెళ్లిపోయారని చెప్పారు. చీకటిగా ఉండటంతో పాటు ఈ సంఘటన అంతా రెప్పపాటులో జరిగిపోయిందని, ఆ సమయంలో తాను మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నోట్ చేసుకోలేక పోయాయని తెలిపారు. వారి ముఖాలను సరిగ్గా చూడలేదని ఈనమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోహిణి ఉత్తర పోలీసు స్టేషన్ పరిధిలో సెక్షన్స్ 356, 379, 34ల కింద ఆ గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదుచేశారు. ఆ అనుమానితులను త్వరలోనే పట్టుకుంటామని రోహిణి డీసీపీ రాజ్‌నీష్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment