పాక్ చెంప చెల్లుమనిపించిన భారత్
న్యూయార్క్: పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. తొలిసారి ఐక్యరాజ్యసమితిలో తమ దేశం తరుపున మాట్లాడిన పాక్ కొత్త ప్రధాని షాహిద్ ఖబన్ అబ్బాసీ భారత్‌పై తీవ్ర నిందలు వేయగా దానికి బదులుగా చెంపచెల్లుమనేట్లుగా భారత్ బదులిచ్చింది. 'పాకిస్థాన్ ఇప్పుడు టెర్రిరిస్థాన్.. స్వచ్ఛమైన ఉగ్రవాదానికి అది ఇప్పుడు పుట్టినిళ్లుగా ఉంది' అంటూ భారత్ ఐక్యరాజ్యసమితిలో ఏ మాత్రం సంకోచించకుండా వ్యాఖ్యానించింది. 'పాక్‌కు ఉంది కొద్ది చరిత్రే. అందులోనే ఉగ్రవాదానికి అర్థంగా మారింది. స్వచ్ఛమైన ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఉత్పత్తి చేసి పెంచిపోషిస్తోంది. పాకిస్థాన్ ఇప్పుడు టెర్రరిస్థాన్.
ప్రపంచం మొత్తానికి ఆ దేశమే ఉగ్రవాదాన్ని పంపిణీ చేస్తోంది' అంటూ భారత్ తరుపున ఐక్యారాజ్యసమితిలో మాట్లాడిన సెక్రటరీ ఈనం గంబీర్ వ్యాఖ్యానించారు. ఒసామా బిన్ లాడెన్, తాజాగా హఫీజ్ సయీద్‌లాంటి ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని, ఉగ్రవాదులపాలిట స్వర్గంగా పాకిస్థాన్ మారిందని స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థగా లష్కరే తోయిబాను ఐక్యరాజ్యసమితి గుర్తించగా ఇప్పుడు అదే సంస్థకు చెందిన హఫీజ్ మహ్మద్ సయీద్ పార్టీ పెడతానంటూ ప్రకటించారని, పాకిస్థాన్‌లో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ ఒక్క విషయం గమనిస్తే అర్ధమైపోతుందని అన్నారు.