పాకిస్తాన్‌తోచారిత్రాత్మిక టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ అన్ని విధాల సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీబీజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఓలీ పోప్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు అబుదాబి వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది.
ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ లయన్స్ బ్యాటర్ ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బాగా టర్న్ అయ్యి వైడ్‌గా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ ఫోక్స్ డైవ్ చేస్తూ స్టంప్స్‌ను చూడకుండానే గిరాటేశాడు.
ఫోక్స్ అద్భుత విన్యాసం చూసి బ్యాటర్‌తో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఒక్క సారిగా షాక్‌కు గురియ్యారు. ఇందుకు సంబంధించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్‌లో షేర్ చేసింది. ఇక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఇరు జట్ల మధ్య ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం గమనార్హం. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, విల్ జాక్స్, కీటన్ జెన్నింగ్స్, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌టన్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్
Ben Foakes: Good wicketkeeper 🔥 pic.twitter.com/jyxhZCHXaa
— England Cricket (@englandcricket) November 24, 2022
చదవండి: IND vs BAN: భారత్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment