టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇంగ్లండ్ కౌంటీల్లో కెంట్ తరపున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కౌంటీల్లో తన తొలి వికెట్‌ను అర్ష్‌దీప్ సాధించాడు. కాంటర్‌బరీ వేదికగా సర్రేతో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1 మ్యాచ్‌లో బెన్ ఫోక్స్‌ను అవుట్ చేసిన అర్ష్‌దీప్.. మొదటి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
సర్రే ఇన్నింగ్స్ 22 ఓవర్‌లో అర్ష్‌దీప్ వేసిన ఆఖరి బంతికి బెన్ ఫోక్స్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకీ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్ అని వేలుపైకెత్తాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 14. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్.. 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
అర్ష్‌దీప్ తొలి వికెట్‌కు సంబంధించిన వీడియోను కెంట్ క్రికెట్ క్లబ్ ట్విటర్‌లో షేర్ చేసింది.ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్న అర్ష్‌దీప్.. టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాడు. అర్ష్‌దీప్ తిరిగి వెస్టిండీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో వచ్చే అవకాశం ఉంది.
చదవండి: #KLRahul: పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు
Arshdeep Singh has his first #LVCountyChamp wicket!
— LV= Insurance County Championship (@CountyChamp) June 12, 2023
The @KentCricket bowler gets one to nip back and dismisses Ben Foakes pic.twitter.com/RS4TTfAjut
Comments
Please login to add a commentAdd a comment