ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పలు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. స్టోక్స్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ సారథి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ముసుగు దొంగలు తన ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారని స్టోక్స్ తెలిపాడు. ఆ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారని.. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి హానీ జరగలేదన్నాడు. ఈ పని ఎవరు చేశారో తెలియాల్సి ఉందని.. త్వరగా దొంగలను పట్టుకోవడంలో తమకు సహకరించాలని కోరాడు.
పాక్ పర్యటనలో ఉన్న సమయంలో
ఏదేమైనా కష్ట సమయంలో తన కుటుంబానికి పోలీసులు అండగా ఉన్నారని.. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘అక్టోబరు 17, గురువారం.. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు నార్త్ ఈస్ట్‌లో గల కాసిల్ ఈడెన్ ఏరియాలో ఉన్న మా ఇంట్లోకి చొరబడ్డారు.
నా భార్యా పిల్లలకు భయానక అనుభవం
ర్యా నగలు, విలువైన వస్తువులు ఎత్తుకుపోయారు. అందులో మా కుటుంబానికి అతి ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు దయచేసి నాకు సహాయం చేయండి. నిజానికి ఈ దుర్ఘటన జరిగినపుడు నా భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
అయితే, వారిపై దొంగలు ఎలాంటి భౌతిక దాడికి పాల్పడలేదు. కానీ.. ఆ సమయంలో వారి మనఃస్థితి ఎంత ఆందోళనకరంగా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఫొటోలు షేర్ చేస్తున్నా
నా ఇంట్లో చోరీకి గురైన వస్తువుల ఫొటోలు విడుదల చేస్తున్నాను. వాటిని ఎవరైనా సులువుగా గుర్తించవచ్చు. తద్వారా దొంగలను పట్టుకునే వీలు కలుగుతుంది. మాకెంతో ముఖ్యమైన వస్తువులు పోయినప్పటికీ.. కేవలం వాటిని రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పోస్టు పెట్టడం లేదు.
ఈ పని చేసిన దుండగులు ఎవరో కనిపెట్టడం కోసమే వాటి ఫొటోలు షేర్ చేస్తున్నా. విపత్కరకాలంలో మా కుటుంబానికి స్థానిక పోలీసులు అండగా నిలిచారు. వారి మేలు మర్చిపోలేనిది. ఆ దొంగలను పట్టుకునేందుకు మేమంతా తీవ్రం శ్రమిస్తున్నాం’’ అని స్టోక్స్ ఎక్స్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు.
పాక్ చేతిలో ఘోర ఓటమి
కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు స్టోక్స్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా తొలి మ్యాచ్‌కు అతడు దూరంగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత అతడు తిరిగి వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్.. ఆఖరి రెండు టెస్టుల్లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.
చదవండి: Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
— Ben Stokes (@benstokes38) October 30, 2024
Comments
Please login to add a commentAdd a comment