Buy one get one free
-
బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీసీ గ్రూప్ చైర్మన్ హార్ష్‌గోయెంకా దసర పండగ వేళ సరికొత్త పాఠాలు నేర్పారు. ట్విట్టర్ వేదికగా జీవితంలో పైకి ఎదగాలనుకునే వారికి, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి హితబోధ చేశారు. అయితే ఆయన వ్యాపారవేత్త కదా అందుకు జ్ఞానాన్ని సైతం బిజినెస్ స్టైల్లోనే చెప్పారు. హర్ష్ చేసిన ట్వీట్లో మీరు కోపాన్ని కొంటే అసిడిటీ ఉచితంగా వస్తుంది. ఈర్ష్యని కొంటే భయం ఉచితం, ఒత్తిడిని కొంటే బ్లడ్ ప్రషర్ ఉచితం అంటూ పలు విధాలుగా సెలవిచ్చారు ఈ పారిశ్రామికవేత్త. అంతేకాదు నమ్మకాన్ని కొంటే స్నేహం ఉచితం, ప్రేమని కొనుగోలు చేస్తే సంతోషం ఉచితమంటూ జీవిత సత్యాలను ట్విట్టర్లో ఓలకబోశారు. Buy anger, get acidity free. Buy jealousy, get bitterness free. Buy hatred, get ulcer free. Buy stress, get blood pressure free. OR Buy trust, get friendship free. Buy exercise, get health free. Buy honesty, get sleep free. Buy love, get happiness free. — Harsh Goenka (@hvgoenka) October 15, 2021 స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న బుల్ ట్రెండ్‌పై కూడా ఆసక్తికర వీడియోను ఆయన షేర్ చేశారు. ఇప్పుడు కొనసాగుత్ను బుల్ ట్రెండ్ ముందు ఏదీ నిలవలేదన్నట్టుగా ఆయన షేర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది. Stock market today….with everyone cheering !pic.twitter.com/kIdfniFVbT — Harsh Goenka (@hvgoenka) October 14, 2021 -
‘వ్యాక్సిన్ ఆఫర్’.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ !
దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్‌కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్ ఆఫర్’ను ప్రకటించింది. బొమ్మపడింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్‌లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్ చేశామని పీవీఆర్ ప్రకటించింది. అందరికీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్ వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పండి వ్యాక్సిన్ ఆఫర్ మల్టీప్లెక్సుల ఓపెనింగ్ సందర్భంగా వ్యాక్సిన్ ఆఫర్‌ని ప్రకటిచింది పీవీఆర్ సినిమాస్. వ్యాక్సిన్ తీసుకుని పీవీఆర్ సినిమాస్‌కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్ (సినిమా)పై ఒక టికెట్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్షన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మల్టీప్లెక్సులు ఓపెన్ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్‌ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. -
‘బై వన్, గెట్ వన్’ ఆఫర్లపై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఒకటి కొంటే ఒకటి ఉచితం.. ఒకటి కొంటే రెండు ఉచితం... మా దగ్గర వస్తువులు కొంటే 50 శాతం డిస్కౌంట్ ఇస్తాం... మా దగ్గర షాపింగ్ చేస్తే 80 శాతం రాయితీ ఇస్తాం... ఇవన్నీ మాల్స్, దుకాణదారుల ఆఫర్లు. ఎఫ్ఎంసీజీ నుంచి ఫార్మాస్యూటికల్, టెక్ట్స్‌టైల్, ఫుడ్, రిటైల్ చైన్ కంపెనీల వరకు అన్ని కంపెనీలు ఈ మార్కెటింగ్ టెక్నిక్‌నే ఎక్కువగా ఉపయోగించేవి. అయితే ఈ ఉచితాలన్నింటికీ గతేడాది అమల్లోకి వచ్చిన జీఎస్టీ మంగళం పాడేసింది. వాటిని కూడా పన్ను పరిధిలోకి తెచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఈ ఉచితాలను పక్కనపెట్టేశాయి. ప్రస్తుతం ఈ ఉచితాలపై గుడ్‌న్యూస్ చెప్పబోతుంది జీఎస్టీ కౌన్సిల్. బై-వన్-గెట్-వన్-ఫ్రీ వంటి కంపెనీల ఉచిత ఆఫర్లను పన్ను పరిధి నుంచి మినహాయించాలని చూస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ నేతృత్వంలోని ఓ ప్యానల్ అధికారులు.. ఉచితాలపై జీఎస్టీని తీసివేసే ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేశారని తెలిసింది. ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ భేటీ కూడా జరుపబోతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అంతేకాక ఉచితంగా ఉత్పత్తిని అమ్ముతున్నట్టు కంపెనీలు వర్గీకరిస్తే ఇన్ని రోజులు వ్యాపారస్తులు ఇన్పుట్ క్రెడిట్‌ను కూడా కోల్పోయేవారు. అయితే ఇక నుంచి గిఫ్ట్‌లు, శాంపుల్స్‌పై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను నిరాకరించకూడదని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రమోషనల్ స్కీమ్స్‌లో బై-వన్-గెట్-వన్-ఫ్రీ అనేది చాలా పాపులర్. కానీ జీఎస్టీ అమల్లోకి వచ్చాక, చాలా కంపెనీలు దీన్ని తీసేశాయి. కొంతమంది దీన్ని అవలంభించినా.. పన్ను డిపార్ట్మెంట్ నుంచి వారికి నోటీసులు వెళ్లాయి. వ్యాపారం కోసం ఉచిత ధరలకు ఏదైనా అందించినా.. లేదా శాంపుల్స్ సరఫరా చేసినా.. ఇన్పుట్ క్రెడిట్‌పై ఎలాంటి పరిమితులు విధించకూడదని పీడబ్ల్యూసీ పరోక్ష పన్ను అధికారి ప్రతీక్ జైన్ చెప్పారు. -
జియో 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్ వారికి కూడా...
ముంబై : ఉచిత వాయిస్, ఉచిత డేటా సర్వీసులతో గతేడాది నుంచి సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలుచేయనున్న జియో, కొత్తగా 'బై వన్ గెట్ వన్ ఫ్రీ' ఆఫర్‌తో మరో సంచలనానికి తెరతీయబోతుంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ రిపోర్టు ప్రకారం రూ.149 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు కూడా అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుందని రివీల్ అయింది. మార్చి 31 తో ముగుస్తున్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కంటే ముందుగా రీఛార్జ్ చేసుకున్న వారికి 1జీబీ, 5జీబీ, 10 జీబీ డేటా అదనంగా ఇస్తామని కంపెనీ ఇంతకమునుపే ప్రకటించిన సంగతి తెలిసిందే. అది ఒక్కటి మాత్రమే కాక రూ.149కు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, మరో 1జీబీ డేటాను పొందవచ్చట. అయితే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోని జియో కస్టమర్లకు ఇదే రీఛార్జ్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అదే ప్రైమ్ మెంబర్లైతే ఈ రీఛార్జ్ కింద 2జీబీ 4జీ డేటాను పొందవచ్చు. జనవరి నుంచి మార్చి 31 వరకు కంపెనీ కస్టమర్లకు హ్యాపీ న్యూయర్ ఆఫర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ప్రస్తుతం ముగియడానికి వస్తోంది. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ కింద రూ.303, రూ.499, రూ.999, రూ.1999, రూ.9999 రీఛార్జ్ లపై అదనపు డేటా ప్రయోజనాలను పొందవచ్చు. ప్రస్తుతం రూ.149 రీఛార్జ్‌తో కూడా డేటా ప్రయోజనాలను పొందవచ్చని తెలుస్తోంది. -
బై వన్ గెట్ వన్ ఆఫర్లకు ఇక కాలం చెల్లినట్టేనా..?
న్యూఢిల్లీ : వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించే ఉచిత డీల్స్ ...ఒకటి కొను మరొకటి ఉచితంగా పొందు(బై వన్ గెట్ వన్ ఫ్రీ) డీల్స్ ఇక కోల్పోనున్నామా..? అంటే నిజంగానే ఇవి ఇక ఉండవట. జీఎస్టీ బిల్లుతో ఈ ఉచిత డీల్స్ కు కళ్లెం పడనుందట. ఈ ప్రతిపాదిత జీఎస్టీ బిల్లు ఉచితంగా కొనే వస్తువులకు కూడా వర్తించే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ బిల్లులోని సెక్షన్ 3 షెడ్యూల్డ్ 1 ప్రకారం ఉచిత సప్లైలా, ప్రైవేట్ సప్లై లా అనేది పరిగణలోకి తీసుకోకుండా ఈ పన్ను వర్తిస్తుంది. దీంతో ఉచితంగా వచ్చే వాటికి కూడా కొనుగోలుదారుడు వస్తుసేవల పన్నును చెల్లించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు తెలుపుతున్నారు. ఈ నిబంధన ప్రముఖమైన అమ్మకాలపై ఎక్కువగా ప్రభావం చూపగలదని చెబుతున్నారు. బిజినెస్ ప్రమోషన్ కోసం ఇచ్చే ఉచిత సాంపిల్స్ కు కూడా జీఎస్టీ వర్తిస్తుందా.. లేదా... అనే దానిపై మరింత సూత్రపాయంగా క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. ఉచిత సరఫరాలపై వేసే ప్రత్యక్ష, పరోక్ష జీఎస్టీ, కంపెనీలు ఖర్చు చేసే సేల్స్ అండ్ మార్కెటింగ్ వాటిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని పీడబ్ల్యూసీ లోని నేషనల్ ఇన్ డైరెక్ట్ టాక్స్ లీడర్ ప్రతీక్ జైన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే మోడల్ జీఎస్టీ బిల్లు ఉచిత షాంపుల్స్ పై ఎటువంటి నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వలేదని జీడీఓ ఇండియా ఇన్ డైరెక్టర్ టాక్స్ పార్టనర్ ప్రశాంత్ రాయిజాడా అన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రం విధించే వివిధ రకాల పన్నుల నుంచి వినియోగదారులను తప్పించి, దేశమంతటా ఒకేవిధమైన పన్ను విధానం జీఎస్టీని తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.