IPL 2023: Aiden Markram likely to become SRH captain - Sakshi
Sakshi News home page

IPL 2023: భువీ, అభిషేక్‌ కాదు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ అతడే!

Published Tue, Nov 22 2022 9:32 AM | Last Updated on Tue, Nov 22 2022 10:26 AM

Sunrisers Hyderabad set to offer Aiden Markram captaincy: Reports - Sakshi

ఐపీఎల్‌-2023 మినీ వేలంకు ముందు న్యూజిలాండ్‌ కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారన్నది అన్నది ప్రస్తుతం అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.

ఈ క్రమంలో ఐపీఎల్‌-2023లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా ఆ జట్టు ఆల్‌రౌండర్‌ ఐడెన్ మార్క్‌రామ్‌ను నియమించాలని మేనేజెమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తొలుత భువనేశ్వర్‌ కుమార్‌ లేదా యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

"జట్టు కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉంది. అభిమానులు కూడా మా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు అని నాకు తెలుసు. కానీ కెప్టెన్సీ పెద్ద బాధ్యత. ప్రస్తుతం మా దృష్టిలో ఐడెన్‌ మార్క్‌రామ్‌ ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనుభవం లేనప్పటికీ జట్టును నడిపించగల సత్తా ఉంది.

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా మా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఐడన్‌కే అప్పజెప్పాలని భావిస్తున్నాము. త్వరలోనే మా కోచింగ్‌ స్టాప్‌తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాము" అని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీకు సంబంధించిన ఓ అధికారి ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో పేర్కొన్నారు.

సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.,భువనేశ్వర్‌ ​కుమార్‌

సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్
చదవండి:
 IND vs NZ: గెలిస్తే... సిరీస్‌ మన చేతికి.. సంజూ సామ్సన్‌, యువ పేసర్‌కు అవకాశం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement