న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను రిటైన్ చేసుకోకుండా వేలంలో పెట్టింది. అతడితో పాటు ఈ ఏడాది మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ను కూడా ఎస్‌ఆర్‌హెచ్ విడిచిపెట్టింది.
ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది. తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించే గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో ఎస్‌ఆర్‌హెచ్ తమ జాబితాను ప్రకటించింది. ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 12 మంది ఆటగాళ్లనే మాత్రమే రిటైన్ చేసుకుంది.
నిరాశ పరిచిన విలియమ్సన్
ఈ ఏడాది మెగా వేలంలో కేన్ విలియమ్సన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో విలియమ్సన్ తన స్దాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలయ్యాడు. 13 మ్యాచ్‌లు ఆడిన కేన్ మామ 216 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్సీ పరంగా కూడా అంతగా అకట్టుకోలేకపోయాడు.
అదే విధంగా నికోలస్ పూరన్‌ను కూడా రూ.10.75 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసింది. అతడు కూడా దారుణంగా విఫమయ్యాడు. మరో విండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెఫార్డ్‌ను కూడా ఎస్‌ఆర్‌హెచ్ విడిచిపెట్టింది. మెగా వేలంలో షెఫార్డ్‌ను రూ.7.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఇక ఓవరాల్‌గా మినీ వేలంకు ముందు ఎస్‌ఆర్‌హెచ్ పర్స్‌లో రూ.42.25 కోట్లు ఉన్నాయి.
సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.
సన్‌రైజర్స్ విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితా
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్
చదవండి: T20 WC 2022: 'రోహిత్ పని అయిపోయింది.. ఆ ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయండి'
Comments
Please login to add a commentAdd a comment