ఐపీఎల్-2023 మినీ వేలంకు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేలంలో విలియమ్సన్‌ను రూ.14 కోట్ల భారీ ధరకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో విలియమ్సన్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు.
అదే విధంగా కెప్టెన్సీ పరంగా జట్టును నడిపించడంలో కేన్ విఫలమయ్యాడు. ఈ నేఫథ్యంలోనే అతడిని ఎస్‌ఆర్‌హెచ్ విడిచిపెట్టింది. ఇక అతడితో పాటు విండీస్ ఆటగాళ్లు నికోలాస్ పూరన్, రొమారియో షెపర్డ్ లను కూడా సన్‌రైజర్స్ వేలంలో పెట్టింది.
పంజాబ్ కింగ్స్‌లోకి కేన్ మామ..
ఇక వేలంలోకి వచ్చిన విలియమ్సన్‌కు ఎలాగైనా సొంతం చేసుకోవాలనిపంజాబ్ కింగ్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక గతేడాది సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్ కూడా తమ జట్టు ప్రక్షాళన షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సీజన్‌లో తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ విడుదల చేసింది.
ఈ ఏడాది జరిగిన మెగావేలంలో అగర్వాల్‌ను రూ.12 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే మయాంక్ 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో అతడికి పంజాబ్ ఊద్వసన పలికింది.
ఈ క్రమంలో విలియమ్సన్ వంటి అనుభవిజ్ఞుడైన ఆటగాడిని దక్కించుకోవాలని పంజాబ్ ఫ్రాంజైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికోసం దాదాపు రూ. 10 కోట్ల వరకైన వెచ్చించడానికి పంజాబ్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం పంజాబ్ పర్స్‌లో రూ. 32.2 కోట్లు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది.
చదవండి: IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే!
Comments
Please login to add a commentAdd a comment