ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతూ, బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించడంతో సన్‌రైజర్స్ యాజమాన్యంలో గుబులు మొదలైంది. గడిచిన కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ తరఫున కీలక ఆటగాడిగా రాణిస్తున్న విలియమ్సన్ గాయం కారణంగా దూరమైతే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని యాజమాన్యం భావిస్తోంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్‌ల నేపథ్యంలో కేన్ విలియమ్సన్ ఫిట్‌గా ఉండటం తమకెంతో ముఖ్యమని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. కివీస్ హెడ్ కోచ్ ప్రకటన నేపథ్యంలో విలియమ్సన్ ఐపీఎల్ 2021 సీజన్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీలక ఆటగాడు బెయిర్ స్టోలపై అదనపు భారం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment