
పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో పాక్‌పై 73 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మహ్మద్ అబ్బాస్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అబ్బాస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన అబ్బాస్.. అనంతరం బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అబ్బాస్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 26 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అబ్బాస్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డే అరంగేట్రంలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అబ్బాస్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా అల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరిట ఉండేది. కృనాల్ పాండ్యా 2021లో ఇంగ్లండ్‌పై తన వన్డే అరంగేట్రంలో 26 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. తాజా మ్యాచ్‌లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అబ్బాస్.. పాండ్యా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. కాగా కివీస్ తరుపన డెబ్యూచేసిన అబ్బాస్.. పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆటగాడు కావడం గమనార్హం.
చాప్‌మన్ సూపర్ సెంచరీ..
ఇక ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్‌మన్ (111 బంతుల్లో 132; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. అతడితో నపా డారిల్ మిచెల్ (84 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో రాణించాడు.
పాక్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రౌఫ్, జావిద్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(76) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మొహమ్మద్ రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. డఫీ రెండు, బ్రెస్‌వెల్ తలా వికెట్ సాధించారు.
చదవండి: MI vs GT: 41 బంతుల్లో సెంచరీ చేశాడు.. అతడిని కొనసాగించండి!