
Photo Courtesy: BCCI
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుతో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న భారత తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
వర్షం వల్ల 14 ఓవర్ల ఆట
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాటిదార్ ఈ ఘనత సాధించాడు. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
ఈ నేపథ్యంలో పద్నాలుగు ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), విరాట్ కోహ్లి (1) పూర్తిగా విఫలం కాగా.. రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించాడు.
95 పరుగులు
ఆఖర్లో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 50 నాటౌట్) ఆడటంతో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్‌బ్రార్ రెండేసి వికెట్లు కూల్చగా.. జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
పంజాబ్ ఫటాఫట్
ఇక పంజాబ్ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. నేహాల్ వధేరా (19 బంతుల్లో 33) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌లోనే పాటిదార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
సచిన్ రికార్డు బ్రేక్
ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న రికార్డును పాటిదార్ బద్దలు కొట్టాడు. వీరిద్దరు 31 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నారు.
ఇక.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని.. ఐపీఎల్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్‌లో భారత తొలి బ్యాటర్‌గా రికార్డు
అయితే, రజత్ ఇన్నింగ్స్ పరంగా సుదర్శన్ కంటే వెనుకబడి ఉన్నా... సగటు, స్ట్రైక్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్‌లో 35కు పైగా సగటుతో 150కి పైగా స్ట్రైక్‌రేటుతో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా పాటిదార్ చరిత్రకెక్కాడు. టీ20 ఫార్మాట్లో అతడి నిలకడైన ఆటకు ఇది నిదర్శనం.
ఐపీఎల్-2025: బెంగళూరు వర్సెస్ పంజాబ్
👉వర్షం వల్ల మ్యాచ్ 14 ఓవర్లకు కుదింపు
👉వేదిక: ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్
👉బెంగళూరు స్కోరు: 95/9 (14)
👉పంజాబ్ స్కోరు: 98/5 (12.1)
👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో బెంగళూరుపై పంజాబ్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50 నాటౌట్).
.@PunjabKingsIPL's red is shining bright in Bengaluru ❤️
They continue their winning streak with an all-round show over #RCB 👏
Scorecard ▶ https://t.co/7fIn60rqKZ #TATAIPL | #RCBvPBKS pic.twitter.com/NOASW2XRMD— IndianPremierLeague (@IPL) April 18, 2025