న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్..! | England vs New zealand 3rd test: England Need to 113 Runs In 93 Overs to Win | Sakshi
Sakshi News home page

ENG vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా ఇంగ్లండ్..!

Published Mon, Jun 27 2022 7:37 AM | Last Updated on Mon, Jun 27 2022 7:37 AM

England vs New zealand 3rd test: England Need to 113 Runs In 93 Overs to Win - Sakshi

లీడ్స్‌: న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 3–0తో క్లీన్‌ స్వీప్‌ చేసేందుకు ఇంగ్లండ్‌ జట్టు 113 పరుగుల దూరంలో ఉంది. చివరిదైన మూడో టెస్టులో 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (9), జాక్‌ క్రాలీ (25) అవుటవ్వగా... ఓలీ పోప్‌ (81 బ్యాటింగ్‌; 12 ఫోర్లు), జో రూట్‌ (55 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 168/5తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 105.2 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. బ్లన్‌డెల్‌ (88 నాటౌట్‌; 15 ఫోర్లు), మిచెల్‌ (56; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ కరోనా బారిన పడటంతో అతని స్థానంలో కోవిడ్‌ సబ్‌స్టిట్యూట్‌గా బిల్లింగ్స్‌ బరిలోకి దిగాడు. 
చదవండి: India vs Ireland 1st T20I: ఐర్లాండ్‌కు చుక్కలు చూపించిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement