stumpings
-
అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..!
అతనొక అనుభవజ్ఞుడైన డాక్టర్ అయినప్పటికీ తన కుటుంబంలోని వ్యక్తికి వచ్చిన వ్యాధి ఏంటన్నది నిర్థారించలేకపోయాడు. పలు టెస్టులు చేసి ఆ వ్యాధి ఏంటనేది చెప్పలేకపోయాడు. కానీ ఆ వ్యాధి ఏంటనేది..అతడి ఇంట్లో పనిచేసే పనిమనిషి జస్ట్ 15 సెకన్లలో ఠక్కున చెప్పేసింది. ఆమె సమయస్ఫూర్తికి విస్మయానికి గురైన డాక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ పనిమనిషి ఎలా చెప్పిందంటే...డాక్టర్ ఫిలిప్స్ తన కుటుంబంలోని ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. విపరీతమైన చలి, కీళ్లనొప్పులు, దగ్గుతో బాధపడ్డాడు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా వచ్చాయి. దీంతో ఫిలిప్స్ కోవిడ్ 19, ఇన్ఫ్లుంజా, డెంగ్యూ వంటి వైద్య పరీక్షలన్నీ చేశాడు. కానీ ఆ వ్యక్తికి ఏం వ్యాధి వచ్చేందని నిర్థారించలేకపోయాడు. దీంతో అతనికి సరైన అందిచలేకపోయాడు. అసలు అతనకు వచ్చిన సమస్య ఏంటర్రా బాబు అంటు తలపంటుకున్నాడు. అప్పుడే వచ్చిన పనిమినిషి ఆ వ్యక్తికి వచ్చింది 'ఆంజంపి'ని అనే వ్యాధి అని స్థానిక భాషలో చెప్పింది. ఇది తన మనవళ్లకు వచ్చిందని, వారిలో ఈ లక్షణాలు చూశానని అంది. వెంటనే పనిమినిషి చెప్పిన వ్యాధికి సంబంధించిన పార్వోవైరస్ బీ19 అనే వైద్య పరీక్షలు చేశారు డాక్టర్ ఫిలిప్స్. చివరికి ఆమె చెప్పిందే నిజమయ్యింది. ఆ వ్యక్తికి వచ్చిన వ్యాధిని వైద్య పరిభాషలో రిథీమా ఇన్ఫెక్టియోసమ్ అని పిలుస్తారు. ఇది హ్యుమన్ పార్వోవైరస్ బీ19 వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పిల్లలను బాగా ప్రభావితం చేస్తుంది. ఇది దగ్గినప్పుడూ, తుమ్మినప్పుడూ శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బుగ్గలపై వచ్చే ఎరుపు దద్దర్లను స్లాప్డ్ చీక్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ దద్దర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ మేరకు సదరు డాక్టర్ ఫిలిప్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..17 ఏళ్ల వైద్య అనుభవం ఆ వ్యాధిని నిర్థారించలేదు. కేవలం పది సెకన్లలో ఆ వ్యాధి ఏంటో చెప్పగలిగిన తన పనిమినిషి ముందు తన అనుభవం కూడా సరిపోలేదని అన్నారు. అయితే నెటిజన్లు జనరల్ ప్రాక్టీషనర్(జీపి)ని ఎందుకు సంప్రదించలేదని వైద్యుడిని ప్రశ్నించగా..ఈ రోజుల్లో జీపీ ఆశించిన స్థాయిలో నిర్థారించడ లేదని అన్నారు. తనకు తన పనిమనిషి వ్యాది నిర్థారణ విలువైనదని, అందువల్లే ఒక రోజు సెలువు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.(చదవండి: జీ7 సదస్సులో మోదీకి భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్ ఇదే..!) -
గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అద్బుతమైన స్టంపింగ్‌తో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను క్లాసెన్ పెవిలియన్‌కు పంపాడు. మెరుపు వేగంతో స్టంప్ చేసిన క్లాసెన్.. భారత లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడింది. ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌ను ఎదుర్కోవడానికి పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో భువీ స్వింగ్‌ను కట్ చేసేందుకు ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన భువీ బౌలింగ్‌లో ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి అద్బుతమైన షాట్ ఆడాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వికెట్ కీపర్ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా తీసుకువచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. భువీ వేసిన అదే ఓవర్లో నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి.. వికెట్ల వెనకు క్లాసెన్‌కు చిక్కాడు. గంటకు 140 కి.మీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్ మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 𝗤𝘂𝗶𝗰𝗸 𝗛𝗮𝗻𝗱𝘀 𝘅 𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 ⚡️ Relive Heinrich Klaasen's brilliant piece of stumping 😍👐 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/sRCc0zM9df — IndianPremierLeague (@IPL) April 9, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
క్రికెట్లో కొత్త రూల్.. బ్యాటర్లకు గుడ్‌న్యూస్
కొత్త ఏడాది ఆరంభంలో బ్యాటర్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ గుడ్‌న్యూస్ అందించింది. స్టంపౌట్ రూల్ విషయంలో ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు వికెట్ కీపర్ స్టంపింగ్‌కు అప్పీలు చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ రిఫర్ చేసేవారు. థర్డ్ అంపైర్ తొలుత క్యాచ్(ఆల్ట్రా ఎడ్జ్)ను చెక్ చేసి.. ఆ తర్వాత స్టంప్ ఔటా కాదాన్నది పరిశీలించి తన నిర్ణయాన్ని వెల్లడించేవాడు. అయితే ఇకపై ఈ రూల్ అంతర్జాతీయ క్రికెట్లో మరి కన్పించదు. ఐసీసీ కొత్త రూల్ ప్రకారం.. ఫీల్డ్ అంపైర్లు స్టంపౌట్‌కు రిఫర్ చేస్తే, థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్‌ను మాత్రమే చెక్ చేయాలి. అంతే తప్ప బంతి బ్యాట్‌కు తాకిందా లేదన్నది పరీశిలించాల్సిన అవసరం లేదు. ఫీల్డింగ్ జట్లు పాత నిబంధనను ఎక్కువ ఊపయోగించకోవడంతో ఐసీసీ ఈ తరహా మార్పులు చేసింది. ఈ రూల్ గతేడాది డిసెంబర్ 12 నుంచే అమలు లోకి వచ్చినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే తన టెస్టు కెరీర్లో రూట్ స్టంప్ అవుట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఔటయ్యి కూడా రూట్ ఒక రికార్డు అందుకున్నాడు. కెరీర్లో 130 టెస్టులాడిన రూట్ 11,168 పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయి రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో విండీస్ దిగ్గజం చందర్‌పాల్ 11,414 పరుగులు చేసిన తర్వాత తొలిసారి స్టంపౌట్ అయ్యాడు.మూడో స్థానంలో గ్రేమీ స్మిత్ 8800 పరుగులు చేసిన తర్వాత, టీమిండియా నుంచి కోహ్లి 8195 పరుగులు, సచిన్ టెండూల్కర్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా మహేల జయవర్దేనే నిలిచాడు. టెస్టుల్లో 11,814 పరుగులు చేసిన జయవర్దనే ఒక్కసారి స్టంపౌట్ కాకపోవడం విశేషం. After 11,168 runs, Joe Root has been stumped for the first time in Tests! (h/t @sirswampthing) #Ashes pic.twitter.com/X1XackGAYa — ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
విచిత్రరీతిలో రనౌట్ అయిన పాక్ బ్యాటర్
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ విచిత్రరీతిలో స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పిన్నర్ బ్రిగ్స్ వేసిన ఫుల్ లెన్త్ బంతిని బాదేందుకు క్రీజులో నుంచి బయటికి వచ్చి బీట్ అయ్యాడు హైదర్. అయితే, బంతిని పట్టడంలో మొదట బర్మింగ్‌హామ్ కీపర్ అలెక్స్ డేవియస్ తడబడ్డాడు. గ్లవ్లో తొలుత సరిగా ఒడిసిపట్టలేకపోయి, రెండో ప్రయత్నంలో పట్టుకున్నాడు. ఆలోగానే హైదర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అయితే బంతి కీపర్ అలెక్స్ చేతిలో ఉందని గమనించని హైదర్ అలీ పరుగులు తీసేందుకు క్రీజు దాటి మళ్లీ ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో వికెట్లను గిరాటేశాడు కీపర్ అలెక్స్. దీంతో షాకైన హైదర్ అలీ (48 పరుగులు).. స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను విటాలిటీ బ్లాస్ట్.. ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు హైదర్ అలీని ట్రోల్ చేస్తున్నారు. హైదర్ మందు కొట్టినట్టున్నాడంటూ ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. అతడి కెరీర్‌లాగే హైదర్ అలీ తికమకపడ్డాడని మరో యూజర్ రాసుకొచ్చారు. అలీ దిమ్మతిరిగిందని మరికొందరు ట్రోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో డెర్బీషైర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ బియర్స్ 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో డెర్బీషైర్ చేజ్ చేసింది. డెర్బీ షైర్ కెప్టెన్ డు ప్లూయీ (25 బంతుల్లో 66, నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. సిక్సర్ల మోత మోగించి చివరి వరకు ఉండి సత్తాచాటాడు. Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ — Vitality Blast (@VitalityBlast) June 7, 2023 చదవండి: సిరాజ్‌కు కోపం తెప్పించిన స్మిత్ చర్య -
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్; చహర్ వదిలినా ధోని వదల్లేదు
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన కీపింగ్ టైమింగ్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో గిల్‌ను ధోని స్టంపౌట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ జడేజా వేశాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో గిల్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చహర్ క్యాచ్ వదిలేశాడు. దీంతో ఒక లైఫ్ లభించడంతో 39 పరుగులతో గిల్ ధాటిగా ఆడుతున్నాడు. జడ్డూ వేసిన ఆఖరి బంతిని షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. మాములుగానే అలర్ట్‌గా ఉండే ధోని ఈసారి మరింత వేగంగాగా స్పందించాడు. అలా గిల్ క్రీజు దాటాడో లేదో.. ఇలా ధోని బంతిని అందుకొని టక్కున స్టంప్స్ ఎగురగొట్టాడు. అలా చహర్ క్యాచ్ వదిలేసి గిల్‌కు లైఫ్ ఇచ్చినా ధోని తన స్మార్ట్ స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. Photo: IPL Twitter అయితే ధోని స్టంపౌట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికి.. గిల్ మాత్రం డీఆర్ఎస్ కోరాడు. అయితే రివ్యూలో గిల్‌కు నిరాశే మిగిలింది. జడ్డూ బంతి వేయడమే ఆలస్యం.. గిల్ మిస్ చేసి ఫ్రంట్‌ఫుట్ దాటడం.. బంతి అందుకున్న ధోని గిల్ వెనక్కి వచ్చే లోపే సూపర్‌ఫాస్ట్‌గా బెయిల్స్ ఎగురగొట్టడం కనిపించింది. అంతే గిల్ ఔట్ అని బిగ్స్క్రీన్పై కనిపించింది. Still the world's best 'keeper'#EnoughSaid pic.twitter.com/zhgMJEcFUj — JioCinema (@JioCinema) May 29, 2023 MS Dhoni - still the fastest hand behind the stumps. pic.twitter.com/57xOM77nEh — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023 Treatment effect 😭 pic.twitter.com/oVDj2RYN7h — Mohammad Junaid (@MDJunaid4377067) May 29, 2023 చదవండి: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఇవాళ ఎంటర్టైన్ చేస్తాం' -
అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా
ఐపీఎల్ 16వ సీజన్లో క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. కాగా గుజరాత్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను పియూష్ చావ్లాను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. వేసింది వైడ్ బాల్ అయినప్పటికి సాహా ప్రంట్ఫుట్ వచ్చేలా ఊరించే బంతి వేయడం ఫలితాన్ని ఇచ్చింది. సాహా మిస్ చేయడంతో బంతిని అందుకున్న ఇషాన్ కిషన్ రెప్పపాటులో వికెట్లను గిరాటేయగా సాహా స్టంప్ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అనుభవం ముందు సాహా బ్యాటింగ్ పనికిరానట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Mumbai was desperate for a wicket, and Piyush Chawla delivered in his very first over. What an underrated performer for Mumbai this season. Just incredible. #GTvsMI #IPL2023 pic.twitter.com/3ldhhAlZyz — Ridhima Pathak (@PathakRidhima) May 26, 2023 చదవండి: 'ఈసారి కప్ మనదే'.. రోహిత్ శర్మ సిగ్నల్! -
వినడానికి విచిత్రంగా ఉన్నా కోహ్లి కెరీర్లో ఇదే తొలిసారి..
టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో తొలిసారి స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. వినడానికి విచిత్రంగా విన్నా ఇది నిజం. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కోహ్లి స్టంపౌటయ్యాడు. భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇన్నింగ్స్ 19వ ఓవర్ టాడ్ మర్ఫీ వేవాడు. ఆ ఓవర్ రెండో బంతిని కోహ్లి ఫ్రంట్‌ఫుట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అయి కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది. సెకన్ కూడా వేస్ట్ చేయని కేరీ విరాట్ బ్యాట్‌ను క్రీజులో పెట్టేలోపే బెయిల్స్‌ను ఎగరేశాడు. అప్పటికి కోహ్లి క్రీజుకు చాలా దూరంగా ఉండడం గమనార్హం. దీంతో కోహ్లి తొలిసారి తన టెస్టు కెరీర్లో స్టంపౌట్ అయ్యాడు. కోహ్లి కెరీర్ ఆరంభించి 15 ఏళ్లు కావొస్తుంది. ఈ 15 ఏళ్లలో కోహ్లి క్రీజు విడిచి ఫ్రంట్‌ఫుట్ ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఇక వన్డేలు, టి20ల్లో తన ఆటను అందుకునే మొనగాడు లేడని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం కోహ్లి ఆట కాస్త నిధానంగానే ఉంటుంది. మాములుగానే క్రీజులో నుంచి బయటికి రాని కోహ్లి టెస్టుల్లో అసలు ఆ సాహసమే చేయడు. కానీ ఆసీస్‌తో టెస్టులో వేగంగా ఆడాలనే లేక ఇంకేదైనా కారణమో తెలియదు కానీ తొలిసారి స్టంప్ అవుట్ అయ్యి కోహ్లి అవసరం లేని రికార్డును కొనితెచ్చుకున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి ఔట్ కాదని తేలినప్పటికి అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. చదవండి: KL Rahul: ఇక భరించలేం.. తొలగించాల్సిందే! -
ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే!
పాకిస్తాన్తోచారిత్రాత్మిక టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ అన్ని విధాల సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీబీజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఓలీ పోప్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు అబుదాబి వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ లయన్స్ బ్యాటర్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బాగా టర్న్ అయ్యి వైడ్‌గా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ ఫోక్స్ డైవ్ చేస్తూ స్టంప్స్‌ను చూడకుండానే గిరాటేశాడు. ఫోక్స్ అద్భుత విన్యాసం చూసి బ్యాటర్‌తో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఒక్క సారిగా షాక్‌కు గురియ్యారు. ఇందుకు సంబంధించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఇక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఇరు జట్ల మధ్య ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం గమనార్హం. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, విల్ జాక్స్, కీటన్ జెన్నింగ్స్, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్ Ben Foakes: Good wicketkeeper 🔥 pic.twitter.com/jyxhZCHXaa — England Cricket (@englandcricket) November 24, 2022 చదవండి: IND vs BAN: భారత్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు -
శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. అంతకు ముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 252 పరుగులు చేయడంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 92 పరుగులు చేశాడు. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో తక్కువ వ్యవధిలో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అయ్యర్ అద్భత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. స్పిన్నర్లపై అయ్యర్ విరుచుకు పడ్డాడు. ధనంజయ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లతో అయ్యర్ 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 92 పరుగులు చేసి సెంచరీ చేరువగా ఉన్న సమయంలో అయ్యర్ స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. టెస్టుల్లో 90 పరుగులు దాటాక స్టంపౌటైన నాలుగో భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. దీంతో భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ,వీరేంద్ర సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ సరసన చేరాడు. 2001లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 90 పరుగులు చేసిన సచిన్.. నాసిర్ హుస్సేన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.. ఇక 2010లో కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో సెహ్వాగ్ 99 పరుగుల వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అదే విధంగా 90 పరుగులు దాటాక స్టంపౌటైన తొలి భారత క్రికెటర్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్ నిలిచాడు. 1987లో పాకిస్తాన్‌పై 96 పరుగుల వద్ద వెంగ్‌సర్కార్ స్టంపౌటయ్యాడు. చదవండి: Ind Vs SL 2nd Test: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. తొలి రోజు టీమిండియాదే! -
డికాక్ మెరుపువేగంతో.. పంత్ తేరుకునేలోపే
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను దురదృష్టం వెంటాడింది. ఆండిలే ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో పంత్ ఔటైనప్పటికి ఆ క్రెడిట్ మొత్తం కీపర్ క్వింటన్ డికాక్‌కే దక్కుతుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స 35వ ఓవర్ తొలి బంతిని ఫెహ్లుక్వాయో లెగ్‌సైడ్ వేయగా.. పంత్ దానిని ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్ అవడం.. పంత్ క్రీజులో నుంచి బయటికి రావడం ఒకేసారి జరిగిపోయింది. ఇక్కడే కీపర్ డికాక్ మెరుపు వేగంతో స్పందించాడు. పంత్ తేరుకునేలోపే సెకన్ల వ్యవధిలో డికాక్ బెయిల్స్ ఎగురగొట్టడం జరిగిపోయింది. దీనిపై లెగ్ అంపైర్ థర్డ్అంపైర్ను కోరగా.. బిగ్‌స్క్రీన్‌లో పంత్ కాలు గాల్లోనే ఉండడం స్పష్టంగా కనిపించడంతో ఔట్ అని తేలింది. దీంతో 16 పరుగులు చేసిన పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు మాత్రమే చేయగలిగింది. శిఖర్ ధావన్(75), విరాట్ కోహ్లి(51), శార్ధూల్ ఠాకూర్(50 నాటౌట్) రాణించినప్పటికి వారి మెరుపులు సరిపోలేదు. దీనికి తోడూ మిగతా బ్యాట్స్‌మన్ విఫలం కావడంతో టీమిండియా పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, తబ్రైజ్ షంసీ, ఆండీ ఫెలుక్యావో తలా రెండు వికెట్లు తీశారు. Did you see that?👀 #SAvIND #BetwayODISeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/bWLdyNIySx — Cricket South Africa (@OfficialCSA) January 19, 2022 -
రెండో బ్యాట్స్‌మన్‌గా టామ్ లాథమ్! 30 ఏళ్ల తర్వాత..
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో టామ్ లాథమ్ సెంచరీకి 5 పరుగుల దూరంలో ఔటైన సంగతి తెలిసిందే. కాగా ఒక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ 90ల్లో స్టంప్ అవుట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1991-92లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జాన్ రైట్ 99 పరుగుల వద్ద స్టంప్ ఔటయ్యాడు. కాగా జాన్ రైట్ టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 ఏళ్ల తర్వాత టామ్ లాథమ్ టీమిండియాతో తొలి టెస్టులో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. 282 బంతులెదుర్కొన్న లాథమ్ 10 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ విరామ సమయానికి 122 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. టామ్ బ్లండెల్ 10, కైల్ జేమీసన్ 8 పరుగులతో ఆడుతున్నారు. -
రిషబ్ పంత్ సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ రెండు క్యాచ్‌లు పట్టడంతో అతడీ ఘనత సాధించాడు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంత్ 15 క్యాచ్‌లు పట్టి, 5 స్టంపింగ్‌లు చేశాడు. దీంతో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. 2011లో డెక్కన్ చార్జర్స్ జట్టు తరపున ఆడిన సంగక్కర 19 ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019లో బంగ్లా వికెట్ కీపర్ నురుల్ హసన్ కూడా 19 డిసిమిసల్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీతో ఆదివారం ఫిరోజ్‌షా కోట్ల మైదానం జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ రెండు అద్భుత క్యాచ్‌లు పట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ కీపింగ్‌లో మాత్రం మెరిశాడు. కష్టసాధ్యమైన క్యాచ్‌లు పట్టి క్లాసెన్, గురుకీరత్ సింగ్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, గతేడాది ఐపీఎల్లో కూడా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ సింగిల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్(684)గా నిలిచాడు. -
కీపింగ్‌లో మొనగాడు ఎంఎస్ ధోని
సాక్షి, స్పోర్ట్స్ (మాంచెస్టర్): మూడు టీ20ల భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్ సాధించాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్ కూల్’ ధోని అధిగమించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది. అదే ఫామ్ కొనసాగిస్తే ఆతిథ్య జట్టుకు 200 పరుగులు సులువే. కానీ 14వ ఓవర్లో కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. ఈ చైనామన్ బౌలర్ మూడో(ఇన్నింగ్స్14వ) ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. ఓ ఓవర్ తొలి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అందుకోగా నిరాశగా వెనుదిరిగాడు. అపై అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ఎంఎస్ ధోని సమం చేశాడు. ఆ మరుసటి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు మహీ. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని నిలిచాడు. ధోని ఆలోచనల్ని సరిగ్గా అమలుచేసిన కుల్దీప్(5/24) అద్భుత బౌలింగ్‌కు ఇంగ్లండ్ నుంచి సమాధానం కరువై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ శతకంతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) పరవాలేదనిపించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి రాహుల్ లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్‌లో టీమిండియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు 33 ఎంఎస్ ధోని 32 కమ్రాన్ అక్మల్ 28 మహ్మద్ షెహజాద్ 26 ముష్ఫీకర్ రహీం 20 కుమార సంగక్కర -
ధోని ఖాతాలో మరో రికార్డు
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డులకెక్కిన ఎంఎస్ ధోని.. సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు. ఇది ధోనికి ఓవరాల్ ఐపీఎల్లో 33 స్టంపింగ్. ఫలితంగా ఐపీఎల్లో అత్యధిక స్టంపింగ్ జాబితాలో ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న రాబిన్ ఉతప్ప(32)ను ధోని అధిగమించాడు. ఆ తర్వాత స్థానాల్లో దినేష్ కార్తీక్(30), సాహా(18)లు ఉన్నారు. రెండేళ్ల నిషేధం తర్వాత రంగంలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ పునరాగమనాన్ని ఘనంగా చాటింది. అసాధారణ ఆటతీరుతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆదివారం ముంబైలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. -
ధోనిని తలపించిన కార్తీక్
-
ధోనీ ప్రపంచ రికార్డు
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన కీపర్‌గా ధోనీ (134) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ధోనీ.. మిచెల్ జాన్సన్‌ను స్టంప్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. దీంతో శ్రీలంక ఆటగాడు సంగక్కర (133) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది. ధోనీ టెస్టుల్లో 38, వన్డేల్లో 85, టి-20ల్లో 11 స్టంప్ అవుట్లు చేశాడు.