కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్‌ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది.
విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్‌ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్‌కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు.
క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు.
ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.
What an effort by Dom Sibley 👏
— Surrey Cricket (@surreycricket) June 14, 2023
Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩
So good to have you home 🏡
🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE
An incredible day 📷
— Surrey Cricket (@surreycricket) June 14, 2023
🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l
చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు
Comments
Please login to add a commentAdd a comment