జియో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ వారికి కూడా... | Reliance Jio offers extra freebies with Prime to woo more users | Sakshi

జియో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ వారికి కూడా...

Mar 27 2017 7:26 PM | Updated on Sep 5 2017 7:14 AM

జియో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ వారికి కూడా...

జియో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ వారికి కూడా...

ఉచిత వాయిస్, ఉచిత డేటా సర్వీసులతో గతేడాది నుంచి సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తోంది.

ముంబై : ఉచిత వాయిస్, ఉచిత డేటా సర్వీసులతో గతేడాది నుంచి సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలుచేయనున్న జియో, కొత్తగా 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్తో మరో సంచలనానికి తెరతీయబోతుంది.  ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం రూ.149 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కూడా అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుందని రివీల్ అయింది. మార్చి 31 తో ముగుస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కంటే ముందుగా రీఛార్జ్ చేసుకున్న వారికి 1జీబీ, 5జీబీ, 10 జీబీ డేటా అదనంగా ఇస్తామని కంపెనీ ఇంతకమునుపే ప్రకటించిన సంగతి తెలిసిందే. అది ఒక్కటి మాత్రమే కాక రూ.149కు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, మరో 1జీబీ డేటాను పొందవచ్చట.
 
అయితే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని జియో కస్టమర్లకు ఇదే రీఛార్జ్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అదే ప్రైమ్ మెంబర్లైతే ఈ రీఛార్జ్ కింద 2జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జనవరి నుంచి మార్చి 31 వరకు కంపెనీ కస్టమర్లకు హ్యాపీ న్యూయర్ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ ఆఫర్ ప్రస్తుతం ముగియడానికి వస్తోంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కింద రూ.303, రూ.499, రూ.999, రూ.1999, రూ.9999 రీఛార్జ్ లపై అదనపు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం రూ.149 రీఛార్జ్తో కూడా డేటా ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement