Vodafone Idea Offers One Time Rs 49 Plan For Low Income Users Amid COVID-19 - Sakshi
Sakshi News home page

Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్‌ ఉచితం 

Published Wed, May 19 2021 8:48 AM | Last Updated on Wed, May 19 2021 12:04 PM

Vodafone Idea Rs 49 Free Plan For Low Income Customers Amid Covid 19 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 విపత్తు వేళ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. తక్కువ ఆదాయమున్న 6 కోట్ల మంది కస్టమర్లకు రూ.49 రీచార్జ్‌ ప్యాక్‌ను ఒకసారి ఉచితంగా ఇవ్వనుంది. 28 రోజుల కాలపరిమితి గల ఈ ప్యాక్‌ కింద రూ.38 టాక్‌టైం, 100 ఎంబీ డేటా అందుకోవచ్చు.

ఇక ఈ ప్రయోజనాల విలువ రూ.294 కోట్లు అని కంపెనీ వెల్లడించింది. అలాగే రూ.79 రీచార్జ్‌ ప్యాక్‌పై రూ.128 టాక్‌టైం, 200 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది.  

చదవండి: తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న జియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement