
క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025' (IPL 2025) మొదలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే జియో అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా కొన్ని ప్రత్యేక ప్యాకేజీల ద్వారా క్రికెట్ వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ కథనంలో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యేక డేటా ప్లాన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
జియో
కేవలం 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. 90 రోజుల వ్యాలిడిటీతో, 5జీబీ డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచితంగా ఐపీల్ వీక్షించవచ్చు. ఈ ఆఫర్ 2025 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది.
ఎయిర్‌టెల్
ఎయిర్‌టెల్ కూడా తన యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ అందిస్తోంది. వినియోగదారులు 100 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 5జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. రూ. 195 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 90 రోజుల వ్యాలిడిటీతో 15జీబీ డేటా లభిస్తుంది. 90 రోజుల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ
వోడాఫోన్ ఐడియా
వోడాఫోన్ ఐడియా అందిస్తున్న రూ.101 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో.. 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే 151 రూపాయల రీఛార్జ్ ద్వారా 4జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 169 రూపాయల ప్లాన్ ద్వారా 8జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో.. 30 రోజుల మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment