
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్ రే బర్మన్ పేరిట ఉండేది.
బర్మన్ 2019 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్ తర్వాత ఐపీఎల్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబ్ ఉర్ రెహ్మాన్ పేరిట ఉంది. ముజీబ్ 2018 సీజన్‌లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.
అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..
14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*
16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019
17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018
17y 152d - రియాన్ పరాగ్, 2019
17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008
లక్నో, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విషయానికొస్తే.. జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్ కెప్టెన్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్ తరఫున సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.
తుది జట్లు..
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
ఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్
లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్/కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్
ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్