indian premier league
-
ఐపీఎల్ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్
ఐపీఎల్‌పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ ఒలిపింక్స్‌తో సమానమని లాంగర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఆండీ ప్లవర్ స్ధానాన్ని లంగర్‌తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఐపీఎల్లో హెడ్‌కోచ్ పదివి చేపట్టడం లంగర్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. లంగర్‌కు కోచ్‌గా అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్ తొలి టీ20 వరల్డ్‌కప్(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్‌లో కూడా లంగర్ కోచ్‌గా విజయవంతమయ్యాడు. ఈనేపథ్యంలో లక్నో ఫ్రాంచైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లంగర్ మాట్లాడుతూ.. "రికీ పాటింగ్కు ఐపీఎల్ టోర్నీ అంటే చాలా ఇష్టం. అతడితో నేను ఎప్పుడు మాట్లాడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ప్రయాణం గురించే చెబుతూ ఉంటాడు. అదే విధంగా నా బెస్ట్ ఫ్రెండ్ టామ్ మూడీ సైతం ఐపీఎల్లో చాలా కాలంగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు కూడా చాలా సార్లు ఈ టోర్నీ కోసం నాతో మాట్లాడాడు. ఐపీఎల్ అనేది ఒలింపిక్స్ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రతీ మ్యాచ్ ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఆదరణ ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. చదవండి: PAK vs AUS: పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్ -
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు..
RCB appoint Sanjay Bangar as head coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. తదుపరి రెండు ఐపీఎల్ సీజన్లకు ప్రధాన కోచ్‌గా అతడిని ఆర్సీబీ నియమించింది. అయితే గత కొద్ది సీజన్ల నుంచి ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బంగర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఐపీఎల్-2021 తొలి దశలో ఆర్సీబీకు ప్రధాన కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్.. సెకెండ్ ఫేజ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మైక్ హెస్సన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మైక్ హెస్సన్ ఆజట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆర్సీబీ సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! -
ఐపీఎల్ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు
ఆంటిగ్వా: పొట్టి ఫార్మాట్‌పై వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత మైఖేల్ హోల్డింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్ అసలు క్రికెట్టే కాదని, అందుకే ఆ ఫార్మట్‌లో జరిగే ఐపీఎల్ తదితర లీగ్‌ల్లో కామెంటరీ చెప్పడం లేదని పేర్కొన్నాడు. తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను క్రికెట్‌కు మాత్రమే కామెంటరీ చెబుతానని, తాను ఐపీఎల్‌ను క్రికెట్‌గా పరిగణించనని, అందుకే కామెంటరీ చెప్పడం లేదని వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రస్తుత విండీస్ క్రికెట్ దుస్థితిపై ఆయన స్పందించాడు. టీ20ల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్లో తమ దేశం రాణించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలి కాలంలో తమ జట్టు పొట్టి ఫార్మాట్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ.. ఆ గెలుపు అసలు గెలుపే కాదని, ఈ టోర్నీలు నెగ్గడం విండీస్ క్రికెట్‌కు పునరుజ్జీవం కాదని అభిప్రాయపడ్డాడు. విండీస్ క్రికెటర్లు దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడడం మానేసి, డబ్బు కోసం ఐపీఎల్ లాంటి క్యాష్ రిచ్ లీగ్‌ల బాట పట్టారని ఆయన వాపోయాడు. విండీస్ లాంటి పేద దేశం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులలా ఆటగాళ్లకు వేతనాలు చెల్లించలేవని, అందుకే తమ ఆటగాళ్లు ఆ దేశాల్లో జరిగే టీ20 క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నాడు. వేతన వివాదాలపై తమ దేశ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య అనేక వివాదాలున్నాయని, ఇలాంటి పరిస్థితులుంటే ఆటగాళ్లు మాత్రం ఏం చేయగలరని వ్యాఖ్యానించాడు. క్రికెటర్లను నిందించడం తన ఉద్దేశం కాదని, డబ్బులు ఎర వేసి ఆటగాళ్లను లోబర్చుకుంటున్న నిర్వాహకులను మాత్రమే తాను విమర్శిస్తున్నాని పేర్కొన్నాడు. తమ దేశ స్టార్ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌కు చాలా సేవలు చేయాల్సి ఉందని, కానీ వారికి అవేవీ పట్టడం లేదని గేల్, రసెల్, బ్రేవో, పొలార్డ్, సునీల్ నరైన్ లాంటి క్రికెటర్లనుద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో విండీస్ జట్టు టీ20 టోర్నమెంట్లను గెలుస్తుండవచ్చని, అయితే అది క్రికెట్టే కాదు.. అసలు గెలుపే కాదని తెలిపాడు. కాగా, మైఖేల్ హోల్డింగ్ ఇటీవలే జాత్యహంకార అంశంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను ఇంగ్లండ్‌లో పెరిగి ఉంటే.. అసలు బతికి ఉండేవాడినే కాదని, అదృష్టవశాత్తు తాను అక్కడ పెరగలేదని, లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే చనిపోయేవాడినని అన్నాడు. 1979లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన 67 ఏళ్ల హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. మొత్తంగా 391 వికెట్లు పడగొట్టాడు. చదవండి: కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..? -
క్రికెట్ కుంభమేళా: నేటి నుంచి ఐపీఎల్–2021
ఐపీఎల్ ఆటకు వేళయింది. టైటిల్ వేటకు రంగం సిద్ధమైంది. ఈ రెండింటికి ముందే ‘పాజిటివ్’ల గోల మొదలైంది. డగౌట్లో మాస్క్‌లతో... మైదానంలో బ్యాట్, ప్యాడ్లతో మెరుపుల లీగ్ రెడీ రెడీ అంటోంది. ఓ విధంగా ఇది క్రికెట్ కుంభమేళానే! కానీ వైరస్ వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా టీవీలకే అతుక్కుపోయే క్రికెట్ మేళా ఇది! ఒకప్పుడు ఐపీఎల్ అంటే బౌండరీ మీటర్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్‌లే తారుమారయ్యేవి. కానీ ఇప్పుడు మహమ్మారి కేసులు, క్వారంటైన్, ఐసోలేషన్లు లీగ్‌లో భాగమయ్యాయి. ఆటగాళ్లు తేల్చుకుంటారు మైదానంలో! మనం మాత్రం చూసుకుందాం టీవీల్లో! ఎందుకంటే కరోనా వైరస్ కాచుకుంది. గతానికి భిన్నంగా మనదేశంలో జరిగే ఐపీఎల్ పోటీలను మన వెళ్లి చూడలేని పరిస్థితి. గతేడాది యూఏఈలో జరిగినా... అది పరాయిగడ్డ! కానీ మన నగరాల్లో మెరుపులు మెరిపిస్తున్నా... అవి మనకు బుల్లితెరల్లోనే కనిపిస్తాయి. ఈల గోల ఉండదు. ఆడే ఆటగాళ్లు, తీర్పులిచ్చే అంపైర్లు, ఖాళీగా కుర్చీలు కనిపిస్తాయి. అయితే ఆట బోసిపోదు. మెరుపుల పవర్ తగ్గదు. బౌలింగ్ పదును తగ్గదు. తొలి పంచ్ విసిరేందుకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సై అంటోంది. శుభారంభం చేసేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమంటోంది. -
సన్‌రైజర్స్‌కు షాక్.. కీలక ఆటగాడికి గాయం..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతూ, బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించడంతో సన్‌రైజర్స్ యాజమాన్యంలో గుబులు మొదలైంది. గడిచిన కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ తరఫున కీలక ఆటగాడిగా రాణిస్తున్న విలియమ్సన్ గాయం కారణంగా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని యాజమాన్యం భావిస్తోంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్‌ల నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్‌గా ఉండటం తమకెంతో ముఖ్యమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కివీస్ హెడ్ కోచ్ ప్రకటన నేపథ్యంలో విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీలక ఆటగాడు బెయిర్ స్టోలపై అదనపు భారం పడనుంది. -
పేటీఎంకు గూగుల్ షాక్!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీల సంస్థ పేటీఎంకు టెక్ దిగ్గజం గూగుల్ శుక్రవారం షాకిచ్చింది. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. నిబంధనలకు విరుద్ధంగా క్రీడలపై బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. దీంతో కొద్ది గంటలపాటు పేటీఎం యాప్‌పై గందరగోళం నెలకొంది. అయితే, వివాదాస్పదమైన ’క్యాష్‌బ్యాక్’ ఫీచర్‌ను పేటీఎం తొలగించడంతో యాప్‌ను సాయంత్రానికి గూగుల్ మళ్లీ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచింది. గూగుల్ నిబంధనలకు అనుగుణంగా క్యాష్‌బ్యాక్ కింద ఆఫర్ చేస్తున్న స్క్రాచ్ కార్డులను ఉపసంహరించినట్లు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. కొత్త కస్టమర్లను చేర్చుకోనివ్వకుండా పేటీఎంకు గూగుల్ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ వృద్ధి చెందేందుకు మరింత తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. ‘(గూగుల్ వంటి) కొన్ని ప్లాట్‌ఫామ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆధిపత్యం గలవారు బాధ్యతగా కూడా మెలగాల్సి ఉంటుంది. ఈ దేశ అభివృద్ధి పాలుపంచుకోవాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుంది. నవకల్పనలను అణగదొక్కేయకుండా దేశ స్టార్టప్ వ్యవస్థకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతోంది. ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లు మొదలయ్యే ముందు బెట్టింగ్ యాప్స్ కుప్పతెప్పలుగా రావడం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకు ముందు ఏం జరిగిందంటే... ప్లేస్టోర్‌లో పేటీఎం యాప్ పునరుద్ధరణకు ముందు పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ‘ప్లే స్టోర్ నిబంధనలను ఉల్లఘించినందుకు యాప్‌ను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ టోర్నమెంటు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మా విధానాలపై వివరణ విడుదల చేశాం‘ అని గూగుల్ పేర్కొంది. కేవలం ప్లే స్టోర్‌లో ఉన్న యాప్‌ను మాత్రమే తొలగించామని, ఇప్పటికే ఉన్న యూజర్లపై ప్రతికూల ప్రభావమేదీ ఉండబోదని తెలిపింది. మరోవైపు, ఈ పరిణామంపై స్పందించిన పేటీఎం .. ప్లే స్టోర్‌లో కొత్తగా డౌన్లోడ్ చేసుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు తమ యాప్ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, యాప్‌ను వెంటనే మళ్లీ అందుబాటులోకి తెస్తామని, యూజర్ల డబ్బుకేమీ ఢోకా లేదని భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. క్రికెట్ లీగ్ తెచ్చిన తంటా.. క్రికెట్ ఇష్టపడే యూజర్లు తాము జరిపే లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు పొందే విధంగా తమ కన్జూమర్ యాప్‌లో ఇటీవల ’పేటీఎం క్రికెట్ లీగ్’ను ప్రారంభించినట్లు పేటీఎం ప్రతినిధి తెలిపారు. ‘ఈ గేమ్ ఆడే యూజర్లకు ప్రతీ లావాదేవీ తర్వాత స్టిక్కర్స్ లభిస్తాయి. వాటన్నింటినీ సేకరించి, పేటీఎం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ భారత్‌లో పూర్తిగా చట్టబద్ధమే. మేం అన్ని నిబంధనలు, చట్టాలను పక్కాగా పాటిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది తమ నిబంధనలకు విరుద్ధమని గూగుల్ భావిస్తోంది. అందుకే ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌ను తొలగించింది‘ అని వివరించారు. బెట్టింగ్ యాప్స్ అన్నీ తొలగింపు.. క్రీడలపై బెట్టింగ్ చేసే యాప్స్ వేటినీ తాము అనుమతించబోమని, అలాంటి వాటన్నింటినీ తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తామని గూగుల్ తమ బ్లాగ్‌లో వెల్లడించింది. ‘స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే అనియంత్రిత గ్యాంబ్లింగ్ యాప్స్, ఆన్లైన్ కేసినోలు మొదలైన వాటిని మేం అనుమతించం‘ అని స్పష్టం చేసింది. యూజర్లు నష్టపోకుండా, వారి ప్రయోజనాలు కాపాడేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో గూగుల్‌ప్లే డెవలపర్ అకౌంట్‌ను రద్దు చేయడం సహా తీవ్ర చర్యలు ఉంటాయని ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ సుజానె ఫ్రే తెలిపారు. మరోవైపు, ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్ ఇలాంటి చర్య తీసుకోవడమనేది .. తమ కఠినతరమైన విధానాల గురించి డెవలపర్లకు మరోసారి గుర్తు చేయడానికే అయి ఉంటుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనం చంద్వానీ పేర్కొన్నారు. -
బాలీవుడ్ సాంగ్‌ని రీక్రియేట్ చేసిన ధావన్ దంపతులు
సాక్షి, ఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే స్టార్స్‌కి కాస్త సమయం దొరికినట్లయ్యింది. ఈ క్వాలిటీ టైంని కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అతడి సతీమణి అయేషాతో కలిసి బాలీవుడ్ క్లాసిక్ సాంగ్‌ను రిక్రియేట్ చేస్తూ డ్యాన్స్ చేశారు. టేబుల్ టెన్నిస్ రాకెట్లు, పింగ్ పాంగ్ బంతినే ప్రాపర్టీస్‌గా వాడుతూ భార్యాభర్తలిద్దరూ ‘హమ్‌జోలి’ చిత్రంలోని ‘జానే దో జానా హై’ పాటకు స్టెప్పులేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శిఖర్ ధావన్ ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘హమ్‌జోలి’ చిత్రంలోని ఈ ఒరిజినల్ పాటలో నటుడు జితేంద్ర, నటి లీన్ చందవర్కర్ బ్యాడ్మింటన్ ఆడుతూ సాగుతుంది ఈ పాట. శిఖర్ ధావన్ దంపతులు కూడా సేమ్ సీన్ రీ క్రియేట్ చేస్తూ డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram Ho gayi shaam jaane do jaana hai 😉😜😘 @aesha.dhawan5 #JeetendraJi A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Apr 2, 2020 at 6:04am PDT -
శ్రీనాథ్‌కు రూ. 52 లక్షలు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడంతో పాటు ఆర్థికపరంగా కూడా వారికి మంచి స్థాయి లభించింది. ఇదే తరహాలో లీగ్‌తో భాగస్వామ్యం ఉన్న అనేక మందికి ఐపీఎల్ ద్వారా పెద్ద మొత్తాలు దక్కాయి. ఇందులో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ఉన్నారు. 2019 ఐపీఎల్లో ఎనిమిది మంది భారత అంపైర్లకు చేసిన చెల్లింపుల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. శ్రీనాథ్‌కు ఈ సీజన్ కోసం 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించాయి. శ్రీనాథ్‌తో సరిగ్గా సమానంగా అంపైర్ నితిన్ మీనన్‌కు కూడా 52 లక్షల 45 వేల 128 రూపాయలు లభించడం విశేషం. ఎస్. రవి రూ. 42.46 లక్షలు, మను నాయర్ రూ. 41.96 లక్షలు, షంషుద్దీన్ రూ. 41.00 లక్షలు... అనిల్ దండేకర్, యశ్వంత్ బెర్డే, నారాయణన్ కుట్టి తలా రూ.32.96 లక్షలు, నందన్ రూ. 37.04 లక్షలు అందుకున్నారు. -
సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టును విశ్వ విజేతగా నిలిపి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా పేరున్న ట్రెవర్ బేలిస్... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌కు టామ్ మూడీ (ఆస్ట్రేలియా) హెడ్ కోచ్‌గా ఉన్నాడు. బేలిస్ సైతం ఆస్ట్రేలియాకు చెందినవాడే. కొంతకాలంగా ఇంగ్లండ్‌కు శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇతడి ఆధ్వర్యంలోనే ఆ జట్టు 2015 యాషెస్ సిరీస్‌ను 3–2 తేడాతో గెల్చుకుంది. 2016 టి20 ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. అనంతరం వన్డేల్లో నంబర్‌వన్‌గానూ అవతరించింది. తాజాగా వన్డే ప్రపంచ కప్‌నూ సాధించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్‌తో ఇంగ్లండ్ జాతీయ జట్టుతో బేలిస్ ఒప్పందం ముగియనుంది. దీనికిముందు 2010–11లో అతడు ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం శ్రీలంక జాతీయ జట్టుకు పనిచేశాడు. లంక 2011 ప్రపంచ కప్‌లో ఫైనల్ చేరినప్పుడు బేలిస్ ఆ దేశ కోచ్‌గా ఉన్నాడు. 2012–15 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సందర్భంలోనూ అతడే శిక్షకుడు. బేలిస్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ సైతం ప్రయత్నించాయి. కోల్‌కతాతో చర్చలు కూడా నడిచినా అవి ముందుకు సాగలేదు. మూడీ సేవలకు వీడ్కోలు సన్‌రైజర్స్ కోచ్‌గా టామ్ మూడీది విజయవంతమైన ప్రయాణమే. అతడు ఏడు సీజన్ల పాటు బాధ్యతలు నిర్వర్తించాడు. ఇందులో 2016లో హైదరాబాద్ లీగ్ విజేతగా నిలవగా, 2018లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. ‘మూడీ స్థానంలో ఫ్రాంచైజీకి కొత్త హెడ్ కోచ్‌ను నియమించాలన్నది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. జట్టు భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసేందుకు అతడు సరైనవాడు ’ అని సన్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. జట్టుపై మూడీ ప్రభావాన్ని ఈ సందర్భంగా కొనియాడింది. ‘సన్ రైజర్స్ పురోగతి, విజయాల్లో మూడీది చెరగని ముద్ర. లీగ్‌లో అత్యధిక కాలం కోచ్‌గా పనిచేశాడు. అయినా కొత్తవారికి కోచింగ్ బాధ్యతలు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది’ అని సన్‌రైజర్స్ సీఈవో షణ్ముగం తెలిపాడు. -
ఐపీఎల్‌తో ఎంత ఆదాయమో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇప్పుడు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం 2018-19 మధ్యకాలంలో సుమారు రూ. 2,017 కోట్ల మిగులు ఆదాయాన్ని బీసీసీఐ ఆర్జించనుంది. ఇక బోర్డుకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు, అంతర్జాతీయ, దేశీయ మ్యాచుల ద్వారా కేవలం రూ.125 కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా వచ్చే ఆదాయం రూ.3,413 కోట్లు. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ బోర్డు ఆదాయంలో ఐపీఎల్ వాటా సుమారు 95 శాతానికి పైమాటే. గతేడాది ఇది 60 శాతం మాత్రమే ఉంది. ఈ లెక్కన్న ఏడాదిలో బీసీసీఐకి వచ్చే ఆదాయం కన్నా.. 45 రోజుల పాటు కొనసాగే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం 16 రెట్లు అధికంగా ఉందన్న మాట. ప్రసార హక్కుల కోసం స్టార్ ఇండియాతో సుమారు 16, 347 కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం మూలంగానే ఇది అమాంతం పెరగటానికి కారణమని చెప్పుకొవచ్చు. ఇక మొత్తం ఆదాయంలో.. క్రీడా సదుపాయాలు, ఇతరత్రా వాటికి బీసీసీఐ రూ.1,272 కోట్లను ఖర్చు చేయనుంది. -
సన్‌రైజర్స్‌కు ధావన్, పంజాబ్‌కు అశ్విన్
సాక్షి, బెంగళూరు: పది సీజన్లు ముగించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభించింది. క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రెకెత్తిస్తున్న ఈ వేలంలో తొలి ఆటగాడిగా ఉన్న శిఖర్ ధావన్‌ను పాత జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ వేలంలో ముంబై ఇండియన్స్, పంజాబ్, సన్‌రైజర్స్ జట్లు పోటీపడగా చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.5.2 కోట్లకు ధావన్‌ను కొనుగోలు చేసి ధావన్‌పై నమ్మకాన్ని ఉంచింది. నిషేధం విదించక ముందు వరకు 8 సీజన్ల వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడిన స్టార్ స్పిన్నర్ అశ్విన్‌ను ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. వేలంలో 7.6 కోట్ల భారీ ధరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ జట్లు అశ్విన్ కోసం ఆసక్తి చూపాయి. అయితే సెహ్వాగ్ సూచనతో ప్రీతి జింతా అశ్విన్‌ను కొనుగోలు చేసి విలువైన ఆటగాడిని పంజాబ్‌కు తీసుకున్నారు. -
ఐపీఎల్ విజేతకు రూ.15 కోట్లు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్లో విజేతగా నిలిచిన జట్టు రూ. 15 కోట్లు ఎగరేసుకుపోనుంది. రన్నరప్‌కు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ప్లే ఆఫ్‌లో భాగంగా ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమయ్యే మిగతా రెండు జట్లకు రూ.7.5 కోట్ల చొప్పున అందనున్నాయి. ఓవరాల్‌గా ప్లేఆఫ్ నుంచి తుది పోరు వరకు రూ.40 కోట్ల ప్రైజ్‌మనీ పంపిణీ చేయనున్నారు. ఈనెల 27 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. -
రంజుగా ప్లే ఆఫ్ రేసు
పంజాబ్, చెన్నైలకు ఇప్పటికే అర్హత రాజస్థాన్, కోల్‌కతాలకు మెరుగైన అవకాశాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కీలక దశకు చేరుకుంది. లీగ్‌లో 56 మ్యాచ్‌లకు గాను 48 మ్యాచ్‌లు ముగిశాయి. ఇంకా ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఏడో సీజన్లో ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇంతకుముందే ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఢిల్లీకి ఎలాంటి అవకాశాలు లేవు. ఇక మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆయా జట్ల ప్రస్తుత స్థితి... - సాక్షి క్రీడావిభాగం రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు ఆడాల్సినవి: 23న పంజాబ్ (మొహాలీలో)తో, 25న ముంబై (వాంఖడేలో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి నెగ్గినా రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు సమీకరణాలతో సంబంధం లేకుండానే అర్హత సాధిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడటం ద్వారా రాజస్థాన్ రన్‌రేట్ మరింతగా పడిపోతుంది. లేదంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోవాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 22న బెంగళూరు (ఈడెన్‌లో)తో, 24న హైదరాబాద్ (ఈడెన్‌లో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్ చేరుతుంది. ఒకవేళ రెండూ ఓడితే బెంగళూరు, హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 23న ఢిల్లీతో, 25న రాజస్థాన్‌తో (రెండు వాంఖడేలోనే) ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. అలాగే హైదరాబాద్, బెంగళూరు జట్లు తప్పనిసరిగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. రాజస్థాన్, కోల్‌కతాలలో ఒక జట్టు రెండు మ్యాచ్‌లు ఓడాలి. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 22న కోల్‌కతా (ఈడెన్‌లో)తో, 24న చెన్నై (బెంగళూరులో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో తనకన్నా మెరుగైన స్థానంలో ఉన్న రాజస్థాన్, కోల్‌కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో హైదరాబాద్, ముంబై జట్లు ఒక్కో మ్యాచ్‌లో అయినా ఓడిపోవాలి. బెంగళూరు రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. హైదరాబాద్ సన్‌రైజర్స్ ప్రస్తుతం: 12 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మిగిలిన మ్యాచ్‌లు: 22న చెన్నై (రాంచీలో)తో, 24న కోల్‌కతా (ఈడెన్‌లో)తో ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్, కోల్‌కతా జట్లలో ఏదైనా ఒక జట్టు తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో బెంగళూరు, ముంబై జట్లు కచ్చితంగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. హైదరాబాద్ రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. -
తొలుత యూఏఈలో.. తర్వాత భారత్‌లో..
ఐపీఎల్-7 షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికగా బంగ్లాదేశ్ ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు ఐపీఎల్-7 47 రోజుల్లో 60 మ్యాచ్‌లు మ్యాచ్‌ల తేదీలను శుక్రవారం ప్రకటించనున్న బీసీసీఐ తొలి విడత ఏప్రిల్ 16-30 (దుబాయ్‌లో) రెండో విడత మే 1-12 (భారత్‌లో లేదా బంగ్లాదేశ్‌లో) మూడో విడత మే 13-జూన్ 1 (భారత్‌లో) న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ వేదికపై సస్పెన్స్ వీడింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకు భద్రత కల్పించలేమని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రత్యామ్నాయ వేదికలను ఎంపిక చేసింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు జరిగే ఐపీఎల్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరిగే తొలి విడతలో కనీసం 16 మ్యాచ్‌లు యూఏఈలోజరుగుతాయి. ఈ టి20 మ్యాచ్‌లను అబుదాబి, దుబాయ్, షార్జాలలో నిర్వహిస్తారు. మే 1 నుంచి 12 వరకు రెండో విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లోనే రెండో విడత మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ మ్యాచ్‌లకు హోంశాఖ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒకవేళ అనుమతి రాకపోతే రెండో విడత మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహిస్తారు. దీనికి బంగ్లా ప్రభుత్వం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఆమోదం తెలిపాయి. ఫైనల్ లెగ్ భారత్‌లోనే... రెండో విడత మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించినా... మే 13 నుంచి జూన్ 1 వరకు జరిగే చివరి విడత (ఫైనల్ లెగ్) మ్యాచ్‌లను మాత్రం భారత్‌లోనే నిర్వహిస్తారు. అప్పటికే అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మిగిలిన కొన్ని లీగ్‌లతో పాటు ప్లే ఆఫ్‌లు, ఫైనల్‌ను భారత్‌లోనే నిర్వహిస్తారు. మే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌తో సహా) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా జరగనుంది. చివరి విడత పోలింగ్ నుంచి కౌంటింగ్ తేదీ వరకు మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐ పెద్దలు హోంశాఖ అధికారుల సలహా కోరనున్నారు. ఇక బీసీసీఐ, ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ మ్యాచ్‌ల తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. శుక్రవారం మ్యాచ్‌ల తేదీలను వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. విదేశాల్లో రెండోసారి... ఐపీఎల్ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించడం ఇది రెండోసారి. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా రెండో సీజన్‌ను పూర్తిగా దక్షిణాఫ్రికాలోనే నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఎన్నికల షెడ్యూల్(ఏప్రిల్ 7 నుంచి మే 12)ను దృష్టిలో పెట్టుకుని తొలి విడతను విదేశాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు యూఏఈలో తొలి విడత మ్యాచ్‌లను నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్వాగతించింది. బీసీసీఐ నిర్ణయం యూఏఈలోని క్రికెట్ ప్రేమికులకు శుభవార్త అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ అన్నారు. ఈ టోర్నీ యూఏఈలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానే తోడ్పడుతుందని రిచర్డ్సన్ ధీమా వ్యక్తం చేశారు. -
పార్టీలే చెడగొట్టాయి జస్టిస్ ముద్గల్ వ్యాఖ్య
ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్‌కు మంచిదే అయినప్పటికీ... కాసుల వర్షం కురవడమే అసలు వివాదాలకు కారణమని జస్టిస్ ముకుల్ ముద్గల్ అన్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఇటీవలే ఆయన సమర్పించిన నివేదిక భారత క్రికెట్లో సంచలనం రేపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పార్టీలే మొత్తం వివాదాలకు కేంద్ర బిందువయ్యాయని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు. తానిచ్చిన నివేదికతో ఇప్పుడు వివాదాలు తగ్గు ముఖం పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘నిస్సందేహంగా ఈ టోర్నీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాల్ని కల్పించింది. ఐపీఎల్లో ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. వారిని సెలెబ్రిటీలను చేసింది. అనుకోకుండా వచ్చి పడిన డబ్బుల కారణంగా వారిలో అహంకారం పెరిగిపోయింది. అయితే ఆటగాళ్లు డబ్బులు సంపాదించడానికి నేను వ్యతిరేకం కాదు’ అని జస్టిస్ ముద్గల్ అన్నారు. లేట్‌నైట్ పార్టీలు కొందరు యువ ఆటగాళ్లను చెడగొట్టాయని ముద్గల్ విమర్శించారు. -
ఐదుగురిని కొనసాగించొచ్చు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకునే అవకాశం ఇవ్వాలన్న ఫ్రాంచైజీల విజ్ఞప్తిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మన్నించింది. గతంలో ఈ సంఖ్య నాలుగుగా ఉండగా ఇప్పుడు దీనిని ఐదుకు పెంచారు. పైగా ‘రైట్ టు మ్యాచ్’ పేరుతో ఆరో ఆటగాడిని కూడా కొనసాగించే అవకాశాన్ని కూడా కల్పించారు. ఐపీఎల్-2014కు సంబంధించిన కొత్త నిబంధనలు, మార్పుచేర్పులను గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. ఐపీఎల్-7 కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న వేలం నిర్వహిస్తారు. అవసరమైతే దీనిని మరో రోజు పొడిగించవచ్చు. వేలం నిర్వహించే వేదికను ఇంకా ఖరారు చేయలేదు. ఐపీఎల్-2014 ప్రధాన నిబంధనలు ప్రతీ జట్టులో 16కు తగ్గకుండా, 27కు మించకుండా ఆటగాళ్లు ఉండాలి. ఇందులో విదేశీ ఆటగాళ్లు 9 మంది మాత్రమే. జట్టులో ఎంచుకునే అండర్-19 స్థాయి ఆటగాళ్లు కనీసం ఫస్ట్ క్లాస్ లేదా లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. ఆటగాళ్ల కోసం ఒక ఫ్రాంచైజీ రూ. 60 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. 2013 ఐపీఎల్ ఆడిన జట్టునుంచి ఐదుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీ విడుదల చేయకుండా తమ వద్దే కొనసాగించవచ్చు. మొదటి ఆటగాడికి రూ. 12.5 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 9.5 కోట్లు...ఇలా తగ్గిస్తూ ఐదుగురు ఆటగాళ్లకు గవర్నింగ్ కౌన్సిల్ విలువ నిర్ధారించింది. ఇదే మొత్తాన్ని ఫ్రాంచైజీ ఫీజునుంచి (ఆటగాళ్లతో చేసుకున్న ఒప్పందంతో సంబంధం లేకుండా) తగ్గిస్తారు. ఉదాహరణకు చెన్నై జట్టు ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే కొనసాగిస్తే ఆ జట్టు మొత్తం రూ. 39 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మిగిలిన రూ. 21 కోట్లతోనే ఆ జట్టు మిగతా 22 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. ‘రైట్ టు మ్యాచ్’ అంటే.... ఫ్రాంచైజీలు ఐదుగురిని అట్టి పెట్టుకోవడంతో పాటు ఆసక్తి ఉంటే వేలం తర్వాత ఆరో ఆటగాడిని కూడా కొనసాగించే అవకాశం ఉంది. 2013 సీజన్లో ఒక జట్టుకు ఆడిన ఆటగాడిని వేలంలో మరో జట్టు సొంతం చేసుకుందనుకుందాం. అయితే అప్పుడు కూడా ఆ క్రికెటర్ వేలంలో అమ్ముడైన మొత్తం చెల్లించి పాత ఫ్రాంచైజీయే తీసుకోవచ్చు.