![Klaasen Stumps Dhawan On Bhuvneshwars 140 Kmph Snorter - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/10/Untitled-1.gif.webp?itok=nlz8YyqS)
PC: IPL.com/bcci
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అద్బుతమైన స్టంపింగ్‌తో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను క్లాసెన్ పెవిలియన్‌కు పంపాడు. మెరుపు వేగంతో స్టంప్ చేసిన క్లాసెన్.. భారత లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడింది.
ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌ను ఎదుర్కోవడానికి పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో భువీ స్వింగ్‌ను కట్ చేసేందుకు ధావన్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి షాట్‌లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన భువీ బౌలింగ్‌లో ధావన్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి అద్బుతమైన షాట్ ఆడాడు. ఇది చూసిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వికెట్ కీపర్ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా తీసుకువచ్చాడు.
సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసొచ్చింది. భువీ వేసిన అదే ఓవర్‌లో నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ధావన్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి.. వికెట్ల వెనకు క్లాసెన్‌కు చిక్కాడు. గంటకు 140 కి.మీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్ మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
𝗤𝘂𝗶𝗰𝗸 𝗛𝗮𝗻𝗱𝘀 𝘅 𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 ⚡️
— IndianPremierLeague (@IPL) April 9, 2024
Relive Heinrich Klaasen's brilliant piece of stumping 😍👐
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/sRCc0zM9df
Comments
Please login to add a commentAdd a comment