Ben Foakes
-
‘చీటింగ్‌కు కూడా వెనుకాడరు.. కళ్లు కనిపించడం లేదా బాబూ’
రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస క్రీడా స్ఫూర్తి కూడా ప్రదర్శించడం చేతకాదా అని మండిపడుతున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ 353 పరుగుల వద్ద ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్ కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(38)తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో 20వ ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్.. షాట్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడ్డట్లుగా అనిపించింది. దీంతో జైస్వాల్ అవుటైనట్లేనంటూ ఇంగ్లండ్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, రివ్యూలో భాగంగా తొలి రీప్లేలో ఫలితం సరిగ్గా తేలకపోయినా అలాగే సంబరాలు చేసుకున్నారు. అయితే, ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్ అంపైర్ ఒకటికి రెండుసార్లు బాల్ ట్రాకింగ్ చేశాడు. ఈ క్రమంలో బాల్ తొలుత నేలను తాకి.. ఆ తర్వాత వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు తేలింది. దీంతో జైస్వాల్ నాటౌట్‌గా తేలగా.. ఇంగ్లండ్ ఆటగాళ్లు ముఖ్యంగా కెప్టెన్ స్టోక్స్ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలాగోలా ఒత్తిడి పెంచి జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటింపజేయడంలో భాగంగానే ఇలా ‘చీటింగ్’కు పాల్పడేందుకు కూడా వెనుకాడలేదని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. England thought they had Yashasvi Jaiswal dismissed caught behind, but replays showed the ball hit the ground, putting a halt to the celebrations.#INDvENG pic.twitter.com/RgDhy7qOF5 — CricBlog ✍ (@cric_blog) February 24, 2024 England players are so rattled by Yashasvi Jaiswal that they sacrificed all their principles regarding Spirit Of Cricket and started appealing for a grounded catch. Next, they may finally try to run someone out at the non striker's end. — Sameer Allana (@HitmanCricket) February 24, 2024 ఇదిలా ఉంటే.. ఈ ఘటన సమయానికి జైస్వాల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. టీమిండియా స్కోరు 68-1. ఇక రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జైస్వాల్(73) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. Jaiswal has cracked the code for run-making! 🙌🏻 He brings up his fiery 5️⃣0️⃣ in style to keep #TeamIndia's momentum. 🔥#INDvENG #IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/nFAmYZPaX4 — JioCinema (@JioCinema) February 24, 2024 -
అరె బాబు.. నన్నేం చూస్తున్నావు.. రోహిత్ శర్మ ఆగ్రహం
India vs England, 4th Test: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. తేడా వస్తే అంతే సీరియస్ అవుతాడు. కీలక సమయంలో ఆటగాళ్లు సరైన రీతిలో ఆడకపోతే ఫీల్డ్‌లోనే వాళ్లపై గట్టిగా అరవడానికి కూడా వెనుకాడడు హిట్‌మ్యాన్. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తొలుత రోహిత్ శర్మ ఆగ్రహాన్ని చవిచూశాడు. ఓవైపు అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ చక్కగా వికెట్లు తీస్తుంటే.. సిరాజ్ మాత్రం అనుభవలేమి బౌలర్లా పేలవ ప్రదర్శన కనబరిచాడు. తొలి సెషన్లో భాగంగా వేసిన తొలి ఆరు ఓవర్లలోనే ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ సాబ్‌కు కోపమొచ్చింది. ఇక శుక్రవారం నాటి మ్యాచ్‌లో సిరాజ్ తర్వాత.. అదే స్థాయిలో రోహిత్ ఆగ్రహానికి గురైంది ఎవరైనా ఉన్నారంటే కెమెరామెన్. అవునండీ.. గంభీర వాతావరణం నెలకొని ఉన్న తరుణంలో కెమెరామెన్ చేసిన పని వల్ల రోహిత్ తీవ్ర అసహానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 59.3వ ఓవర్లో వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ క్రీజులో ఉన్న సమయంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ కోసం అప్పీలు చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన బాల్ ట్రాకింగ్ కాకుండా.. ఆ సమయంలో రోహిత్ శర్మ రియాక్షన్‌పై దృష్టి సారించిన కెమెరామెన్.. బిగ్స్క్రీన్పై రోహిత్ రూపాన్ని ప్రదర్శించాడు. దీంతో సహనం కోల్పోయిన రోహిత్.. ‘‘ఏయ్ నన్నెందుకు చూపిస్తున్నావు? ఏంటిది?’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ రివ్యూను టీమిండియా కోల్పోవడంతో రోహిత్ కోపం రెట్టింపైంది. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ 106, ఓలీ రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ రెండు, అశ్విన్, జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. A reverse swing masterclass ft. Siraj 🔥 The 🇮🇳 pacer sends Tom Hartley 𝙥𝙖𝙘𝙠𝙞𝙣𝙜! 🤩#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports#INDvENG pic.twitter.com/qQFpOlX0xn — JioCinema (@JioCinema) February 23, 2024 చదవండి: Ind vs Eng: ‘బజ్‌బాల్ కాదు’.. జో రూట్ సరికొత్త చరిత్ర! ఒకే ఒక్కడు.. Captain Rohit Sharma is a pure entertainer 😄#INDvsENG #T20WorldCuppic.twitter.com/mo9Lp9T5Wt — Ajmul Cap (@AjmulCap2) February 23, 2024 Rohit Sharma's reaction to camera man to focus on DRS not on me🤣🤣#INDvsENG #Rohitsharma #AkashDeep #Siraj #Pope #CricketTwitter #JoeRoot pic.twitter.com/Ikv2wZ68d1 — Shahid wani (@shayu9682) February 23, 2024 -
బుమ్రా విషయంలో ఫోక్స్ ఎందుకిలా? ఇంగ్లండ్ గెలిచేది ఇలాగేనా?
India vs England, 1st Test: టీమిండియాతో తొలి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వ్యవహరించిన తీరు నెట్టింట చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో నువ్వా- నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఫోక్స్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడంటూ టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఒకవేళ ఫోక్స్ చేసిన పనే గనుక భారత వికెట్ కీపర్ చేసి ఉంటే ఇంగ్లండ్ మీడియా గగ్గోలు పెట్టేదంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మొదటి టెస్టులో తలపడ్డ విషయం తెలిసిందే. తొలి రెండు రోజులు రోహిత్ సేన ఆధిపత్యం కనబరచగా.. ఆ తర్వాత స్టోక్స్ బృందం పైచేయి సాధించింది. చివరికి 28 పరుగుల తేడాతో ఎట్టకేలకు విజయం అందుకుని 1-0తో ముందడుగు వేసింది. ఇదిలా ఉంటే.. ఈ టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ఇంగ్లండ్ విధించిన 231 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బరిలోకి దిగింది. బుమ్రా విషయంలో ఫోక్స్ చేసిందేమిటి? ఈ క్రమంలో.. రెండో ఇన్నింగ్స్‌లో 66వ ఓవర్ సమయానికి టీమిండియా కేవలం 189 పరుగులు మాత్రమే చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అలాంటి సమయంలో ఓవర్ ఐదో బంతికి స్పిన్నర్ టామ్ హార్లీ బౌలింగ్‌లో భారత టెయిలెండర్ జస్ప్రీత్ బుమ్రా షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ కోపం, చిరాకులో క్రీజులోపలే మళ్లీ షాట్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా కనిపించిన బుమ్రా గాల్లోకి ఎగిరాడు. అయితే, అంతలోనే బంతిని అందుకున్న వికెట్ కీపర్ ఫోక్స్ బెయిల్స్‌ను పడగొట్టి స్టంపౌట్‌కు అప్పీలు చేశాడు. కానీ.. అప్పటికే బుమ్రా తన పాదాన్ని నేలమీద పెట్టడంతో అప్పటికి ప్రమాదం తప్పింది. క్యారీ- బెయిర్ స్టో వివాదం గుర్తుచేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ.. జానీ బెయిర్ స్టోను ఇంచుమించు ఇదే తరహాలో అవుట్ చేసినపుడు ఇంగ్లండ్ మీడియా చేసిన రచ్చను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. నాడు నిబంధనలకు అనుగుణంగానే క్యారీ వ్యవహరించినా.. క్రీడా స్ఫూర్తిని మరిచాడంటూ దుమ్మెత్తిపోసిన మీడియాకు ఫోక్స్ చేసిన పని కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ ముగిసి రెండు రోజు కావొస్తున్నా ఈ విషయం మీద చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్ టీమిండియాపై ఇలా గెలవాలని భావించిందా అంటూ సొంత అభిమానులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇందుకు విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియం వేదిక కానుంది. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. చదవండి: Ind vs Eng: ఆఖరి 3 టెస్టులకు జట్టు ఎంపిక?.. కోహ్లి రీఎంట్రీ డౌటే!? A penny for Jonny Bairstow and Brendon McCullum’s thoughts on trying to win a game with this? #INDvENG pic.twitter.com/JaZW9B88eV — Scott Bailey (@ScottBaileyAAP) January 28, 2024 @WG_RumblePants just wondering what the difference is between Foakes’ attempted stumping and Careys v Bairstow? Bumrah jumped in the air from frustration, there was no attempt for a run pic.twitter.com/q9uA4TPJaE — Lord John Atkin (@Sarasota_Gooner) January 29, 2024 The English team did spot Bumrah hopping a little and converted it into a stumping ploy. Foakes was slightly late in completing it. It could have caused a controversial end. pic.twitter.com/FFwINJOPLY — Omkar Mankame (@Oam_16) January 29, 2024 What do we have to say about Ben Foakes’ attempt to stump Jasprit Bumrah? ‘Spirit of the Game’? If the shoe was on the foot, and had batter got out, we would be having the spirit of the game conversation for sure!!! @piersmorgan @bhogleharsha @KP24 @vikrantgupta73 @NikhilNaz pic.twitter.com/Z7h6X8adwF — Sidhant Mamtany (@SidhantMamtany) January 29, 2024 -
కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు
కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్‌ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది. విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్‌ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. What an effort by Dom Sibley 👏 Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩 So good to have you home 🏡 🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE — Surrey Cricket (@surreycricket) June 14, 2023 An incredible day 📷 🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l — Surrey Cricket (@surreycricket) June 14, 2023 చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు -
ఇంగ్లండ్ కౌంటీల్లో తొలి వికెట్ పడగొట్టిన అర్ష్‌దీప్.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌంటీల్లో తన తొలి వికెట్‌ను అర్ష్‌దీప్ సాధించాడు. కాంటర్బరీ వేదికగా సర్రేతో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 మ్యాచ్‌లో బెన్ ఫోక్స్‌ను అవుట్ చేసిన అర్ష్‌దీప్.. మొదటి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సర్రే ఇన్నింగ్స్ 22 ఓవర్లో అర్ష్‌దీప్ వేసిన ఆఖరి బంతికి బెన్ ఫోక్స్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకీ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ అని వేలుపైకెత్తాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 14. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్.. 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ తొలి వికెట్‌కు సంబంధించిన వీడియోను కెంట్ క్రికెట్ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న అర్ష్‌దీప్.. టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాడు. అర్ష్‌దీప్ తిరిగి వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో వచ్చే అవకాశం ఉంది. చదవండి: #KLRahul: పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు Arshdeep Singh has his first #LVCountyChamp wicket! The @KentCricket bowler gets one to nip back and dismisses Ben Foakes pic.twitter.com/RS4TTfAjut — LV= Insurance County Championship (@CountyChamp) June 12, 2023 -
ఇలా కూడా అవుట్ అవుతారా? వాళ్లు అంతలా కష్టపడితే.. నీకేమో ఇంత బద్ధకమా?
New Zealand vs England, 2nd Test: రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తోంది న్యూజిలాండ్. పర్యాటక ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆతిథ్య కివీస్ 209 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కావడంతో ఫాలో ఆన్ ఆడించింది. అనూహ్య రీతిలో అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని ఇంగ్లండ్‌కు షాకిచ్చింది న్యూజిలాండ్. ఓపెనర్లు టామ్ లాథమ్(83), డెవాన్ కాన్వే(61)లకు తోడు వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బ్యాట్ ఝులిపించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. కేన్ 132 పరుగులు చేయగా.. డారిల్ మిచెల్(54), టామ్ బ్లండెల్(90) కూడా అర్ధ శతకాలతో రాణించడంతో 483 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ రనౌట్ అయిన తీరు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మరీ ఇంత బద్ధకమా? 158.2 ఓవర్లో ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో బ్లండెల్ షాట్ బాది... బ్రేస్‌వెల్‌తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, మూడో పరుగుకు ఆస్కారం ఉండటంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తగా.. బ్రేస్‌వెల్ రనౌట్ అయ్యాడు. క్రీజు దగ్గరికి చేరినప్పటికీ బ్రేస్‌వెల్ బద్దకం ప్రదర్శించాడు. బ్యాట్, బ్రేస్‌వెల్ కాలు గాల్లోనే ఉండటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ లిప్తపాటులో బంతిని వికెట్లకు గిరాటేశాడు. దీంతో కివీస్ మరో వికెట్ కోల్పోయింది. అయితే, విలియమ్సన్ సహా మిగతా బ్యాటర్లు జట్టును గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రదర్శించగా.. బ్రేస్‌వెల్ ఇలా రనౌట్ కావడంతో ఫ్యాన్స్ అతడిని విమర్శిస్తున్నారు. ఇంత బద్దకమా.. ఇంత తేలికగా వికెట్ పారేసుకోవడం ఏమిటి? నీ తీరు అస్సలు బాగోలేదు’’ అని మండిపడుతున్నారు. రెండు టెస్టుల్లోనూ విఫలం బ్రేస్‌వెల్ తొలి టెస్టులో 7 పరుగులు మాత్రమే చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి వైఫల్యాన్ని కొనసాగించాడు. ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన కివీస్.. ఇంగ్లండ్‌కు 258 పరుగుల టార్గెట్ విధించింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. చదవండి: Kane Williamson: పార్ట్‌టైమ్ పేసర్ చేతికి చిక్కి.. తొలి బాధితుడిగా.. పాపం కేన్ మామ! వీడియో వైరల్ Ind Vs Aus 3rd Test: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా ఆటగాళ్లు! కళ్లన్నీ అతడిపైనే.. This is why you run your bat in 😬 A wicket manufactured from out of nowhere! #NZvENG pic.twitter.com/i52FQVyw2H — Cricket on BT Sport (@btsportcricket) February 27, 2023 -
ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే!
పాకిస్తాన్తోచారిత్రాత్మిక టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ అన్ని విధాల సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న ఇంగ్లీష్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో బీజీబీజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఓలీ పోప్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు అబుదాబి వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ లయన్స్ బ్యాటర్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బాగా టర్న్ అయ్యి వైడ్‌గా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ ఫోక్స్ డైవ్ చేస్తూ స్టంప్స్‌ను చూడకుండానే గిరాటేశాడు. ఫోక్స్ అద్భుత విన్యాసం చూసి బ్యాటర్‌తో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఒక్క సారిగా షాక్‌కు గురియ్యారు. ఇందుకు సంబంధించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఇక పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఇరు జట్ల మధ్య ఇదే తొలి టెస్టు సిరీస్ కావడం గమనార్హం. ఇక డిసెంబర్1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, విల్ జాక్స్, కీటన్ జెన్నింగ్స్, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్ Ben Foakes: Good wicketkeeper 🔥 pic.twitter.com/jyxhZCHXaa — England Cricket (@englandcricket) November 24, 2022 చదవండి: IND vs BAN: భారత్‌తో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన! స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు -
జాసన్ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 2022-23 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ ఫోక్స్ తొలి సారి సెంట్రల్ కాంట్రాక్ట్(ఫుల్‌టైమ్)ను పొందారు. అదే విధంగా ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ తొలిసారి తన సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. అయితే, అతడికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కింది. కాగా రాయ్ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందిలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని డిమోట్ చేయడం గమనార్హం. ఇక ఈ సీజన్‌కు గానూ మొత్తం 30 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కింది. అందులో 18 మందికి ఫుల్ టైమ్కాంట్రాక్ట్ , ఆరుగురికి ఇంక్రిమెంట్ కాంట్రాక్ట్, మరో ఆరుగురుకి పేస్ బౌలింగ్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ లభించింది. కాగా జాసన్ రాయ్‌తో పాటు డోమ్ బెస్, రోరీ బర్న్స్, క్రిస్ జోర్డాన్, టామ్ కర్రాన్ కూడా తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్స్: మొయిన్ అలీ (వార్విక్షైర్), జేమ్స్ ఆండర్సన్ (లంకాషైర్), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), జోనాథన్ బెయిర్‌స్టో (యార్క్‌షైర్) స్టువర్ట్ బ్రాడ్ (నాటింగ్‌హామ్‌షైర్) జోస్ బట్లర్ (లంకాషైర్) జాక్ క్రాలే (కెంట్) సామ్ కర్రాన్ (సర్రే) బెన్ ఫోక్స్ (సర్రే) జాక్ లీచ్ (సోమర్సెట్) లియామ్ లివింగ్‌స్టోన్ (లంకాషైర్) ఒల్లీ పోప్ (సర్రే) ఆదిల్ రషీద్ (యార్క్‌షైర్) ఆలీ రాబిన్సన్ (ససెక్స్) జో రూట్ (యార్క్‌షైర్) బెన్ స్టోక్స్ (డర్హామ్) క్రిస్ వోక్స్ (వార్విక్షైర్) మార్క్ వుడ్ (డర్హామ్). ఇంక్రిమెంట్ కాంట్రాక్టులు హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), డేవిడ్ మలన్ (యార్క్‌షైర్) ,మాథ్యూ పాట్స్ (డర్హామ్), జాసన్ రాయ్ (సర్రే), రీస్ టోప్లీ (సర్రే) ,డేవిడ్ విల్లీ (నార్థాంప్టన్షైర్ 1 నవంబర్ 22 నుండి). ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ కాంట్రాక్టులు: బ్రైడన్ కార్సే (డర్హామ్) మాథ్యూ ఫిషర్ (యార్క్‌షైర్) సాకిబ్ మహమూద్ (లంకాషైర్) క్రెయిగ్ ఓవర్టన్ (సోమర్సెట్) జామీ ఓవర్టన్ (సర్రే) ఒల్లీ స్టోన్ (1 నవంబర్ 22 నుండి నాటింగ్‌హామ్‌షైర్) చదవండి: T20 World Cup 2022: ఒకే ఇన్నింగ్స్‌లో 11 మంది బౌలింగ్.. ఆశ్చర్యపరిచిన జింబాబ్వే కెప్టెన్ -
సెంచరీలతో చెలరేగిన స్టోక్స్, బెన్ ఫోక్స్.. పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తుంది. తొలి టెస్టులో దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ను 151 పరుగులకే ఆలౌట్ చేసి తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్.. రెండోరోజు ఆటలో బ్యాటింగ్‌లో దూకుడు కనబరిచింది. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(163 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 103 పరుగులు) చాలా రోజుల తర్వాత శతకంతో చెలరేగాడు. Photo Credit: ESPNcricinfo స్టోక్స్‌కు టెస్టుల్లో ఇది 12వ శతకం కాగా.. కెప్టెన్‌గా మాత్రం ఇదే మొదటిది. ఇక వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ కూడా సెంచరీ మార్క్‌ను(209 బంతుల్లో 104 బ్యాటింగ్, 9 ఫోర్లు)అందుకున్నాడు. కాగా బెన్ఫోక్స్కు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ. సెంచరీ సాధించి స్టోక్స్ ఔటైనప్పటికి వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 395 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. A special first hundred as England Test captain for Ben Stokes ✨ pic.twitter.com/PiKjUGO94d — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 Manchester stands up and applauds a quite magnificent Test hundred 👏 It's the first at home for Ben Foakes pic.twitter.com/cIFaWhC3YB — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 -
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్..!
లీడ్స్: న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసేందుకు ఇంగ్లండ్ జట్టు 113 పరుగుల దూరంలో ఉంది. చివరిదైన మూడో టెస్టులో 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు అలెక్స్ లీస్ (9), జాక్ క్రాలీ (25) అవుటవ్వగా... ఓలీ పోప్ (81 బ్యాటింగ్; 12 ఫోర్లు), జో రూట్ (55 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 168/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 105.2 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. బ్లన్‌డెల్ (88 నాటౌట్; 15 ఫోర్లు), మిచెల్ (56; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బెన్ ఫోక్స్ కరోనా బారిన పడటంతో అతని స్థానంలో కోవిడ్ సబ్‌స్టిట్యూట్‌గా బిల్లింగ్స్ బరిలోకి దిగాడు. చదవండి: India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం -
ఇంగ్లండ్ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ
కరోనా మహమ్మారి యూకేలో విలయతాండవం చేస్తుంది. స్థానిక క్రికెటర్లతో పాటు ఆ దేశంలో పర్యటిస్తున్న క్రికెట్ జట్లలోని ఆటగాళ్లు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ (ఈసీబీ) క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో ఫోక్స్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతున్నట్లు ఈసీబీ పేర్కొంది. ఫోక్స్‌కు నడుము పట్టేయడంతో పాటు కరోనా లక్షణాలు ఉండటంతో మూడో రోజు ఆట బరిలోకి దిగలేదని ఈసీబీ వివరించింది. ఎల్ఎఫ్టి కోవిడ్ టెస్ట్‌లో ఫోక్స్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఫోక్స్‌ను ఐసోలేషన్‌కు తరలించామని, అతని రీప్లేస్‌మెంట్‌గా సామ్ బిల్లింగ్స్‌ను ఎంపిక చేశామని ప్రకటించింది. ఫోక్స్ జులై 1 నుంచి టీమిండియాతో జరుగబోయే టెస్ట్ మ్యాచ్‌లోపు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఐసీసీ కోవిడ్ నిబంధనల ప్రకారం సామ్ బిల్లింగ్స్ ఫోక్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా జట్టులో చేరతాడని, అతను నాలుగో రోజు ఆటలో వికెట్‌కీపింగ్ చేస్తాడని పేర్కొంది. కాగా, ఇవాళ ఉదయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోవిడ్ బారిన పడినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రోహిత్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: కొత్త చరిత్ర ఆవిష్కృతం.. రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్ -
Ben Foakes: డ్రెస్సింగ్ రూమ్‌లో జారిపడి...
లండన్: ప్రస్తుతం ఇంగ్లండ్ అత్యుత్తమ వికెట్ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బెన్ ఫోక్స్ దురదృష్టవశాత్తూ అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. సుదీర్ఘ కాలం వేచి చూసిన తర్వాత స్వదేశంలో తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమైన అతను డ్రెస్సింగ్ రూమ్‌లో సాక్స్‌లు వేసుకొని నడుస్తూ కాలు జారి పడ్డాడు. అతని తొడ కండరాల్లో చీలిక రావడంతో కనీసం మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో పాటు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఫోక్స్ దూరం కానున్నాడు. అతని స్థానంలో జేమ్స్ బ్రాసీని కీపర్‌గా ఎంచుకున్న ఇంగ్లండ్ ప్రత్యామ్నాయ బ్యాట్స్‌మన్‌కు హసీబ్ హమీద్‌ను కూడా ఎంపిక చేసింది. మరోవైపు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కుడి మోచేతికి శస్త్ర చికిత్స జరిగినట్లు ఈసీబీ ప్రకటించింది. కనీసం నాలుగు వారాల తర్వాత అతను కోలుకుంటున్న తీరును చూసి బౌలింగ్‌ను మొదలు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. చదవండి: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం -
ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత తొలి వికెట్..
చెన్నై: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తుది జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఎట్టకేలకు ఖాతా తెరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ చైనామన్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో బెన్ ఫోక్స్‌ను అవుట్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్.. అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ పేరిట తొలి వికెట్ నమోదైంది. ఆ తర్వాత ధాటిగా ఆడుతూ 18 బంతుల్లో 43 పరుగులు చేసిన ఇంగ్లండ్ బౌలర్ మెయిన్ అలీని పెవలియన్‌కు పంపి మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఆస్ట్రేలియాతో రెండేళ్ల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా టెస్టు క్రికెట్ ఆడిన కుల్దీప్.. సిడ్నీలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 5 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఈ గణంకాలు నమోదు చేసి, డ్రాగా ముగిసిన ఈ టెస్టులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి టీమిండియా టెస్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటున్న అతడు, బెంచ్‌కే పరిమితం అయ్యాడు. బీసీసీఐ ప్రకటించిన 13 టెస్టు మ్యాచ్ ప్రాబబుల్స్‌లో కుల్దీప్కు చోటు దక్కినా ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్నమొదటి టెస్టులో అతడిని ఆడిస్తారని భావించినా, షాబాజ్ నదీంను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి కుల్దీప్కు నిరాశే ఎదురైంది. ఇక ఎట్టకేలకు రెండో టెస్టు తుది జట్టులో అతడి పేరును చేర్చడంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా.. 6 ఓవర్లు వేసిన కుల్దీప్, 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మంగళవారం నాటి రెండో ఇన్నింగ్స్‌లో లంచ్‌బ్రేక్ సమయానికి 3.3 ఓవర్లు వేసి ఏడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో అతడి ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆ తర్వాత మొయిన్ అలీ వికెట్ పడగొట్టాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 6.2 ఓవర్లు వేసిన కుల్దీప్.. 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 482 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన ఇంగ్లండ్ భోజన విరామానికి ముందు ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అనంతరం మొయిన్ అలీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఎట్టకేలకు గౌరవప్రదమైన స్కోరు చేసి 164 పరుగులకు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి: ‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’ చదవండి: 'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి' Kuldeep finally smiled. 😍 pic.twitter.com/3YgGRXErls — 𝐍𝐢𝐤𝐡𝐢𝐥 🇮🇳 (@nrcexe) February 16, 2021 -
పంత్,ఇంగ్లండ్ కీపర్ గొడవ.. మధ్యలో స్టోక్స్
చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో పంత్, స్టోక్స్ మధ్య చిన్పపాటి గొడవ జరిగింది. ఇన్నింగ్స్ 87వ ఓవర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్‌కు వచ్చిన సమయంలో పంత్ బ్యాటింగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ వికెట్‌కీపర్ బెన్ ఫోక్స్ పదే పదే వికెట్ల వెనుక నుంచి నోరుజారుతూ కనిపించాడు. దీంతో చిర్రెత్తికొచ్చిన పంత్ నిరసన వ్యక్తం చేస్తూ స్ట్రైక్ తీసుకునేందుకు నిరాకరించి బెన్ ఫోక్స్ వైపు చూస్తూ నిలబడ్డాడు. దాంతో.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని పంత్కి సర్దిచెప్పాడు. ఓవర్ ముగిసిన తర్వాత కెప్టెన్ రూట్ పంత్ వద్దకి వచ్చి సర్ది చెప్తున్నాడు.. ఇంతలో అక్కడికి చేరుకున్న బెన్ స్టోక్స్ పంత్‌ను రెచ్చగొట్టే ధోరణిలో వాఖ్యలు చేశాడు. దీంతో మరోసారి పంత్, స్టోక్స్ మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. స్టోక్స్ తీరుచూస్తే పంత్‌తో కావాలనే గొడవ పడుతున్నట్లు వీడియోలో కనిపించింది. మరోసారి ఫీల్డ్ అంపైర్లు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ధి చెప్పారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా.. రిషబ్ పంత్ 58 నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్ 2, సిరాజ్, ఇషాంత్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: పుజారాకు గాయం.. రెండో ఇన్నింగ్స్‌లో డౌటే! Rishabh Pant vs Stokes fight today 👇🏻👇🏻 pic.twitter.com/P8a0mbO5d1 — middle stump (@middlestump4) February 13, 2021 -
శ్రీలంక లక్ష్యం 462
గాలె: శ్రీలంకతో జరగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయంపై గురి పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడిన ఆ జట్టు శ్రీలంక ముందు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక నెగ్గాలంటే ఇంకా 447 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు తొలి మ్యాచ్ ఆడుతున్న బెన్ ఫోక్స్ (107; 10 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది. పెరీరాకు 5 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకే పరిమితమైంది. మాథ్యూస్ (52) ఒక్కడే అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత కీటన్ జెన్నింగ్స్ (146 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి తోడు స్టోక్స్ (62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 322 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
అరంగేట్రంలోనే అదరగొట్టాడు..
గాలె: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేసిన బెన్ ఫోక్స్ అదుర్స్ అనిపించాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తంగా 144 పరుగులు చేసిన ఫోక్స్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన రెండో ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసిన ఫోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేశాడు. దాంతో ఇంగ్లండ్ తరపున తొలి టెస్టు మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మ్యాట్ ప్రయర్(147) అగ్రస్థానంలో ఉన్నాడు. మరొకవైపు కీటన్ జెన్నింగ్స్(146 నాటౌట్) భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్ జెన్నింగ్స్ 280 బంతులు ఎదుర్కొని శతకాన్ని నమోదు చేశాడు. అతనికి సాయంగా బెన్ స్టోక్స్(62) కూడా రాణించడంతో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను 322/6 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా శ్రీలంకకు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, శ్రీలంకలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఇంగ్లండ్ సవరించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు 664. అంతకుముందు 1993లో కొలంబోలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చేసిన 608 పరుగులే ఆ జట్టుకు ఇప్పటివరకూ లంకలో అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లిష్ టీమ్ బ్రేక్ చేసింది. ఇక తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న లంక స్పిన్నర్ రంగనా హెరాత్ మూడు వికెట్లు సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.