ఒక్క సీజన్‌కేనా? ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా కమ్మిన్స్‌ సరైనోడు కాదు! | What Is SRH Thinking?: Irfan Pathan Reacts On IPL Captain Sacking | Sakshi
Sakshi News home page

IPL 2024: ఒక్క సీజన్‌కేనా.. మార్క్‌రమ్‌ ఏం తప్పు చేశాడు? అతడు సరైనోడు కాదు

Published Tue, Mar 5 2024 10:48 AM | Last Updated on Tue, Mar 5 2024 11:25 AM

Whats SRH Thinking?: Irfan Pathan Reacts IPL Captain Sacking - Sakshi

PC: CRIC TRACKER

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కెప్టెన్సీ మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్‌, వన్డే ప్రపంచకప్‌ 2023 విన్నింగ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ను తమ జట్టు కొత్త కెప్టెన్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌ నియమించింది. గతేడాది సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఎయిడెన్‌ మార్క్రమ్‌ను తప్పిస్తూ కమ్మిన్స్‌కు తమ జట్టు పగ్గాలను ఆరెంజ్‌ ఆర్మీ అప్పగించింది. 

కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ వేలంలో రికార్డు స్థాయిలో కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్‌ దక్కించుకుంది. అయితే గత మూడేళ్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ సారథ్య బాధ్యతలు చేపట్టిన నాలుగో ఆటగాడిగా కమ్మిన్స్‌ నిలిచాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్ చేరాడు. 

"ప్యాట్‌ కమ్మిన్స్‌ అద్భుతమైన కెప్టెన్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడొక వరల్డ్‌క్లాస్‌ కెప్టెన్‌. కమ్మిన్స్‌ సారథ్యంలోనే ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. గత రెండేళ్లగా తన వ్యక్తిగత ప్రదర్శనతో కూడా కమ్మిన్స్‌ అకట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఒక్కటే సమస్య. టెస్టుల్లో, వన్డేల్లో సారథి సఫలమైన కమ్మిన్స్‌.. టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు.

అదే విధంగా టీ20ల్లో తన వ్యక్తిగత ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. ఐపీఎల్‌లో కూడా అతడి గణాంకాలు అంత బాగోలేవు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ ఏ ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు.  ఇప్పుడు మార్క్రరమ్‌ పరిస్థితి ఏంటి? అతడికి కేవలం ఒక్క సీజన్‌లో మాత్రమే కెప్టెన్సీ ఛాన్స్‌ ఇచ్చారు.

మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్‌ పేర్కొన్నాడు.  కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్‌రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం సారథిగా ఈ ప్రోటీస్‌ స్టార్‌ విఫలమయ్యాడు.
చదవండి: WPL 2024: భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. దెబ్బకు కారు అద్దం పగిలిపోయింది! వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement